పోలీసుల అదుపులో నిందితులు
వైద్య నివేదిక కోసం ఎదురు చూపు
బెంగళూరు : ఓ బాలికపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలున్న మహిళా టీచర్‌ను ఇక్కడి ఆర్‌టీ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్‌టీ నగరలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో ఆరు సంవత్సరాల బాలిక ఒకటో తరగతి చదువుతోంది. బాలిక స్కూల్‌కు వెళ్లిన సమయంలో అదే స్కూల్‌లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ లైంగిక దాడి చేశాంటూ ఆ బాలిక తల్లిదండ్రులు ఇక్కడి ఆర్‌టీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. బాలిక శరీరంలోని వివిధ చోట్ల, సున్నితమైన ప్రాంతంలో గాయాలు ఉన్నాయని వైద్యులు ధ్రువీకరించారు. అయితే బాలికపై లైంగిక దాడి జరిగిందా లే దా అని వైద్య నివేదిక తెలుస్తుందని శనివారం డీసీపీ సురేష్ అన్నారు. వైద్య నివేదిక అందిన తరువాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు. టీచర్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాలిక అల్లరి చేస్తే నాలుగు దెబ్బలు కొట్టానే తప్ప.. లైంగిక దాడి చేయలేదని టీచర్ చెబుతున్నారు.
ఈ విషయం శనివారం వెలుగుచూడంతో ఆ స్కూల్‌కు సెలవు ప్రకటించారు. స్కూల్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లైంగిక దాడి జరిగిందని కచ్చితమైన వివరాలు తెలియకపోవడంతో స్కూల్ పేరు, మహిళా టీచర్ పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. బెంగళూరులోని పలు స్కూల్‌లో బాలికలపై టీచర్లు, బస్సు డ్రైవర్లు, సిబ్బంది లైంగిక దాడి చేశారని కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలికపై మహిళా టీచర్ లైంగిక దాడి చేశారంటూ మొదటి సారి ఫిర్యాదు రావడంతో పోలీసులు వైద్యులను ఆశ్రయించారు.
బాలికపై మహిళా టీచర్ లైంగిక దాడి ?
Published Sun, Nov 23 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement