ఐదు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన నాలుగు నెలల చిన్నారి షైనీ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ మిస్టరీని చేధించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారిని రక్షించారు. ఈ కేసుకు సంబంధించి ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు మైలార్‌దేవ్‌పల్లిలో కిడ్నాపర్లు చంద్రకాంత్, హంసలను బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి షైనీని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ చిన్నారి తిరిగి ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.