
దేశ రాజధానిలో ఓ పోలీసాయనపై హీరో అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రాణాలకు తెగించి మరీ..
వైరల్: విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన అధికారుల గాథలు మనం బోలెడు చూసి ఉంటాం. అదే విధంగా.. సమయస్ఫూర్తితో వ్యవహరించే వాళ్లు కూడా అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అలా.. ఢిల్లీలో ఓ పోలీసాయన డ్యూటీలో చూపించిన తెగువకి అభినందనలు కురుస్తున్నాయి.
ఢిల్లీలో సత్యేంద్ర అనే కానిస్టేబుల్ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించారు. అదీ తెగువ ప్రదర్శించి. షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైందన్న సమాచారం అందుకున్నారాయన. వెంటనే.. చెయిన్‌తో పారిపోతున్న ఓ దొంగను వెంటాడి.. భైక్ మీద నుంచి దూకి మరీ అతన్ని పట్టుకున్నాడు. చెయిన్ రికవరీతో పాటు పారిపోతున్న ఆ దొంగను పట్టేసుకున్న సత్యేంద్ర ఉన్నతాధికారుల అభినందనలు సైతం అందుకున్నారు. ఆపై తేలింది ఏంటంటే..
కానిస్టేబుల్ సత్యేంద్ర పట్టుకుంది మామూలు చెయిన్ స్నాచర్‌ను కాదంట. అతనికి నేర చరిత్ర చాలానే ఉందని, అతని ద్వారా పదకొండు పెండింగ్ కేసులను విజయవంతంగా పరిష్కరించగలిగామని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రాణాలకు తెగించి మరీ స్నాచర్‌ను పట్టుకున్న కానిస్టేబుల్ సత్యేంద్రపై అభినందనలు కురుస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేసిన ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్ ద్వారా ట్రెండ్ అవుతోంది.
अपनी जान की परवाह किए बगैर शाहबाद डेरी थाने के कांस्टेबल सत्येंद्र ने एक स्नैचर को गिरफ्तार किया।
— Delhi Police (@DelhiPolice) November 24, 2022
इस स्नैचर की गिरफ्तारी से 11 मामले सुलझाए गए।
विधिक कार्यवाही जारी है।@dcp_outernorth#HeroesOfDelhiPolice pic.twitter.com/PceBbYpdYQ