caught-on-camera
-
ఆ పోలీసాయన తెగువకి హ్యాట్సాఫ్.. నెట్టింట వైరల్
వైరల్: విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన అధికారుల గాథలు మనం బోలెడు చూసి ఉంటాం. అదే విధంగా.. సమయస్ఫూర్తితో వ్యవహరించే వాళ్లు కూడా అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అలా.. ఢిల్లీలో ఓ పోలీసాయన డ్యూటీలో చూపించిన తెగువకి అభినందనలు కురుస్తున్నాయి. ఢిల్లీలో సత్యేంద్ర అనే కానిస్టేబుల్ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించారు. అదీ తెగువ ప్రదర్శించి. షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైందన్న సమాచారం అందుకున్నారాయన. వెంటనే.. చెయిన్‌తో పారిపోతున్న ఓ దొంగను వెంటాడి.. భైక్ మీద నుంచి దూకి మరీ అతన్ని పట్టుకున్నాడు. చెయిన్ రికవరీతో పాటు పారిపోతున్న ఆ దొంగను పట్టేసుకున్న సత్యేంద్ర ఉన్నతాధికారుల అభినందనలు సైతం అందుకున్నారు. ఆపై తేలింది ఏంటంటే.. కానిస్టేబుల్ సత్యేంద్ర పట్టుకుంది మామూలు చెయిన్ స్నాచర్‌ను కాదంట. అతనికి నేర చరిత్ర చాలానే ఉందని, అతని ద్వారా పదకొండు పెండింగ్ కేసులను విజయవంతంగా పరిష్కరించగలిగామని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రాణాలకు తెగించి మరీ స్నాచర్‌ను పట్టుకున్న కానిస్టేబుల్ సత్యేంద్రపై అభినందనలు కురుస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేసిన ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్ ద్వారా ట్రెండ్ అవుతోంది. अपनी जान की परवाह किए बगैर शाहबाद डेरी थाने के कांस्टेबल सत्येंद्र ने एक स्नैचर को गिरफ्तार किया। इस स्नैचर की गिरफ्तारी से 11 मामले सुलझाए गए। विधिक कार्यवाही जारी है।@dcp_outernorth#HeroesOfDelhiPolice pic.twitter.com/PceBbYpdYQ — Delhi Police (@DelhiPolice) November 24, 2022 -
హన్మకొండలో నారాయణ స్కూల్ బండారం బట్టబయలు..||
-
కెమెరాకు చిక్కిన పెద్దపులి
నాగర్‌కర్నూల్ : నల్లమల్ల దట్టమైన అడవీ ప్రాంతంలో విహరిస్తున్న పెద్ద పులి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహబాద్ అటవీ శాఖ సిబ్బందిలో ఒకరు ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్లో బంధించారు. ఇందులో పులి గాండ్రింపు శబ్దం స్పష్టంగా రికార్డయ్యింది. పులి సంచరించిన ప్రాంతంలో నీళ్లు ఉండటంతో, అవి తాగడానికి పులి అటుగా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు...
-
రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు...
న్యూయార్క్: పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ కాస్తా ముదిరి ఇద్దరు మహిళలు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఆదివారం రోజున వ్యాలీ స్ట్రీమ్ లోని గ్రీన్ ఎకర్స్ మాల్ ఎదుట పార్కింగ్ స్థలంలో 24 ఏళ్ల లటోయియా తమ కారుని పార్క్ చేయడానికి వెళ్లింది. అయితే అదే స్థలంలో తమ వాహనాన్ని పార్క్ చేసుకుంటామని ఒక వ్యక్తి కారుని ఆపాడు. కారు దిగిన లటోయియా తనను ఆస్థలంలో ఎందుకు కారును పార్క్ చేయనివ్వలేదని అడిగింది. దీంతో కారు పార్క్ చేసిన వ్యక్తి భార్య త్వానా మోరెల్(లావుగా ఉండి నారింజ రంగు డ్రెస్ వెసుకున్న35 ఏళ్ల మహిళ) లటోయియాతో వాగ్వాదానికి దిగింది. తన నోటికి పని చెప్పటంతో ఆగకుండా తన భర్త, కుమారుడు చూస్తుండగానే సదరు మహిళని రోడ్డుపై పడేసి, మీద కూర్చొని ముఖం మీద పిడిగుద్దులు కురిపించింది. మరోవైపు భార్యను వారించాల్సిన భర్త కూడా మరింత కొట్టమని ప్రోత్సహించడంతో బాధితురాలిని చితక బాదింది. చివరికి ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.