
గుల్బర్గా: కర్ణాటక గుల్బర్గా జిల్లాలోని కమలాపురం వద్ద శనివారం(నవంబర్ 9) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వేగంగా వెళుతున్న బొలేరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడ వాసులుగా గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: పంజాగుట్టలో కారు బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment