ఇద్దరు దొంగల అరెస్ట్
Published Tue, Sep 17 2013 12:21 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : బైక్‌లు దొంగిలించి, వాటిపై ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో తిరుగుతూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు దొంగలను గుడిహత్నూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్సై ఎల్.వెంకటరమణ కేసు వివరాలు వెల్లడిం చారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని యవత్మాల్ సమీపంలోని రారేగావ్‌కు చెందిన భగత్ అల్పేశ్(29), పాండ్రకవడకు చెందిన సునీల్(23) ఏడాది నుంచి ఆదిలాబా ద్ పరిసర ప్రాంతాలతోపాటు మండలంలో పలుచోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సో మవారం మండలంలోని చింతగూడ ధంపూర్ అటవీ ప్రాంతంలో మోటార్ సైకిల్‌పై అనుమానాస్పద రీతిలో తిరుగుతుండగా విశ్వసనీ య సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చోరీ సంఘటనలు వెలుగు చూశాయి.
బైక్‌లు.. గొలసులు..
గతేడాది నవంబరు 28న ఆదిలాబాద్‌కు చెందిన తోటి పద్మావతి మండలంలోని వాఘాపూర్ బంధువుల ఇంటికి వెళ్తుండగా సీతాగోంది సమీపంలో అల్పేశ్, సునీల్ ఆమె మెడలో ఉన్న తులం బంగారు గొలుసు తెంపుకుని పారిపోయూరు. ఈ ఏడాది జూన్‌లో ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉపాధ్యాయురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు దొంగిలించారు. గత నెల 28న మండలంలోని కొల్హారికి చెందిన సుధాకర్ ముండే మోటార్ సైకిల్‌ను దొంగిలించారు. అదే బైక్‌పై తిరుగుతుండగా పట్టుకున్నామని ఎస్సై తెలిపారు. వీరు మహారాష్ట్ర ప్రాంతంలో మరో బైక్ దొంగిలించారని పేర్కొన్నారు. వీరి నుంచి రెండు తులాల బంగారం, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొదట వీరు బైక్‌లు దొంగిలిస్తూ అనంతరం వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని వివరించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేవారని తెలిపారు.
Advertisement