the complaint
-
ఆన్లైన్ గ్రీవెన్స్
ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటు కార్యాలయాలకు వెళ్లే భారానికి చెక్ ఇప్పటికే 55 ప్రభుత్వ శాఖలకు ఐడీలు {పతీ ఫిర్యాదుకు నంబర్ ఏ స్థారుులో ఉందో తెలుసుకునే అవకాశం వరంగల్ రూరల్ : ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ సెల్(ప్రజావాణి)లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయడమంటే పెద్ద ప్రహసనమేనని చెప్పాలి. అరుుతే, ప్రజలకు పాలనను దగ్గర చేయాలన్న భావనతో రాష్ట్రప్రభుత్వం తాజాగా జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఈ మేరకు ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రీవెన్ససెల్ను తీరును నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్సకు రావడం ఇబ్బందే అరుునా తప్పని పరిస్థితుల్లో ప్రజలు వస్తున్నారని గుర్తిం చారు. వారికి వ్యయప్రయాసాలు తగ్గించాలన్న భావనతో డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజావాణిని రెండు వారాల క్రితం ప్రారంభించారు. అరుుతే, ఆ వారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్సకు ఏ మాత్రం రద్దీ తగ్గలేదు. కొంచెం ప్రచారమైతే జిల్లా కేంద్రానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందనే భావనకు వచ్చారు. మొత్తం తగ్గించేందుకు.. కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్‌ససెల్‌కు వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడ్డాక మొదటివారం 75, రెండో వారం 170, మూడో వారం 75, నాలుగో వారం 120 ఫిర్యాదులు అందారుు. ఇలా కలెక్టరేట్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గించేందుకు మం డల స్థారుులో రెండు వారాలుగా గ్రీవెన్స నిర్వహిస్తున్నారు.అరుుతే, జిల్లా, మండల కా ర్యాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గించేందు కు తాజాగా ‘ఆన్లైన్ గ్రీవెన్ససెల్’కు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటర్నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్ లేదా స్మార్ ఫోన్ ఉంటే చాలు ఇం ట్లో కూర్చునే శాఖల వారీగా మనం ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వరంగల్ రూరల్ జిల్లాలో మాత్రం 55 శాఖలకు ప్రత్యేక ఐడీలు కేటారుుంచారు. ఈ మేరకు ప్రజలు ఛిఞజట్చఝట.్టట.జీఛి.జీ సైట్లోకి వెళ్లి మన జిల్లా, ఫిర్యాదుకు సంబంధించి శాఖ తదితర వివరాలతో పాటు ఫిర్యాదు చేసే వివరాలు నింపి సబ్మిట్ చేస్తే ఆ ఫిర్యాదుకు ఓ ప్రత్యేక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ద్వారా ఫిర్యాదు ఏ స్థారుులో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, శాఖల వారీగా ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యా రుు. ఎన్నింటిని పరిష్కరించారు, పరిష్కరించకపోతే కారణాలేమిటన్నవివరాలనుకలెక్టర్తో పా టు శాఖల ఉన్నతాధికారులు తెలుసుకునే వెసలుబాటు ఉంది. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెరిగి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారనేది కలెక్టర్ భావన. ఈ మేరకు ఆన్లైన్లో గ్రీవెన్స పద్ధతిపై జిల్లాలో విసృ్తతంగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఎస్ఎంఎస్ అలర్ట్ ప్రజావాణిలో నేరుగా లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వారికి ఎస్ఎంఎస్ అందుతుంది. అలాగే, ఆ ఫిర్యాదు పరిష్కారమయ్యాక మరో మెసేజ్, పరిష్కరించలేకపోతే అందుకు కారణాలు చెబుతూ మెసేజ్‌లు అందుతారుు. అరుుతే, ఒక్కో మెసేజ్‌కు ఐదు పైసల ఖర్చవుతుండగా.. దీనిని భరించేందుకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అంగీకరించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎంఎస్ చార్జీలు ఎవరు చెల్లించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఫిర్యాదుదారుల సెల్ నంబర్లకు మెసేజ్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ విధానం ప్రారంభమయ్యే అవకాశముంది. -
ప్రసవానికి వెళ్తే గెంటేశారు
ఇందూరు : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల తీరును నిరసిస్తూ పచ్చి బాలింత కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. వివరాల్లోకి వెలితే... నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన నిషాత్ పర్విన్ (సబియా) కు నెలల నిండడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలకు నొప్పులు రాగా తల్లిదండ్రులు, బంధువులు కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. ఆస్పత్రిS మెట్లు ఎక్కుతుండగానే అక్కడి సిబ్బంది, నర్సులు డెలివరీ చేయబోము, వెళ్లిపోండని అక్కడి నుంచి పంపించి వేశారు. గర్భిణి తల్లి బిస్మిల్లా షేక్ సిబ్బందిని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వేరే గతిలేక ఇంటికి తీసుకెళ్లారు. గర్భిణి ఇంట్లోనే ఆడ బిడ్డను ప్రసవించింది. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పసి బిడ్డ, బాలింతతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోఅధికారులు ఎవరూ లేనందున కలెక్టర్ సీసీ సూచన మేరకు డీఆర్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసి వెళ్లారు. ప్రవసం చేయకుండా తిప్పి పంపించిన వారిపై చర్యలు తీసుకోవాలని, నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
ఏటీడబ్ల్యూ నియామకం వివాదాస్పదం
ఇందూరు: జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నియామకం వివాదాస్పదమైంది. గ్రేడ్–1 వార్డెన్లను కాదని అర్హత లేని, ఏసీబీ కేసు ఉన్న వార్డెన్‌ను ఏటీడబ్ల్యూవోగా నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గ్రేడ్–1 వార్డెన్, ఇతర వార్డెన్లు ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడబ్ల్యూవో)గా పనిచేసిన నర్సింహారెడ్డి.. ఇటీవల స్పౌజ్ విధాన బదిలీల్లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీ అయ్యింది. గ్రేడ్–1 వార్డెన్లకు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ జుక్కల్ మండలం కౌలాస్‌లో వార్డెన్‌గా పని చేసిన కమలేశ్ పేరును జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయ్ కుమార్ సిఫారసు చేశారు. డిచ్పల్లి గ్రేడ్–1 వార్డెన్ శంకర్ పేరును కూడా ఫైల్లో చేర్చారు. కానీ శంకర్‌పై అభియోగాలు ఉన్నాయని ఫైలులో పేర్కొన్నారు. కాగా కమలేశ్‌పై ఏసీబీ కేసు ఉన్నా.. ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు. దీంతో ఇన్చార్జి ఏజేసీ పద్మాకర్, కలెక్టర్ యోగితా రాణాలు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోగా కమలేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రేడ్–1 వార్డెన్ శంకర్‌తో పాటు మిగతా వార్డెన్లు నాలుగు రోజుల క్రితం జిల్లా గిరిజన సంక్షేమాధికారితో వాగ్వాదానికి దిగారు. అర్హతలు లేని వ్యక్తిని ఏటీడబ్ల్యూవోగా ఎలా నియమిస్తారని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయమై టీఎన్జీవోస్ నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
ట్రైబల్ వెల్ఫేర్‌లో పోస్టింగ్ వివాదం
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నియామకం వివాదాస్పదమైంది. గ్రేడ్–1 వార్డెన్లను కాదని అర్హత లేని, ఏసీబీ కేసు ఉన్న వార్డెన్‌ను ఏటీడబ్ల్యూవోగా నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గ్రేడ్–1 వార్డెన్, ఇతర వార్డెన్లు ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడబ్ల్యూవో)గా పనిచేసిన నర్సింహారెడ్డి.. ఇటీవల స్పౌజ్ విధాన బదిలీల్లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీ అయ్యింది. గ్రేడ్–1 వార్డెన్లకు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ జుక్కల్ మండలం కౌలాస్‌లో వార్డెన్‌గా పని చేసిన కమలేశ్ పేరును జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయ్ కుమార్ సిఫారసు చేశారు. డిచ్పల్లి గ్రేడ్–1 వార్డెన్ శంకర్ పేరును కూడా ఫైల్లో చేర్చారు. కానీ శంకర్‌పై అభియోగాలు ఉన్నాయని ఫైలులో పేర్కొన్నారు. కాగా కమలేశ్‌పై ఏసీబీ కేసు ఉన్నా.. ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు. దీంతో ఇన్చార్జి ఏజేసీ పద్మాకర్, కలెక్టర్ యోగితా రాణాలు ఇన్చార్జి ఏటీడబ్ల్యూవోగా కమలేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రేడ్–1 వార్డెన్ శంకర్‌తో పాటు మిగతా వార్డెన్లు నాలుగు రోజుల క్రితం జిల్లా గిరిజన సంక్షేమాధికారితో వాగ్వాదానికి దిగారు. అర్హతలు లేని వ్యక్తిని ఏటీడబ్ల్యూవోగా ఎలా నియమిస్తారని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయమై టీఎన్జీవోస్ నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
వీడియో ఆధారాలున్నా కేసు పెట్టరా?
పూతలపట్టు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించకపోవడం ఘోరం ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం బాధ్యులపై కేసు నమోదు చేయాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ తిరుపతి : పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం ఘోరమని ఎంపీ మిథున్‌రెడ్డి విస్మయాన్ని వ్యక్తం చేశారు. వీడియో ఆధారాలున్నా పోలీసులు ఇప్పటివరకూ బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ, పోలీసుల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా మారిందన్నారు. మండల సమావేశం సందర్భంగా ఎస్సీ ఎమ్మెల్యేకి అవమానం జరిగిన నేపథ్యంలో స్వయంగా శాసనసభ్యుడు ఫిర్యాదు చేసినా పోలీసులు సంబంధిత అధికారులు, అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం, కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో పోలీసులు స్పందించకపోతే హెచ్ఆర్సీకి, ఎస్సీఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ఖాయమని ఎంపీ హెచ్చరించారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అందరితో కలిసి జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇదే విషయంపై జీడీ నెల్లూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా స్పందించి పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. బాధ్యులపై కేసు నమోదు చేయని పక్షంలో పార్టీ తరపున ఆందోళనలు మొదలు పెడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఇదిలా ఉండగా ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం, బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పోలీస్స్టేషన్ల ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు యోచిస్తున్నారు. వచ్చే మంగళవారం కార్యక్రమాలకు రూపకల్పన జరిపి నిరసన కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించే అవకాశాలున్నాయి. ఎస్సీ ఎమ్మెల్యేపై పోలీసులు చిన్నచూపు చూడడాన్ని పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. -
చూపుకు మీసం వస్తే...
అచ్చోసిన ఆంబోతు అనేది ఒక చక్కటి తిట్టు. బహుశా ఆడవాళ్లే కనిపెట్టి ఉంటారు. ఎవరైనా కుర్రాళ్లు పనీ పాటా లేకుండా ఊళ్లో పడి తిరుగుతూ ఉంటే వారిని ఈ తిట్టుతో గౌరవిస్తూ ఉంటారు. మంచిదే. కాని- మగాడు తిరక్క చెడ్డాడు అనే జాతీయం ఎక్కడిది? దీనిని కూడా ఆడవాళ్లే సృష్టించి ఉంటారు. పనీ పాట లేకుండా ఇంట్లోనే గోళ్లు గిల్లుకుంటూ బుద్ధిగా ఏ కుర్రాడైనా కూచుంటే అతడిని ఈ తిట్టుతోనే సత్కరించి బజారున పడేస్తారు. తిరిగితే తప్పు. తిరక్కపోయినా తప్పు. హతవిథీ. మూతికి మీసం రాకపోతే గేలి చేస్తారు. అదే చూపుకు మీసం వస్తే ‘ఏయ్ మిస్టర్... నీకు అక్కచెల్లెళ్లు లేరా’ అంటారు. ఏ లా పుస్తకాల్లోని నీతి ఇది? నాకా ఉద్దేశం లేదంటే పెద్ద ప్రవరాఖ్యుడివిలే అని ఈసడిస్తారు. కాసింత చొరవచూపామో గ్రంథసాంగుడంటూ భ్రష్టుపట్టిస్తారు.మగవాడికి ఇదేం శాపం? అందం చూడవయా ఆనందించవయా అంటారు. అందమే ఆనందం అంటారు. కాని- మీరు చాలా అందంగా ఉన్నారండీ అనగానే ‘చెప్పు తెగుద్ది’ అని ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్తారు. ఆడవాళ్లూ... మీకు జోహార్లు. నరసింహను నీలాంబరి హింసిస్తే తప్పుకాదు. కాని- కి...కి... కి...కిరణ్ అంటూ వెంటపడినందుకు షారూక్‌ఖాన్ మాత్రం జీవితాంతం మచ్చ మోయాలి. ఇద్దరు కలిసే తప్పు చేశారు. కాని బిల్ క్లింటనే బద్నామ్ కావాల్సి వచ్చింది. ఎవరో సరిగ్గానే చెప్పారు- ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా మగవాడికే నష్టం. మగవారికి గత జన్మల పాపాల పర్యవసానంగా ఏదో మగ పుట్టుక పుట్టేస్తాం గానీ, ఓరి భగవంతుడా.. ఈ జన్మను గట్టెక్కడానికి ఎన్ని పాట్లు పడాలి..! ఎన్నెన్ని నింద నిష్టూరాలను భరించాలి..! బాల్యం కన్నుమూసి తెరిచినంత వేగంగా గడిచిపోతుంది. టీనేజీని, కాలేజీని ఎంజాయ్ చేద్దామనుకునేలోపు భవిష్యత్ చిత్రపటం బెంబేలెత్తిస్తుంది. ఉద్యోగం చేయాలి. లేదంటే సద్యోగం వెతుక్కోవాలి. కాదంటే నిర్బంధ నిరుద్యోగపర్వంలో నానా నరక యాతననూ అనుభవించాలి. నాయనా! ఇది మగపుట్టుక. అయ్యిందా... ఇది చాలక పెద్దలు కుదిర్చిన పిల్లను బుద్ధిగా పెళ్లాడి సంసార సాగరంలో పడాలి. తా దూర కంత ఉన్నా, లేకున్నా మెడకో డోలు. డోలు తగులుకున్నాక దరువులకు కరువా? డడ్డనక... డడ్డనక... బతుకు బస్టాండైపోతుంది. పవిత్ర కర్మభూమిలో సగటు మగ బతుకుల పద్నాలుగు రీళ్ల కథ ఇంతే. ఇంతటి దీనులూ అర్భకులూ అయినప్పటికీ మగవారి మీద ప్రభుత్వాలకు గానీ, చట్టాలకు గానీ ఏమాత్రం కనికరం ఉండదు. చెయ్యి కదిపితే తప్పు... నోరు మెదిపితే తప్పు... కన్ను తిప్పితే తప్పు... కాలు జారితే తప్పు... తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనంటుంది చట్టం. ‘ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజాట్’... అనగా చట్టము పట్ల అజ్ఞానమునకు క్షంతవ్యత లేదు. ఇంటా బయటా ఎక్కడికక్కడ అనుల్లంఘనీయమైన నిషేధాజ్ఞలు. అదృశ్య లక్ష్మణరేఖలు. స్లీప్‌వెల్ మెట్రెసెస్ అని మార్కెట్లో అమ్ముతుంటరు కాని ప్రతి మగవాడూ పడుకునేది అంపశయ్య మీదే కదా. ఇంట్లోని బాణాలు వీపున దిగే సమాజపు శరాలు... వీటితో నిద్రెక్కడిది? సుఖమైన కునుకెక్కడిది. నిషేధాలు, నిబంధనలు సరే! ప్రకృతి ఒకటి ఉంటుంది కదా! అది మగాళ్లను ఒక పట్టాన కుదురుగా ఉండనివ్వదు. పరిసరాల్లో సూదంటురాళ్లు సంచరిస్తుంటే మగ కళ్లు అసంకల్పితంగా అటే మళ్లుతాయి. వాటిని వెనక్కు మళ్లించుకోవడం ఎంత కష్టం? కళ్ల ముందు హరివిల్లులు అరవిరుస్తుంటే నాట్యం చేయకుండా నిభాయించుకోవడం మరెంత కష్టం..? మండు వేసవి మధ్యాహ్నవేళ రోడ్లు కొలుస్తున్నప్పుడు ‘పిల్ల’గాలి తెమ్మెర చల్లగా సోకితే పట్టరాని ఉత్సాహంతో ఈల నోరు దాటనివ్వకుండా అరికట్టడం ఇంకెంత కష్టం..? ఇలాంటి కష్టాల కొలిమిలో కాలిపోవడం తప్ప మగబతుకులకు వేరే దిక్కేది..? చట్టమా..? ప్రకృతా..? ఎటువైపు మొగ్గాలనేది మగ బతుకుల్లో అతి పెద్ద డైలమా! బాడీ లాంగ్వేజ్‌లో తేడా ఉన్నట్లు తెగువ గల ఏ మగువ ఫిర్యాదు చేసినా ఊచలు లెక్కపెట్టక తప్పదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తోంది. ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడింది. లౌకిక రాజ్యాంగం అమలవుతోంది. అయినా మగ బతుకుల్లో ఆశాజనకమైన మార్పులేవీ రాలేదు. శత వృద్ధ పార్టీ మొదలుకొని, బొడ్డూడని పార్టీల వరకు చాలా రాజకీయ పార్టీలు దేశసేవలో తెగ తరిస్తున్నాయి. అయితే, ఇవేవీ మగ బతుకులను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. రాజకీయ పార్టీల నాయకుల్లోనూ అత్యధికులు మగాళ్లే, కార్యకర్తల్లోనూ అత్యధికులు మగాళ్లే. కోర్టుల్లోనూ, జైళ్లలోనూ మెజార్టీ ‘మగా’నుభావులదే. అయినా, ఈ దేశంలో మగ బతుకులు తరతరాలుగా అన్యాయమైపోతున్నాయంటే... ఓ ‘మగ’ర్షీ..! ఓ ‘మగా’నుభావా..! గోడు ఎవరితో చెప్పుకోవాలి? ఆడదానికి ఆడదే శత్రువని ఆడిపోసుకుంటారు గానీ, నిజానికి ఈ దేశంలో మగ బతుకులను గమనిస్తుంటే.. మగాడికి మగాడే శత్రువనే అనుమానం పెనుభూతమవుతోంది. లేకపోతే... ప్రజాస్వామ్య మూలస్తంభాలలో మెజారిటీ మగాళ్లదే అయినా... మగాళ్ల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎవరూ అరికట్టే ప్రయత్నమే చేయరేం..? మహిళా పక్షపాత చట్టాలకు చెల్లుచీటీ రాసే చర్యలు చేపట్టరేం..? - పన్యాల జగన్నాథ దాసు -
ఆ 15 రోజులు .. ఏం జరిగింది
ఫిర్యాదుపై వేగంగా స్పందించని పోలీసులు పట్టింపులేని హాస్టల్ సిబ్బంది నెల రోజులు తెలియని ఆచూకీ చివరికి శవాలుగా కనిపించిన గిరిజన విద్యార్థినులు నర్సంపేట/పర్వతగిరి/నల్లబెల్లి/చెన్నారావుపేట: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పర్వతగిరి మండలం నారాయణపురం, కంబాలకుంట గ్రామాలకు చెం దిన విద్యార్థినులు ప్రియాంక(14), భూమిక(14)లు హాస్టల్ నుంచి వెళ్లిన పదిహేను రోజులు ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. ఈ నెల 27న చెన్నారావుపేట మండలం ఖాదర్గుట్ట సమీపంలో లభించిన బాలికల మృతదేహాల స్థితిని పరిశీలిస్తే వారు పదిహేను రోజుల కిందట మరణించినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులు తప్పిపోయిన 33 రోజుల తర్వాత ఆచూకీ లభించింది. ఈ లెక్కన వీరు చనిపోవడానికి ముందు పదిహేను రోజుల పాటు ఎక్కడ, ఎవరితో ఉన్నారనేది కేసులో కీలకంగా మారింది. బాలికల మృతదేహాలు పడి ఉన్న చోటులో సేకరించిన ఆధారాలతో ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి ముందడుగూ పడలేదు. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం సైతం కేసు పురోగతికి దోహదం చేయడం లేదు. దీంతో బాలికల ఆచూకీ కాదుగదా వారు మరణించిన తర్వాత కూడా కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిర్లక్ష్యం తీరిది.. గిరిజన బాలికలు ప్రియాంక, భూమికల అనుమానాస్పద మృతికి పోలీసులు, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలికలు కనిపించకుండా పోయి నెలరోజులు దాటినా వారి ఆచూకీ కనిపెట్టలేకపోవడం పోలీసుశాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ బాలికలు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. 2015 నవంబరు 6న ప్రియూంక, 8న భూమిక అనారోగ్య కారణాలతో స్వగ్రావూలకు చేరుకున్నారు. వీరిద్దరు హాస్టల్‌కు వెళ్తున్నామంటూ నవంబరు 23న తిరుగు ప్రయాణమయ్యారు. హాస్టల్‌కు వెళ్లకుండా ములుగు మండలం మల్లంపల్లిలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. మరుసటి రోజు(నవంబరు 24న) హాస్టల్‌కు బయలుదేరినా అక్కడికి చేరుకోలేదు. చివరికి 33 రోజుల తర్వాత చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్ల సమీపంలో విగత జీవులుగా లభ్యమయ్యారు. ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యమైన సంఘటనలో పోలీసులు, హాస్టల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి నుంచి బయల్దేరిన తమ పిల్లలు హాస్టల్‌కు చేరుకున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు నవంబరు 24 సాయంత్రం బాలికల తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ (సంక్షేమ అధికారి) జాటోతు వీరమ్మను ఫోన్లో సంప్రదించగా ‘నేను పని మీద నర్సంపేటకు వచ్చాను. తిరిగి హాస్టల్ వెళ్లగానే కబురు చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. తాపీగా రెండు రోజుల తర్వాత నవంబరు 26న బాలికలు రాలేదంటూ తల్లిదండ్రులకు వీరమ్మ ఫోన్లో తెలిపారు. దీంతో బాలికల తల్లిదండ్రులు 27న హాస్టల్‌కు చేరుకుని అక్కడ ధర్నా చేశారు. బాలికల ఆచూకీ కనిపెట్టాలంటూ నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో నవంబరు 27 ఫిర్యాదు చేయగా.. పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ అక్కడి పోలీసులు సూచించారు. దీంతో నవంబరు 28న పర్వతగిరిలో ఫిర్యాదు నమోదైంది. కేసు విచారణలో భాగంగా పర్వతగిరి ఎస్సై ములుగు మండలం మల్లంపల్లిలో బాలికల బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత బాలికల తల్లిదండ్రులు అనుమానితులుగా పేర్కొన్న ఆటోడ్రైవరును విచారించారు. సదరు ఆటోడ్రైవరు ఫోన్ నుంచి బాలికలు నెక్కొండకు చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేసినట్లుగా తెలుసుకుని అతన్ని సైతం విచారించారు. ఈ రెండు సందర్భాల్లో ఆశించిన మేరకు సమాచారం రాకపోవడంతో కేసు విచారణలో వేగం మందగించింది. డిసెంబరు 6, 8 తేదీలలో పర్వతగిరి స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు పర్యాటక ప్రాంతాల్లో గాలించారు. తల్లిదండ్రులు కూడా తిరుపతి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో వెతికారు. డిసెంబరు 27న చెన్నారావుపేట మండలం ఖాదర్గుట్ట సమీపంలో గుర్తుపట్టలేని స్థితిలో బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు పోలీసుశాఖలో కదలిక వచ్చింది. హాస్టల్లో బాలికలు అదృశ్యమైన తర్వాత వారికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడంలో హాస్టల్ వార్డెన్ జాటోతు వీరమ్మ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదృశ్యమైన విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని తోటి విద్యార్థినుల నుంచిగానీ, సన్నిహితంగా ఉండే ఇతర హాస్టల్ సిబ్బంది నుంచిగానీ సేకరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. తమ పిల్లలు కనిపించకుండా పోయారని ఆందోళన చేసిన తల్లిదండ్రులపై నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వార్డెన్.. విద్యార్థులు తప్పిపోయినట్లుగా మాత్రం ఎటువంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. నల్లబెల్లి హాస్టల్‌కు బయల్దేరే ముందు పర్వతగిరిలో ఓ ఫొటో స్టూడియోలో ఇద్దరు విద్యార్థినులు ఫొటోలు దిగినట్లు తెలిసింది. నవంబరు 24 నుంచి డిసెంబరు 27 వరకు విద్యార్థినుల ఆచూకీ లభించని కాలంలో వీరు సేంద్రియ ఎరువులు కంపెనీ తరఫున రిప్రజెంటేటీవ్‌గా పనిచేశారంటూ ప్రచారం జరుగుతోంది. విద్యార్థినుల ఫొటోలు చూపించి రామప్ప ఆలయం దగ్గర విచారించగా... వారు అక్కడకు వచ్చినట్లుగా సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. అయితే కచ్చితమైన తేదీని వెల్లడించలేకపోతున్నారు. -
కార్యాలయంలోకి వెళ్లి...కళ్లలో కారం కొట్టి.!
రాంనగర్లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు ముషీరాబాద్: రాంనగర్లో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వేర్వేరుగా ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన అనసూయ(53) మార్నింగ్ వాక్కు వైఎస్ఆర్ పార్కుకు వెళుతుండగా దాదాపు 24 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువకులు ద్విచ క్రవాహనంపై వెనుక నుంచి వచ్చారు. ఆమె మెడలోని ఆరు తులాల పుస్తెలతాడును లాక్కొని పార్శిగుట్ట వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారం కొట్టి... రాంనగర్ ఈ-సేవ సమీపంలోని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి పక్కన గల భవనం మొదటి అంతస్థులో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయం ఉంది. అందులో రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి సమీపంలో నివసించే స్మిత(32) ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ యువకుడు అక్కడికి వెళ్లాడు. ఆమె కళ్లలో కారం కొట్టి... మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో షట్టర్ కిందికి దించి... బయటి నుంచి గేటు పెట్టి వెళ్లిపోయాడు. ఆఫీస్‌లోని ఫోన్లో యాజమానికి సమాచారం అందించగా.. ఆయన వచ్చి షటర్ తెరిచాడు. సమాచారం అందుకున్న నల్లకుంట ఇన్స్పెక్టర్ సంతోష్ కిరణ్, ఎస్ఐ రామరాజు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. అందులో స్నాచర్ రావడం..వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. కేసు దర్యాప్తులో ఉంది. -
బాలికపై మహిళా టీచర్ లైంగిక దాడి ?
పోలీసుల అదుపులో నిందితులు వైద్య నివేదిక కోసం ఎదురు చూపు బెంగళూరు : ఓ బాలికపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలున్న మహిళా టీచర్‌ను ఇక్కడి ఆర్టీ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్టీ నగరలోని ఒక ప్రైవేటు స్కూల్లో ఆరు సంవత్సరాల బాలిక ఒకటో తరగతి చదువుతోంది. బాలిక స్కూల్‌కు వెళ్లిన సమయంలో అదే స్కూల్లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ లైంగిక దాడి చేశాంటూ ఆ బాలిక తల్లిదండ్రులు ఇక్కడి ఆర్టీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. బాలిక శరీరంలోని వివిధ చోట్ల, సున్నితమైన ప్రాంతంలో గాయాలు ఉన్నాయని వైద్యులు ధ్రువీకరించారు. అయితే బాలికపై లైంగిక దాడి జరిగిందా లే దా అని వైద్య నివేదిక తెలుస్తుందని శనివారం డీసీపీ సురేష్ అన్నారు. వైద్య నివేదిక అందిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు. టీచర్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాలిక అల్లరి చేస్తే నాలుగు దెబ్బలు కొట్టానే తప్ప.. లైంగిక దాడి చేయలేదని టీచర్ చెబుతున్నారు. ఈ విషయం శనివారం వెలుగుచూడంతో ఆ స్కూల్‌కు సెలవు ప్రకటించారు. స్కూల్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లైంగిక దాడి జరిగిందని కచ్చితమైన వివరాలు తెలియకపోవడంతో స్కూల్ పేరు, మహిళా టీచర్ పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. బెంగళూరులోని పలు స్కూల్లో బాలికలపై టీచర్లు, బస్సు డ్రైవర్లు, సిబ్బంది లైంగిక దాడి చేశారని కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలికపై మహిళా టీచర్ లైంగిక దాడి చేశారంటూ మొదటి సారి ఫిర్యాదు రావడంతో పోలీసులు వైద్యులను ఆశ్రయించారు. -
పోలీస్ మాయ !
సాక్షి, గుంటూరు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న రోజులు పోయి... పోలీసులు పోలీసులు రికవరీ సొమ్ములో వాటాలు వేసుకుంటున్న రోజులు ఇవి. దొంగతనం జరిగి సొమ్ము పోయిందని ఫిర్యాదు అందిన మరుక్షణం పారంభమయ్యే పోలీస్ ‘నొక్కుడు' దొంగల నుంచి రికవరీ చేసిన మొత్తంలో సగానికి పైగా జేబులో వేసుకోవడంతో ఆగిపోతోంది. రూరల్ జిల్లాతోపాటు, గుంటూరు నగరంలో నాలుగు నెలలుగా దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయి. సొమ్ము పోగొట్టుకుని బాధితులు గగ్గోలు పెడుతుంటే, రికవరీ చేస్తున్న పోలీసులు వాటాలు వేసుకుని ఖుషీ చేస్తున్నారు దీంతో దొంగతనం లేదా దోపిడీ జరిగిందని ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకడుగు వేస్తున్నారు. బాధితులనే వేధిస్తున్నారు.. ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళుతున్న బాధితులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలు కొల్లలుగా ఉన్నాయి. అంత బంగారం ఇంట్లో ఎందుకు ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ తక్కువ మొత్తం పోయినట్లుగా కేసు నమోదు చేస్తున్నారు. పోయిన సొమ్ము వెతికి ఇవ్వాల్సింది పోలీసులే కావడంతో వారితో వాదనకు దిగలేక వారు ఎంత రాస్తే ఆ మేరకే అంగీకరిస్తూ బాధితులు సంతకం చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులే తీసివుంటారని అనుమానిస్తూ వారినీ స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు చెబుతున్నారు. సొమ్ము పోయిందని వస్తే సొంతోళ్లనే కేసులో ఇరికించాలని చూస్తుండటంతో సొమ్ము పోతే పోయిందిలే అంటూ ఫిర్యాదు సైతం ఇవ్వకుండా వదలివేస్తున్నారు. మేం పిలిచినప్పుడల్లా స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేస్తూ, దొంగలను వెతకడానికి వెళ్తున్నాం దారి ఖర్చులకు ఇవ్వమంటూ కింది స్థాయి సిబ్బంది బాధితుల వద్ద డబ్బు గుంజుతున్నారు. డబ్బు, బంగారం పోగొట్టుకుని తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు పోలీసుల వేధింపులు మరింత బాధ కలిగిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించి దొంగతానాలు, దోపిడీ కేసుల్లో తమకు న్యాయం చే యాలని బాధితులు కోరుతున్నారు. -
పోలీస్ బాస్‌పై కన్నెర్ర!
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీపై అధికార పార్టీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరించడంలేదని పాలక పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. తమను చట్టానికి అతీతులుగా చూడాలనే దృక్పధంతో ఉన్నారు. తాము చెప్పినట్లు వినే అధికారే జిల్లాకు కావాలని పట్టుబడుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అధికారంలోకి వచ్చిన తమకు ఆ ప్రత్యేకత కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పనుల నిమిత్తం జిల్లా ఎస్పీ 15రోజులు సెలవులో వెళ్లినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ చట్టాన్ని పరిరక్షించడం, నిష్పక్షపాతంగా వ్యవహరించడం అధికార పార్టీ నేతలకు రుచించడం లేదు. అడపాపదడపా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా... అలా కాదు.. ప్రతి చర్యలో ప్రత్యేకత ఉండాలని తెలుగుతమ్ముళ్లు ఆశిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా ఎస్పీకి మింగుడు పడటం లేదు. సాధ్యమైనంత మేరకు అధికారపార్టీ నేతల పెత్తనాన్ని భరిస్తూ పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకు చట్టానికి విరుద్ధంగా విపక్ష ఎమ్మెల్యే తనయులపై రౌడీషీట్లు తెరిచారు. అనేక కేసుల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్నా చూసీచూడనట్లు వెళుతున్నారు. అయినా తెలుగుతమ్ముళ్లు గుర్రుగానే ఉన్నారు. రాజ్యమేలుతున్న మట్కా.... పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు డివిజన్లలో అధికారపార్టీ నేతల అండతో మట్కా జూదం యధేచ్ఛగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలుగా మారిన ఇరువురు మట్కా నిర్వాహకుల కనుసన్నల్లో జిల్లా వ్యాప్తంగా ఈ జూదం విస్తరిస్తోంది. కిందిస్థాయి యంత్రాంగం సహకరిస్తున్నా ఎస్పీ ఇందుకు అడ్డు తగులుతున్నట్లు సమాచారం. ఇదివరకే జూదం నిర్వహిస్తున్న రిక్రియేషన్ క్లబ్‌లను మూసివేయించారు. పులివెందుల పరిధిలో మట్కా విషయంలోనూ టీడీపీలో వర్గపోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆపార్టీ నేతలే ఒకరి అనుచరులపై ఇంకొకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి. ఈ విషయంలో ఎస్పీ కఠిన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా కిందిస్థాయి యంత్రాంగం సహకారంతో మట్కా నిర్వాహకులు వారి పని నిరాటంకంగా సాగిస్తున్నారు. హోంమంత్రికి ఫిర్యాదుల వెల్లువ.... హోంమంత్రి చిన రాజప్ప ఇటీవల జిల్లాలోని 8 నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ పర్యటనలో నియోజకవర్గ స్థారుు నాయకులు ఈ ఎస్పీ మాకొద్దు...మార్చండంటూ హోంమంత్రికి విన్నవించినట్లు సమాచారం. ఆ తర్వాత మరికొందరు నేతలు కూడా ఇదే విషయూన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. చట్టపరిధిలో పనిచేస్తున్న ఎస్పీ ఉండటం తమకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నట్లు ‘దేశం’శ్రేణుల వ్యవహార శైలి కనిపిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’ప్రతినిధితో అభిప్రాయపడ్డారు. వాస్తవ విషయాలు తెలుసుకుంటున్న ఎస్పీ సైతం జిల్లాలో పనిచేసేందుకు విముఖత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వ్యక్తిగత కారణాలతో 15రోజులు సెలవులో వెళ్లారు. కెనడా వెళ్లేందుకు సెలవు పెట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో పనిచేయడానికి ఎస్పీ సుముఖంగా లేరని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈలోపే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్పీని మార్పించాలనే లక్ష్యంతో దేశం శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
గిరిజన సంక్షేమంలో ఫిర్యాదులపై విచారణ
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సిబ్బంది పనితీరు, నిధుల దుర్వినియోగం పై వెల్లువెత్తిన ఫిర్యాదులపై ఆ శాఖ కమిషనరేట్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. రత్నమాల విచారణ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం వరకు జిల్లా కార్యాలయంలో, నగరంలోని ఆ శాఖ కార్యాలయాలకు వెళ్లి పలు ఫైళ్లను పరిశీలించారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయ ఉద్యోగులను ఆమె ప్రత్యేకంగా ఒక్కొక్కరిని పిలిపించి విచారించి రాత పూర్వకంగా వారి వాదనలను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే గిరిజన విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పలువురు కార్యాలయానికి వచ్చి డీడీకి వినతి పత్రాలను అందజేశారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన విషయాన్ని కూడా ఆమె తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే గిరిజన సంక్షేమంలో భాగంగా వివిధ పథకాల అమలుకు సంబంధించి విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం తదితర విషయాలను ఆరా ఆమె తీశారు. అధికారి, సిబ్బంధి మధ్య ఉన్న సమన్వయంతో పాటు కార్యాలయంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఫిర్యాదు మేరకు ఆయా ఫైళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు వచ్చిన విషయం వాస్తవమేనని, అయితే ఫిర్యాదులకు సంబంధించి చేపట్టిన విచారణ కాన్ఫిడెన్షియల్ అని, విచారణ నివేదికలతో పాటు సంబంధిత ఫైళ్లను కమిషనర్‌కు అందజేస్తామని డీడీ చెప్పారు.