సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ శివార్లలో బుధవారం(జనవరి1) భారీగా నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.
ఏకంగా రూ.2 కోట్ల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోంటెక్ ఎల్‌సీ ట్యాబ్లెట్లతో పాటు పలు మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ శివార్లలోని జిన్నారంలో మందుల తయారీ ఫ్యాక్టరీ పెట్టి నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో నకిలీ మెడిసిన్‌లతో పాటు కాలం చెల్లిన మందులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మనుషుల పప్రాణాలకు ముప్పుతెచ్చే ఈ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment