theives attack
-
దొరికితే గొలుసులు.. లేదంటే దాడులు!
సాక్షి, హైదరాబాద్: చేతికి అందితే గొలుసులు.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చేతిలోని మారణాయుధాలతో దాడులు... ఇదే గుల్బర్గాకు చెందిన చెయిన్ స్నాచర్ల లక్ష్యం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస స్నాచింగ్‌లకు పాల్పడి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దరు స్నాచర్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి తపంచా, రివాల్వర్, 15 బుల్లెట్లు, రెండు కత్తులు, రెండు సెల్ఫోన్లు, బైక్, 47 గ్రాముల బంగారు ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10న గుల్బర్గాకు చెందిన ఇషాన్ నిరంజన్, రాహుల్ కర్నాటకలోని హుడ్నూర్ రింగ్ రోడ్‌లోని ఓ జువెల్లరీ షాపులో చోరీ యతి్నంచారు. నిందితులను పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుళ్లు గురుమూర్తి, సంజయ్ కుమార్లపై ఇనుప రాడ్లతో దాడి చేసి పరారయ్యారు. కర్నాటక పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేయడంతో బైక్‌పై హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ వీరికి మరో నిందితుడు ఆశ్రయం కలి్పంచాడు. ముగ్గురు కలిసి పెద్ద మొత్తంలో చెయిన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇషాన్, రాహులపై కర్నాటకలో బైక్ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. ఈ నెల 25న ముగ్గురు బైక్‌పై వచ్చి గచ్చిబౌలి, కూకట్పల్లి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో పరిధిలో ముగ్గురు మహిళల మెడలో నుంచి చెయిన్లను దొంగిలించారు. మర్నాడు ఉదయం బైక్‌పై నిరంజన్, రాహుల్ మియాపూర్ పీఎస్ పరిధిలో మరో మహిళ చెయిన్ లాక్కెళ్లారు. అక్కడి నుంచి పటాన్చెరు మీదుగా పారిపోవటానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే 25న స్నాచింగ్ చేసిన నిందితులే మియాపూర్‌లోనూ పంజా విసిరినట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), మాదాపూర్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నిందితులు రాత్రి అక్కడే గడిపారు. 26న ఉదయం 10 గంటలకు సీసీఎస్ కానిస్టేబుల్ కృష్ణా బైక్‌పై వెళుతుండగా నిందితులు మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద కనిపించారు. వెంటనే ప్రత్యేక బృందాలకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మియాపూర్‌లో స్నాచింగ్‌కు యతి్నంచి విఫలం కావటంతో.. పరారైన నిందితులు పది నిమిషాల్లోనే ఆర్సీపురం పీఎస్ పరిధిలోని బీహెచ్ఈఎల్లో స్నాచింగ్ చేశారు. దీంతో నిందితులు బీహెచ్ఈఎల్లోకి ఎంట్రీ అయ్యారని నిర్దారించుకున్న పోలీసులు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను దిగ్బంధం చేశారు. వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. అడుగడుగునా జల్లెడ పట్టారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబేష్ రవి బైక్‌లపై గాలిస్తుండగా.. తెలుపై రంగు పల్సర్ బైక్‌పై యాష్ కలర్ జాకెట్, తెలుపు రంగు షర్ట్, నలుపు, ఎరుపు రంగు టోపీలు ధరించిన నిరంజన్, రాహుల్ హెచ్ఐజీ గేట్ వైపునకు వెళుతున్నట్లు గుర్తించారు. దిబేష్ బైక్ దిగి నిందితుడు రాహుల్‌ను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన నిరంజన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్యపై దాడి చేశాడు. రక్తం కారుతున్నా.. యాదయ్య నిరంజన్ను వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ రవి.. నిరంజన్ను పట్టుకున్నాడు. వారు యాదయ్యను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదయ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శౌర్య పతకాలకు ప్రతిపాదన.. ప్రాణాలకు తెగించి చెయిన్ స్నాచర్లను పట్టుకున్న హెచ్‌సీ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిల ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించి పోలీసులపై ప్రజలలో విశ్వాసం, నమ్మకాన్ని కలి్పంచారని కొనియాడారు. హెచ్‌సీ యాదయ్యతో పాటు కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిలకు శౌర్య పతకం కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి ప్రతిపాదిస్తామని సీపీ తెలిపారు. (చదవండి: ఇక్కడి నుంచే దేశం దాటింది ) -
ముసుగు దొంగల స్వైరవిహారం... మూడు విల్లాల్లో చోరి
శంషాబాద్: శంషాబాద్ పట్టణం, సాతంరాయిలో ముసుగు దొంగలు స్వైరవిహారం చేశారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీపై ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి లోపలికి చొరబడి చోరీ చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాశంబండ సాతంరాయిలోని సుచిరిండియా విల్లాల్లో బుధవారం ఉదయం మూడు విల్లాల యజమానులు ఇంటి తలుపులకు ఉన్న గడియలు కోసేసి ఉండటాన్ని గుర్తించారు. అల్మారాల్లో ఉన్న నగదు పోయిందని నిర్ధారించుకుని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. విల్లాలకు ముందు భాగంలో ఉన్న ఫెన్సింగ్‌ను కోసేసిన దుండగులు లోపలికి చొరబడి విల్లాల వెనుక భాగంలో ఉన్న తలుపులను గ్యాస్ కట్టర్లతో తొలగించినట్లు గుర్తించారు. ఐఏఎస్ అధికారి ఇంట్లో.. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ ఇంట్లో రూ. 60 వేలు, ఆ పక్కనే ఉన్న మరో రెండు విల్లాల్లో రూ. 30, రూ. 10 వేలు దొంగిలించారు. అయితే ఆయా ఇళ్లల్లో వెండి వస్తువులు, పాటు విలువైన గ్యాడ్జెట్స్, ల్యాప్‌టాప్‌లు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తీరిగ్గా ఆకలి తీర్చుకుని.. ముసుగు దొంగలు ముగ్గురు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ పని ప్రారంభించి సుమారు నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో స్పష్టమైంది. వారు రెండు ఇళ్లలోని ఫ్రిజ్‌లలో పండ్లను మొత్తం ఆరగించినట్లు గుర్తించారు. చోరీల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విల్లాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వారే దొంగతనం చేసి ఉంటారా..? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. (చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ..) -
హుండీని పెకలించి చోరీకి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయాల్లో నగలు చోరీ శివమొగ్గ: బసవనగంగూరు గ్రామంలోని గుళ్లమ్మ, మాతంగమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి దొంగలు చొరబడి దేవతామూర్తులకు అలంకరించిన రూ.లక్ష విలువైన బంగారు నగలు, హుండీలోని కానుకలను ఎత్తుకెళ్లారు. 14 బైక్‌లు స్వాధీనం యశవంతపుర: దేవస్థానాల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న మైసూరు జిల్లా శ్రీరంగపట్టణకు చెందిన శివకుమార్ అనే దొంగను చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.11.35 లక్షల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇతను జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర) -
దొంగల తెలివి...ఏటీఎం మిషన్నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్
Thieves can go to any extent: ఇటీవలే బిహార్‌లో ఒక దొంగల ముఠా స్టీల్ బ్రిడ్జ్‌ని దొంగలించిన సంటన గురించి విన్నాం. అంతేందుక ఒక దొంగ ఒక మహిళ దృష్టి మరల్చడానిక హఠాత్తుగా డ్యాన్స్ చేసి రోలెక్స్ వాచ్‌ని ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి డబ్బులు కోసం ఏటీఎం మిషన్‌ని ఎత్తుకుపోవాలనుకున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లే...మహారాష్ట్రాలోని దొంగలు డబ్బులు కోసం ఏకంగా ఏటీఎం మిషన్‌ని తవ్వేందుకు యత్నించారు. అందుకోసం ఏకంగా ఎక్స్‌కవేటర్‌ని ఉపయోగించారు. ఈ ఘటన చూస్తే డబ్బలు కోసం ఎంతకైన తెగిస్తారు దొంగలు అన్నట్లుగా ఉంది. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు దొంగల ధైర్యాన్ని చూసి ఫిదా అవ్వడమే కాకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయంటూ... ట్వీట్ చేశారు. JCB Crane used to steal #ATM Machine in Maharshtra#Robbery pic.twitter.com/CSLn3nQohS — శంకర్ ముదిరాజ్ (@Gsk339) April 24, 2022 (పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్) -
ఇంట్లో చొరబడి యువతులపై లైంగిక దాడికి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పరిధిలోని రాజానుకుంట వద్ద అద్దిగానహళ్లి గ్రామంలో జూన్ 8వ తేదీ తెల్లవారుజామున ఒక కార్పెంటర్ ఇంట్లోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో వారిని బెదిరించి రూ.10వేల నగదు, కొంత బంగారం దోచుకున్నారు. (చదవండి: విమానాలకు రన్‌వేగా..) కామంతో కళ్లుమూసుకుపోయిన చోరులు ఇంట్లో ఉన్న యువతులపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అయితే వారు గట్టిగా కేకలు వేయడడంతో పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) -
క్రేన్ తో దొంగతనానికి వచ్చి..
తలకొండపల్లి: చోరీ ఘటన సినిమా సీన్‌ను తలపించింది.. క్రేన్ సహాయంతో ఓ భారీ వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అయితే క్రేన్ బురదలో కూరుకుపోవడంతో ప్రయత్నం బెడిసి విగ్రహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన సోమవారం మండలంలోని వెల్జాల్ గ్రామంలో సంచలనం రేకెత్తించింది. గ్రామశివారులోని వెంకాయకుంటలో ఆరుబయట అతిపురాతన వినాయక విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి అత్యంత పవిత్రత ఉందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢనమ్మకం. కోరినకోర్కెలుతీర్చే దేవుడిగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన వినాయకుడి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లేందుకు పథకం రచించారు. ఆదివారం అర్ధరాత్రి క్రేన్‌తో వెంకాయకుంటకు చేరుకున్నారు. విగ్రహాన్ని ట్రక్కు, లారీ, తదితర వాహనాల్లో వేయడానికి యత్నించారు. కొద్దిదూరం పాటు విగ్రహాన్ని క్రేన్‌సాయంతో కదిలిం చారు. లారీలో వేస్తుండగా క్రేన్ బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో దుండగులు విగ్రహంతో పాటు క్రేన్‌ను అక్కడే వదిలిపారిపోయారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కొందరు క్రేన్‌ను గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఆమనగల్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు మహేందర్, శ్రీనివాసులు, సాయికుమార్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలు ఆరాతీరు. గ్రామస్తుల ఆందోళన క్రేన్‌ను అక్కడినుంచి తరలించేందుకు సన్నాహాలు చేశారు. గ్రామస్తులు క్రేన్‌ను ఎక్కడికీ తరలించొద్దని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యజమాని ఇక్కడికి రావాలని, విగ్రహం చోరీ వివరాలను వెల్లడించాలని పట్టుబట్టారు. పోలీస్‌లు ఎంతచెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు కొద్దిసేపు వా గ్వాదం కొనసాగింది. విషయం తెలుసుకున్న మాజీ ఏంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు తహశీల్దార్ జ్యోతిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వినాయకుడి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్టింపజేస్తామని ఇరువర్గాలను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. అక్కడే ఉన్న క్రేన్‌సాయంతో పూర్వస్థానంలో ఉంచారు. విగ్రహాన్ని అభిషేకించి ప్రత్యేకపూజలు జరిపారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. క్రేన్‌ను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.