Command Control Center
-
హైదరాబాద్ ఓఆర్ఆర్పై డ్రంకెన్ డ్రైవ్‌లు.. ఇక అడుగడుగునా నిఘా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద పోలీసు కమిషనరేట్ రాచకొండలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రానుంది. నిర్భయ, ఐటీఎంఎస్, నేను సైతం కార్యక్రమాల కింద ఏర్పాటైన సుమారు లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలు కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో రాచకొండలో అడుగడుగునా నిఘా ఉండనుంది. ఇప్పటికే కేంద్రం హోం శాఖకు చెందిన సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను పంపించామని కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. సుమారు 50 మంది సిబ్బంది 24/7 కంట్రోల్ సెంటర్లో విధుల్లో ఉంటారని, జోన్ల వారీగా ప్రత్యేక నిఘా ఉంటుందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..ఔటర్లో డ్రంకెన్ డ్రైవ్‌లు.. పోలీసులు, అధికారులు రోడ్ల మీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుంది. ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం (ఆప్ట్)ను ఏర్పాటు చేశాం. ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు, దర్యాప్తులతో పాటు సమాంతరంగా ప్రమాదం జరిగిన తీరు, కారణాలను క్షేత్ర స్థాయిలో విశ్లేషించడం, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించడం దీని బాధ్యత. ఓఆర్ఆర్పై ప్రమాదాలను, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) నిర్వహిస్తున్నాం.3 షిఫ్ట్‌లలో సిబ్బందికి విధులు.. సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటివరకు రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహించే పెట్రోలింగ్ సిబ్బందికి మూడు షిఫ్ట్‌లను కేటాయించాం. దీంతో 74 పెట్రోలింగ్ వాహనాల సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తారు. తగినంత స్థాయిలో నియామకాలు జరిగిన తర్వాత పోలీసు స్టేషన్లలో కూడా మూడు షిఫ్ట్‌ల విధానాన్ని అమలు చేస్తాం.సైబర్ బాధితులకు ఊరట.. క్విక్ రెస్పాన్స్, విజుబుల్ పోలీసింగ్, సాంకేతికత.. ఈ మూడే రాచకొండ పోలీసుల ప్రాధాన్యం. దీంతోనే నేరాలు తగ్గడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడంతో పాటు బాధితులకు ఊరట కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గత 7 నెలల్లో రూ.15 కోట్ల సొమ్మును బాధితులకు రీఫండ్ చేశాం. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తే బాధితులకు ఊరట కలగడంతో పాటు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.చదవండి: మైనర్ల డ్రైవింగ్‌పై ఆర్టీఏ కొరడా.. తల్లిదండ్రులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలుపోలీసు ప్రవర్తనపై నిఘా.. ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకునేందుకు వంద బాడీవార్న్ కెమెరాలను కొనుగోలు చేశాం. కమిషనరేట్‌లోని 12 ఠాణాల్లోని ఎస్ఐ ర్యాంకు అధికారికి వీటిని ధరించి విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. ఈ బాడీవార్న్ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. దీంతో వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసిపోతుంటుంది.మహిళల భద్రత కోసం.. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 2 నెలల్లో ఎల్బీనగర్, భువనగిరిలో భరోసా సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిల్లో తగినంత మహిళా సిబ్బందితో పాటు శాశ్వత కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తున్నాం. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వాటిపై నిఘా పెట్టేందుకు ఆయా విభాగాల్లో మహిళా సిబ్బందిని పెంచుతున్నాం. మహిళలను వేధింపులు పునరావృతమైతే ఆయా నిందితులపై రౌడీ షీట్లు తెరుస్తున్నాం. ఇందుకోసం ప్రతీ పోలీసు స్టేషన్లో రిజిస్ట్రీ ఉంటుంది. -
బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
-
క్షీర విప్లవం వెల్లువెత్తేలా..!
సాక్షి, అమరావతి: జగనన్న పాలవెల్లువ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద ప్రస్తుతం 1,515 ఆర్బీకేల పరిధిలో 2.60 లక్షల మంది మహిళా రైతులు నమోదు కాగా.. 65 వేల మంది నుంచి ప్రతిరోజు 1.75 లక్షల లీటర్ల పాలను అమూల్ సంస్థ ద్వారా అత్యధిక ధర చెల్లించి సేకరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5,388 ఆర్బీకేల పరిధిలో కనీసం 4.58 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజూ 6 లక్షల లీటర్లు, 2024 మార్చి నాటికి 8,021 ఆర్బీకేల పరిధిలో 6 లక్షల మంది రైతుల నుంచి 9 లక్షల లీటర్లను సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. నిత్యం 30 మందితో మాట్లాడేలా.. పాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లాకో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కంట్రోల్ సెంటర్ పని చేస్తాయి. డీఆర్డీఎ, పశుసంవర్థక, సహకార శాఖల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఈ సెంటర్లో సేవలందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. ప్రతిరోజు కనీసం 30 మంది మహిళా పాడి రైతు సంఘాల కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ల సిబ్బంది మాట్లాడతారు. పాలుపోసే మహిళా పాడిరైతులతోపాటు రూట్ ఆఫీసర్స్, అమూల్ టీమ్‌కు జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. పాల సేకరణ, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతం గుర్తింపు, సకాలంలో డబ్బులు జమ వంటి విషయాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు. సేకరణ తగ్గితే రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు ఏ గ్రామంలో అయినా పాల సేకరణ తగ్గినట్టుగా గుర్తిస్తే వెంటనే అందుకు గల కారణాలను విశ్లేషించి పెరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ప్రత్యేక టీమ్‌లను పంపించే ఏర్పాటును కమాండ్ కంట్రోల్ సెంటర్లు చేస్తాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుతో పాటు బీఏంసీయూ, ఏఎంసీయూ భవనాల నిర్మాణాల పురోగతి, పాడి రైతులకు బ్యాంక్ లింకేజ్‌ను కలెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇందుకోసం ఎంపీడీఓ, తహసీల్దార్ నేతృత్వంలో మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సొసైటీల రిజిస్ట్రేషన్లు, పాల సేకరణకు చెల్లించే హ్యాండ్లింగ్, నిర్వహణ చార్జీలు ఎప్పటికప్పుడు జమయ్యేలా చూస్తాయి. రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అన్ని గ్రామాలకు విస్తరిస్తాం జగనన్న పాల వెల్లువ పథకాన్ని దశల వారీగా అన్ని ఆర్బీకేలకు, అన్ని గ్రామాలకు విస్తరించడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2024 మార్చి కల్లా పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకే పరిధిలో పాల సేకరణ ప్రారంభించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ -
బ్రదరూ! అక్కడుంటాడొకడు.. క్లిక్మనగానే ఇంటికి డైరెక్టుగా ట్రాఫిక్ చలానా!
టాఫిక్ పోలీస్ లేడని దర్జాగా దూసుకెళ్లినా.. నిబంధనలు అతిక్రమించినా ఒకడున్నాడు చూడ్డానికి. ఇకపై కూడళ్ల వద్ద మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్‌మని జరిమానా వేసేస్తాడు. – కాజీపేట ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కాజీపేట చౌరస్తాలో ఇటీవల కొత్తగా ఆటోమెటిక్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. చక్కగా తన పనితాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక ముందు బీట్ కానిస్టేబుల్ చౌరస్తాలో నిలబడి నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఫొటోలు తీసి జరిమానా విధించే పని ఉండదు. ఆటోమెటిక్ కెమెరాలు తీసిన ఫొటోల ఆధారంగా నేరుగా ఈ–చలానా ఇంటికే వచ్చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఈవిధానం అమలవుతుండగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికోసం వరంగల్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిర్వహణ కొనసాగించనున్నారు. (చదవండి: బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు) ఈ నిబంధనలు పాటించాల్సిందే.. ► హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు ► రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు ► వాహనాలపై పరిమిత సంఖ్యలో ప్రయాణించాలి ► ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించొద్దు ► నంబర్ ప్లేట్ వంచొద్దు. స్టిక్కర్లు అంటించొద్దు. ఈవిధానంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రాంతం నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారి ఫొటోలు ఈకెమెరాల్లో నిక్షిప్తమై కంట్రోల్ కేంద్రం నుంచి ఆటోమెటిక్‌గా ఈ–చలానా వాహనదారులకు చేరేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఏఎంపీఆర్ విధానం ఆటోమెటిక్‌గా ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు అనంతరం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎంపీఆర్ (ఆటో మెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) అమలు చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా తమ వాహనం నంబర్లో ఒక సంఖ్య తొలగించి వాహనం నడిపితే సీసీ కెమెరాల్లో ఆవాహనం ఫొటో నిక్షిప్తమై తొలగించిన నంబర్‌ను గుర్తు పడుతోంది. అనంతరం ఆయజమాని సెల్‌ఫోన్‌కు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తుంది. (చదవండి: లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
రవాణా మంత్రిగా ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చా!
సాక్షి, హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పలు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను రవాణా మంత్రిగా చేసిన కృషి, ముఖ్యమంత్రిగా సింగపూర్ పర్యటనలో ఎదురైన అనుభవం, మాజీ డీజీపీ అప్పారావు కొన్నేళ్ల క్రితం కలిసినప్పటి అంశాలను ప్రస్తావించారు. ఆ విషయాలు కేసీఆర్ మాటల్లోనే.. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చా ‘‘అప్పారావు ఆర్టీసీ ఎండీ, నేను రవాణా మంత్రి. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆర్టీసీ రూ.13 కోట్ల నష్టాల్లో ఉంది. ఏం చేద్దాం అప్పారావుగారు అని అడిగితే.. మీరు సరేనంటే గట్టిగా పనిచేసి లాభాల్లోకి తీసుకొద్దాం అన్నారు. చాలెంజ్‌గా తీసుకుని పనిచేశాం. అప్పట్లో ఆంజనేయరెడ్డి గారిని కలవాలనుకున్నాను. నేను ఈ విషయం చెబితే ఆయనే వస్తానన్నారు. మీరు మా కంటే సీనియర్, నేను మంత్రిని కాగానే కొమ్ములేవీ మొలవలేదు అంటూ నేనే స్వయంగా వెళ్లి మాట్లాడిన. అనేక సలహాలు తీసుకున్నా. ఆపై అప్పారావు గారితో కూర్చుని ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుని పని ప్రారంభించాం. రూ.13 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రూ.14 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చాం. మా తర్వాత వచ్చిన కొందరు మళ్లీ ముంచేశారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా పోలీసు ఉన్నతాధికారులే ఆదుకున్నారు. వారి నాయకత్వమే ఇప్పటికీ ఆర్టీసీని నడిపిస్తోంది’’ సింగపూర్ పరిస్థితులపై మహిళా ఐఏఎస్‌తో.. ‘‘సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు మహేందర్‌రెడ్డి సూచనల మేరకు అక్కడి పోలీసు విభాగం, పనితీరును పరిశీలించాం. అప్పట్లో నాతో సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, మరో మహిళా ఐఏఎస్ వచ్చారు. అక్కడి ఓ బిజినెస్ మీట్లో కొందరు ‘‘వెన్ ఆర్ యూ గోయింగ్ టూ మేక్ హైదరాబాద్ అజ్ సింగపూర్ (మీరు హైదరాబాద్‌ను ఎప్పుడు సింగపూర్‌గా మారుస్తారు?)’ అని అడిగారు. ఇప్పుడే కదా ప్రారంభమయ్యాం.. కొంత సమయం పడుతుంది అని చెప్పా. సింగపూర్‌లో మహిళలు అర్థరాత్రి ధైర్యంగా బయటికి వెళ్లి పనులు చేసుకోగలరని వాళ్లు గర్వంగా చెప్పారు. మేం టెస్ట్ చేశాం. రాజశేఖర్‌రెడ్డిని, మా వెంట వచ్చిన మహిళా ఐఏఎస్ అధికారిని క్షేత్రస్థాయిలో పర్యటనకు పంపాం. నిజంగానే ఆమెకు ఎక్కడా ఏ ఇబ్బందీ ఎదురుకాలేదు. అలాంటి రోజులు ఇక్కడ కూడా రావాలి. వస్తాయి.’’ సిటీపై మాజీ అధికారులకు మమకారం మాజీ పోలీసు అధికారులకు రాష్ట్రంపై, పోలీసింగ్‌పై మంచి కన్సర్న్ ఉంది. ఓ ఏడాది గణేశ్ నిమజ్జనం రోజున మాజీ డీజీపీ అప్పారావు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు మహేందర్‌రెడ్డి సిటీ పోలీసు కమిషనర్. అప్పారావు కూడా గతంలో సిటీ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఏదో విషయం మాట్లాడుతున్నాం. అ సమయంలో అప్పారావు నా ముందే ఫోన్ తీసి మహేందర్‌రెడ్డికి కాల్ చేశారు. గణేశ్ ఊరేగింపు ఎక్కడి వరకు వచ్చింది? అక్కడ జాగ్రత్త, ఫలానా చోట మన వాళ్లు అలర్ట్‌గా ఉన్నారా? అని అడిగి సలహాలు ఇచ్చారు. ఇప్పటికీ మాజీ పోలీసు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు అవసరం. -
నేడు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
-
ఆగష్టు 4న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధం
-
హైదరాబాద్: ఆగష్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
-
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భారీ చోరీ
బంజారాహిల్స్(హైదరాబాద్): అణువణువు నిఘా పెట్టేందుకు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్‌లో రోడ్ నం.12లో నిర్మిస్తు్తన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.40 లక్షల విలువ చేసే 38 రాగి బండిళ్లు (కాపర్ బండిల్స్) చోరీకి గురికాగా దీనిపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్న షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ అడ్మిన్ ఇన్చార్జి శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్మాణానికి గాను రాగి బండిళ్లను తెప్పించారు. ఈనెల 2న ప్రాజెక్టు ఇన్చార్జి సురేశ్ కృష్ణ అడ్మిన్ ఇన్చార్జి నరేందర్‌కు ఫోన్ చేసి 38 రాగి బండిళ్లు కనిపించడంలేదని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని ప్రాంతాల్లో గాలించిన అనంతరం ఎక్కడా కన్పించకపోవడంతో సంస్థలో పనిచేస్తున్న వారందర్నీ పిలిచి విచారించారు. ఎవరూ తెలియదని సమాధానం చెప్పడంతో శనివారం నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
సాక్షి, తాడేపల్లి: కరోనా నియంత్రణ, వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒకవైపు కర్ఫ్యూను అమలు చేస్తూ.. మరోవైపు వ్యాక్సినేషన్, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తూ కరోనాపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కోవిడ్ బారిన పడిన రోగులకు, ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అండగా నిలుస్తూ క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈ సేవలను మరింతగా క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ, ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలంతా పాటించేలా వారిని చైతన్యవంతం చేయడంతో పాటు రోగులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ కోవిడ్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు వారికి ఉచితంగా అందేలా కృషి చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానికంగా కోవిడ్ సెంటర్లు లేని పక్షంలో అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని ఏర్పాటు చేయించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా సేవలకు, 9143 54 1234; 9143 64 1234 వాట్సాప్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమతమ నియోజకవర్గాల్లో కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, అందులో రెండు ఫోన్ నెంబర్లు కేటాయించి, ప్రజలు, ముఖ్యంగా కరోనా రోగులకు సహాయపడుతూ మీరు చేస్తున్న కార్యక్రమాలతో పాటు మీ సలహాలు సూచనలను పార్టీ స్టేట్ కంట్రోల్ సెంటర్ వాట్సాప్ ద్వారా పంపించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. చదవండి: సీఎం జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం పకడ్బందీగా కోవిడ్ కర్ఫ్యూ .. గడప దాటని జనం -
మళ్లీ ట్రూనాట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ట్రూనాట్ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేస్తున్నారని, ఇకపై ట్రూనాట్ ద్వారా పరీక్షలు చేయాలన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పెండింగ్ కేసులకు తక్షణమే నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. 104 కాల్ సెంటర్‌పై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. నేడు సెకండ్ డోసు మాత్రమే.. గురువారం కరోనా టీకా రెండో డోసు మాత్రమే వేస్తున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోసు ఎవరికీ వెయ్యరని చెప్పారు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ & డేటా సెంటర్‌ను ప్రారంభించారు. దీనిద్వారా ఒకేసారి భారీ స్క్రీన్‌పై 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10 లక్షల కెమెరా దృశ్యాలను నెల రోజులపాటు స్టోర్ చేసేలా భారీ సర్వర్ల ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను కూడా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే వీక్షించే అవకాశం ఉంది. (తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలే) -
డయల్ 1902కు కాల్ వచ్చిన గంటలోనే..
సాక్షి, అమరావతి: కంటికి కనిపించని కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అలుపెరుగని పోరాటం చేస్తోంది. లాక్డౌన్ తరుణంలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా స్పందించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తోంది. డయల్ 1902 కు కాల్ వచ్చిన గంటలోనే ప్రత్యేక బృందాలు కార్యరంగంలోకి దిగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి 21 ప్రభుత్వ శాఖలను ఒకే చోటకు చేర్చడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రోజుకు సగటున వెయ్యికిపైగా కాల్స్ వస్తున్నాయి. వీటిలో చాలా వరకు ప్రజలకు అత్యవసర సేవలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజావసరాలు తీర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు ఐజీలు, ఇద్దరు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, అనేక మంది పోలీస్ సిబ్బంది కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్నారు. (డయల్ 1902) గంటలోనే పరిష్కారం కమాండ్ కంట్రోల్ సెంటర్ 1902కి కాల్ వచ్చిన గంటలోనే సమస్య పరిష్కరిస్తున్నామని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐజీ హరికుమార్ చెప్పారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాల నుంచి వచ్చే కాల్స్‌ని కూడా వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి. ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సేవలను ప్రభుత్వ యంత్రాంగం అందిస్తుందని ఆయన చెప్పారు. ఇలా స్పందిస్తున్నారు.. ► లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి జనం ఎక్కువగా వచ్చినా, వాహనాలు నిలిచిపోయినా, సరిహద్దుల్లో రద్దీ ఉన్నా, ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా ఆయా ప్రాంతాల్లోని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ► పొరుగు ప్రాంతంలో చిక్కుకున్నామని, తమ ఊరికి వెళ్లే అవకాశం కల్పించాలని అనేక మంది కోరడంతో రాష్ట్ర సరిహద్దుల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి వైద్య పరీక్షలతో అనుమతించిన సందర్భాలున్నాయి. కరోనా తీవ్రతపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ► నిత్యావసర సరుకులు అందకపోవడం, ధరలు అందుబాటులో లేవనే ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా స్టాల్స్ విస్తారంగా ఏర్పాటు చేసి అధిక ధరలను నియంత్రించింది. ఈ విషయంలో జిల్లాల్లోనూ జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ► ఆక్వా ఉత్పత్తులు, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో పడుతున్న ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపై దృష్టి అలాగే ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఢిల్లీ వెళ్లివచ్చిన 758మందిని గుర్తించి, వారి శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షలకు పంపారు. మరోవైపు ఢిల్లీలో సదస్సుకు వెళ్లిన వారితో కలిసి ప్రయాణం చేసిన వారిని, వారి కుటుంబ సభ్యులను, వారితో సన్నిహితంగా ఉన్న వారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకూ 543 మంది కాంటాక్ట్‌ల నమూనాలను సేకరించారు. ఢిల్లీ వెళ్లినవారితో పాటు, వారు కలిసిన 1301మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 110మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఏపీలో గురువారం ఉదయం వరకూ 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. -
గంటలోనే పరిష్కారం
-
‘విక్రమ్’ను గుర్తించాం!
బెంగళూరు/వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ‘విక్రమ్’ ల్యాండర్‌ను గుర్తించామని తెలిపారు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్’కు సంబంధించిన థర్మల్ ఇమేజ్‌లను చిత్రీకరించాయని వెల్లడించారు. ఈ చిత్రాలను చూస్తే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లు (చంద్రుడిపై పడిపోయినట్లు) అనిపిస్తోందని వ్యా ఖ్యానించారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలో శివన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విక్రమ్ ల్యాండర్ దెబ్బతిందా? అన్న మీడియా ప్రశ్నకు..‘ఆ విషయంలో మాకు స్పష్టత లేదు. ల్యాండర్ లోపలే రోవర్ ప్రజ్ఞాన్ ఉంది’ అని జవాబిచ్చారు. ఇస్రో ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయాయి. సమయం మించిపోతోంది.. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు సమయం మించిపోతోందని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో ఆలస్యమయ్యేకొద్దీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థల్ని పునరుద్ధరించడం కష్టమైపోతుంది. ఇప్పటికైనా ల్యాండర్ సరైన దిశలో ఉంటే సోలార్ ప్యానెల్స్ సాయంతో చార్జింగ్ చేసుకోగలదు. అయితే ఇది జరిగే అవకాశాలున్నట్లు కనిపించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. చంద్రుడిపై సురక్షితంగా దిగేలా విక్రమ్‌ను రూపొందించామనీ, అయితే జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా తాకడం కారణంగా ల్యాండర్ దెబ్బతిని ఉండొచ్చని మరో ఇస్రో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇస్రో రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ కోసం రూ.375 కోట్లు, ఆర్బిటర్–ల్యాండర్–రోవర్ కోసం రూ.603 కోట్లు వెచ్చించింది. మరోవైపు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు శివన్ తెలిపారు. ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్‌లో 8 సాంకేతిక పరికరాలు ఉన్నాయనీ, ఇవి చంద్రుడి ఉపరితలాన్ని మ్యాపింగ్ చేయడంతో పాటు బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయని వెల్లడించారు. దేశ ప్రజలకు ఇస్రో కృతజ్ఞతలు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంలో ఒడిదుడుకులు ఎదురైనా ప్రధాని మోదీతో పాటు యావత్ భారతం తమవెంట నిలవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై శివన్ మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో పాటు దేశమంతా మాకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చర్య శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైతిక స్థైర్యాన్ని అమాంతం పెంచింది’ అని తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ స్పందిస్తూ..‘భారత ప్రజలు చూపిన సానుకూల దృక్పథంతో మేం కదిలిపోయాం. ఇస్రో చైర్మన్ శివన్, ఇతర శాస్త్రవేత్తల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే విషయంలో ప్రధాని గొప్పగా ప్రవర్తించారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ల్యాండింగ్ ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో ప్రజలు గుర్తించి తమకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని ఇస్రోకు గతంలో చైర్మన్‌గా పనిచేసిన ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం తాము దేశానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ‘ఇస్రో’పై అమెరికా ప్రశంసలు.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రశంసలు కురిపించింది. ఈ ప్రయోగంతో తాము స్ఫూర్తి పొందామనీ, ఇస్రోతో కలిసి సౌర వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ప్రకటించింది. ఈ విషయమై నాసా స్పందిస్తూ.. ‘అంతరిక్ష ప్రయోగాలు అన్నవి చాలా సంక్లిష్టమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2ను స్వాగతిస్తున్నాం’ అని తెలిపింది. ఇస్రో చేపట్టిన ప్రయోగం అద్భుతమనీ, దీనివల్ల శాస్త్రీయ పరిశోధనలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేసింది. చంద్రుడిపై దిగే తొలిప్రయత్నంలో ఇండియా విజయవంతం కాకపోయినా భారత ఇంజనీరింగ్ నైపుణ్యం, సామర్థ్యం ఏంటో చంద్రయాన్–2తో ప్రపంచం మొత్తానికి తెలిసిందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రశంసించింది. అమెరికా చేపట్టిన ‘అపోలో మిషన్’తో పోల్చుకుంటే ఎంతో చవకగా కేవలం 141 మిలియన్ డాలర్ల వ్యయంతోనే భారత్ చంద్రయాన్–2 చేపట్టిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. -
నిఘా నేత్రాలు పట్టిస్తున్నాయ్!
సాక్షి, నెల్లూరు(క్రైమ్): జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిస్టరీగా మారిన పలు కేసులను సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఛేదిస్తున్నారు. జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల్లోనూ సీసీ ఫుటేజీలు కీలక సాక్ష్యంగా ఉపయోగపడుతున్నాయి. ఓ వైపు శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయడంతోపాటు మరోవైపు నేరాలను అదుపులో ఉంచేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కొన్ని ఉదాహరణలు ► ముత్యాలపాళెంలో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్యచేసి ఆపై నిప్పంటించాడు. ఈ కేసులో చిన్నపాటి క్లూ దొరక్క పోలీసులు తలలు పట్టుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఆటోను గుర్తించారు. దాని ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ► అత్యాశకుపోయిన ఓ ఆటోడ్రైవర్ ప్రయాణికుల బ్యాగ్‌తో ఉడాయించాడు. అతను ఎవరు? ఎక్కడి వాడు అన్న వివరాలు తెలియదు. దీంతో పోలీసులు ప్రయాణికుడు ఎక్కిన ప్రాంతం నుంచి దిగిన ప్రాంతం వరకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ► సర్వజనాస్పత్రిలో ఓ పసికందు కిడ్నాప్‌కు గురైంది. దీంతో బాధిత తల్లి కన్నీటి పర్యంతమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పసికందును తల్లికి సురక్షితంగా అప్పజెప్పారు. ► మూలాపేటలో వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగద దోచుకెళ్లారు. ఈ ఘటనలో చిన్నపాటి క్లూ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. ► మూడురోజుల క్రితం గాంధీబొమ్మ వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న ఓ మహిళ పర్సును లాక్కెళ్లిన దుండగుడు రఫీని గంటల వ్యవధిలోనే సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. వాటి ఆధారంగానే.. జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుర్తుతెలియని వాహనాలు హైవేపై ప్రయాణించే వారిని, వాహనాలను ఢీకొని వెళ్లిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు సిబ్బంది కష్టపడుతున్నా కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈక్రమంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అలాగే దోపిడీలు, చోరీలు, హత్య కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు ఉపయోగపడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సీసీ కెమెరాలు నేర పరిశోధనకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. చిన్నపాటి క్లూ లేని కేసుల ఛేదనలో వీటి పాత్ర అద్వితీయం. వృద్ధుల వద్ద నగదు, నగలు దోచుకెళ్లిన కేసులో సీసీ కెమెరాకు చిక్కిన నిందితులు (ఫైల్) 540 కెమెరాల ఏర్పాటు సీసీ కెమెరాల నిఘాలో జిల్లా ఉంది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పారిశ్రామికవాడలు తదితర ప్రాంతాలన్నింటిలో పోలీసులు స్థానికులు, దాతల సహకారం, సీఎస్ఆర్ నిధులతో పెద్దఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నారు. అక్కడ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పలు సందర్భాల్లో ఏదైనా నేరం జరిగిన వెంటనే సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేయడంతో గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్న ఘటనలున్నాయి. జిల్లా కేంద్రంలోనే కాకుండా మనుబోలు, నాయుడుపేట, కావలి పట్టణాల్లో మినీ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటుచేసి పరిసర ప్రాంతాల్లోని కెమెరాలను వాటికి అనుసంధానించారు. గతంలో కేవలం 86 కెమెరాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 540 (నెల్లూరు నగరంలో 101, నెల్లూరు రూరల్ 190, గూడూరు 50, నాయుడుపేట 50, కావలి 123, ఆత్మకూరు 25)కు చేరింది. జిల్లావ్యాప్తంగా 1,000 కెమెరాలను ఏర్పాటుచేసే దిశగా పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. కెమెరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే నేరాలు చేసేందుకు ఎవరైనా భయపడే పరిస్థితి రానుంది. వ్యాపారస్తులు, బహుళ అంతస్తుల భవన యజమానులు, షాపింగ్‌మాల్ నిర్వాహకులు సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. -
సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడెకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సెంటర్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. శాంతిభద్రతలతో పాటు విపత్తుల నిర్వహణ, పండగలు, జాతరల నిర్వహణ తదితర కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చని సీఎం చెప్పారు. సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆరూరి రమేశ్, గంగుల కమలాకర్, అరికెపూడి గాంధీ, సంజీవరావు, అర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ నుంచి ప్రాజెక్టుల పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లున్నాయి. ఈ కేంద్రానికి అనుబంధంగా వివిధ జిల్లాల్లో పది కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రాలున్నాయి. త్వరలో ఏర్పాటయ్యే స్టేట్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కార్యాలయం(ఇంటిగ్రేటెడ్ డేటా బేస్ ఫర్ రియల్ గవర్నెన్స్) కూడా దీనికి అనుసంధానంగా ఉంటుంది. -
చైన్ స్నాచర్లకు కళ్లెం
నగరంలో చైన్ స్నాచర్ల ఆటకట్టించడంలో పోలీసులు సఫలమయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈసారి స్నాచింగ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 2015లో మొత్తం 267 స్నాచింగ్ కేసులు నమోదవగా..ఈ ఏడాది నవంబర్ వరకు కేవలం 82 కేసులు నమోదయ్యారుు. దీంతో మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరవ్యాప్తంగా పోలీసులు భారీ ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం..కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో చైన్‌స్నాచర్లు తోకముడిచారు. సిటీబ్యూరో: సిటీలో వరుస ఉదంతాలతో ముచ్చెమటలు పట్టించిన చైన్ స్నాచర్లు తోకముడుస్తున్నారు... గతేడాదితో పోలిస్తే ఈ కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. సిటీ పోలీసులు అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలే దీనికి కారణమని స్పష్టమవుతోంది. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటు, పీడీ యాక్ట్ ప్రయోగం, కేసుల విచారణ వేగవంతం చేయడం తదితర చర్యలు ఫలితాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ముచ్చెమటలు పట్టించారు... సామాన్యుల నుంచి ప్రముఖుల కుటుంబాల వారిని స్నాచర్లు వదల్లేదు. ఓ పక్క స్థానిక ముఠాలు, మరోపక్క ఉత్తరాది నుంచి వచ్చివెళ్లే గ్యాంగులు ముచ్చెమటలు పట్టించారుు. ఉదయం, సాయంత్రం వేళల్లో విరుచుకుపడిన గొలుసు దొంగలు ఒకే రోజు వరుస ఉదంతాలకూ పాల్పడ్డారు. వీరిబారిన పడి ప్రాణాలు కోల్పోరుు, తీవ్రంగా గాయపడిన బాధితులు సైతం ఉన్నారు. ఈ రకంగా దాదాపు ఐదేళ్ల పాటు నగర ప్రజలతో పాటు పోలీసులకూ చైన్ స్నాచర్లు నరకం చూపించారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఫలితంగా గడిచిన మూడేళ్లుగా ఈ కేసుల్లో తగ్గుదల కనిపించింది. ఈసారి గణనీయమైన మార్పు... సిటీ కాప్స్ తీసుకుంటున్న చర్యల కారణంగా గడిచిన కొన్నేళ్లుగా చైన్ స్నాచింగ్ నేరాల్లో తగ్గుదల కనిపిస్తూ వచ్చింది. 2013లో 675, 2014లో 523 కేసులు నమోదయ్యారుు. గత ఏడాది నుంచీ ఈ నేరాలను ప్రత్యేకంగా పరిగణించిన నగర పోలీసులు గణనీయంగా తగ్గించాలని నిర్ణరుుంచుకున్నారు. దీంతో అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఓ పక్కన సంప్రదాయ పద్ధతులతో పాటు మరోపక్క సాంకేతిక పరిజ్ఞానాన్నీ విసృ్తతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది ఈ కేసుల సంఖ్య 267కు తగ్గింది. ఈ ఏడాది వీటి సంఖ్య 100కు మించకూడదనే లక్ష్యంతో ఆది నుంచీ చర్యలు తీసుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీలో స్నాచింగ్స సంఖ్య చెప్పుకొదగ్గ స్థారుులో తగ్గింది. ఈ ఏడాది నవంబర్ 18 వరకు కేవలం 82 కేసులు నమోదయ్యారుు. వీటిలోనూ గొలుసు దొంగతనాలకు సంబంధించినవి కేవలం 60 కేసులే. మిగిలిన 22 కేసులూ బ్యాగ్‌లు తదితరాలు లాక్కుపోవడం వంటి నేరాలపై నమోదయ్యారుు. పోలీసులు తీసుకున్న ప్రధాన చర్యలివి... ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటి సంఖ్య వీటన్నింటినీ బషీర్‌బాగ్‌లోకి కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానిస్తున్నారు. ఇప్పటికే వీటి సంఖ్య 10 వేలకు చేరింది. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ఈ కెమెరాలు ఉంటున్న నేపథ్యంలో ప్రతి ఉదంతానికి సంబంధించి ఏదో ఒక క్లూ దొరుకుతోంది. ఫలితంగా నేరగాళ్లను పట్టుకుని జైలుకు పంపడం తేలికై ంది. దీని ఫలితంగా కేసులు కొలిక్కివచ్చే శాతం కూడా గణనీయంగా పెరిగింది. మరోపక్క ఇలా చిక్కిన నేరగాళ్లల్లో వరుసగా నేరాలు చేసిన వారు ఉంటే వీరిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు. జైల్లో ఉండగానే శిక్షలుపడేలా... పీడీ యాక్ట్ ప్రయోగించడంతో నేరగాళ్లు 12 నెలల పాటు జైల్లోనే ఉంటున్నారు. నగర పోలీసులు గడిచిన రెండేళ్ల కాలంలో మొత్తం 530 మందిపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. వీరిలో 68 మంది స్నాచర్లే కావడం గమనార్హం. ఇలా ఏడాది పాటు వీరు జైల్లో ఉన్న సమయంలోనే కేసు విచారణ పూర్తరుు, శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఈ రకంగా లాంబా, ఫైజల్ లాంటి ఘరానా స్నాచర్లతో సహా మొత్తం 14మందికి కనిష్టంగా రెండేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్షలు పడ్డారుు. దీంతోపాటు విజుబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా స్నాచర్లను కట్టడి చేస్తున్నారుు. -
జలమండలిలో కమాండ్ కంట్రోల్ సెంటర్
పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు, మంచినీరు, డ్రెయినేజీ పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
సమస్తం.. బయో మెట్రిక్
పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ సంస్కరణల బాట సాక్షి, హైదరాబాద్ పోటీ పరీక్షల నుంచి ఉద్యోగం వచ్చి విధుల్లో చేరే వరకు అన్నింటా బయోమెట్రిక్ విధానం తెచ్చేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు నిర్వహించిన మూడు కేటగిరీల పరీక్షలకు బయోమెట్రిక్ విధానం అమలు చేసిన టీఎస్పీఎస్సీ.. ఇకపై అన్ని పరీక్షలకు దీన్ని తప్పనిసరి చేయనుంది. గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు నాలుగైదు లక్షల మంది అభ్యర్థులు హాజరైనా అంద రికీ బయోమెట్రిక్ విధానం అమలు చేయనుంది. అంతేకాదు.. ఉద్యోగం వచ్చిన వారు విధుల్లో చేరే సమయంలో వేలిముద్ర తీసుకోవడంతోపాటు వారి సర్వీసు రిజిస్టర్లలోనూ ‘థంబ్ ఇంప్రెషన్’ తప్పనిసరిగా ఉండే విధంగా కసరత్తు చేస్తోంది. సంస్కరణల పథంలో.. పరీక్షల నిర్వహణను టీఎస్పీఎస్సీ సంస్కరణ పట్టాలెక్కిస్తోంది. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, అర్హులకు అన్యాయం జరగకుండా చూసేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమైన, సాంకేతికపరమైన పోస్టులకు ఆన్లైన్ పరీక్షల విధానం (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు - సీబీఆర్టీ) అమల్లోకి తెచ్చింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అభ్యర్థుల వీడియో రికార్డింగ్ , వారి డిజిటల్ ఫొటోలు, సంతకాలు తీసుకోవడంతోపాటు వేలి ముద్రలు సైతం సేకరిస్తోంది. తద్వారా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా చూడొచ్చని, పరీక్షలకు హాజరైన వారే ఇంటర్వ్యూలకు వచ్చేలా చేయొచ్చని భావిస్తోంది. పరీక్ష కేంద్రంలో తీసుకునే ఫొటోలు, వేలి ముద్రలు, సంతకాలను ఇంటర్వ్యూ సమయంలో పోల్చి చూడటం ద్వారా పొరపాట్లకు ఎలాంటి అవకాశం ఉండదు. అలాగే ఇంటర్వ్యూలు లేని పరీక్షల్లో... పరీక్ష రాసిన వారెవరు? ఉద్యోగంలో చేరుతున్న వారెవరు? అన్న విషయాలను తేల్చేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడనుంది. ఉద్యోగంలో చే రిన తర్వాత వేలిముద్ర తీసుకుంటే మరింత మంచిదన్న ఆలోచనల్లో టీఎస్పీఎస్సీ ఉంది. వారి సర్వీసు రిజిస్టర్లో వేలిముద్ర ఉంటే ఏ దశలోనైనా క్రాస్ చెక్ చేయొచ్చని భావిస్తోంది. ప్రతి పరీక్ష హాల్లో సీసీటీవీ పోటీ పరీక్ష నిర్వహించే ప్రతి గదిలో సీసీటీవీలు ఉండేలా చూడాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుతం ప్రతి తరగతి గదిలో సీసీటీవీ ఉన్న కాలేజీల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ర్యాగింగ్ నిరోధంలో భాగంగా ప్రతి కాలేజీ.. అన్ని తరగతి గ దుల్లో సీసీటీవీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ద్వారా ఈ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. ఫలితంగా భవిష్యత్తులో పరీక్షలన్నింటినీ నిఘా నేత్రం నీడన నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని యోచిస్తోంది. సీబీఆర్టీలో ఎన్నో ప్రత్యేకతలు టీఎస్పీఎస్సీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ టెస్టు (ఆన్ లైన్) పరీక్ష విధానాన్ని తీసుకువచ్చింది. దీనిద్వారా నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి నెల రోజుల్లో పరీక్షలను పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా చర్యలు చేపట్టింది. అంతేకాదు పరీక్ష జరిగిన మరుసటి రోజే అభ్యర్థులు వారి జవాబు పత్రాలు పొందేలా వీలు కల్పిస్తోంది. కమిషన్ ఇచ్చే ప్రత్యేక లింకు ద్వారా అభ్యర్థులు వారి జవాబు పత్రాన్ని పొందవచ్చు. అలాగే జవాబుల కీని కూడా పరీక్ష మరుసటి రోజే ప్రకటిస్తోంది. అంతేకాకుండా పరీక్ష సమయంలో అభ్యర్థులు మొదట ఒక ఆప్షన్‌ను ఎంచుకొని, ఆ తర్వాత మార్చుకునే వీలు కల్పిస్తోంది. చివరగా ఫైనల్ సబ్మిట్ ఆప్షన్‌ను అందిస్తోంది. ఇందులో మరో సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది. పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులు ఐదు నిమిషాలు కనుక రాయకుండా (మౌస్ ద్వారా ఆప్షన్లు క్లిక్ చేయకుండా ఉంటే) ఉంటే ఆటోమెటిక్‌గా కనెక్షన్ నిలిచిపోతుంది. సదరు అభ్యర్థి మళ్లీ కొనసాగించాలంటే.. పరీక్ష కేంద్రంలోని అబ్జర్వర్ ఓకే చెప్పాలి. దీంతో ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు వచ్చి పరీక్ష రాసే వీలు ఉండదు. ప్రస్తుతం సీబీఆర్టీని 30 వేల లోపు దరఖాస్తులు వచ్చిన పరీక్షలకే అమలు చేసే సదుపాయాలు ఉన్నాయి. ఐటీ శాఖ నేతృత్వంలో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, కంప్యూటర్లు ఏర్పాటు చేయడం, తెలంగాణ స్టేట్ డాటా సెంటర్ ఏర్పాటు చేసి, టీఎస్పీఎస్సీ పరీక్షలను దాంతో అనుసంధానం చేస్తే ఎన్ని వేల మందికైనా ఆన్ లైన్ పరీక్షలను సులభంగా నిర్వహించవచ్చని యోచిస్తోంది. ప్రశ్నజవాబులన్నీ జంబ్లింగే! ఒకరి పేపర్ మరొకరు చూసి రాసేందుకు వీల్లేకుండా పరీక్షల్లో ప్రతి ప్రశ్న, ప్రతి జవాబును కూడా కమిషన్ జంబ్లింగ్ విధానంలోనే ఇస్తోంది. పరీక్ష హాల్లో ఏ ఒక్క అభ్యర్థి పేపరులోని ప్రశ్నలు, అప్షన్ల వరుస క్రమం మరో విద్యార్థికి ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు, జవాబుల ఆప్షన్లతో కలువకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పక్కా పర్యవేక్షణ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పక్కా పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. పరీక్ష కేంద్రంలో ఏం జరిగినా వెంటనే కమాండ్ సెంటర్లో తెలిసిపోయేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసింది. ఏదైనా కేంద్రంలో ఒక విద్యార్థి పరీక్ష రాయడం ఆపేసినా వెంటనే ఇక్కడి తెలిసేలా చర్యలు చేపట్టింది. తద్వారా ఏ సమస్య వచ్చినా వెంటనే చర్యలు చేపట్టవచ్చని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. -
క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు
= ఐటీ ఉద్యోగుల భద్ర తా చర్యల్లో భాగంగా పోలీసుల ఏర్పాటు =కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ =మూడు డిజిట్లతో త్వరలో సహాయ ఫోన్ నంబర్ సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఉద్యోగుల భద్రతా చర్యల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు క్యాబ్‌లు, ఆటోలకు ప్రత్యేక నంబర్ (నాలుడు డిజిట్ల)ను కేటాయిస్తున్నారు. ఇందుకుగాను డ్రైవర్లకు ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తులను కూడా ఇప్పటికే అందజేశారు. వీరంతా డిసెంబర్ 31వ తేదీలోగా నంబర్‌ను పొందాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. దరఖాస్తులో వాహనం యజమాని పేరు, చిరునామాతో పాటు సెల్‌నెంబర్, డ్రైవర్ పేరు, చిరునామాతో పాటు సెల్‌నెంబర్ తదితర వివరాలు పూరించాలి. వచ్చిన దరఖాస్తులన్నింటికీ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్‌ను కేటాయిసా ్తరు. ఈ నంబర్‌ను క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు త మ వాహనంపై లోపల, బయట రాసుకోవాలి. ఏదైనా సంఘటన చోటుచేసుకున్నప్పుడు బాధితులు చెప్పిన నంబర్ ఆధారంగా డ్రైవర్, వాహన యజమాని వివరాలు క్షణాల్లో పోలీసులకు ప్రత్యక్ష మవుతాయి. దీంతో పాటు అం దరి వివరాలు, ప్రత్యేక నంబర్ల వివరాలన్నింటి నీ సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్‌తో పాటు సెక్యురిటీ కౌన్సిల్ వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ అభయ ఘటన తరువాత రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు మరో కొత్త ప్రతిపాదన చేశారు. ఆయా ఐటీ కంపెనీలు కాల్సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కాల్‌సెంటర్ల వల్ల తరచూ ఫిర్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నందున గచ్చిబౌలిలోని కమిషనర్ కార్యాలయంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పోలీసులు, సెక్యురిటీ కౌన్సిల్ ఒక నిర్ణయానికి వచ్చారు. సులువుగా నంబర్ గుర్తుండేవిధంగా మూడు డిజిట్ల నంబర్‌ను త్వరలో కేటాయిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న కెమెరాలతో పాటు మరో వంద కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించడంతో ఇందుకు సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు. ఆర్టీసీకి మూడు ప్రాంతాల అప్పగింత బస్సులను నిలిపేందుకు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలో మూడు ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాలను ఏపీఐఐసీ ఆర్టీసీకి కేటాయించింది. ఉద్యోగులు డ్యూటీకి వెళ్లేటప్పుడు, ముగించుకునే సమయాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. మిగతా సమయంలో డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను వారికి కేటాయించిన ప్రాంతాలలో పార్కింగ్ చేసి విశ్రాంతి తీసుకుంటారు.