
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యకు కరోనా వైరస్ సోకడంతో.. మనోవేదనకు గురై భర్త మృతి చెందిన ఘటన ఏలూరు నగరంలో జరిగింది. ఏలూరు టూటౌన్‌లో నివాసముండే వివాహితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్‌గా భర్తను కూడా కార్వంటైన్‌కు తరలిస్తున్న సమయంలో బస్సు ఎక్కుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ రిపోర్టు వచ్చింది. భార్యకు కరోనా రావడంతో బాధతో మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. స్థానికులను ఈ విషాద ఘటన కలిచివేసింది. (కరోనా మా కుటుంబాన్ని వణికించింది)
Comments
Please login to add a commentAdd a comment