చెలరేగిన చైన్ స్నాచర్లు | Chain Snatcher robberies in gold chain setc... | Sakshi
Sakshi News home page

చెలరేగిన చైన్ స్నాచర్లు

Published Mon, May 16 2016 2:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

చెలరేగిన చైన్ స్నాచర్లు

చెలరేగిన చైన్ స్నాచర్లు

బెంగళూరు(బనశంకరి) :   నగరంలో మళ్లీ చైన్‌స్నాచర్లు పెట్రేగిపోయారు. శనివారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌కు తెగబడ్డారు. జేపీ.నగర ఏడవపేజ్‌లోని చుంచుఘట్ట మెయిన్‌రోడ్డు శివశక్తినగరలో శాలిని అనే మహిళ  రాత్రి 8.15 సమయంలో ఆస్పత్రిలో విధులు ముగించుకుని కాలినడకన ఇంటికి బయల్దేరింది. బన్నేరుఘట్టరోడ్డు- అరికెరె సిగ్నిల్ వద్ద బైక్‌లో వచ్చిన దుండగుడు ఆమె మెడలోని   10 గ్రాముల బంగారుచైన్ లాక్కొని ఉడాయించాడు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు జేపీ.నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా జయనగర హౌసింగ్‌బోర్డులోని వజ్రమునినగరలో చైన్ స్నాచింగ్ జరిగింది. స్థానికంగా ఉంటున్న సుజాతా అనే మహిళ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి ముందు చిన్నారిని ఆడించుకుంటూ భోజనం తినిపిస్తుండగా ఇద్దరు చైన్‌స్నాచరు అడ్రస్ అడుగుతూ ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారుచైన్ లాక్కుని బైకులో ఉడాయించారు. ఘటనపై తలఘట్టపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement