సాక్షి, హైదరాబాద్: చేతికి అందితే గొలుసులు.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చేతిలోని మారణాయుధాలతో దాడులు... ఇదే గుల్బర్గాకు చెందిన చెయిన్ స్నాచర్ల లక్ష్యం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస స్నాచింగ్‌లకు పాల్పడి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దరు స్నాచర్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి తపంచా, రివాల్వర్, 15 బుల్లెట్లు, రెండు కత్తులు, రెండు సెల్‌ఫోన్లు, బైక్, 47 గ్రాముల బంగారు ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్‌తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం వివరాలు వెల్లడించారు.
- ఈనెల 10న గుల్బర్గాకు చెందిన ఇషాన్ నిరంజన్, రాహుల్ కర్నాటకలోని హుడ్నూర్ రింగ్ రోడ్‌లోని ఓ జువెల్లరీ షాపులో చోరీ యతి్నంచారు. నిందితులను పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుళ్లు గురుమూర్తి, సంజయ్ కుమార్లపై ఇనుప రాడ్లతో దాడి చేసి పరారయ్యారు. కర్నాటక పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేయడంతో బైక్‌పై హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ వీరికి మరో నిందితుడు ఆశ్రయం కలి్పంచాడు. ముగ్గురు కలిసి పెద్ద మొత్తంలో చెయిన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇషాన్, రాహులపై కర్నాటకలో బైక్ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి.
- ఈ నెల 25న ముగ్గురు బైక్‌పై వచ్చి గచ్చిబౌలి, కూకట్‌పల్లి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో పరిధిలో ముగ్గురు మహిళల మెడలో నుంచి చెయిన్లను దొంగిలించారు. మర్నాడు ఉదయం బైక్‌పై నిరంజన్, రాహుల్ మియాపూర్ పీఎస్ పరిధిలో మరో మహిళ చెయిన్ లాక్కెళ్లారు. అక్కడి నుంచి పటాన్‌చెరు మీదుగా పారిపోవటానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే 25న స్నాచింగ్ చేసిన నిందితులే మియాపూర్‌లోనూ పంజా విసిరినట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), మాదాపూర్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నిందితులు రాత్రి అక్కడే గడిపారు.
- 26న ఉదయం 10 గంటలకు సీసీఎస్ కానిస్టేబుల్ కృష్ణా బైక్‌పై వెళుతుండగా నిందితులు మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద కనిపించారు. వెంటనే ప్రత్యేక బృందాలకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మియాపూర్‌లో స్నాచింగ్‌కు యతి్నంచి విఫలం కావటంతో.. పరారైన నిందితులు పది నిమిషాల్లోనే ఆర్సీపురం పీఎస్ పరిధిలోని బీహెచ్‌ఈఎల్‌లో స్నాచింగ్ చేశారు. దీంతో నిందితులు బీహెచ్‌ఈఎల్‌లోకి ఎంట్రీ అయ్యారని నిర్దారించుకున్న పోలీసులు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను దిగ్బంధం చేశారు.
- వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. అడుగడుగునా జల్లెడ పట్టారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబేష్ రవి బైక్‌లపై గాలిస్తుండగా.. తెలుపై రంగు పల్సర్ బైక్‌పై యాష్ కలర్ జాకెట్, తెలుపు రంగు షర్ట్, నలుపు, ఎరుపు రంగు టోపీలు ధరించిన నిరంజన్, రాహుల్ హెచ్‌ఐజీ గేట్ వైపునకు వెళుతున్నట్లు గుర్తించారు. దిబేష్ బైక్ దిగి నిందితుడు రాహుల్‌ను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన నిరంజన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్యపై దాడి చేశాడు. రక్తం కారుతున్నా.. యాదయ్య నిరంజన్‌ను వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ రవి.. నిరంజన్‌ను పట్టుకున్నాడు. వారు యాదయ్యను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదయ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
శౌర్య పతకాలకు ప్రతిపాదన..
ప్రాణాలకు తెగించి చెయిన్ స్నాచర్లను పట్టుకున్న హెచ్‌సీ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిల ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించి పోలీసులపై ప్రజలలో విశ్వాసం, నమ్మకాన్ని కలి్పంచారని కొనియాడారు. హెచ్‌సీ యాదయ్యతో పాటు కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిలకు శౌర్య పతకం కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి ప్రతిపాదిస్తామని సీపీ తెలిపారు.
(చదవండి: ఇక్కడి నుంచే దేశం దాటింది )
Comments
Please login to add a commentAdd a comment