రౌడీషీటర్ మున్నాతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన గుల్బర్గా ఎస్ఐ మల్లికార్జున బండె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు.
రౌడీషీటర్ మున్నాతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన గుల్బర్గా ఎస్ఐ మల్లికార్జున బండె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ నెల 8న గుల్బర్గాలో రౌడీషీటర్ మున్నా, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్ఐ మల్లికార్జున తలలో రెండు బుల్లెట్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో ఆయన్ని మొరుగైన వైద్య చికిత్స కోసం గుల్బర్గా నుంచి హైదరాబాద్ తరలించారు. స్థానిక యశోదా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆయనకు మరింత మెరుగైన వైద్య సహయం కోసం విదేశాల్లోని వైద్యులను భారత్ కు తీసుకురావాలని ఎస్ఐ భార్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.