Gulbarga
-
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
-
గుల్బర్గాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం
గుల్బర్గా: కర్ణాటక గుల్బర్గా జిల్లాలోని కమలాపురం వద్ద శనివారం(నవంబర్ 9) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వేగంగా వెళుతున్న బొలేరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడ వాసులుగా గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పంజాగుట్టలో కారు బీభత్సం -
Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత లోక్‌సభ స్థానం గుల్బర్గాలో బీజేపీ నుంచి మరోసారి గట్టి సవాలు ఎదురవుతుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన గుల్బర్గాలో 2009, 2014ల్లో వరుసగా నెగ్గిన ఖర్గే 2019లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఖర్గే ఓటమి చవిచూసి హ్యాట్రిక్‌కు దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మరోసారి ఉమేశ్ జాదవ్ పోటీ చేస్తున్నారు. కలబురిగికి చెందిన దొడ్డమణికి పలు విద్యాసంస్థలున్నాయి. ఇంతకాలం ఖర్గే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన తదితరాల్లో తెర వెనక దన్నుగా ఉన్నారు. వైద్యుడైన ఉమేశ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీదర్‌లోని చించోలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఖర్గేతో విభేదాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తన గురుతుల్యుడైన ఖర్గేపైనే గెలుపొందారు. గుల్బర్గాలోలో 65 శాతం కంటే ఎక్కువ గ్రామీణ ఓటర్లే. మొత్తమ్మీద 20 శాతం మంది ముస్లిం ఓటర్లు, 24 శాతానికి పైగా దళితులున్నారు. వీరి ఓట్లపై కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. గుల్బర్గా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడింది. బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. -
కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ
-కలబురిగి (గుల్బర్గా) నుంచి కల్వల మల్లికార్జున్‌రెడ్డి హైదరాబాద్ కర్ణాటకలో అతిపెద్ద జిల్లా కలబురిగి (గుల్బర్గా)లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం జోరందుకుంది. ఈ నెల 10న ఎన్నికలు జరగనుండగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కర్ణాటకకు గతంలో ఇద్దరు సీఎంలు వీరేంద్ర పాటిల్, ధరమ్‌సింగ్‌ను అందించిన కాంగ్రెస్ కలబురిగి జిల్లాపై పట్టు సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్–చిట్టాపూర్), దివంగత మాజీ సీఎం ధరమ్‌సింగ్ కుమారుడు అజయ్‌సింగ్ (కాంగ్రెస్–జీవర్గి), గుల్బర్గా ఎంపీ ఉమేశ్ జాదవ్ కుమారుడు అవినాశ్ జాదవ్ (బీజేపీ–చించోలి), బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలికయ్య గుత్తేదార్ (బీజేపీ–అఫ్జల్పూర్) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కలబురిగిపై బీజేపీ కాస్త పట్టు సాధించగా ఈసారి కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించొచ్చని చెబుతున్నారు. అభ్యర్థుల గుణగణాలు, సామాజికవర్గ సమీకరణాలు, ధన ప్రవాహం కూడా ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపుతాయని ‘సాక్షి’క్షేత్రస్థా యి పరిశీలనలో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఇలా... అఫ్జల్పూర్.. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన అఫ్జల్పూర్ నియోజకవర్గంలో దిగ్గజ నేతలు ఎంవై పాటిల్ (కాంగ్రెస్), మాలికయ్య గుత్తేదార్ (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు) పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించిన మాలికయ్య గుత్తేదార్ సొంత సోదరుడు నితిన్ గుత్తేదార్‌కు అధిష్టానం మొండిచే యి చూపడంతో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి కాంగ్రెస్, బీజేపీకి తీవ్ర పోటీనిస్తున్నారు. 1978లో జనతా, 2004లో జేడీ(ఎస్), 2018లో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఎంవై పాటిల్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 1985 నుంచి 2013 వరకు ఆరుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన మాలికయ్య గుత్తేదార్ 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివకుమార్ నటేకర్ ప్రచారం ఇంకా పుంజుకోలేదు. జీవర్గి.. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన జీవర్గిలో ప్రాతినిధ్యం కోసం బీజేపీ ప్రయతి్నస్తోంది. 1972 నుంచి 2004 వరకు వరుసగా ఎనిమిదిసార్లు కాంగ్రెస్ నుంచి ధరమ్‌సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ధరమ్ సింగ్ చిన్న కుమారుడు డాక్టర్ అజయ్ సింగ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. 2008లో ధరమ్ సింగ్‌పై గెలిచిన బీజేపీ నేత ‘దొడ్డప్పగౌడ శివలింగప్పగౌడ్ పాటిల్ నారిబోల్కు టికెట్ నిరాకరించడంతో జేడీ(ఎస్) తరపున పోటీ చేస్తున్నారు. సేడం.. తెలంగాణ సరిహద్దులో ఉన్న సేడంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ మళ్లీ బరిలో నిలవగా గతంలో మూడుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 2018 ఎన్నికలో ఓడిన శరణ్ ప్రకాశ్ పాటిల్ వరుసగా ఐదోసారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. రాజ్‌కుమార్ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న జేడీ(ఎస్) అభ్యర్థి బాలరాజు గుత్తేదార్ బలమైన అభ్యర్తిగా తెరమీదకు వచ్చారు. గాలి జనార్దన్‌రెడ్డి మేనల్లుడు, కల్యాణ రాజ్య ప్రగతిపక్ష అభ్యర్థి జి.లల్లేశ్ రెడ్డి కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. చించోలి (ఎస్సీ).. గుల్బర్గా బీజేపీ ఎంపీ డాక్టర్ ఉమేశ్ జాదవ్ కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అవినాశ్ జాదవ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. గతంలో మల్లికార్జున ఖర్గేకు అనుచరుడైన ఉమేశ్ జాదవ్ 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2019లో గుల్బర్గా స్థానం నుంచి ఖర్గేపై బీజేపీ ఎంపీగా గెలుపొందారు. చించోలి నియోజకవర్గం బీదర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఉమేశ్ జాదవ్ దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతో అవినాశ్ జాదవ్‌కు కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ వి. రాథోడ్ గట్టిపోటీనిస్తున్నారు. గుల్బర్గా రూరల్ (ఎస్సీ).. బీజేపీ ఎమ్మెల్యే బస్వరాజ్ మత్తిమూడ్, కాంగ్రెస్ అభ్యర్థి రేవు నాయక్ బెలమాగి నడుమ పోటీ సాగుతోంది. ఇక్కడ జేడీ (ఎస్) ఎన్నికల అవగాహనలో భాగంగా సీపీఎంకు మద్దతిస్తోంది. సీపీఎం తరఫున పాండురంగ్ మావింకర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవు నాయక్ 2008లో బీజేపీ, 2018లో జేడీ(ఎస్), ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తరచూ పార్టీలు మారడంతో ఆయనకు కొంత ప్రతికూలత కనిపిస్తోంది. అలంద్.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ బీజేపీ నుంచి, మాజీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. జేడీ(ఎస్) మహిళా అభ్యర్థి మహేశ్వరి వలేను బరిలోకి దింపింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ పాతవారే కావడంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. చిట్టాపూర్ (ఎస్సీ).. మల్లికార్జున ఖర్గే కుమారుడు, మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. 2009 ఉప ఎన్నికలో ఓడిన ప్రియాంక్ తిరిగి 2013, 2018లో గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ తరఫున మణికంఠ రాథోడ్ పోటీ చేస్తుండగా, సుభాష్ చంద్ర రాథోడ్ జేడీ(ఎస్) నుంచి బరిలో ఉన్నారు. కరోనా వేళ సామాజిక సేవలో నిమగ్నమైన జేడీ (ఎస్) అభ్యర్థి సుభాష్ చంద్ర రాథోడ్‌పై సానుకూలత ఉంది. -
మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్.. గుల్బర్గాదే మహారాజా ట్రోపీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టి20 లీగ్ 2022 తొలి సీజన్ విజేతగా మనీష్ పాండే నేతృత్వంలోని గుల్బర్గా మైస్టిక్స్ నిలిచింది. శుక్రవారం రాత్రి బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్లో గుల్బర్గా 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన మనీష్ పాండే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా మైస్టిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మనీష్ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు నాటౌట్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అంతకముందు జెస్వాత్ ఆచార్య 39, రోహన్ పాటిల్ 38, కృష్ణన్ షిర్జిత్ 38 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బుల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎల్ఆర్ చేతన్ (40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంతి కుమార్ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు బుల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. Gulbarga Mystics are the CHAMPIONS of the Maharaja Trophy KSCA T20!! 🔥🙌🏼@GulbargaMystics #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/7sTniWTvPL — Maharaja Trophy T20 (@maharaja_t20) August 26, 2022 చదవండి: Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు.. -
దొరికితే గొలుసులు.. లేదంటే దాడులు!
సాక్షి, హైదరాబాద్: చేతికి అందితే గొలుసులు.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చేతిలోని మారణాయుధాలతో దాడులు... ఇదే గుల్బర్గాకు చెందిన చెయిన్ స్నాచర్ల లక్ష్యం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస స్నాచింగ్‌లకు పాల్పడి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దరు స్నాచర్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి తపంచా, రివాల్వర్, 15 బుల్లెట్లు, రెండు కత్తులు, రెండు సెల్ఫోన్లు, బైక్, 47 గ్రాముల బంగారు ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10న గుల్బర్గాకు చెందిన ఇషాన్ నిరంజన్, రాహుల్ కర్నాటకలోని హుడ్నూర్ రింగ్ రోడ్‌లోని ఓ జువెల్లరీ షాపులో చోరీ యతి్నంచారు. నిందితులను పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుళ్లు గురుమూర్తి, సంజయ్ కుమార్లపై ఇనుప రాడ్లతో దాడి చేసి పరారయ్యారు. కర్నాటక పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేయడంతో బైక్‌పై హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ వీరికి మరో నిందితుడు ఆశ్రయం కలి్పంచాడు. ముగ్గురు కలిసి పెద్ద మొత్తంలో చెయిన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇషాన్, రాహులపై కర్నాటకలో బైక్ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. ఈ నెల 25న ముగ్గురు బైక్‌పై వచ్చి గచ్చిబౌలి, కూకట్పల్లి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో పరిధిలో ముగ్గురు మహిళల మెడలో నుంచి చెయిన్లను దొంగిలించారు. మర్నాడు ఉదయం బైక్‌పై నిరంజన్, రాహుల్ మియాపూర్ పీఎస్ పరిధిలో మరో మహిళ చెయిన్ లాక్కెళ్లారు. అక్కడి నుంచి పటాన్చెరు మీదుగా పారిపోవటానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే 25న స్నాచింగ్ చేసిన నిందితులే మియాపూర్‌లోనూ పంజా విసిరినట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), మాదాపూర్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నిందితులు రాత్రి అక్కడే గడిపారు. 26న ఉదయం 10 గంటలకు సీసీఎస్ కానిస్టేబుల్ కృష్ణా బైక్‌పై వెళుతుండగా నిందితులు మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద కనిపించారు. వెంటనే ప్రత్యేక బృందాలకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మియాపూర్‌లో స్నాచింగ్‌కు యతి్నంచి విఫలం కావటంతో.. పరారైన నిందితులు పది నిమిషాల్లోనే ఆర్సీపురం పీఎస్ పరిధిలోని బీహెచ్ఈఎల్లో స్నాచింగ్ చేశారు. దీంతో నిందితులు బీహెచ్ఈఎల్లోకి ఎంట్రీ అయ్యారని నిర్దారించుకున్న పోలీసులు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను దిగ్బంధం చేశారు. వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. అడుగడుగునా జల్లెడ పట్టారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబేష్ రవి బైక్‌లపై గాలిస్తుండగా.. తెలుపై రంగు పల్సర్ బైక్‌పై యాష్ కలర్ జాకెట్, తెలుపు రంగు షర్ట్, నలుపు, ఎరుపు రంగు టోపీలు ధరించిన నిరంజన్, రాహుల్ హెచ్ఐజీ గేట్ వైపునకు వెళుతున్నట్లు గుర్తించారు. దిబేష్ బైక్ దిగి నిందితుడు రాహుల్‌ను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన నిరంజన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్యపై దాడి చేశాడు. రక్తం కారుతున్నా.. యాదయ్య నిరంజన్ను వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ రవి.. నిరంజన్ను పట్టుకున్నాడు. వారు యాదయ్యను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదయ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శౌర్య పతకాలకు ప్రతిపాదన.. ప్రాణాలకు తెగించి చెయిన్ స్నాచర్లను పట్టుకున్న హెచ్‌సీ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిల ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించి పోలీసులపై ప్రజలలో విశ్వాసం, నమ్మకాన్ని కలి్పంచారని కొనియాడారు. హెచ్‌సీ యాదయ్యతో పాటు కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిలకు శౌర్య పతకం కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి ప్రతిపాదిస్తామని సీపీ తెలిపారు. (చదవండి: ఇక్కడి నుంచే దేశం దాటింది ) -
చూడముచ్చటగా ఉన్నారు.. ఎంత పనై పోయింది
యశవంతపుర: సెల్ఫీ మోజులో ఎంతోమంది ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. సెల్ఫీ వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నా పట్టించుకోకుండా విగతజీవులవుతున్నారు. బీదర్ నుండి వచ్చిన విద్యార్థులు నది వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి మరణించారు. బీదర్‌లోని కర్ణాటక కాలేజ్‌లో బీఏ విద్యార్థి పురుషోత్తమ పాటిల్, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రక్షిత స్నేహితులు. రక్షిత గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదివేది. వీరిద్దరూ ప్రేమికులు కూడా. వరుస సెలవులు కావడంతో పర్యాటక యాత్రకు వచ్చారు. సోమవారం బాడుగ ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. అక్కడ ఎవరూ లేని సమయంలో మొబైల్ ఫోన్లో ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకొంటుండగా జారి వంతెన పైనుండి కాళీ నదిలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. వంతెనపై దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువతి కుటుంబసభ్యులకు కొందరు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఒడ్డుకు తెచ్చారు. బీదర్ జిల్లా రామనగర పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా వీరు నిజంగానే ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అని స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: కిరాతకం: అందరూ చూస్తుండగానే.. -
నన్ను వదిలేస్తే మరికొందరిని చంపుతా..!
ముంబై : మొక్క మహావృక్షంగా ఎదగాలంటే మూలాలు బాగుండాలి. అలానే మనిషి ఉన్నతంగా ఎదగాలంటే పెంపకం బాగుండాలి. మరీ ముఖ్యంగా బాల్యం. అమ్మనాన్నల ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కరువైతే.. ఎదిగాక మనిషి ఎలా మారతాడనే దానికి ఉదాహరణగా నిలిచాడు విఠల్ భజంత్రి(26). కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా అఫ్జల్పూర్ గ్రామానికి చెందిన భజంత్రి 12 ఏళ్ల వయసులో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో కూలీగా చేరాడు. ఆ సమయంలో వయసులో ఇతనికంటే పెద్దవారైన లేబర్స్ భజంత్రికి డ్రగ్స్ ఇచ్చి అతని మీద లైంగిక దాడి చేశారు. ఈ భయంకరమైన అనుభవాలు అతని మనసులో అలానే గూడుకట్టుకుపోయాయి. వీటి నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాడు.. కుదరలేదు. గట్టిగా మాట్లాడ్డానికి కూడా ఇష్టపడని భజంత్రి.. ఎవరైనా తనను తిడిడే మాత్రం తట్టుకోలేకపోయేవాడు. అంత సేపు ప్రశాంతంగా ఉన్న అతనిలో మృగం మేల్కోనేది. ఆ కోపంతో తనను హేళన చేసిన వారిని చంపేసేవాడు. ఇలా ఇప్పటికి 5గుర్ని అంతమొందించాడు. అయితే చంపడానికి ఆయుధాలు కాకుండా.. బండరాయిని వాడేవాడు. మొదటి హత్య 2017, అక్టోబర్‌లో చేశాడు. తనను, తన స్నేహితున్ని తిట్టిన ఓ లేబర్ని బండరాయితో కొట్టి చంపాడు. ఓ నెల తిరక్కముందే మరో హత్య చేశాడు. బలహీనంగా ఉన్నావంటూ హేళన చేసిన మరో లేబర్ని నవంబర్ 7, 2017న హత్య చేశాడు. ఇతన్ని కూడా బండరాయితోనే కొట్టి చంపాడు భజంత్రి. మూడోసారి ఏకంగా తన సోదరి భర్తనే చంపేశాడు. ఒక రోజు తన సోదరి, ఆమె భర్త గొడవపడుతుండటం చూశాడు భజంత్రి. ఆ కోపంలో తన బావను నవంబర్ 12, 2017న అతన్ని చంపేశాడు. కానీ ఈ సారి పోలీసులకు చిక్కాడు భజంత్రి. డిసెంబర్ 6, 2017న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఒక సంవత్సరం పాటు జైలులో గడిపిన తరువాత 2018, డిసెంబరులో బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే పోలీసులకు కేవలం మూడో హత్య గురించే తెలుసు. మొదటి రెండింటి గురించి తెలియదు. దాంతో త్వరగానే బెయిల్ దొరికింది. కానీ మొదటి రెండు హత్యల గురించి భజంత్రి స్నేహితుడు సూరజ్‌కు తెలుసు. దాంతో అతన్ని చంపాలని పథకం పన్నాడు భజంత్రి. అందులో భాగంగా పని ఉందని చెప్పి స్నేహితున్ని వెంటపెట్టుకుని వెళ్లాడు. అక్కడ మరో వ్యక్తితో కలిసి సూరజ్‌ని చంపేశాడు. ఈ హత్య జనవరి 4, 2019న జరిగింది. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సూరజ్‌ను చంపిన వ్యక్తి కర్ణాటకలో ఉంటున్నట్లు తెలిసింది. దాంతో అతన్ని అరెస్ట్ చేయడానికి గుల్బర్గా వెళ్లారు పోలీసులు. అతన్ని విచారించగా భజంత్రి గురించి తెలిసింది. ఇతను ఇంతకు ముందే ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లి వాచ్చడని నిర్ధారించుకున్న పోలీసులు భజంత్రి గురించి వెతకడం ప్రాంరభించారు. ఈ క్రమంలో గత నెల 19న ఓ హైవే మీద నడుచుకుంటూ వెళ్లున్న భజంత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా భజంత్రి తాను చేసిన ఐదు హత్యల గురించి పోలీసులకు తెలియజేశాడు. అంతేకాక కామ్‌గా ఉండే తనని ఎవరైనా హేళన చేస్తే మృగంగా మారతానని.. వారిని చంపేవరకూ ఊరుకోనని తెలిపాడు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులే తనను ఇలా మార్చాయని వెల్లడించాడు. మద్యం తాగితే తాను కంట్రోల్లో ఉండనన్నాడు. మంచిగా మారడానికి ప్రయత్నించానని.. సాధ్యం కాలేదని తెలిపాడు. తనను జైలు నుంచి బయటకు పంపిస్తే మరింత మందిని చంపుతానని పేర్కొన్నాడు. ప్రస్తుతం భజంత్రి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతను చేసిన ఐదు హత్యల్లో నలుగురి మృతదేహాలు పోలీసులకు లభించాయి. మరోక హత్య గురించి ఎటువంటి వివరాలు తెలియలేదు. -
అమ్మ కొట్టడంతో..
సాక్షి, బంజారాహిల్స్: ఇంటి పనులు చేయడం లేదని తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి ముంబైకి పారిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని బంజారాహిల్స్ పోలీసులు కనుగొన్నారు. వారిద్దరినీ ముంబైలోని పునరావాస కేంద్రం నుంచి శనివారం నగరానికి తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఫస్ట్ లాన్సర్‌లో నివసిస్తున్న సీమా ఖురేషికి కూతురు ఇష్రత్‌బీ(14) ఉంది. ఆమె సోదరి కూతురు సమీనా బేగం(14) కూడా ఇక్కడే ఉంటోంది. గత నెల 29న పని చేయడం లేదని ఇష్రత్‌బీని సీమా కొట్టింది. తర్వాత ఆమె సమీపంలో ఫంక్షన్‌కు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఇష్రత్‌బీ, సమీనాబేగం అదృశ్యమయ్యారు. దీంతో 30న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా, ఇద్దరు బాలికలు బ్యాగులు వేసుకొని వెళ్తున్నట్టు గుర్తించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో గుల్బర్గా రైలెక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కానిస్టేబుల్ జుబేర్‌ను అక్కడికి పంపించారు. ఓవైపు పోలీసులు గాలిస్తుండగానే, వారు ఈ నెల 1న ముంబై రైల్వే స్టేషన్లో దిగడం, అక్కడ చైల్డ్‌లైన్ సిబ్బంది చేతికి చిక్కడం జరిగింది. వారిద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. అప్పటికే బంజారాహిల్స్ పోలీసులు వారి ఫొటోలతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫొటోలు చూసిన చైల్డ్‌లైన్ సిబ్బంది ఇక్కడికి ఫోన్ చేశారు. అయితే వారు పేర్లు తప్పు చెప్పడంతో ఒక రోజంతా టెన్షన్ నెలకొంది. మార్గమధ్యంలో ఉన్న కానిస్టేబుల్ జుబేర్ 3న ముంబైకి చేరుకొని శనివారం నగరానికి తీసుకొచ్చాడు. -
టికెట్ రాలేదు.. భోరుమన్న బీజేపీ నేత
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలో భాగం అవుదామనుకునే నేతలకు కొదవే ఉండదు. వచ్చే నెలలో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని టికెట్ ఆశించేవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ వారు బాహాటంగానే తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పత్రికా సమావేశాల్లో ఆయా పార్టీలపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన రెండో జాబితాలో కూడా తనకు సీటు కేటాయించకపోవడంతో ఓ బీజేపీ నేత విలేకరుల సమావేశంలో బోరుమన్నాడు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక మధ్యలోనే వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. 12 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా, గుల్బార్గా నగర డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన బీజేపీ నేత శశీల్ జీ నామోషీ తొలుత ‘గుల్బార్గా దక్షిణ్’ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ ఆ సీటుని దత్తాత్రేయ పాటిల్ రేవూర్‌కు కేటాయించింది. పార్టీ ప్రకటించే రెండో జాబితాలోనైనా తనకు టికెట్ లభిస్తుందని ధీమాగా ఉన్న శశీల్ తన అనుచరగణంతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ‘గుల్బార్గా ఉత్తర్’ టికెట్‌ను ఇస్తారని అనుకున్నారు. కానీ, ఆయనకు రెండో జాబితాలోనూ నిరాశే మిగిలింది. సోమవారం విడుదలైన రెండో జాబితాలో బీజేపీ ఆ స్థానాన్ని సీబీ పాటిల్‌కు కేటాయించింది. దాంతో శశీల్ తీవ్ర మనస్థాపం చెందారు. తన ఆవేదనను వెళ్లగక్కేందుకు పత్రికా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతుండగానే.. దుఃఖం పొంగుకురావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న తన సహచరులు, పాత్రికేయులు ఆయనను సముదాయించి అర్థాంతరంగా సమావేశాన్ని ముగించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, శశీల్ జేడీఎస్ (జనతాదళ్-సెక్యులర్) తరపున 2013 లో గుల్బార్గా దక్షిణ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
టికెట్ ఇవ్వలేదని బోరుమన్న బీజేపీ నేత
-
రూ.1500 లకే స్పెషల్ హెల్మెట్
బెంగళూరు : ప్రమాదాలకు గురైన సమయంలో రక్షణ కోసమే కాదు.. దారి చూపేందుకు కూడా సహకరించే హెల్మెట్లు త్వరలో మార్గెట్లోకి రానున్నాయి. అంతర్గతంగా బ్లూటూత్ స్పీకర్ ఇందులో పొందుపరచబడి ఉంటుంది. దీని ద్వారా రూట్ విషయంలో వాహనదారుడికి సూచనలు అందుతుంటాయి. బెంగళూర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిని తయారు చేశారు. గుల్బర్గాలోని పీడీఏ కాలేజీలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న యోగేష్, అభిజిత్‌లు ఈ హెల్మెట్‌ను రూపొందించారు. ‘హెల్మ్ట్లో ఇన్‌బిల్ట్‌గా ఓ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. దారి మరిచిపోయిన సందర్భంలో ఫోన్ బ్లూటూత్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌కు దీనికి అనుసంధానించే సౌలభ్యం ఉంటుంది. రూట్ తెలీక గందరగోళానికి గురయ్యే వాహనాదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అని ఆ విద్యార్థులు చెబుతున్నారు. ‘విదేశాల్లో వీటికి మంచి మార్కెట్ ఉంటుంది. కానీ, విద్యార్థుల కోరిక మేరకు 1500 రూ. దీనిని అమ్మాలని నిర్ణయించాం’ అని హెల్మెట్‌పై హక్కులు తీసుకున్న సంస్థ తెలిపింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఇది 6 గంటలు పని చేస్తుంది. ఛార్జింగ్ పోర్ట్‌తోపాటు, ముందు భాగంలో కూలింగ్ షీట్‌ను కూడా పొందుపరిచారు. త్వరలో బెంగళూర్‌తోపాటు మిగతా ప్రధాన నగరాల్లోని మార్కెట్ల్లోకి ఒకేసారి ఇవి అందుబాటులోకి రానున్నాయి. -
ఖ్వాజా బందే నవాజ్ దర్గా గుల్బర్గా
పుణ్య క్షేత్రం ప్రతి మనిషీ దేవుని సంతానమే. ప్రతి మనిషీ ఇంకో మనిషిని ప్రేమించాలి. మతం ఏదైనా కులం ఏదైనా సమూహం ఏదైనా మనుషుల మధ్య ప్రేమ ముఖ్యం... అని బోధించిన మహనీయుడు ఖ్వాజా బందే నవాజ్. ‘బందా’ అంటే ‘మనిషి’. ‘నవాజ్’ అంటే ‘ప్రియమైన’... ఆయన మనుషులకు ప్రియమైన వాడు. మనుషులను ప్రియమైనవారిగా చూసేవాడు. ఆయన మనుషులను అక్కున చేర్చుకునే మహనీయుడు. గుల్బర్గా చీకూ చింతా లేని ఊరు. ఎదగడానికి తొందరపడే ఊరులా కనిపించదు. ప్రశాంతమైన జనం... తీరిగ్గా ఉండే జీవనం. దిగిన వెంటనే మనకు ‘హాఫ్ ఆటో’ అనే మాట వినిపిస్తుంది. ‘షేర్ ఆటో’కు అది అక్కడ సమానార్థకం. ఆఫ్ ఆటోలో ఎక్కితే పది రూపాయలకు కావలసిన దూరంలో దింపుతారు. ‘ఫుల్ ఆటో’ అంటే మనకు మాత్రమే. అప్పుడు మనం బేరం చేసుకుని కావలసిన చోటుకు మాట్లాడుకోవాలి. నలభై రూపాయలకు చాలా దూరం వస్తారు. వంద రూపాయలకు దాదాపు ఊరు చుట్టేయొచ్చు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా 220 కిలోమీటర్ల దూరం. ముంబై వెళ్లే ట్రైన్లన్నీ ఇక్కడ ఆగుతాయి. మధ్యాహ్నం ‘పూణె శతాబ్ది’ ఉంది. ఎక్కితే మూడున్నర గంటల్లో శ్రమ లేకుండా దించుతుంది. స్టేషన్ నుంచి నాలుగడుగుల దూరంలోనే హోటల్స్ ఉన్నాయి. భారీ హోటల్స్ కాదు. మధ్యస్తంవి. ఉండొచ్చు. ఊళ్లో ఒక మంచి హోటల్ ఉంది. దానికి మాత్రం ముందే బుక్ చేసుకొని వెళ్లడం ఉత్తమం. లేకుంటే రూములు దొరకవు. హైదరాబాద్ నుంచి వెహికిల్ మాట్లాడుకుని వెళ్లేవాళ్లే ఎక్కువ. వికారాబాద్, వాడి మీదుగా శ్రమ లేకుండా చేరుకోవచ్చు. కలబురగి.... గుల్బర్గా అసలు పేరు కలబురగి అని అంటారు. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఆ రాజ్యం కింద ఉంది. ఇక్కడ ఆ కాలం నాటి కోట ఉంది. గట్టి రాతితో కట్టిన కోటను ‘కలబురగి’ అన్నారు. అదే ఆ ఊరి పేరైంది. అయితే ఆ తర్వాత వచ్చిన బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. అప్పుడు వారు ఆ ఊరిని అధికారికంగా ‘ఎహసేనాబాద్’ అని పెట్టుకున్నా ‘గుల్’ అనగా పూలతోటలు ఉన్న ఊరు కనుక జనసామాన్యంలో ‘గుల్బర్గా’ అన్నారు. చాలా కాలం అదే పేరు కొనసాగినా తాజా కర్ణాటక ప్రభుత్వం మళ్లీ పాత పేరును అధికారిక పేరుగా మార్చింది. కనుక ఊళ్లో ప్రభుత్వ బోర్డులు కలబురగి అని, ప్రజల బోర్డులు గుల్బర్గా అని ఉంటాయి. దర్గా... గల్బర్గా- దేశం మొత్తానికి అక్కడ ఉన్న దర్గా వల్లే ప్రసిద్ధి. మన దేశంలో ఎక్కువ ప్రాముఖ్యం కలిగిన దర్గాగా రాజస్తాన్‌లో ఉన్న అజ్మీర్ దర్గాను భావిస్తారు. అక్కడ ఉన్న సూఫీ గురువును ఖ్వాజా గరీబ్ నవాజ్ అని పిలుస్తారు. గరీబ్ అంటే పేద. ఆయన పేదల పెన్నిధి. దక్షిణాదిన ఉన్న గుల్బర్గా దర్గాలో ఉన్న సూఫీ గురువును బందే నవాజ్ అని పిలుస్తారు. అసలు పేరు... ఖ్వాజా బందే నవాజ్ అసలు పేరు సయ్యద్ ముహమ్మద్ హుసేని. భక్తులు ఆయనను ‘హజరత్ ఖ్వాజా బందే నవాజ్ గైసు దరజ్’ అని పిలుచుకుంటారు.‘ఖ్వాజా’ అంటే ‘గురువు’ అని అర్థం. బందే నవాజ్ 14-15 శతాబ్దాల కాలంలో జీవించారు. వీరి పూర్వికులది ఇస్లామీయ మహాపురుషులలో ఒకడైన హజరత్ అలీ వంశం అని భావిస్తారు. ఆ వంశానికి చెందినవారు ఢిల్లీకి వచ్చి స్థిరపడగా అక్కడ బందే నవాజ్ జన్మించారు. ఈయనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు వీరి కుటుంబం దౌలతాబాద్ వెళ్లిపోయింది. అక్కడే పదిహేనేళ్ల వరకూ ఉండి ఇస్లామీయ విద్యపై మక్కువతో ఢిల్లీలో ఉన్న సూఫీ గురువు హజరత్ నసీరుద్దీన్ చిరాగ్ దెహల్వి దగ్గర శిష్యరికానికి వచ్చారు. హజరత్ నసీరుద్దీన్ ప్రఖ్యాత సూఫీ గురువు హజరత్ నిజాముద్దీన్‌కు శిష్యులు. ఆగని చదువు... బందే నవాజ్ తన గురువు నసీరుద్దీన్ దగ్గర విద్యను అభ్యసించారు. అది ఒక స్థాయికి చేరుకుంది. ఇక నేను చదువు ఆపవచ్చునా అని గురువును అడిగారట. నిజానికి అంతటితో ఆపితే నష్టం లేదు. కాని ఆ గురువు- లేదు.. కొనసాగించు నీ నుంచి నేను చాలా ఆశిస్తున్నాను అన్నారట. ఆ తర్వాత బందే నవాజ్ తన ఆధ్యాత్మిక చదువును మరింత లోతులకెళ్లి కొనసాగించారు. ఆయన 105 సంవత్సరాలు జీవించారు. తన జీవితకాలంలో 105 విశిష్టమైన ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. ఏవీ కలం పట్టి రాయలేదు. చెప్తూ ఉండగా సహాయకుడు రాసి పెట్టడమే. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేయనున్నాడని బందే నవాజ్ జోస్యం చెప్పినట్టుగా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఢిల్లీ మీద తైమూర్ దాడి చేసి ఆ నగరాన్ని సర్వనాశనం చేసినప్పుడు బందేనవాజ్ను బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తన గుల్బర్గాకు వచ్చి ఉండిపోవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. అలా తన 76వ ఏట గుల్బర్గా వచ్చిన బందే నవాజ్ అక్కడే 105 సంవత్సరాల వరకూ జీవించి క్రీ.శ. 1422లో దైవ సన్నిధికి చేరుకున్నారు. మనసును తాకే ప్రశాంతత... గుల్బార్గా దర్గాకు స్టేషన్ నుంచి అరవై రూపాయలు ఆటో చెల్లించి చేరుకోవచ్చు. దర్గా ఊళ్లో కొంచెం లోపలి ప్రాంతంలో ఉంటుంది. దర్గా ఆవరణలో పూల దుకాణాల వారు పూల చాదర్లు అమ్ముతుంటారు. వాటిని కొని దర్గాలో సమర్పించవచ్చు. దేశంలో చాలా దర్గాలు ఉన్నాయి. కాని గుల్బర్గా దర్గా ఎంతో విశాలమైన ప్రశాంతమైన దర్గా అనిపిస్తుంది. గురుసమాధి ఉన్న టూంబ్ ఎంతో విశాలంగా ఏ.సిలు బిగించి తొడతొక్కిడి లేని దర్శనం కలిగి హాయిగా ఉంటుంది. మనసులో ఉన్నది నివేదించుకుంటే నెరవేరుతుందని నమ్మిక. అసలు హోటళ్లు అవసరం లేకుండా దర్గాలోనే నిద్ర చేసే వీలుంది. దర్గా ఆవరణలోని విశాలమైన షెడ్లు రాత్రిళ్లు నిద్రపోవడానికి వీలుగా ఉంటాయి. భక్తుల కోసం స్నానాల గదులు, టాయిలెట్లు ఉన్నాయి. చాలామంది భక్తులు హోటల్ గదుల జోలికి పోకుండా రెండు మూడు రోజులు ఇక్కడే ఉండిపోతారు. అన్ని మతాల కూడలి... గుల్బర్గా దర్గాకి అన్ని మతాల వాళ్లు వస్తారు. ఖ్వాజా బందే నవాజ్ చెప్పినట్టుగా మనిషిని మనిషి ప్రేమించడానికి మతం అడ్డుకాదు అనే భావనకు ఆ తావు ఒక సాక్ష్యం పలికినట్టు ఉంటుంది. గుల్బర్గాలో బస చేసి తెల్లవారు జామున దర్గాను సందర్శించి చూడండి. మీ మనసుకు అమితమైన ప్రశాంతత చేకూరుతుంది. మీ ఆందోళనలన్నీ చెదిరి పోయి మీ ధైర్యం స్థిరపడి ముందుకు వెళ్లే స్థిమితత్వం వస్తుంది. గురుమార్గం- తప్పక అనుసరణీయమైన మార్గం. - కెవికె కుమార్ ఆయన మహిమను చూస్తారా..? బందేనవాజ్ తన గురువుకు సేవ చేసే సమయంలో కురులను పొడవుగా పెంచారట. ఒకసారి గురువును పల్లకీలో మోసుకుంటూ వెళుతూ ఉండగా ఆ కురులు పల్లకీ అంచులో చిక్కుకుపోయాయి. ఎంతో నొప్పి కలుగుతున్నా గురువుకు అంతరాయం కలుగుతుందని ఆ సంగతి చెప్పలేదు. సాధారణంగా మిగిలిన బోయీలు చేయి మార్చుకుంటారు. తన కురులు చిక్కుకుపోవడం వల్ల మరొకరికి భుజం మార్చకుండా అలాగే పల్లకీని మోశారు. ఈ సంగతి తెలిసి గురువు పులకించి పోయి ‘గైసు దరజ్’ బిరుదు ఇచ్చారు. బందే నవాజ్ సమక్షంలో ఒక అనుయాయి ఒక వ్యక్తిని ‘నువ్వు’ అని సంబోధించాడు. దానికి బందే నవాజ్ అభ్యంతరం చెప్పారు. ‘అతడు హిందువు. కనుక నువ్వు అన్నాను’ అన్నాడు అనుయాయీ. ‘దానికంటే ముందు అతడు మనిషి. మనిషిని గౌరవించు’ అని హితవు చెప్పారు బందే నవాజ్. బందే నవాజ్ మహిమాన్వితం పట్ల అనుమానాలున్న ఒక పెద్ద మనిషి ఒకసారి బందేనవాజ్ను దర్శించడానికి వచ్చి ఆ సమయంలో ఆయన చేతిలో ఉన్న విసన కర్రను చూసి ఇది నాకు ఇస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు బందే నవాజ్ ఆ పెద్ద మనిషితో ‘ఒక ఊళ్లో ఒక గాడిదకి దొంగలని పట్టడం తెలుసు. దాని కళ్లకు గంతలు కట్టి అనుమానితుల దగ్గర వదిలేస్తే అది నేరుగా వెళ్లి దొంగ కట్టుకున్న పంచెను పట్టుకుని లాగుతుంది. మహిమలు చూపితే నేనూ ఆ గాడిదతో సమానం అవుతాను. ఇదిగో విసనకర్ర కోరుకున్నావుగా. తీసుకెళ్లు’ అని ఇచ్చేశారు. ఒక ముసలామె బందే నవాజ్ మహిమను ఎగతాళి చేయదలచి జనాజా (శవవాహనం)లో తన కొడుకును పడుకోబెట్టి నలుగురితో కూడి బందే నవాజ్ దగ్గరకు వచ్చి నా కొడుకు చనిపోయాడు... జనాజా నమాజు చదవండి అని ప్రాధేయపడింది. ఆయన నమాజు చదవడం మొదలెడితే కొడుకు నవ్వుతూ లేచి నిలబడి ఆయనను ఎగతాళి చేయాలని ఉద్దేశ్యం. బందే నవాజ్ జనాజా నమాజు చదివారు. నమాజు పూర్తయినా కొడుకు లేవలేదు. తల్లి వెళ్లి చూస్తే చనిపోయి ఉన్నాడు. చేసిన తప్పుకు లెంపలు వేసుకుని ఆమె బందే నవాజ్ కాళ్ల మీద పడింది. బందే నవాజ్ ఆమెను క్షమించిన మరుక్షణం కొడుకు శరీరం ప్రాణంతో కదిలింది. -
జూనియర్ పై సీనియర్ల అకృత్యం
కోజికోడ్: ర్యాగింగ్ బారిన పడిన కేరళ నర్సింగ్ విద్యార్థిని ఒకరు చావుబతుకుల్లో ఉంది. సీనియర్స్ కిరాతకం కోజికోడ్ కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. గత 9నకర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుల్బర్గాలోని అల్ ఖమర్ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న కేరళ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఆమెతో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్ బలవంతంగా తాగించారు. బాధితురాలిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఆమె కోలుకోలేదు. దీంతో ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఫినాయిల్ తాగడం వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. కూలి పనులు చేసుకుని జీవించే తాను కూతురు చదువు కోసం రూ. 3 లక్షలు అప్పు చేశానని బాధితురాలి తల్లి వెల్లడించింది. ర్యాగింగ్ జరగలేదని, కుటుంబ సమస్యల కారణంగానే బాధితురాలు ఫినాయిల్ తాగిందని నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్తేర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై గుల్బర్గా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
24 మంది దోషులు.. 36 మంది నిర్దోషులు
* గుల్బర్గ్ ఊచకోత కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు * అందరిపై కుట్ర అభియోగాలు కొట్టివేత అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 14 ఏళ్ల నాటి గుల్బర్గ్ నరమేధం కేసులో ప్రత్యేక కోర్టు 24 మందిని దోషులుగా తేల్చింది. గోద్రా అల్లర్ల మరుసటి రోజు జరిగిన ఈ ఊచకోత కేసులో కోర్టు 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అందరిపైనా కుట్ర అభియోగాలను తొలగించింది. ఈనెల 6న దోషులకు జడ్జి శిక్ష ప్రకటించనున్నారు. 2002లో గుజరాత్లో జరిగిన ఈ ఊచకోత ఘటనలో నాటి కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది బలయ్యారు. అప్పుడు జాఫ్రీని దుండగులు బయటకు ఈడ్చుకొచ్చి కిరాతకంగా చంపి తగులబెట్టారు. జాఫ్రీ భార్య జకియా 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్నప్పటికీ తనకు జరిగిన అన్యాయంపై అలుపెరగకుండా పోరాడారు. 66 మంది నిందితులు దర్యాప్తు సంస్థ ‘సిట్’ ఈ కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొనగా ఆరుగురు విచారణ దశలో మరణించారు. 24 మంది దోషుల్లో 11 మందిని ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్ గురువారం ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) కింద దోషులుగా నిర్ధారించారు. మిగిలిన 13 మందిపై చిన్నపాటి నేరాలను నిర్ధారించారు. నిర్దోషులుగా తేలిన వారిలో సిట్టింగ్ బీజేపీ కార్పొరేటర్ బిపిన్ పటేల్, గుల్బర్గ్ సొసైటీ ఏరియా ఇన్స్పెక్టర్ కేజీ ఈర్దా, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ మేఘ్‌సింగ్ చౌదరీ తదితరులు ఉండగా, తేలికపాటి నేరాలు రుజువైన వారిలో వీహెచ్‌పీ నాయకుడు అతుల్ వైద్య తదితరులున్నారు. దోషుల్లో 11 మందికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరే అవకాశం ఉండగా, దోషుల తరఫు న్యాయవాదులు మరణించేవరకు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరే అవకాశముంది. మిగిలిన 13 మందికి 10-12 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారించింది. ఊచకోత ముందస్తు ప్రణాళిక మేరకు పన్నిన కుట్రే అని నమోదుచేసిన అభియోగాలను సిట్ దానిని నిరూపించలేకపోయింది. దర్యాప్తునకు నేతృత్వం వహించిన సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్కే రాఘవన్ తీర్పుపై మిశ్రమ అభిప్రాయం వ్యక్తంచేశారు. తీర్పుపై సవాల్‌చేసే విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామన్నారు. హత్యానేరం కింద దోషులు: కైలాశ్ దోబీ, యోగేంద్రసింగ్ షెకావత్, క్రిష్ణ కుమార్ కలాల్, దిలీప్ కలు, జయేశ్ పర్మర్, రాజు తివారీ, నరన్ తంక్, లఖన్సింగ్ చుడాసమా, దినేశ్ శర్మ, భరత్ బలోడియా, భరత్ రాజ్‌పుత్. బాధిత కుటుంబాల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దర్యాప్తు కోసం సిట్‌ను నియమించింది. పోరాటం ఆగుతుందనుకున్నా: జకియా కోర్టు తీర్పుపై జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘నిందితులు తాము చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. వారంతా నా కళ్లముందే ఎంతోమందిని కిరాతకంగా చంపేశారు.’ అని జకియా మీడియాకు చెప్పారు. ఈ రోజుతో తన పోరాటం ముగిసిపోతుందని అనుకున్నానని, అయితే ఈ తీర్పుతో పోరాటం కొనసాగించక తప్పదన్నారు. మోదీకి కళంకం: మాజీ న్యాయమూర్తి ఊచకోత నాడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారని, ఈ తీర్పు మోదీకి కళంకితమని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజిందర్ సచార్ అన్నారు. -
‘హై-క’ అభివృద్ధే లక్ష్యంగా నేడు గుల్బర్గాలో అసెంబ్లీ
బెంగళూరు : హైదరాబాద్-కర్ణాటక ప్రాంత సమగ్ర అభివృద్ధే ముఖ్య అజెండాగా శుక్రవారం గుల్బర్గాలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతమైన హై-క అభివృద్ధిపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుల్బర్గాలోని కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక హై-క ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇక్కడ సాగు, తాగునీటి వనరుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు అందజేయాల్సిన సాయం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. హై-క ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గాను 371(జె) ప్రకారం ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి రాకపోవడంతో ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఇక హై-క అభివృద్ధి మండలికి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పాటు ఇప్పటికే విడుదలైన నిధులను సైతం సరిగ్గా వినియోగించలేదు. ఈ కారణంగా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక మంత్రి వర్గ సమావేశ నిర్వహణ కోసం గుల్బర్గాకు వస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులకు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. గుల్బర్గా నగరాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జెండా లు, కాంగ్రెస్ నాయకుల కటౌట్లతో కాంగ్రెస్ శ్రేణులు నింపేశాయి. కాగా చెరుకు మద్దతు ధరకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులు ఈ మంత్రి వర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుల్బర్గాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఇందుకు గాను బెంగళూరు నుంచి ప్రత్యేక బలగాలను రప్పించి గుల్బర్గాలో మోహరించారు. -
వికా సాగర్ జేవీలో పూర్తివాటా వికా చేతికి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కర్నాటక రాష్ర్టం గుల్బర్గాలో ఏర్పాటు చేసిన వికా సాగర్ సిమెంట్‌లో 47 శాతం వాటాను వికాకు విక్రయిస్తోంది. 47 శాతం వాటాను రూ. 435 కోట్లకు (షేరు ధర రూ.66.68) అమ్మడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు సాగర్ సిమెంట్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఫ్రాన్స్‌కు వికా, రాష్ట్రానికి చెందిన సాగర్ సిమెంట్స్ సంయుక్త భాగస్వామ్యంతో గుల్బర్గాలో వికా సాగర్ సిమెంట్ పేరుతో 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని 2008లో నిర్ణయించుకున్నాయి. ఈ వెంచర్లో వికాకు 53 శాతం వాటా వుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ కింద డిసెంబర్, 2012 నాటికి 2.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం సాగర్ సిమెంట్ రూ.86 కోట్లు వ్యయం చేసింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా భాగస్వామ్యం నుంచి తప్పుకున్నామని, ఇక నుంచి రెండు కంపెనీలు వాటి శక్తి సామర్థ్యాలున్న రంగాలపై పూర్తి దృష్టిసారించడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని సాగర్ సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ప్లాంట్ పెట్టడం లేదా ఇతర కంపెనీలను కొనుగోళ్లకు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాగర్ సిమెంట్స్ 2.3 మిలియన్ టన్నుల క్లింకర్ సామర్థ్యం, 2.75 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అవసరమైన నియంత్రణా సంస్థల అనుమతులు రాగానే డీల్ పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది. -
విషాద యాత్ర
బెంగళూరు, న్యూస్‌లైన్ : కాసేపట్లో దర్గాకు చేరుకుని, దైవ సమానులైన గురువుకు ప్రార్థనలు చేయాల్సి ఉంది. ఇంకేముంది అర గంటలో దర్గాకు చేరుకుంటున్నాం కదా అనుకుంటుండగానే... విధి వక్రించింది. గురువు సన్నిధిని కాకుండా దైవ సన్నిధిని చేరుకోవాల్సి వచ్చింది. గుల్బర్గ జిల్లా అళంద తాలూకా కోరహళ్లి క్రాస్ వద్ద సోమవారం వేకువ జామున కేఎస్ ఆర్టీసీ బస్సు, మ్యాక్సీ క్యాబ్‌లు ముఖాముఖి ఢీ కొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అసువులు బాశారు. వారంతా ఉమ్మడి కుటుంబాలకు చెందిన వారు. మృతులను మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్గూడ్కు చెందిన నబీలాల్ అహ్మద్ హనీఫ్ముల్లా (58), మహబూబ్ బీ నబీలాల్ ముల్లా (55), రంజాన్ దాదాసాబ్ ముల్లా (25), గుడు మదర్సాబ్ ముల్లా (25), బాషా మదర్సాబ్ ముల్లా (60), సమీర్ ముల్లా (50), రెహానా షేక్ ముల్లా (30), మొహసీనా సికిందర్ (14), హుసేన్ మదరసా ముల్లా (30), మొమైత్ మహబూబ్ ముల్లా (35), నూర్జహాన్ రజాక్ (38), పర్వీన్ సికిందర్ ముల్లా (30), సమీరా ముల్లా (8), బావా జాన్ (32), మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కమలాకర్ (38)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 12 మంది గుల్బర్గలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి, అళందలోని ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా ఆదివారం రాత్రి మాక్సీ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని గుల్బర్గ సమీపంలోని ఖాజా బాందా నవాజ్ దర్గాకు బయలుదేరారు. అర్ధరాత్రి వరకు అందరూ ఉల్లాసంగా మాట్లాడుకుంటూ గడిపారు. అనంతరం నిద్రలోకి జారుకున్నారు. కొద్ది సేపట్లో క్యాబ్ దర్గాకు చేరుకోవాల్సి ఉండగా, హొస్పేట నుంచి అళంద తాలూకా జడగాకు వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీ కొంది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయాయి. 12 మంది అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. క్యాబ్‌లో ఉన్న 14 మంది, బస్సులోని ఐదు మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ రవి లింగశెట్టి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు మూడు గంటల పాటు శ్రమించి వాహనాలను వెలికి తీసి, మృతదేహాలను అళంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రవి లింగశెట్టికి వరుసగా మూడు రోజుల పాటు డ్యూటీ చేస్తుండడం వల్ల నిద్రలోకి జారుకున్నాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఖమరుల్ ఇస్లాం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు. -
చికిత్స పొందుతున్న గుల్బర్గా ఎస్ఐ మృతి
-
చికిత్స పొందుతున్న గుల్బర్గా ఎస్ఐ మృతి
రౌడీషీటర్ మున్నాతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన గుల్బర్గా ఎస్ఐ మల్లికార్జున బండె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ నెల 8న గుల్బర్గాలో రౌడీషీటర్ మున్నా, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్ఐ మల్లికార్జున తలలో రెండు బుల్లెట్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ని మొరుగైన వైద్య చికిత్స కోసం గుల్బర్గా నుంచి హైదరాబాద్ తరలించారు. స్థానిక యశోదా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆయనకు మరింత మెరుగైన వైద్య సహయం కోసం విదేశాల్లోని వైద్యులను భారత్ కు తీసుకురావాలని ఎస్ఐ భార్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
బళ్లారి విమానాశ్రయాన్ని త్వరగా నిర్మిస్తాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బళ్లారి సహా గుల్బర్గ, శివమొగ్గల్లో విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గుల్బర్గలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పనులను వేగవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయాల నిర్మాణ పనులను ఆపబోమని భరోసా ఇచ్చారు. గుల్బర్గలో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చినందున ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఆయన తప్పే చేయలేదని స్పష్టం చేశారు. వర్షా కాలం తర్వాత దెబ్బ తిన్న రోడ్లు, వంతెనలను మరమ్మతు చేయిస్తామని తెలిపారు. కొత్త తాలూకాల ఏర్పాటుపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.