Mental anguish
-
మంచి మాట..భయం ఒక భ్రమణం
ఈనాడు సమస్త విశ్వాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య భయం. ఇది ఏదైనా సరే ఒకసారి పట్టుకుందంటే అది వ్యక్తిత్వాన్ని దుర్బలపరుస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆందోళనకు అభద్రతకు గురి చేస్తుంది. ఇదొక మానసిక వేదన. దీనివల్ల మొత్తం మనిషి జీవితం నిర్వీర్యమవుతుంది. ఇది సామాజిక వాతావరణం నుంచి ఉద్భవిస్తుంది తప్ప అంతర్గతంగా ఉండదు. బయట వాతావరణాన్ని బట్టి అంతర్గత లక్షణాలు ప్రకోపిస్తాయి. ఈ లక్షణాలే భయానికి ప్రధాన కారణమవుతున్నాయి. నిత్యజీవితంలో మనిషి రకరకాల భయాలతో కాలం వెళ్ళదీస్తుంటాడు. అవి ప్రాకృతికమైనా, సామాజికమైనా, సాంస్కృతికమైనా వాటిని అధిగమించడం ద్వారానే మనిషి మామూలు మనిషి కావడం సాధ్యపడుతుంది. అయితే ఈ భయాలను అధిగమించాలంటే మనిషనేవాడికి వ్యక్తిగత సాధన, విమర్శనాత్మక పరిశీలన ముఖ్యం. ప్రతిమనిషి నిత్యం ఆలోచనలతో జీవిస్తూ ఉంటాడు. వర్తమానాన్ని విడిచి పెట్టి, భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని తీవ్రంగా ఆలోచిస్తాడు. ఇలాంటి ఆలోచనలే భయాన్ని ప్రోదిచేస్తాయి. మనస్సంటే ఒక భాగం జ్ఞాపకాలు, మరో భాగం ఊహలతో నిండి ఉంటుంది. నిజానికి ఈ రెండు ఊహలే. మనిషి ఇలా ఊహల్లో మునిగిపోవడం వల్లనే భయం కలుగుతుంది. ఈ భయమే మన చుట్టూ హద్దులను గీస్తుంది. ఆ హద్దుల వల్ల మనకి మనం సురక్షితంగా ఉండొచ్చునేమో కానీ, అది జీవించడాన్నుంచి, జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది. భయం వల్ల మనిషి తనకు తానే పరిమితులు నిర్దేశించుకుని తన ప్రపంచంలో తాను మునిగి తేలుతాడు. ఈ క్రమంలో అటు ఆనందానికి, ఇటు స్వేచ్ఛకు దూరమైపోతాడు. అంతేకాదు హాయిగా నవ్వలేడు.. హృదయంతో ఏడ్వలేడు... అసలు మనస్ఫూర్తిగా, ఇష్టంగా ఏ పనీ చేయలేడు. ఏ మనిషైనా భయపడేది భవిష్యత్ గురించే.. తాను చేస్తున్న పనిలో విజయం సాధించగలనా... తన కుటుంబానికి ఆస్తిపాస్తులివ్వగలనా.. తన పిల్లలు చక్కగా చదువుకోగలరా.. తనకు భవిష్యత్‌లో ఆరోగ్యం సహకరిస్తుందా.. ఇలా రకరకాలుగా, వాస్తవంలో లేని వాటి గురించి బాధపడుతూ భయాన్ని పెంచుకుంటూ ఉంటారు. భయం జీవితం నుంచి పుట్టింది కాదు. భ్రాంతులతో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టింది. అస్తిత్వంలో లేని దాని గురించి బాధ పడడం వల్లనే భయం ఆవరిస్తుంది. నిత్యం భవిష్యత్‌లో బతకడం వల్లనే భయం కలుగుతోంది. ఈ భయం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎవరికి వారు సాధన చేయాలి.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.. తామెందుకు భయపడుతున్నామని ప్రశ్నించుకోవాలి.. నిజానికి తాము భయపడాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకోవాలి. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగి పోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. అసలు భయం అంటే ఏమిటి? మనం ఎందుకు భయపడతాం? భయం ఎన్ని రకాలు? భయం లేని మనుషులు వుంటారా? అసలు భయం ఎప్పుడు ఎలా పుట్టింది? ఈ ప్రశ్నలన్నిటినీ నిర్భయంగా చర్చించుకుంటే తప్ప భయం నుంచి విముక్తులు కాలేం. ఈ క్రమంలో కారణాలు తెలిసిన భయాలు కొన్ని.. కారణాలు తెలియని భయాలు కొన్ని. తెలిసిన భయాలకు అర్థవంతమైన వివరణ ఇస్తే పరిష్కారం చూపిస్తే పోతుంది. కాని తెలియని భయాలు అలా కాదు. అవి ఫలానా కారణం వల్ల కలిగాయని ఎవ్వరూ చెప్పరు. అందువల్ల మన భయాలకు మూల కారణాలు తెలుసుకుని, భయాన్ని పోగొట్టుకోవాలి. తన చేతుల్లో లేని ప్రకృతికి దైవత్వం ఆపాదించిన ప్రాచీన మానవుడు దానిపట్ల భయమూ భక్తి పెంచుకున్నాడు. భక్తి పెంచుకోక పోతే నష్టం కలుగుతుందని భయపడ్డాడు. ఫలితంగా మూఢ నమ్మకాలకు లోనయ్యాడు. మూఢత్వం భయానికి మొదటి హేతువు. మూఢనమ్మకాల వల్ల కలిగే భయాలు ఎవరినీ వదలి పెట్టవు. పైగా తమ సంపద పోతుందేమోనన్న భయంతో పోకుండా కాపాడుకోవాలన్నది అదనపు భయంగా తయారవుతుంది. మనుషుల మీద నమ్మకాలు సడలిపోవడం వల్ల ఎవరినీ నమ్మలేని విశ్వాస రాహిత్యం వెన్నాడుతుంది. అలాగే, మంచివారు చెడు చేయరు గనక దుర్మరణం పాలైన వారే ప్రేతాలై హింసిస్తారన్న నమ్మకం ఈ భయం వల్లనే ఏర్పడుతుంది. ఇలా మూఢత్వం అనేక భయాలకు దారి తీసింది. ఇలా అనాదిగా తన పరిధిని పెంచుకున్న భయం నేడు విశ్వ వ్యాప్తమై మనిషిని నిర్జీవంగా తయారు చేస్తోంది. భయానికి సంబంధించి మన పురాణాలలో అనేక ఘట్టాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. పురాణాలలో ఆయా కథలలోని భయాలకు ఓ సముచితమైన కారణం, దిశానిర్దేశం ఉండడం వల్లనే వారంతా మహనీయులయ్యారు. అదే విధంగా మనిషి కూడా తాను నిత్యం వేధించే భయాలతో కృంగి కృశించి పోకుండా, తమ భయాలకు అసలు సిసలైన కారణాలు తెలుసుకుని, వాటి పరిష్కారాలకు ప్రయత్నించినపుడే భయం అనే మహమ్మారి నుంచి విముక్తులవుతారు. భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగిపోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. -
భార్యకు కరోనా.. కుప్పకూలిన భర్త
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యకు కరోనా వైరస్ సోకడంతో.. మనోవేదనకు గురై భర్త మృతి చెందిన ఘటన ఏలూరు నగరంలో జరిగింది. ఏలూరు టూటౌన్లో నివాసముండే వివాహితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్‌గా భర్తను కూడా కార్వంటైన్‌కు తరలిస్తున్న సమయంలో బస్సు ఎక్కుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ రిపోర్టు వచ్చింది. భార్యకు కరోనా రావడంతో బాధతో మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. స్థానికులను ఈ విషాద ఘటన కలిచివేసింది. (కరోనా మా కుటుంబాన్ని వణికించింది) -
తెల్లమచ్చలు తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్ నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఫలితంగా తీవ్రమైన మానసిక వేదన కలుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం చెప్పండి. – నాగేంద్రబాబు, మహబూబ్‌నగర్ బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల వస్తుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. ∙బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు ∙పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు ∙జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు; ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల, విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు ∙మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది ∙వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరెక్టర్,పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
భయం..భయం..
చైన్ స్నాచర్ల ఆగడాలతో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇంటి ముందు ఉన్న కిరాణ షాపుకు వెళ్లినా... కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా... పిల్లలను పాఠశాల నుంచి తీసుకువచ్చేందుకు వెళ్లినా.. తిరిగి ఇంటికి చేరే వరకు ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందోని మహిళలు ఆందోళనచెం దుతున్నారు. ఏ గల్లీ, ఏ రోడ్డు నుంచి చైన్‌స్నాచర్లు దూసుకొస్తారో... మెడలోని ఆభరణాలను తెంపుకెళ్తారోనని భయం భయంగా దిక్కులు చూస్తూ వెళ్లాల్సివస్తోంది. తాము ఎంత జాగ్రత్తగా ఉన్నా చైన్‌స్నాచింగ్‌లు తప్పడం లేదని పలువురు మహిళలు వాపోతున్నారు. - వనస్థలిపురం మానసిక వేదనకు గురవుతున్నాం... వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్‌లకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట, ఒకోసారి రెండు, మూడు చోట్ల స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. మహిళలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మంగళ సూత్రాలను సైతం తెంపుకెళుతుండడంతో మహిళలు మానసిక వేదనకు గురవుతున్నారు. - ఉమా శ్రీనివాస్, వనస్థలి మహిళా మండలి అధ్యక్షురాలు గస్తీ పెంచాలి పాఠశాలల సమయంలో, దేవాలయాల వద్ద, ఫంక్షన్ల సమయంలో పోలీసులు గస్తీ పెంచాలి. చైన్‌స్నాచింగ్‌ల పరంపరను నిరోధించాలి. మహిళల మంగళ సూత్రాలను ఎత్తుకెళుతున్న నేరస్తులను కఠినం గా శిక్షించాలి. మహిళలు కూడా బయటికి వెళ్లినప్పుడు ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - చల్లా గీతారెడ్డి, ఎండీ, ఆరెంజ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మమ్మల్నే తప్పుపడుతున్నారు... పోలీసులు ఎంతసేపు మమ్మల్నే తప్పుబడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ మాకే చెపుతున్నారు తప్ప చైన్‌స్నాచింగ్‌ల నిరోధానికి సరైన చర్యలు తీసుకోవడం లేదు. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వందల సంఖ్యలో చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. మంగళ సూత్రాలు కూడా లాక్కెళుతున్నారు. - ఎ.నిర్మల, గృహిణి -
హెపటైటిస్-సి మందులతో తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. గత ఆర్నెల్లుగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. - సరళ, చెన్నై మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మతగా పేర్కొనవచ్చు. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు సహజంగా మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి పరిపూర్ణ చికిత్స ఉంది. డిప్రెషన్‌ను 1950-60లలో రెండు రకాలుగా విభజించారు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు : మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్: రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. పోస్ట్ నేటల్ డిప్రెషన్: మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. బైపోలార్ డిజార్డర్: ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల నేను నడిచేటప్పుడు పాదాలలో, పిక్కల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. నడుస్తుంటే కండరాలు పట్టేసినట్లుగా ఉండి, నడకలో ఇబ్బంది అనిపిస్తోంది. కొంతదూరం నడవగానే కొద్దిసేపు ఆగాల్సి వస్తోంది. ‘అదే తగ్గిపోతుందిలే’ అని వేచిచూశాను. కానీ మూడు నెలలుగా ఆ నొప్పి తగ్గకపోగా రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. దయచేసిన నా సమస్యకు కారణమేమిటో తెలిపి, సరైన పరిష్కారం చూపించగలరు. - డి. నాగేశ్వరరావు, కర్నూలు మీరు తెలిపిన వివరాలను బట్టి కాలిలోని రక్తనాళాలలో పూడిక ఉన్నట్లు తెలుస్తోంది. పూడిక ఏర్పడటం వల్ల వచ్చే నొప్పిని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పీవీడీ) అంటారు. మీకు మొదటిసారి ఈ సమస్య వచ్చిందా లేక ఇది వరకు ఉన్న సమస్య మళ్లీ కనిపిస్తోందా అనే వివరాలు మీరు తెలపలేదు. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో పాటు సిగరెట్ తాగడం వంటి అలవాటు ఉంటే త్వరగా ఈ సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేనివారిలో ఈ తరహా సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా కాళ్లకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఈ నొప్పి వస్తుంది. రక్తనాళాల్లో పూడికలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాళ్లలో రక్తప్రవాహాన్ని తెలుసుకోవడం ద్వారా పీవీడీని అంచనా వేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మీరు తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచిది. అలాగే దూరప్రయాణాలు చేసే సమయంలో కాలి వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా చేయడం రక్తనాళాల్లో పూడిక ఏర్పడకుండా ఉండటానికి దోహదపడుతుంది. సిగరెట్, గుట్కా, పాన్ వంటి పొగాకును నమిలే అలవాటు ఉండే వెంటనే మానేయండి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంది. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే మీ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారికి హెచ్‌సీవీ వచ్చింది. ముందు కామెర్లు వచ్చాయి. వైద్యపరీక్షలు, స్కానింగ్ తర్వాత హెచ్‌సీవీ జీనోటైప్ 3 అని చెప్పారు. ఇటీవలే నెల క్రితం మళ్లీ పరీక్షలు చేయిస్తే లివర్ సిర్రోసిస్, కాలేయం కుడితమ్మె కుంచించుకుపోయిందనీ (రైట్లోబ్ ష్రంకెన్), లెఫ్ట్ లోబ్ ఎన్లార్జ్ అయిందనీ చెప్పారు. కామెర్లు తగ్గాయి కదా అని మా నాన్నగారికి ఫ్యాటీ ఫుడ్ పెట్టాం. దాంతో ఈ సమస్య వచ్చిందా? గత 20 రోజులుగా ఫ్యాటీ ఫుడ్ మానేసి, అంతా ఉడికించిన ఆహారమే (ఉప్పు లేకుండా) ఇస్తున్నాం. ఆయనకు హెచ్‌సీవీ, లివర్ సిర్రోసిస్ మందులతో తగ్గుతుందా? - మాతాశ్రీ, ఈ-మెయిల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ నాన్నగారికి హెపటైటిస్-సి వ్యాధి వల్ల సిర్రోసిస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా లివర్ సిర్రోసిస్ వల్ల వచ్చే కామెర్లు చాలావరకు నయం కావు. ఇప్పుడు మీరు లివర్ సిర్రోసిస్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం అవసరం. అందుకోసం తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి, హెపటైటిస్-సి కి సంబంధించిన పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే, హెపటైటిస్-సి వ్యాధిని అదుపులో పెట్టవచ్చు. నా వయసు 65 ఏళ్లు. డయాబెటిస్తో బాధపడుతున్నాను. కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదు. గత ఆర్నెల్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటే ఎండోస్కోపీ చేశారు. గ్యాస్ట్రయిటిస్ ఉందని చెప్పారు. ఈ వ్యాధి తగ్గడానికి మందులు వాడవచ్చా? వాటి వల్ల కిడ్నీలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉందా? - సిహెచ్. సుబ్బారావు, ఒంగోలు మీరు డయాబెటిస్ నెఫ్రోపతీ, గ్యాస్ట్రయిటిస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన దశలో ఉన్నారు. అంటే మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. మీకు గ్యాస్ట్రయిటిస్ వల్ల వస్తున్న కడుపులో నొప్పి తగ్గాలంటే ఇప్పుడు వాడుతున్న అల్సర్ మందులు వాడండి. వీటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ మాత్రలు కిడ్నీ ఫెయిల్ అయిన వారికి కూడా ఇవ్వవచ్చు. అవి చాలా సురక్షితం. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన లేకుండా డాక్టర్ ఇచ్చిన మందులు వాడండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నాతో వచ్చేయ్ లేకుంటే.. అందర్నీ చంపేస్తా..!
⇒ మరణించిన స్నేహితురాలు పిలుస్తోందంటూ.. ⇒ మానసిక వేదనతో బాలిక ఆత్మహత్య ⇒ పుంగనూరులో విషాదం... పుంగనూరు: ‘‘అమ్మా.. చనిపోయిన నా స్నేహితురాలు మమత నన్ను రోజూ రమ్మని పిలుస్తోంది. లేకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తోంది. ప్రతి అమావాస్యకూ నన్ను చెరువులోకి తీసుకెళ్లి నాకు తోడు ఎవరూ లేరు నాతో వచ్చేయ్ లేకపోతే అందర్నీ చంపేస్తా అంటూ బెదిరిస్తోంది. అందుకే నేను మమత వద్దకు వెళ్లిపోతున్నా బాయ్.. బాయ్.. నాకోసం బాధపడవద్దు. నాన్నకు, అన్నకు చెప్పండి. నేను చనిపోతున్నా’’ అంటూ యువతి లేఖరాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రకాశం కాలనీలో చోటుచేసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటన పుంగనూరులో కలకలం రేపింది. ప్రకాశం కాలనీకి చెందిన సత్యనారాయణ, నారాయణమ్మ కుమార్తె కల్పన (15) స్థానిక బాలికల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన కల్పన రామసముద్రం రోడ్డులోని పటాలమ్మ ఆలయం వద్ద బావిలో దూకింది. కొద్దిగా ఆలస్యంగా గమనించిన గ్రామస్తులు బాలికను కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అప్పటికే కల్పన మృతి చెందింది. బావి వద్ద ఆమె రాసిన లేఖ దొరికింది. ఆ లేఖలో కల్పన పేర్కొన్న మేరకు.. ఇదే కాలనీకి చెందిన మమత ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఆ నాటి నుంచి కల్పనకు నిత్యం ఆమె కలలో కనిపిస్తుండేదనీ.. తనవద్దకు రాకపోతే కల్పనతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తానని చెబుతున్నట్టు పేర్కొంది. మానసిక వేదన ఎక్కువ కావడంతో కల్పన ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఎస్ఐ అంజనప్ప కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మా కన్నా స్నేహితురాలే ఎక్కువైందా తల్లీ.. కల్పన ఆత్మహత్య చేసుకున్న బావి వద్దకు చేరుకుని తల్లిదండ్రులు బోరున విలపించారు. ‘15 ఏళ్లుగా కష్టపడి పెంచామే.. మా కన్నా స్నేహితురాలే ఎక్కువైందా..మేము ఏం పాపం చేశామని మాకు ఈ శిక్ష వేశావు’ అంటూ తల్లి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. మూఢ నమ్మకాలతోనే బాలిక బలి ఆత్మలు, ప్రేతాత్మలు అమావాస్య నా డు రావడం, పిలవడం అంతా భ్రమ. తీవ్రమైన మానసిక రుగ్మత కారణంగానే కల్పన ఆత్మహత్య చేసుకుంది. మానసికంగా ఇబ్బందిపడుతున్న పిల్లలకు తాయత్తులు కట్టించడం, మంత్రా లు వేయించడం తల్లిదండ్రులు చేయరాదు. మానసిక వైద్యులను సంప్రదిం చాలి. పిల్లల సంరక్షణపై జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎన్బీ సుధాకర్‌రెడ్డి, మానసిక శాస్త్ర నిపుణుడు