సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంటర్ స్టేట్ చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి.
నల్గొండ విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,500, భోరజ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎవరైన లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment