కార్యాలయంలోకి వెళ్లి...కళ్లలో కారం కొట్టి.! | In the eyes of the powder to be dismissed to go into the office | Sakshi
Sakshi News home page

కార్యాలయంలోకి వెళ్లి...కళ్లలో కారం కొట్టి.!

Published Wed, Oct 21 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

కార్యాలయంలోకి వెళ్లి...కళ్లలో కారం కొట్టి.!

కార్యాలయంలోకి వెళ్లి...కళ్లలో కారం కొట్టి.!

రాంనగర్‌లో  రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
 
ముషీరాబాద్: రాంనగర్‌లో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేర్వేరుగా ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన అనసూయ(53) మార్నింగ్ వాక్‌కు వైఎస్‌ఆర్ పార్కుకు వెళుతుండగా దాదాపు 24 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువకులు ద్విచ క్రవాహనంపై వెనుక నుంచి వచ్చారు. ఆమె మెడలోని ఆరు తులాల పుస్తెలతాడును లాక్కొని పార్శిగుట్ట వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేందర్  కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారం కొట్టి...
 రాంనగర్ ఈ-సేవ సమీపంలోని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి పక్కన గల భవనం మొదటి అంతస్థులో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయం ఉంది. అందులో రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి సమీపంలో నివసించే స్మిత(32) ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ యువకుడు అక్కడికి వెళ్లాడు. ఆమె కళ్లలో కారం కొట్టి... మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో షట్టర్ కిందికి దించి... బయటి నుంచి గేటు పెట్టి వెళ్లిపోయాడు. ఆఫీస్‌లోని ఫోన్‌లో యాజమానికి సమాచారం అందించగా.. ఆయన వచ్చి షటర్ తెరిచాడు. సమాచారం అందుకున్న నల్లకుంట ఇన్‌స్పెక్టర్ సంతోష్ కిరణ్, ఎస్‌ఐ రామరాజు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. అందులో స్నాచర్ రావడం..వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement