చైన్ స్నాచర్లకు కళ్లెం | The number of cases declines snaching | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్లకు కళ్లెం

Published Mon, Nov 21 2016 12:53 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

చైన్ స్నాచర్లకు కళ్లెం - Sakshi

చైన్ స్నాచర్లకు కళ్లెం

నగరంలో చైన్ స్నాచర్ల ఆటకట్టించడంలో పోలీసులు సఫలమయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈసారి స్నాచింగ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 2015లో మొత్తం 267 స్నాచింగ్ కేసులు నమోదవగా..ఈ ఏడాది నవంబర్ వరకు కేవలం 82 కేసులు నమోదయ్యారుు. దీంతో మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరవ్యాప్తంగా పోలీసులు భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం..కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో చైన్‌స్నాచర్లు తోకముడిచారు.                                  

సిటీబ్యూరో: సిటీలో వరుస ఉదంతాలతో ముచ్చెమటలు పట్టించిన చైన్ స్నాచర్లు తోకముడుస్తున్నారు... గతేడాదితో పోలిస్తే ఈ కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. సిటీ పోలీసులు అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలే దీనికి కారణమని స్పష్టమవుతోంది. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటు, పీడీ యాక్ట్ ప్రయోగం, కేసుల విచారణ వేగవంతం చేయడం తదితర చర్యలు ఫలితాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ముచ్చెమటలు పట్టించారు...
సామాన్యుల నుంచి ప్రముఖుల కుటుంబాల వారిని స్నాచర్లు వదల్లేదు. ఓ పక్క స్థానిక ముఠాలు, మరోపక్క ఉత్తరాది నుంచి వచ్చివెళ్లే గ్యాంగులు ముచ్చెమటలు పట్టించారుు. ఉదయం, సాయంత్రం వేళల్లో విరుచుకుపడిన గొలుసు దొంగలు ఒకే రోజు వరుస ఉదంతాలకూ పాల్పడ్డారు. వీరిబారిన పడి ప్రాణాలు కోల్పోరుు, తీవ్రంగా గాయపడిన బాధితులు సైతం ఉన్నారు. ఈ రకంగా దాదాపు ఐదేళ్ల పాటు నగర ప్రజలతో పాటు పోలీసులకూ చైన్ స్నాచర్లు నరకం చూపించారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఫలితంగా గడిచిన మూడేళ్లుగా ఈ కేసుల్లో తగ్గుదల కనిపించింది.

ఈసారి గణనీయమైన మార్పు...
సిటీ కాప్స్ తీసుకుంటున్న చర్యల కారణంగా గడిచిన కొన్నేళ్లుగా చైన్ స్నాచింగ్ నేరాల్లో తగ్గుదల కనిపిస్తూ వచ్చింది. 2013లో 675, 2014లో 523 కేసులు నమోదయ్యారుు. గత ఏడాది నుంచీ ఈ నేరాలను ప్రత్యేకంగా పరిగణించిన నగర పోలీసులు గణనీయంగా తగ్గించాలని నిర్ణరుుంచుకున్నారు. దీంతో అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఓ పక్కన సంప్రదాయ పద్ధతులతో పాటు మరోపక్క సాంకేతిక పరిజ్ఞానాన్నీ విసృ్తతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది ఈ కేసుల సంఖ్య 267కు తగ్గింది. ఈ ఏడాది వీటి సంఖ్య 100కు మించకూడదనే లక్ష్యంతో ఆది నుంచీ చర్యలు తీసుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీలో స్నాచింగ్‌‌స సంఖ్య చెప్పుకొదగ్గ స్థారుులో తగ్గింది. ఈ ఏడాది నవంబర్ 18 వరకు కేవలం 82 కేసులు నమోదయ్యారుు. వీటిలోనూ గొలుసు దొంగతనాలకు సంబంధించినవి కేవలం 60 కేసులే. మిగిలిన 22 కేసులూ బ్యాగ్‌లు తదితరాలు లాక్కుపోవడం వంటి నేరాలపై నమోదయ్యారుు.

పోలీసులు తీసుకున్న ప్రధాన చర్యలివి...
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటి సంఖ్య వీటన్నింటినీ బషీర్‌బాగ్‌లోకి కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే వీటి సంఖ్య 10 వేలకు చేరింది. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ఈ కెమెరాలు ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఉదంతానికి సంబంధించి ఏదో ఒక క్లూ దొరుకుతోంది. ఫలితంగా నేరగాళ్లను పట్టుకుని జైలుకు పంపడం తేలికై ంది. దీని ఫలితంగా కేసులు కొలిక్కివచ్చే శాతం కూడా గణనీయంగా పెరిగింది. మరోపక్క ఇలా చిక్కిన నేరగాళ్లల్లో వరుసగా నేరాలు చేసిన వారు ఉంటే వీరిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు.

జైల్లో ఉండగానే శిక్షలుపడేలా...
పీడీ యాక్ట్ ప్రయోగించడంతో నేరగాళ్లు 12 నెలల పాటు జైల్లోనే ఉంటున్నారు. నగర పోలీసులు గడిచిన రెండేళ్ల కాలంలో మొత్తం 530 మందిపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. వీరిలో 68 మంది స్నాచర్లే కావడం గమనార్హం. ఇలా ఏడాది పాటు వీరు జైల్లో ఉన్న సమయంలోనే కేసు విచారణ పూర్తరుు, శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఈ రకంగా లాంబా, ఫైజల్ లాంటి ఘరానా స్నాచర్లతో సహా మొత్తం 14మందికి కనిష్టంగా రెండేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్షలు పడ్డారుు. దీంతోపాటు విజుబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా స్నాచర్లను కట్టడి చేస్తున్నారుు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement