
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ట్రూనాట్ కిట్‌ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేస్తున్నారని, ఇకపై ట్రూనాట్ ద్వారా పరీక్షలు చేయాలన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పెండింగ్ కేసులకు తక్షణమే నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. 104 కాల్ సెంటర్‌పై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.
నేడు సెకండ్ డోసు మాత్రమే..
గురువారం కరోనా టీకా రెండో డోసు మాత్రమే వేస్తున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోసు ఎవరికీ వెయ్యరని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment