child kidnap case
-
తల్లి ఒడిలో నుంచి ఎత్తుకెళ్లిన పసికందు.. ‘బీజేపీ’ నేత ఇంట్లో ప్రత్యక్షం!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న తల్లి ఒడిలోనుంచి ఈనెల 23న 7 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి సంఘటన ఇటీవల సంచలనంగా మారింది. కిడ్నాప్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీని కనుగొన్నారు. మథురాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఫిరోజాబాద్‌లో ఓ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో బాలుడిని గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కిడ్నాప్ గ్యాంగ్‌లో భాగమైన ఇద్దరు డాక్టర్ల నుంచి బాలుడిని రూ.1.8 లక్షలకు కొనుగోలు చేశారు బీజేపీ నేత వినిత అగర్వాల్, ఆమె భర్త. వారికి ఇదివరకే కూతురు ఉన్నప్పటికీ కొడుకు కావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేశారు. ఈ కేసులో రైల్వే స్టేషన్లో పిల్లాడిని ఎత్తుకెళ్లిన వ్యక్తితో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు పోలీసులు. చిన్నారిని ఆమె తల్లికి అప్పగించారు. వైద్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫికింగ్ గ్యాంగ్‌పై వివరాలు వెల్లడించారు సీనియర్ పోలీస్ అధికారి మహమ్మెద్ ముస్తాఖ్. ‘దీపక్ కుమార్ అనే వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. అతడితో పాటు హత్రాస్ జిల్లాకు సమీపంలో ఆసుపత్రి నిర్వహిస్తోన్న ఇద్దరు డాక్టర్లు ఈ గ్యాంగ్‌లో భాగస్వాములు. కొంత మంది ఆరోగ్య కార్యకర్తలకు సైతం ఇందులో భాగం ఉంది. చిన్నారి ఆచూకీ లభించిన ఇంటి సభ్యులను విచారించాం. వారికి ఒకే కూతురు ఉందని, కుమారుడు కావాలని చెప్పారు. అందుకే ఈ డీల్ కుదుర్చుకున్నారు.’ అని వెల్లడించారు ముస్తాఖ్. అయితే, ఈ అంశంపై అరెస్ట్ అయిన కార్పొరేటర్, బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ये व्यक्ति रे०स्टेशन मथुरा जं० से अपनी माँ के साथ सो रहे महज 7 माह के बच्चे को उठाकर ले गया। इस व्यक्ति को पकड़वाने में मदद कीजिये। आप सिर्फ Retweet कर इसके फ़ोटो/वीडियो को Groups में share कर दीजिये, विशेष कर कासगंज, बदायूँ और बरेली साइड में। मुझे भरोसा है ये अवश्य पकड़ा जाएगा। pic.twitter.com/fTnuGbSlsi — SACHIN KAUSHIK (@upcopsachin) August 27, 2022 ఇదీ చదవండి: CCTV Footage: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు -
‘లాక్డౌన్’ కోసం పక్కా ప్లాన్.. రూ.2 లక్షలు ఇచ్చి కిడ్నాప్, ప్రేమతోనే అలా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని చైన్నై అంబత్తూరు గాంధీ నగర్లో ఒడిశాకు చెందిన కిషోర్, పుత్తిని దంపతుల కుమారుడు లాక్డౌన్(ప్రకాష్) ఆదివారం కిడ్నాప్ కాగా, మంగళవారం కోయంబేడు బస్టాండ్‌లో ఓ బస్సులో ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును అంబత్తూరు పోలీసులు విచారించారు. పోలీసులకు భయపడి.. గాంధీ నగర్ భవన నిర్మాణం ఇంజినీరుగా ఉన్న ఈరోడ్‌కు చెందిన బాల మురుగన్(28)కు బాలుడు లాక్డౌన్ బాగా నచ్చాడు. దీంతో అక్కడే పనిచేస్తున్న ఒడిశాకు చెందిన దుశ్యంత్(25) ద్వారా లాక్‌డౌన్‌ను కిడ్నాప్‌కు పథకం వేశాడు. ఇందుకోసం దుశ్యంత్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. పథకం ప్రకారం ఆదివారం కిడ్నాప్ చేసి అదేరోజు రాత్రే లాక్‌డౌన్‌ను కడలూరుకు బాల మురుగన్ తీసుకెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన మహిళ వలర్మతి(53)తో బాలున్ని చూసుకోవాలని కోరాడు. అయితే వ్యవహారం పోలీసులు, మీడియా వరకు వెళ్లడంతో ఆమె నిరాకరించింది. దీంతో అతను కడలూరు నుంచి చెన్నైకు వచ్చిన బస్సులో బాలున్ని నిద్ర పుచ్చి జారుకున్నాడు. అయితే ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పిల్లలను పోషించేందుకు కిషోర్ దంపతులు పడుతున్న కష్టాన్ని చూసి తాను లాక్‌డౌన్‌ను తీసుకెళ్లాని బాల మురుగన్ విచారణలో చెప్పాడు. అయితే నిందితుడితో పాటు అతడికి సహకరించిన దుశ్యంత్, వలర్మతిని పోలీసులు అరెస్టు చేశారు. -
కన్నా.. ఎక్కడున్నావ్?
సాక్షి, మండపేట (తూర్పు గోదావరి): ‘నేను పెడితేనే కాని బాబు అన్నం తినడు.. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? ఏమైనా తిన్నాడో లేదో? ఎందుకు ఎత్తుకెళ్లారో తెలీడం లేదు. ఏం కోరినా ఇస్తాం.. మా బాబును క్షేమంగా అప్పగిస్తే చాలు’ అంటూ కిడ్నాప్‌నకు గురైన బాలుడు జసిత్ తల్లి, నిండు గర్భిణి నాగావల్లి కన్నీరు మున్నీరవుతోంది. కన్న బిడ్డకోసం సోమవారం రాత్రి నుంచి ఆమె కంటి మీద కునుకు లేకుండా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఎవరకు దగ్గరకు వెళ్లినా బాబు ఆచూకీ తెలిసిందా అంటూ ఆమె పడుతున్న ఆత్రుత చూపరుల హృదయాలను కలచివేస్తోంది. ‘ఏ కేసూ పెట్టం. మా బిడ్డను క్షేమంగా అప్పగించండి’ అంటూ ఆమె కిడ్నాపర్లను వేడుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన నూకా వెంకటరమణ, నాగావల్లి దంపతులు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బ్యాంకు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరి నాలుగేళ్ల కుమారుడు జసిత్ ఇంటికి సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. సోమవారం రాత్రి 7.30 గంటలకు అపార్ట్మెంట్ పిల్లలతో ఆడుకుని, నాన్నమ్మతో కలిసి తిరిగి మేడ మెట్లు ఎక్కుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ముఖంపై కొట్టి, బాలుడిని ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డు వైపు తీసుకు వెళ్లిపోయారు. ఇది జరిగి ఒకరోజు గడిచినా ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు. 8 ప్రత్యేక బృందాలతో ఈ కిడ్నాప్ ఓ మిస్టరీగా మారింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పోలీసులు అన్ని కోణాల్లోను ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్కే ఖాన్ మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాలుడి తల్లిదండ్రులు, నానమ్మ పార్వతిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ జేవీ సంతోష్, సీఐ కె.మంగాదేవి తదితరులతో చర్చించారు. ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి మండపేట చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలుడి జాడ తెలుసుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీ పుటేజ్‌ల పరిశీలించారు. వెంకటరమణ, నాగవల్లి సహచర బ్యాంకు ఉద్యోగుల నుంచి వివరాలు, అనుమానితుల కాల్ డేటా వివరాలను సేకరిస్తున్నారు. గతంలో తాను పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పని చేసినప్పుడు బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టిన వ్యక్తిని పోలీసులకు పట్టించినట్టు వెంకటరమణ తెలపడంతో ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు సమాచారం. వెంకటరమణకు ఎవరితోనైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? ఆయన స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలోనూ ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. డిప్యూటీ సీఎం బోస్ పరామర్శ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బాలుడి తండ్రి వెంకటరమణతో ఫోన్లో మాట్లాడారు. అధైర్య పడవద్దని, కిడ్నాపర్లను పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన పోలీసులు అధికారులతో దీనిపై సమీక్షించారు. త్వరితగతిన బాలుడిని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు బాధితులను పరామర్శించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కిడ్నాప్ కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని, త్వరితగతిన నిందితుల్ని అదుపులోకి తీసుకుని బాలుడిని సురక్షితంగా తీసుకువస్తామన్నారు. చిన్నారి కోసం ఎదురుచూపులు జసిత్ కోసం తల్లిదండ్రులు, నానమ్మ పార్వతి నిద్రాహారాలు లేకుండా ఎదురు చూపులు చూస్తున్నారు. నా చేతుల్లోంచే బిడ్డను లాక్కుపోయారంటూ నానమ్మ పార్వతి బోరున విలపిస్తోంది. నా కుమారుడిని క్షేమంగా అప్పగించండి మీరు కోరింది ఇస్తామంటూ మీడియా ద్వారా తండ్రి వెంకటరమణ కిడ్నాపర్లను వేడుకుంటున్నాడు. జసిత్ కిడ్నాప్ ఘటన స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, ఆచూకి తెలపాలంటూ వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు స్థానికులు, బ్యాంకు ఉద్యోగులు, విజయలక్ష్మి నగర్‌లోని వారి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికుమార్ వెంకటరమణను పరామర్శించారు. బాలుడిని సురక్షితంగా తీసుకురావాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
దారుణం : చిన్నారి చేతుల్ని విరిచేసిన కిడ్నాపర్..!
సాక్షి, హైదరాబాద్ : అభంశుభం తెలియని చిన్నారిపై ఓ వ్యక్తి రాక్షసత్వం ప్రదర్శించాడు. ఆమెను కిడ్నాప్ చేసి అతికిరాతంగా రెండు చేతులు విరిచేశాడు. ఈ ఘటన నగరంలోని లంగర్‌హౌజ్‌లో వెలుగుచూసింది. మూడురోజుల క్రితం వైష్ణవి అనే చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. పక్కీరప్ప అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. పాప రెండు చేతులు విరిచేసిన కిడ్నాపర్ అనంతరం ఆమెను వదిలేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి తల్లిదండ్రుల కంటబడింది. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇలాంటి దుస్థితి ఏ చిన్నారికి రావొద్దని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైష్ణవి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పిచ్చి ముసలాయన తనను కిడ్నాప్ చేశాడని, అనంతరం తీవ్రంగా కొట్టి చేతులు విరిచేశాడని వైష్ణవి చెప్పింది. చిన్నారి ప్రాణాలకు ప్రమాదం లేదని, ఆమె చేతులకు సర్జరీ అవసమా లేక కట్లతోనే నయం అవుందా అనే విషయం ఆదివారం చెప్తామని డాక్టర్లు తెలిపారు. -
చిన్నారిపై కిడ్నాపర్ రాక్షసత్వం
-
సినిమా చూస్తుండగా పాపనెత్తుకుపోయాడు
సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం): చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. అపహరణకు గురైన 14 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేస్తే ఆమె తల్లి తనతో కలిసి ఉండేందుకు అంగీకరిస్తున్నందన్న దుర్బుద్ధితోనే నిందితుడు ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పట్టణ సీఐ ఎస్.తాతారావు శనివారం విలేకరులకు కేసు వివరాలు చెప్పారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన కె.తిరుపతమ్మ భర్తతో గొడవ పడి విడిగా ఉంటోంది. కూలి పనుల నిమిత్తం తన మూడేళ్ల కుమార్తె లక్ష్మీభవానీని తీసుకుని అనకాపల్లికి బయలుదేరింది. ఆమె రాజమండ్రి రైల్వేస్టేషన్లో దిగి మరో రైలు ఎక్కేందుకు సిద్ధపడగా అక్కడ విజయనగరం జిల్లా బాడంగి మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ ఎం.లక్ష్మణరావు తిరుపతమ్మకు పరిచయమయ్యాడు. లక్ష్మణరావుకు భార్యాపిల్లలు ఉన్నారు. వారు స్వగ్రామంలో ఉంటున్నారు. వారితో విభేదాలు వచ్చిన లక్ష్మణరావు విజయవాడలో ఉంటూ పని ఉన్న ప్రాంతానికి వెళ్తుంటాడు. రైల్వే స్టేషన్లో కలిసిన తిరుపతమ్మను ఎక్కడికి వెళ్తున్నారని లక్ష్మణరావు ప్రశ్నించగా కూలీ పనుల నిమిత్తం వెళ్తున్నట్టు సమాధానమిచ్చింది. కూలీపని ఇప్పిస్తానని లక్ష్మణరావు చెప్పడంతో తిరుపతమ్మ తన కుమార్తెను లక్ష్మీభవానీ తీసుకుని లక్ష్మణరావుతో కలిసి 25వ తేదీ రాత్రి అనకాపల్లి వచ్చింది. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో లక్ష్మణరావు భవన నిర్మాణ పని ఉందని అదేరోజు రాత్రి తీసుకెళ్లాడు. ఆ రాత్రి అక్కడ నిద్రించి 26వ తేదీన పని చేశారు. ఆరోజు రాత్రి అక్కడే నిద్రించారు. అయితే తనకు భార్య లేదని, తనతో కలిసి ఉండాలని తిరుపతమ్మను లక్ష్మణరావు కోరాడు. అందుకు తిరుపతమ్మ నిరాకరించింది. 27, 28 తేదీల్లో కూలి దొరకలేదు. పనులు లేకపోవడంతో సినిమా చూద్దామని చెప్పి తిరుపతమ్మను లక్ష్మణరావు బయలుదేరించాడు. తిరుపతమ్మ, ఆమె కుమార్తె, లక్ష్మణరావు అనకాపల్లి పట్టణంలో ఒక థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు. సినిమా మధ్యలో పాప ఏడుస్తుండడంతో లక్ష్మణరావు పాప బయటకు తీసుకొచ్చి, ఆమెతో పాటు పరారయ్యాడని సీఐ చెప్పారు. లక్ష్మణరావు, పాప రాకపోవడంతోతిరుపతమ్మకు అనుమానం వచ్చి బయటకు వచ్చి చూడగా లేకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. ఎస్ఐలు రామకృష్ణ, స్వీటీ, ఆధ్వర్యంలో పోలీసులు గాలించగా సింహాచలం మెట్లపై పాప లక్ష్మీభవానీతో లక్ష్మణరావు ఉన్నట్టు గుర్తించి, అనకాపల్లి తీసుకొచ్చారు. సీఐ తాతారావు సమక్షంలో తల్లి తిరుపతమ్మకు పాప లక్ష్మీభవానీ అప్పగించారు. -
చిన్నారి షైనీ కిడ్నాప్ కథ సుఖాంతం
-
చిన్నారి షైనీ కిడ్నాప్ కథ సుఖాంతం
శంషాబాద్ : ఐదు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన నాలుగు నెలల చిన్నారి షైనీ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ మిస్టరీని చేధించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారిని రక్షించారు. ఈ కేసుకు సంబంధించి ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు మైలార్‌దేవ్‌పల్లిలో కిడ్నాపర్లు చంద్రకాంత్, హంసలను బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి షైనీని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ చిన్నారి తిరిగి ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
కిడ్నాపైన బాలుడు సురక్షితం
తెనాలి : గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. తెనాలి మారీస్‌పేటలో రెండు రోజుల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటున్న నిఖిల్ రెడ్డి(2) అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిఖిల్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీలో ఓ వ్యక్తి నిఖిల్ రెడ్డిని తీసుకువెళ్తున్నట్లు స్పష్టంగా కనపడింది. ఆ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేయడంతో కేసు కొలిక్కి వచ్చింది. విజయవాడ సమీపంలో నిఖిల్‌రెడ్డిని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ తెలియడంతో నిఖిల్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.