chain snacthing
-
దొరికితే గొలుసులు.. లేదంటే దాడులు!
సాక్షి, హైదరాబాద్: చేతికి అందితే గొలుసులు.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చేతిలోని మారణాయుధాలతో దాడులు... ఇదే గుల్బర్గాకు చెందిన చెయిన్ స్నాచర్ల లక్ష్యం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస స్నాచింగ్‌లకు పాల్పడి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దరు స్నాచర్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి తపంచా, రివాల్వర్, 15 బుల్లెట్లు, రెండు కత్తులు, రెండు సెల్ఫోన్లు, బైక్, 47 గ్రాముల బంగారు ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నారు. డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10న గుల్బర్గాకు చెందిన ఇషాన్ నిరంజన్, రాహుల్ కర్నాటకలోని హుడ్నూర్ రింగ్ రోడ్‌లోని ఓ జువెల్లరీ షాపులో చోరీ యతి్నంచారు. నిందితులను పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుళ్లు గురుమూర్తి, సంజయ్ కుమార్లపై ఇనుప రాడ్లతో దాడి చేసి పరారయ్యారు. కర్నాటక పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేయడంతో బైక్‌పై హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ వీరికి మరో నిందితుడు ఆశ్రయం కలి్పంచాడు. ముగ్గురు కలిసి పెద్ద మొత్తంలో చెయిన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇషాన్, రాహులపై కర్నాటకలో బైక్ దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. ఈ నెల 25న ముగ్గురు బైక్‌పై వచ్చి గచ్చిబౌలి, కూకట్పల్లి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో పరిధిలో ముగ్గురు మహిళల మెడలో నుంచి చెయిన్లను దొంగిలించారు. మర్నాడు ఉదయం బైక్‌పై నిరంజన్, రాహుల్ మియాపూర్ పీఎస్ పరిధిలో మరో మహిళ చెయిన్ లాక్కెళ్లారు. అక్కడి నుంచి పటాన్చెరు మీదుగా పారిపోవటానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే 25న స్నాచింగ్ చేసిన నిందితులే మియాపూర్‌లోనూ పంజా విసిరినట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), మాదాపూర్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో నిందితులు రాత్రి అక్కడే గడిపారు. 26న ఉదయం 10 గంటలకు సీసీఎస్ కానిస్టేబుల్ కృష్ణా బైక్‌పై వెళుతుండగా నిందితులు మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద కనిపించారు. వెంటనే ప్రత్యేక బృందాలకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మియాపూర్‌లో స్నాచింగ్‌కు యతి్నంచి విఫలం కావటంతో.. పరారైన నిందితులు పది నిమిషాల్లోనే ఆర్సీపురం పీఎస్ పరిధిలోని బీహెచ్ఈఎల్లో స్నాచింగ్ చేశారు. దీంతో నిందితులు బీహెచ్ఈఎల్లోకి ఎంట్రీ అయ్యారని నిర్దారించుకున్న పోలీసులు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను దిగ్బంధం చేశారు. వెయ్యికి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. అడుగడుగునా జల్లెడ పట్టారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబేష్ రవి బైక్‌లపై గాలిస్తుండగా.. తెలుపై రంగు పల్సర్ బైక్‌పై యాష్ కలర్ జాకెట్, తెలుపు రంగు షర్ట్, నలుపు, ఎరుపు రంగు టోపీలు ధరించిన నిరంజన్, రాహుల్ హెచ్ఐజీ గేట్ వైపునకు వెళుతున్నట్లు గుర్తించారు. దిబేష్ బైక్ దిగి నిందితుడు రాహుల్‌ను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన నిరంజన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్యపై దాడి చేశాడు. రక్తం కారుతున్నా.. యాదయ్య నిరంజన్ను వదిలి పెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మరో కానిస్టేబుల్ రవి.. నిరంజన్ను పట్టుకున్నాడు. వారు యాదయ్యను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదయ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శౌర్య పతకాలకు ప్రతిపాదన.. ప్రాణాలకు తెగించి చెయిన్ స్నాచర్లను పట్టుకున్న హెచ్‌సీ యాదయ్య, కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిల ధైర్య సాహసాలు పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించి పోలీసులపై ప్రజలలో విశ్వాసం, నమ్మకాన్ని కలి్పంచారని కొనియాడారు. హెచ్‌సీ యాదయ్యతో పాటు కానిస్టేబుళ్లు దిబే‹Ù, రవిలకు శౌర్య పతకం కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి ప్రతిపాదిస్తామని సీపీ తెలిపారు. (చదవండి: ఇక్కడి నుంచే దేశం దాటింది ) -
చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు
- వనస్థలిపురం ఆటోనగర్ వద్ద చైన్ స్నాచింగ్‌కు యత్నం - మహిళ మెడలో బంగారు గొలుసు తెంపబోయిన దుండగులు - స్నాచర్లపై తుపాకీతో కాల్పులు జరిపిన సీసీటీమ్ సిబ్బంది - పోలీసుల సమన్వయలోపంతో తప్పించుకున్న స్నాచర్లు హైదరాబాద్: ఉదయం 11.02: ఎల్బీనగర్లోని సాయినగర్‌కాలనీ వాసి సాయి అనురాధ.. రాజధాని హోటల్ నిర్వహిస్తున్న భర్తను కలసి ఇంటికి వెళ్తోంది. ఉదయం 11.06: ఆటోనగర్ సిగ్నల్ నుంచి సాయినగర్ వైపు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని బ్లాక్ పల్సర్ బైక్‌పై ఆమెను అనుసరించారు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి ముఖానికి హాఫ్ మాస్క్, బైకర్ హెల్మెట్ ధరించి ఉన్నారు. ఆమెకు దగ్గరగా బైక్‌ను పోనిచ్చి మెడలోని బంగారు గొలుసును తెంచేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన అనురాధ స్నాచర్ల చేతిలో గొలుసు చిక్కకుండా జాగ్రత్తపడింది. ఉదయం 11.07: అదే సమయంలో అక్కడే మాటువేసి ఉన్న ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్ (సీసీ టీమ్) కానిస్టేబుళ్లు రవిశంకర్, నరేందర్ పారిపోతున్న స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నరేందర్ దుండగులను పట్టుకోబోగా వారు బైక్ వేగాన్ని పెంచారు. ఇది గమనించిన రవిశంకర్ తన దగ్గర ఉన్న తుపాకీతో దుండగులపై అతి సమీపం నుంచి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయినా స్నాచర్లు తప్పించుకుని పారిపోయారు. ఉదయం 11.09: స్నాచర్లను వెంబడించే క్రమంలో కానిస్టేబుళ్లు తమ బైక్‌ను స్టార్ట్ చేసేందుకు మూడు నిమిషాల వరకు సమయం తీసుకున్నారు. ఆ గ్యాప్‌లోనే స్నాచర్లు అక్కడి నుంచి ఉడాయించడం జరిగిపోయింది. పనామా చౌరస్తా వరకు వెళ్లిన తర్వాత దుండగుల వాహనం కనబడలేదు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించినా స్నాచర్లు చిక్కలేదు. దుండగులు చింతల్‌కుంట చెక్‌పోస్టు వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ద్విచక్ర వాహనం వెంటనే స్టార్ట్ కాకపోవడం కూడా స్నాచర్లు పారిపోవడానికి ఒక కారణమని తెలుస్తోంది. పోలీసుల మధ్య లోపించిన సమన్వయం.. లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయలోపం కారణంగా గొలుసు దొంగలు తప్పించుకోగలిగారు. కాల్పులు జరిపిన అనంతరం సీసీ టీమ్స్ బృందం ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించింది. ఈ విషయాన్ని వెంటనే ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లయితే సుష్మా చౌరస్తా, పనామా చౌరస్తా, చింతలకుంట చెక్‌పోస్టు వద్ద స్నాచర్లను పట్టుకునే అవకాశం ఉండేది. పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే స్నాచర్లు తప్పించుకున్నట్లు స్పష్టమవుతోంది. చూస్తున్నారే కానీ ముందుకు రాలేదు.. ఆటోనగర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. ఘటన జరిగిన సమయంలో కూడా అక్కడ చాలా మందే ఉన్నారు. కానీ పోలీసులకు సహకరించేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. ప్రజలు సహకరించి ఉంటే స్నాచర్లు తప్పించుకునేవారు కాదని పోలీసులు అంటున్నారు. నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు ఎంత ప్రచారం చేసినా ఆశించిన స్పందన రావట్లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కాల్పులు జరిపిన రవిశంకర్ ఏమన్నాడంటే.. ‘‘డ్యూటీలో భాగంగా ఉదయం 11 గంటల సమయంలో ఆటోనగర్ సిగ్నల్ సమీపంలో వాహనాలను పరిశీలిస్తున్నాం. ఈ సమయంలో అనుమానాస్పదంగా పల్సర్ వాహనంపై వచ్చిన సుమారు 25-30 ఏళ్ల వయసున్న యువకులు అనురాధ మెడలోని చైన్‌ను తెంపేందుకు ప్రయత్నించారు. నా తోటి కానిస్టేబుల్ నరేందర్ దొంగలను పట్టుకునేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. కొద్ది దూరంలోనే ఉన్న నేను వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపినా దొంగలు తప్పించుకున్నారు. దొంగలను పట్టుకోలేకపోవడం బాధగా ఉంది.’’ ఘటనా స్థలాన్ని పరిశీలించిన జాయింట్ సీపీ.. విషయం తెలుసుకున్న సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి, డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ భాస్కర్‌గౌడ్ ఘటనాస్థలికి చేరుకుని కాల్పులు జరిగిన తీరును పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బ్యాంకు సీసీటీవీ ఫుటేజీలో స్నాచర్లు మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నించిన దృశ్యం, వెంటనే తేరుకున్న కానిస్టేబుళ్లు కాల్పులు జరిపిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. పట్టుకుని ఉంటే ఫలితముండేది.. బాధితురాలు సాయి అనురాధ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘కళ్లు మూసితెరిచేలోపే స్నాచర్లు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన నేను మూడు తులాల గొలుసును గట్టిగా పట్టుకున్నాను. అక్కడే ఉన్న పోలీసు లు దుండగులపై కాల్పులు జరిపినా తప్పిం చుకున్నారు. వారిని పట్టుకుని ఉంటే ఫలితం ఉండేది’’ అని అన్నారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడే షాపులో ఉన్న నరేష్ అనే వ్యక్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘అనురాధ నడిచి వెళ్తుండగా పల్సర్‌పై వచ్చిన ఇద్దరు.. యూటర్న్ తీసుకుని ఆమె మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు తేరుకుని దుండగులపై కాల్పులు జరిపారు’’ అని చెప్పాడు.