కాలి బూడిదయిన కారు
హైదరాబాద్: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆదిలాబాద్ జిల్లా జడ్జి కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదం నుంచి జడ్జి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన శుక్రవారం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జడ్జి సామ్యూల్ బొగ్గులకుంట నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా కారులో పొగలు రావడంతో డ్రైవర్ ఆపాడు. కొద్ది సేపటికి పొగలు ఆగడంతో కారు స్టార్ట్ చేయగా, మంటలు చెలరేగాయి. జడ్జి, డ్రైవర్ కారు దిగి దూరంగా వెళ్లారు. చూస్తుండగానే కారు కాలి బూడిదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment