
పూణె: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇంతలో పూణె సమీపంలో ఓ కారులో భారీగా నగదు పోలీసులకు పట్టుబడింది. ఖేడ్ శివ్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వాహనంలో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇన్నోవా వాహనంలో భారీగా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఖేడ్ శివపూర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో ఒక ఇన్నోవా కారులో తనిఖీలు చేసినప్పుడు భారీగా నగదు బయటపడింది. విషయం తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు నోట్లను లెక్కించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘చియోంగ్‌చియాన్’పై అధ్యయనం
Comments
Please login to add a commentAdd a comment