కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగ హల్‌చల్ | Chain Snatcher Hulchul in Kurnool government hospital | Sakshi
Sakshi News home page

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగ హల్‌చల్

Published Mon, Jul 11 2016 10:57 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

Chain Snatcher Hulchul in Kurnool government hospital

కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి క్యాజువాలిటీలో ఓ దొంగ హల్‌చల్ చేశాడు. సోమవారం తెల్లవారుజామున క్యాజువాలిటీలో చికిత్సపొందుతున్న ఒక మహిళ మెడలోంచి బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. వెంటనే స్పందించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి ఔట్‌పోస్ట్ పోలీసులను అప్రమత్తం చేశారు. అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న దొంగను చాకచక్యంగా పట్టుకుని అతనివద్ద నుంచి బంగారు గొలుసు, మరికొన్ని ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మురళీమనోహర్ ప్రస్తుతం 3వ పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడు. రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆస్పత్రిలో నిద్ర చేస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement