సాక్షి, చెన్నై: తమిళనాడులోని చైన్నై అంబత్తూరు గాంధీ నగర్‌లో ఒడిశాకు చెందిన కిషోర్, పుత్తిని దంపతుల కుమారుడు లాక్‌డౌన్(ప్రకాష్) ఆదివారం కిడ్నాప్ కాగా, మంగళవారం కోయంబేడు బస్టాండ్‌లో ఓ బస్సులో ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును అంబత్తూరు పోలీసులు విచారించారు.
పోలీసులకు భయపడి..
గాంధీ నగర్ భవన నిర్మాణం ఇంజినీరుగా ఉన్న ఈరోడ్‌కు చెందిన బాల మురుగన్(28)కు బాలుడు లాక్‌డౌన్ బాగా నచ్చాడు. దీంతో అక్కడే పనిచేస్తున్న ఒడిశాకు చెందిన దుశ్యంత్(25) ద్వారా లాక్‌డౌన్‌ను కిడ్నాప్‌కు పథకం వేశాడు. ఇందుకోసం దుశ్యంత్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. పథకం ప్రకారం ఆదివారం కిడ్నాప్ చేసి అదేరోజు రాత్రే లాక్‌డౌన్‌ను కడలూరుకు బాల మురుగన్ తీసుకెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన మహిళ వలర్మతి(53)తో బాలున్ని చూసుకోవాలని కోరాడు. అయితే వ్యవహారం పోలీసులు, మీడియా వరకు వెళ్లడంతో ఆమె నిరాకరించింది.
దీంతో అతను కడలూరు నుంచి చెన్నైకు వచ్చిన బస్సులో బాలున్ని నిద్ర పుచ్చి జారుకున్నాడు. అయితే ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పిల్లలను పోషించేందుకు కిషోర్ దంపతులు పడుతున్న కష్టాన్ని చూసి తాను లాక్‌డౌన్‌ను తీసుకెళ్లాని బాల మురుగన్ విచారణలో చెప్పాడు. అయితే నిందితుడితో పాటు అతడికి సహకరించిన దుశ్యంత్, వలర్మతిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment