సాక్షి,హైదరాబాద్: డ్రగ్ కంట్రోల్(డీసీఏ) అధికారులు నగరంలోని మెడికల్ షాపులపై ఆదివారం(నవంబర్17) ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్‌గిరిజిల్లాల్లోని మెడికల్ షాపులపై ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని గాయత్రి మెడికల్ స్టోర్‌లలో మందులు సీజ్ చేశారు.
1.25 లక్షల విలువగల 45 రకాల మందులు సీజ్ చేశారు. గడువు ముగిసిన మందుల నిల్వలు ఉండడం, అబార్షన్ మెడిసిన్ అనధికారికంగా విక్రయిస్తుండడాన్ని గుర్తించారు. గాయత్రి మెడికల్ షాపు నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.
రామంతపూర్‌లోని ఓ మెడికల్ షాపులోనూ నిర్వహించిన తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.కంటి ఇన్ఫెక్షన్ నివారణ కొరకు అమ్ముతున్న నకిలీ మెడిసిన్‌ను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment