అల్లీపురం: విశాఖ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబ్బపాలెం గ్రామానికి చెందిన రావివలస సంతోష్‌కుమార్ గత కొన్ని రోజులుగా ఉదయం వేళల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నాడు. అతనికి ఆటో డ్రైవర్ యల్లాజీ సహకరించేవాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పోలీసులు బుధవారం ఉదయం సంతోష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 400 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు యల్లాజీ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ పి.రవికుమార్ మూర్తి తెలిపారు.