చైన్ స్నాచర్ల ఆగడాలతో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇంటి ముందు ఉన్న కిరాణ షాపుకు వెళ్లినా... కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా... పిల్లలను పాఠశాల నుంచి తీసుకువచ్చేందుకు వెళ్లినా.. తిరిగి ఇంటికి చేరే వరకు ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందోని మహిళలు ఆందోళనచెం దుతున్నారు. ఏ గల్లీ, ఏ రోడ్డు నుంచి చైన్‌స్నాచర్లు దూసుకొస్తారో... మెడలోని ఆభరణాలను తెంపుకెళ్తారోనని భయం భయంగా దిక్కులు చూస్తూ వెళ్లాల్సివస్తోంది. తాము ఎంత జాగ్రత్తగా ఉన్నా చైన్‌స్నాచింగ్‌లు తప్పడం లేదని పలువురు మహిళలు వాపోతున్నారు. - వనస్థలిపురం
మానసిక వేదనకు గురవుతున్నాం...
వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్‌లకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట, ఒకోసారి రెండు, మూడు చోట్ల స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మహిళలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మంగళ సూత్రాలను సైతం తెంపుకెళుతుండడంతో మహిళలు మానసిక వేదనకు గురవుతున్నారు.
- ఉమా శ్రీనివాస్, వనస్థలి మహిళా మండలి అధ్యక్షురాలు
గస్తీ పెంచాలి
పాఠశాలల సమయంలో, దేవాలయాల వద్ద, ఫంక్షన్ల సమయంలో పోలీసులు గస్తీ పెంచాలి. చైన్‌స్నాచింగ్‌ల పరంపరను నిరోధించాలి. మహిళల మంగళ సూత్రాలను ఎత్తుకెళుతున్న నేరస్తులను కఠినం గా శిక్షించాలి. మహిళలు కూడా బయటికి వెళ్లినప్పుడు ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- చల్లా గీతారెడ్డి, ఎండీ, ఆరెంజ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ
మమ్మల్నే తప్పుపడుతున్నారు...
పోలీసులు ఎంతసేపు మమ్మల్నే తప్పుబడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ మాకే చెపుతున్నారు తప్ప చైన్‌స్నాచింగ్‌ల నిరోధానికి సరైన చర్యలు తీసుకోవడం లేదు. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వందల సంఖ్యలో చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. మంగళ సూత్రాలు కూడా లాక్కెళుతున్నారు. - ఎ.నిర్మల, గృహిణి
భయం..భయం..
Published Tue, Nov 3 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM
Advertisement
Advertisement