స్థానికులు పట్టుకున్న నిందితుడు
సాక్షి, కామారెడ్డి: చైన్‌స్నాచింగ్ యత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పొలీసులకు అప్పగించిన సంఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి షాపులో ఉన్న ఆయన భార్య కంట్లో కారంపొడి చల్లి మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి సరుకులు కొనేందుకు వచ్చిన భారతి అనే మహిళ ఆ దొంగను అడ్డుకొని కేకలు వేసింది.
దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుధ్ది చేసి గొలుసును బాధిత మహిళకు అప్పగించారు. నిందితుడి వద్దనున్న డ్రైవింగ్ లైసెన్సులో యాదగిరి, సదాశివనగర్ అని, ద్విచక్రవాహనానికి చెందిన ఆర్‌సీ కార్డుపై అజంపుర, మెదక్ అని వేర్వేరు అడ్రస్‌లు ఉన్నట్లు గుర్తించారు. కౌన్సిలర్లు పిట్ల వేణు, కోయల్‌కర్ కన్నయ్యలు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగను అడ్డగించిన భారతి అనే మహిళను స్థానికులు అభినందించారు.
చదవండి: ఒకే ఎఫ్‌ఐఆర్‌తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment