క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు | Cab special numbers | Sakshi
Sakshi News home page

క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు

Published Thu, Nov 14 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

Cab special numbers

= ఐటీ ఉద్యోగుల భద్ర తా చర్యల్లో భాగంగా పోలీసుల ఏర్పాటు
  =కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్
  =మూడు డిజిట్లతో త్వరలో సహాయ ఫోన్ నంబర్

 
 సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఉద్యోగుల భద్రతా చర్యల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు క్యాబ్‌లు, ఆటోలకు ప్రత్యేక నంబర్ (నాలుడు డిజిట్ల)ను కేటాయిస్తున్నారు. ఇందుకుగాను డ్రైవర్లకు ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తులను కూడా ఇప్పటికే అందజేశారు. వీరంతా డిసెంబర్  31వ తేదీలోగా నంబర్‌ను పొందాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. దరఖాస్తులో వాహనం యజమాని పేరు, చిరునామాతో పాటు సెల్‌నెంబర్, డ్రైవర్ పేరు, చిరునామాతో పాటు సెల్‌నెంబర్ తదితర వివరాలు పూరించాలి. వచ్చిన దరఖాస్తులన్నింటికీ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్‌ను కేటాయిసా ్తరు.

ఈ నంబర్‌ను క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు త మ వాహనంపై లోపల, బయట రాసుకోవాలి. ఏదైనా సంఘటన చోటుచేసుకున్నప్పుడు బాధితులు చెప్పిన నంబర్ ఆధారంగా డ్రైవర్, వాహన యజమాని వివరాలు క్షణాల్లో పోలీసులకు ప్రత్యక్ష మవుతాయి. దీంతో పాటు అం దరి వివరాలు, ప్రత్యేక నంబర్ల వివరాలన్నింటి నీ సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్‌తో పాటు సెక్యురిటీ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరుస్తారు.
 
త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్

 అభయ ఘటన తరువాత రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు మరో కొత్త ప్రతిపాదన చేశారు. ఆయా ఐటీ కంపెనీలు కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కాల్‌సెంటర్ల వల్ల తరచూ ఫిర్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నందున గచ్చిబౌలిలోని కమిషనర్ కార్యాలయంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పోలీసులు, సెక్యురిటీ కౌన్సిల్ ఒక నిర్ణయానికి వచ్చారు. సులువుగా నంబర్ గుర్తుండేవిధంగా మూడు డిజిట్ల నంబర్‌ను త్వరలో కేటాయిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న కెమెరాలతో పాటు మరో వంద కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించడంతో ఇందుకు సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు.
 
ఆర్టీసీకి మూడు ప్రాంతాల అప్పగింత

 బస్సులను నిలిపేందుకు హైటెక్  సిటీ పరిసర ప్రాంతాలలో మూడు ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాలను ఏపీఐఐసీ ఆర్టీసీకి కేటాయించింది. ఉద్యోగులు డ్యూటీకి వెళ్లేటప్పుడు, ముగించుకునే సమయాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. మిగతా సమయంలో డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను వారికి కేటాయించిన ప్రాంతాలలో పార్కింగ్ చేసి విశ్రాంతి తీసుకుంటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement