బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో జనాలపై దాడి చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. దానిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. ఆ చిరుత ఒక బాలికతో పాటు వృద్ధురాలిపై కూడా దాడి చేసింది. చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
దీనికిముందు గత సోమవారం అటవీశాఖ అధికారులు ఒక చిరుతను పట్టుకున్నారు. ఇప్పుడు రెండో చిరుతపులిని పట్టుకున్నారు. కతర్నియాఘాట్ అటవీ ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక చిరుత 13 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది.
ఇదేవిధంగా 80 ఏళ్ల రెహమానా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసింది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గ్రామ సమీపంలోని చెరుకు తోటలో బోనును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి చిరుత ఆ బోనులో చిక్కింది. పోలీస్ స్టేషన్ హెడ్ హరీష్ సింగ్, రేంజర్ రోహిత్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుతను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.
ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
Comments
Please login to add a commentAdd a comment