Cabs
-
అమాంతంగా పెరిగిన క్యాబ్ చార్జీలు...
హైదరాబాద్: ఆటోలు, క్యాబ్‌లు ప్రయాణికులను ఠారెత్తిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆటోవాలాలు, క్యాబ్‌వాలాలు చార్జీలను రెట్టింపు చేసి ప్రయాణికులపైన నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు బుకింగ్‌లలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. అత్యవరస పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయించే వారు గంటల తరబడి పడిగాపులు కాయవలసి వస్తోంది. చివరి నిమిషంలో క్యాబ్ బుక్ అయినా డబుల్ చార్జీలు చెల్లించుకోవలసి వస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అనేక చోట్ల రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజారవాణా అస్తవ్యవస్థమైంది. పలు మార్గాల్లో సిటీ బస్సుల రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. దీంతో ఉదయాన్నే విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించారు. సాధారణ రోజుల్లో తార్నాక నుంచి సికింద్రాబాద్‌కు ఆటోలో వెళ్లేందుకు రూ.120 కంటే ఎక్కువ ఉండదు. కానీ మంగళవారం ఏకంగా రూ.250 వరకు చెల్లించవలసి వచ్చినట్లు రమేష్ అనే ప్రయాణికుడు తెలిపారు. బోడుప్పల్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు ఓలా ఆటో సాధారణంగా అయితే రూ.60 నుంచి రూ.80కి లభిస్తుంది. కానీ వర్షం కారణంగా ఏకంగా రూ.150 దాటింది. ఇక సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, బేగంపేట్, తదితర రైల్వేస్టేషన్లకు చేరుకున్న దూరప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమాంతంగా పెరిగిన క్యాబ్ చార్జీలు... సాధారణ రోజుల్లోనే ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ పేరిట క్యాబ్ సంస్థలు అడ్డగోలుగా చార్జీలు పెంచేస్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో క్యాబ్‌ల కొరతను సాకుగా చూపుతూ చార్జీలను రెట్టింపు చేశారు. తార్నాక నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు సాధారణ రోజుల్లో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంటే మంగళవారం ఇది రూ.870 కి చేరినట్లు ఒక ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. ఐటీ నిపుణులు, ఉద్యోగులు, ఉదయం పూట ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వెళ్లే ఉద్యోగుల ఒత్తిడి కారణంగా క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమీర్‌పేట్ వరకు రూ.1650 వరకు వసూలు చేసినట్లు ఒక ప్రయాణికురాలు విస్మయం వ్యక్తం చేశారు. మెట్రో కిటకిట... మెట్రో రైళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. వర్షం దృష్ట్యా చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం, సాయంత్రం ఎక్కువ మంది మెట్రోలపైన ఆధారపడి ప్రయాణం చేశారు. దీంతో రెండు రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య సుమారు 5.50 లక్షలకు చేరినట్లు అంచనా. ప్రతి 3 నిమిషాలకో మెట్రో రైలు నడిపించారు. -
క్యాబ్ సర్వీస్ సంస్థలకు భారీ షాక్: హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
క్యాబ్ సంస్థలు ఎడాపెడా దోచేస్తున్నాయి. పీక్ అవర్స్, ఏసీ ఆన్ చేస్తే డబ్బులంటూ ప్రయాణికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కస్టమర్లకు తలెత్తున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సూచించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం..కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్యాబ్ సర్వీస్ సంస్థలైన ఓలా,ఉబెర్,జుగ్నూ,మేరు సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్ సర్వీస్ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్ ప్రైసింగ్ అల్గారిథమ్, డ్రైవర్స్, పేమెంట్స్ స్ట్రెక్చర్స్ వివరాల్ని వెంటనే అందించాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుల వెల్లువ డిమాండ్ పేరుతో క్యాబ్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. అత్యవసరంగా పనిపై బయటికెళ్లాలంటే మండే ఎండలకు భయపడి ఏసీ ఆన్ చేస్తే చార్జీల మోత మోగిస్తున్నాయి. అడిగే అవకాశం లేక, నియంత్రించే మార్గం లేకపోవడంతో ఆయా సంస్థలు ప్రయాణికుల్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. పీక్ అవర్సే కాదు..సాధారణ సమయాల్లో సైతం అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఆ ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం..తాజాగా క్యాబ్ సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ,“వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేలా క్యాబ్ అగ్రిగేటర్లను హెచ్చరించాం. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు ఛార్జీల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నాయి గత నెలలో లోకల్ సర్కిల్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 ఉన్నప్పటికీ డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు రైడ్ క్యాన్సిలేషన్ చేస్తున్నారని,అందుకు అదనంగా తమ వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు 71 శాతం మంది కస్టమర్లు ఫిర్యాదు చేయగా, 45 శాతం మంది యాప్ ఆధారిత టాక్సీ వినియోగదారులు తమకు సర్జ్ ప్రైసింగ్‌లో 1.5 రెట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ నివేదికలో తేలింది. చదవండి👉 క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
అమ్మ బాబోయి.. 17 కిమీ దూరానికి ఉబర్‌లో ధరెంతో తెలిసి షాక్ అయిన కస్టమర్?
సాదారణంగా మనం ఉబర్ క్యాబ్‌ల ప్రయాణించినప్పుడు ధరలు ఇతర వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి. మహా అయితే ఈ ధరలు ఒక వంద రూపాయలో లేదా 2 వందలో ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మన చెప్పుకోబోయే స్టోరీ గురుంచి తెలిస్తే షాక్ అవుతారు.. డిసెంబర్ 27న, మాంచెస్టర్ సిటీకి చెందిన సామ్ జార్జ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీకి నైట్ క్లబ్ కు వెళ్లాడు. ఆ రాత్రి అతనికి చాలా ఆలస్యమైంది. చాలా రాత్రి కావడంతో తను ఇంటికి క్యాబ్‌లో వెళ్లాలని అనుకున్నాడు. అతని ఇల్లు నైట్ క్లబ్ నుంచి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, అర్ధరాత్రి కవడంతో క్యాబ్‌లు ఎక్కువగా అందుబాటులో లేవు. దీంతో సామ్ స్నేహితులు అనేక సంస్థలకు చెందిన క్యాబ్‌ల కోసం ప్రయత్నించారు. కానీ, ఏదీ అందుబాటులో లేకపోవడంతో సామ్ ఉబర్ క్యాబ్ సేవలను వినియోగించుకోవాలని భావించాడు. ఆ రాత్రి తను, అతను ఫ్రెండ్స్ కలిసి ఉబెర్ ఎక్స్ఎల్ లేదా ఎస్యువి కారులో అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి తాగిన మందు కిక్ దిగిన తర్వాత మరుసటి రోజు యాప్ లో క్యాబ్ ఛార్జీలను చూసి ఒక్కసారిగా అతను ఆశ్చర్యపోయాడు. క్యాబ్ సంస్థ ఆ యువకుడికి కేవలం 17 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10,000 వసూలు చేసింది. అర్థరాత్రి సమయంలో ఇంటికి చేరుకోవడానికి అరగంట కంటే తక్కువ సమయం పడుతుంది. పార్టీకి అయిన ఖర్చుతో పోలిస్తే క్యాబ్‌కు అయిన ఖర్చు ఎక్కువ. ముందుగానే, ఈ ప్రయాణానికి సంబంధించిన ధరలను యాప్ లో చూపించినట్లు ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ యువకుడు చాలా మత్తులో ఉండటంతో క్యాబ్ ధరంతో తెలియలేదు. (చదవండి: 17 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్..!) -
న్యూ ఇయర్ 2022: క్యాబ్ బుకింగ్ రద్దు చేస్తే జరిమానా..
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పరిమితులు, మార్గదర్శకాలను విడుదల చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి. వాహన డ్రైవర్లు ప్రయాణికుల బుకింగ్‌లను రద్దు చేస్తే . ఈ– చలాన్ రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా క్యాబ్, ఆటో బుకింగ్స్‌ను రద్దు చేస్తే సైబరాబాద్ పరిధిలో అయితే 94906 17346, రాచకొండ పరిధిలో అయితే 94906 17111కు వాహనం, సమయం, ప్రాంతం వంటి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు. ఓఆర్ఆర్పై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు (విమాన టికెట్‌ను చూపించాలి) మినహా ప్యాసింజర్, తేలికపాటి వాహనాలకు అనుమతి లేదు. మీడియం, గూడ్స్ వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు మినహా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మీదకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. చదవండి: (Hyderabad: రాత్రి పది తర్వాత అడుగడుగునా తనిఖీలు) క్లబ్, పబ్ నిర్వాహకులూ బాధ్యులే.. బార్, క్లబ్, పబ్‌లలో మద్యం తాగి వాహనం నడిపి ఏదైనా ప్రమాదాలకు కారణమైతే వాహనదారులతో పాటూ సంబంధిత బార్, క్లబ్, పబ్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తాగి వాహనం నడిపే బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, హారన్, ట్రిపుల్, మల్టీఫుల్ రైడింగ్ వంటి వాటిపై కేసులు నమోదు చేస్తారు. -
వారి దోపిడీకి.. తెల్ల బోవాల్సిందే..!!
పట్నంబజారు (గుంటూరు తూర్పు): ఆంధ్ర ప్రదేశ్‌లోని జిల్లాలోని ప్రైవేటు ట్రావెల్స్ వ్యాపారులు కొందరు యథేచ్చగా ట్రాన్స్పోర్ట్ దందా సాగిస్తున్నారు. వైట్‌బోర్డు మాటున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొండుతున్నారు. ఎల్లో బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. సొంత అవసరాల పేరుతో వాహనాలను కొనుగోలు చేసి అద్దె ట్యాక్సీలు తిప్పుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లను నియమించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: దారుణం: చపాతీ కర్రతో అత్తను హత్యచేసిన కోడలు అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని రోడ్డు, పర్మిట్ పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైట్‌బోర్డు పెట్టుకుని కమర్షియల్ వాహనాలు సంచరిస్తున్నాయి. ఎల్లో బోర్డు వాహనాల కంటే ఇవే అధికంగా తిరుగుతున్నాయి. పలువురు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు వైట్‌బోర్డు ముసుగులో టాక్సీలు, క్యాబ్‌లను అద్దెకు తిప్పుతున్నారు. ప్రభుత్వాన్ని రూ. కోట్లలో పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. దందా ఇలా...! ట్రాన్స్‌పోర్టు వినియోగానికి కొనుగోలు చేసిన వాహనాలకు రవాణా శాఖ ఎల్లో బోర్డుతో (మాక్సీక్యాబ్) రిజిస్టేషన్ నంబరు జారీ చేస్తుంది. అదే సొంతంగా కొనుగోలు చేస్తే.. వైట్ నెంబర్ ప్లేటు కేటాయిస్తారు. ఇందులో ఎల్లో బోర్డు వాహనానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వైట్ బోర్డు వెహికల్ అయితే రిజిస్టేషన్ సమయంలో ఒకేసారి లైఫ్‌ట్యాక్స్ చెల్లిస్తే చాలు. ఈ నిబంధనను తమకు అనువుగా మలచుకున్న ట్రావెల్స్ వ్యాపారులు వైట్ బోర్డు కింద వాహనాలు తీసుకుని ట్యాక్సీలుగా అద్దెకు తిప్పుకుంటున్నారు. ప్రధానంగా 4–1 సీటింగ్ సామర్ధ్యంతో ఉన్న వైట్ బోర్డు వాహనాలు పెద్ద సంఖ్యలో ట్యాక్సీలుగా రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో 40 వేలకు పైగా వాహనాలు వైట్ నంబర్ ప్లేటుతో తిరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 2958 మాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి. ట్యాక్స్ ఎగవేతకే.. ప్రైవేటు ట్రావెల్స్ వారు త్రైమాసిక పన్నుతో పాటు రోడ్డు టాక్స్, చెక్‌పోస్టుల్లో పర్మిట్ చార్జీలను తప్పించుకునేందుకే తమ వాహనాలను వైట్‌బోర్డు ముసుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొండుతున్నారు. మామూలుగా టూరిస్టు బోర్డు (టీ–బోర్డు) ఎల్లో బోర్డు వాహనాలు ఏటా రవాణా శాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) పొందాల్సి ఉంటుంది. అదే వైట్‌బోర్డు వాహనాలైతే రిజిస్టేషన్ అయిన తరువాత 15 ఏళ్ల వరకు ఎఫ్‌సీ అవసరం ఉండదు. ట్రావెల్స్ యజమానుల దందా కారణంగా ఏటా సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందనే తెలుస్తోంది. మొక్కుబడిగా తనిఖీలు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో వైట్ బోర్డులు తగిలించుకున్న ట్యాక్సీలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. కొంత మంది అధికారులు ఎల్లో నంబర్ ప్లేటును సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇటీవల ఆర్డీవో, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇటువంటి వాస్తవాలు బయట పడ్డ కనీసం, అధికారుల్లో మాత్రం చలనం కరవైందనే చెప్పాలి. ఎల్లో ప్లేట్ మొదలు ఉదాహరణకు ఏపీ 39 తరువాత ‘టీ’తో మొదలయ్యే ప్రతి వాహనం ట్యాక్సీ ప్లేట్ అని స్పష్టం చేస్తోంది. అవి సైతం వైట్ ప్లేటుగా మార్చుకుని అధికారులే నేరుగా తిరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ట్రావెల్స్తో మిలాఖత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రావెల్స్‌కు సంబంధించి వైట్ ప్లేట్ (ఓన్ప్లేట్) వాహనాలు తిరుగుతున్నాయని తెలిసినప్పటికీ అధికారులు మిన్నకుండి పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. దీనికి సంబంధించి ఆయా డివిజన్ అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్ యజమానులతో పాటు, పలు బస్సుల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనేది సమాచారం. తనిఖీలు చేపడతాం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడతాం. పూర్తిస్థాయిలో ట్రావెల్స్‌పై దృష్టి సారించి, ప్రైవేట్ వాహనాలు ట్రావెలింగ్కు తిరగకుండా నిరోధిస్తాం. అయితే ప్రయాణికులు సైతం ఎల్లో ప్లేటు ఉన్న వాహనాలను మాత్రమే, ప్రయాణానికి వినియోగించాలని కోరుతున్నాం. దానివలన ప్రమాదవశాత్తూ.. ఏదైనా జరిగినా ఇన్సురెన్స్ వర్తిస్తుంది. వైట్ ప్లేటులో ఇన్సూరెన్స్ ప్రయాణికులకు వర్తించదు. అధికారులకు ఎటువంటి అవినీతికి పాల్పడినా.. సహించం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. – ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ, గుంటూరు చదవండి: శీతాకాల అతిథులొచ్చేశాయ్! -
‘వైట్’పై ఎల్లో జర్నీ.. ఏమిటీ వైట్ ప్లేట్..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొన్ని ట్యాక్సీ వాహనాలు, క్యాబ్‌లు మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. పన్నులు ఎగవేసేందుకు ఎల్లో నెంబర్ ప్లేట్ స్థానంలో వైట్ నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నాయి. ఆర్టీఏలో వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని..ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా త్రైమాసిక పన్నులు, రాష్ట్రాల సరిహద్దులు దాటినప్పుడు అంతర్రాష్ట్ర పన్నులు చెల్లించి తిరిగే రవాణా వాహనాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికే కోవిడ్ కారణంగా ట్రావెల్స్ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా ఈ తరహా ఉల్లంఘనల వల్ల మరింత నష్టపోవలసి వస్తోందని ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 వేల వాహనాలు ఇలా వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని తిరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని వాహనాలు రవాణా రంగానికి చెందినవిగానే నమోదు చేసుకున్నప్పటికీ అంతర్రాష్ట్ర పన్నుల ఎగవేత కోసం వైట్ నెంబర్ ప్లేట్‌ను వినియోగిస్తున్నాయి. కోవిడ్‌తో సంక్షోభం... గత 16 నెలలుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పర్యాటక, ఐటీ రంగాలు పూర్తిగా స్తంభించడం, ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రవాణా కోసం వినియోగించే అన్ని రకాల ట్యాక్సీలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, తదితర వాహనాల నిర్వాహకులు త్రైమాసిక పన్నుల నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈఎంఐలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న తాము పన్నులు కట్టలేమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రవాణాశాఖ త్రైమాసిక పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచి్చనట్లుగానే ఈ ఏడాది కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు ట్రావెల్స్ సంస్థల ఆందోళన ఇలా కొనసాగుతుండగా కొంతమంది మాత్రం మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి వైట్ నెంబర్ ప్లేట్‌పై తిరగడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఏ నిర్లక్ష్యం... ఎల్లో నెంబర్ ప్లేట్‌పైన తిరగవలసిన వాహనాలు అందుకు విరుద్దంగా వైట్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకొని ప్రయాణికులను తరలిస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే వేలాది వాహనాలు ఇలా తిరుగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఏమిటీ వైట్ ప్లేట్... వ్యక్తిగత వాహనాల కోసం రవాణాశాఖ వైట్ నెంబర్ ప్లేట్‌ను కేటాయించింది. దీనిపైన నలుపు రంగులో వాహనం నెంబర్ నమోదై ఉంటుంది. ఈ వాహనాలపైన ఒకేసారి జీవితకాల పన్ను రూపంలో చెల్లిస్తారు. ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాలు మాత్రం వాణిజ్య వాహనాలుగా నమోదై ఉంటాయి. వీటికి పసుపు రంగు నెంబర్‌ప్లేట్ (ఎల్లో ప్లేట్)పైన నలుపు రంగంలో నెంబర్లు నమోదై ఉంటాయి. ఈ వాహనాలు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఈ పన్ను మొత్తం ఉంటుంది. -
షీ ట్యాక్సీ ..స్పందన నాస్తి..
ఆదిలాబాద్: మహిళల భద్రతకు ప్రవేశపెట్టిన 24/7 షీ–ట్యాక్సీ పథకానికి జిల్లాలో ఆదరణ కరువైంది. దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసింది. సింగిల్ డిజిట్‌లోనే దరఖాస్తులు వచ్చాయి. ఆదరణ కరువా.. ప్రచార లోపమో.. తెలియదు కానీ జిల్లా మొత్తంగా కేవలం నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళ డ్రైవర్లుగా ట్యాక్సీలు నడిపేందుకు ప్రభుత్వం సబ్సిడీపై కార్లను అందజేస్తోంది. మహిళలు, విద్యార్థినులు, ఒంటరిగా ప్రయాణం చేసే యువతులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు మహిళ డ్రైవర్ల ద్వారా వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మెట్రో నగరాల్లోనే దీనికి ఆదరణ ఉంటుందని, పట్టణాల్లో దీనిపై ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రచార లోపమే కారణమా.. మహిళ, శిశు సంక్షేమ శాఖ, రవాణ శాఖల ద్వారా భారతీయ స్టేట్ బ్యాంక్ సౌజన్యంతో మహిళ డ్రైవర్లుగా ఆసక్తి ఉన్న అభ్యర్థినులకు షీ–టీమ్ స్కీమ్ ద్వారా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 35శాతం సబ్సిడీ, 10శాతం మార్జిన్ మనీ మొత్తం కలిపి 45శాతం సబ్సిడీ అందచేస్తారు. మిగితా మొత్తం అభ్యర్థినిలే వెచ్చించాలి. ఆ అభ్యర్థులకు యాశోద దీదీత ఫౌండేషన్ ద్వారా సాంకేతిక శిక్షణ ఇప్పిస్తారు. ఆసక్తి ఉన్న మహిళలు మొదట దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ తర్వాత వాహనం సమకూర్చుతారు. ఈ పథకంపై సరైన ప్రచారం లేక దరఖాస్తుకు ముందుకు రాలేదు. మహిళ, శిశు సంక్షేమ శాఖాధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమై చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. అసలు ఈ పథకంపై ఈ శాఖలోని వివిధ ప్రాజెక్టు అధికారిణిలకే అవగాహన లేకపోవడం గమనార్హం. ఆయా ప్రాజెక్టుల్లోని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఈ పథకానికి సంబంధించి ప్రచారం చేపట్టి ఉంటే దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉండేదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. పట్టణంలో ఆదరణ తక్కువే షీ–ట్యాక్సీ పథకానికి జిల్లాలో అభ్యర్థులు ఆసక్తి కనబర్చలేదు. ప్రధానంగా మెట్రో నగరాల్లో దీనికి డిమాండ్ ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులకు 45శాతం సబ్సిడీ వర్తించనుంది. అదేవిధంగా శిక్షణ కూడా ఇస్తాం. – మిల్కా, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి, ఆదిలాబాద్ చదవండి: మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ -
గ్రేటర్ హైదరాబాద్‌లో క్యాబ్ డౌన్!
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో అన్ని వర్గాల ప్రయాణికులకు అందుబాటులో ఉన్న క్యాబ్‌లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏడాది కాలంగా చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణం. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ క్యాబ్‌ల మనుగడపైన భారీ దెబ్బ కొట్టింది. ఆ తరువాత నిబంధనల సడలింపుతో క్రమంగా వాహనాలు రోడ్డెక్కినప్పటికీ ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో భారీగా కురిసిన వర్షాలతో క్యాబ్ రంగం కుదేలైంది. సుమారు 5 వేల వాహనాలు నీటమునిగి వినియోగానికి పనికి రాకుండా పోయాయి. థర్డ్ పార్టీ ఇన్సూ్యరెన్స్ కలిగిన ఈ క్యాబ్‌లకు పరిహారం లభించలేదు. మరోవైపు ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థల నుంచి సరైన కమీషన్లు లభించక చాలా మంది డ్రైవర్లు ఈఎంఐలు చెల్లించలేక వాహనాలను వదులుకున్నారు. ఓలా సంస్థ స్వయంగా 3 వేల లీజు వాహనాలను డ్రైవర్ల నుంచి జప్తు చేసినట్లు తెలంగాణ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా క్యాబ్‌లపై జరిగిన ముప్పేట దాడి కారణంగా వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గ్రేటర్లో 40 వేల క్యాబ్లే... కోవిడ్‌కు ముందుకు సుమారు 1.2 లక్షలకు పైగా క్యాబ్‌లు నగరంలో తిరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకే ప్రతి రోజు 10 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో క్యాబ్‌లకు కూడా డిమాండ్ తగ్గింది. అలాగే ఐటీ సంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఒకప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఐటీ రంగాన్ని నమమ్ముకొని వాహనాలు కొనుగోలు చేశారు. ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమయ్యారు. క్యాబ్ సంస్థలు కమీషన్లను తగ్గించినప్పటికీ క్యాబ్ డ్రైవర్లు రవాణా రంగాన్ని మాత్రం వదులుకోలేదు. కానీ ఏడాది కాలంగా ఐటీ కార్యకలాపాలు ఇంటి నుంచే సాగుతుండడంతో ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరువాత తిరిగి 60 వేల క్యాబ్‌లు రోడ్డెక్కాయి. కానీ భారీ వర్షాలు దెబ్బతీసాయి. సుమారు 5 వేల క్యాబ్‌లు నీటమునిగి వినియోగానికి రాకుండా పాడయ్యాయి. ఇలా అనేక కారణాల వల్ల క్యాబ్లసంఖ్య సిటీలో సుమారు 40 వేలకు పడిపోయింది. చార్జీలు పెంచితేనే మనుగడ.. ఈ క్రమంలో కర్ణాటక తరహాలో కిలోమీటర్ ప్రాతిపదికన చార్జీలను పెంచాలని క్యాబ్ అసోసియేషన్లు కోరుతున్నాయి. ప్రస్తుతం నగరంలో కిలోమీటర్‌కు రూ.10 నుంచి రూ.12 మాత్రమే లభిస్తుంది. దీనిని కిలోమీటర్‌కు రూ.17 చొప్పున పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘ ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఓలా, ఉబెర్ సంస్థలు కమిషన్లలో భారీగా కోత విధించాయి. దీంతో మా మనుగడే ప్రశ్నార్ధకమైంది’ అని తెలంగాణ క్యాబ్ అండ్ ట్రావెల్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కన్వీనర్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లి బృందంతో బస్సు.. డ్రైవర్‌కి ఫిట్స్ -
క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. క్యాబ్ డ్రైవర్ల తరుపున న్యాయవాది రాపోలు భాస్కర్ పిల్‌ను వేశారు. పిటిషనర్ తరుపు వాదనలను సీనియర్ అడ్వకేట్ మాచర్ల రంగయ్య వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషనర్ కోరారు. లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఉపాధి లేక క్యాబ్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికి ఈఎంఐ కట్టాలని బ్యాంక్‌లు ఒత్తిడి తెస్తున్నాయని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈఎంఐలు కట్టలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు జూన్ 5న క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్5కు కోర్టు వాయిదా వేసింది. (‘అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు’) -
కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!
కొచ్చి: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడికి చేసేందుకు కేరళ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ట్యాక్సీలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల్లో తిరిగి వస్తున్న వారిని తరలించేందుకు ఈ ట్యాక్సీలను వినియోగించనున్నారు. కారు లోపల ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య ప్లాస్టిక్ షీట్లతో పారదర్శక విభజన ఏర్పాటు చేశారు. పారదర్శక విభజనలతో కారు లోపల భౌతిక దూరం పెరగడంతో పాటు తుమ్మినా, దగ్గినా మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఎర్నాకుళలం జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు పారదర్శక విభజనలు ఏర్పాటు చేసినట్టు ఎంజీఎస్ లాజిస్టిక్స్ సంస్థ వెల్లడించింది. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..) కాగా, పటిష్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తిని కేరళ సమర్థవంతంగా కట్టడి చేస్తోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణింకాల ప్రకారం కేరళలో ఇప్పటివరకు 512 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా, నలుగురు చనిపోయారు. కోవిడ్-19 నుంచి 489 మంది కోలుకున్నారు. (కరోనాను అడ్డుపెట్టుకుని అణచివేస్తారా?) -
మంటల్లో చిక్కుకున్న కారు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. సుచిత్ర సమీపంలో ఓలా క్యాబ్ మంటల్లో చిక్కుకుంది. నడిరోడ్డుపైనే కారు పూర్తిగా దగ్దమైంది. అందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంజిన్ వేడెక్కి కారులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. -
సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎస్సీ క్యాబ్స్
సాక్షి, హైదరాబాద్ ఎస్సీ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఆ కార్పొరేషన్ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే శిక్షణ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ఆ శాఖ.. క్యాబ్‌ల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. దీనికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో జతకడుతోంది. శిక్షణ పొంది, అనుభవం ఉన్న వారికి నేరుగా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు వాహనాలను కొనుగోలు చేసేందుకు కార్ల కంపెనీలతో మంతనాలు జరుపుతోంది. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేసి.. వచ్చే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టనుంది. 2017–18లో వెయ్యి యూనిట్ల గ్రౌండింగ్‌కు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. నిర్వహణకు ప్రాధాన్యత... రెండేళ్ల క్రితం కార్ల పథకాన్ని అమలు చేసినప్పటికీ ఎస్సీ శాఖ నిర్వహణ లోపంతో విఫలం చెందింది. మెజారిటీ లబ్ధిదారులు వాటిని మధ్యలోనే అమ్మేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ కంపెనీల్లో క్యాబ్‌ల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోనుంది. అదేవిధంగా మెట్రోరైల్, ఓలా కంపెనీలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఆయా కంపెనీలతో చర్చలు కూడా జరపడంతో, కార్పొరేషన్ తరుఫున క్యాబ్‌ల నిర్వహణకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తొలి విడత ఒక్కో కంపెనీలో 250 కార్ల చొప్పున నాలుగు కంపెనీల్లో వెయ్యి కార్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. నేరుగా కంపెనీతో అనుసంధానం కావడంతో బిల్లులకు ఎలాంటి ఇబ్బందులుండవని, ఉపాధికి హామీ ఉంటుందని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇది విజయం సాధిస్తే వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని భారీగా అమలు చేయనుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేస్తున్నందున తక్కువ ధరకు తీసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు టయోటా కంపెనీతో చర్యలు జరుపుతున్నారు. ఈనెలాఖరులోగా వాహనాల ధరలు ఖరారు చేసి, వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
క్యాబ్‌ల్లో షేర్ రైడ్స్‌కు చెక్
సాక్షి,న్యూఢిల్లీ: క్యాబ్‌ల్లో షేరింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో గమ్యస్ధానాలకు చేరుకునే వెసులుబాటు ఇక ఉండకపోవచ్చు. యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్స్‌కు త్వరలో చెక్ పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం నూతన ట్యాక్సీ స్కీమ్ ద్వారా వీటికి చెక్ పెట్టనుంది. సీటీ ట్యాక్సీ స్కీమ్ 2017కు ఢిల్లీ ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. ఈ నిబంధనల కింద షేర్ రైడ్‌ను అనుమతించబోరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా విధానాన్ని ప్రజల ముందుంచి వారి సూచనల మేరకు షేర్ రైడ్‌ను అనుమతించాలా లేదా అనేది నిర్ణయిస్తామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. షేర్ రైడ్, కార్ పూల్‌ను ఢిల్లీలో అనుమతించమని గతంలో ప్రభుత్వం పేర్కొంది. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్‌పై తిరిగే వాహనాలను పలువురు ప్రయాణీకులను ఎక్కించుకోవడాన్ని మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం అనుమతించరు. స్టేజ్ క్యారేజ్ పర్మిట్ కలిగిన బస్సుల వంటి ప్రజా రవాణా వాహనాలను మాత్రమే వివిధ లొకేషన్ల నుంచి ప్రయాణీకుల పికప్, డ్రాప్‌లకు అనుమతిస్తారు.ప్రస్తుతం యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్లు చట్టపరిధికి వెలుపల ఉన్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అందుబాటు ధరలో సౌకర్యవంతమైన ప్రయాణంగా రైడ్ షేర్ ఢిల్లీలో ఆదరణ చూరగొంది.ఢిల్లీలో క్యాబ్ ప్రయాణాల్లో 30 శాతం పైగా షేర్ రైడ్లే ఉంటున్నాయి. ఏడాదిలో షేర్ రైడ్లు ఐదు రెట్లు పెరిగాయని ఇటీవల ఓలా ప్రకటించింది. ఓలా షేర్‌కు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం కీలక మార్కెట్‌గా ఓలా ప్రతనిధి చెబుతున్నారు.మరోవైపు కర్ణాటక ప్రభుత్వం షేర్ రైడ్ చట్టవిరుద్ధమంటూ దాన్ని నిషేధించేందుకు రవాణా శాఖ సంసిద్ధమైంది. -
లండన్ రోడ్లపైకి ఎలక్ట్రిక్ బ్లాక్ క్యాబ్స్
లండన్: లండన్‌లో ప్రముఖ క్యాబ్ సంస్థ ‘బ్లాక్ క్యాబ్స్’ తన వాహనాలను డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రిక్ కార్లు మంగళవారం లండన్ రోడ్డెక్కాయి. నగరంలో కాలుష్యం పెరుగుతున్నందున ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తన వాహన శ్రేణిలోని దాదాపు సగం డీజిల్ వాహనాలను (9వేలకు పైగా) 2021 నాటికి విద్యుత్‌తో నడిచే కార్లుగా మారుస్తున్నట్లు వెల్లడించింది. ‘ఈ వాహనాల్లోని అన్ని ఫీచర్లూ కొత్తగా ఉన్నాయి. ప్రయాణికులకు, క్యాబ్ డ్రైవర్‌కూ సౌకర్యవంతంగా ఉండనున్నాయి’ అని లండన్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ సీఈవో క్రిస్ గబ్బే తెలిపారు. ఆరుగురు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా, వైఫై, యూఎస్బీ చార్జర్లు, ప్లగ్ సాకెట్ వంటి వివిధ వసతులు ఈ కార్లో ఉండనున్నాయి. -
క్యాబ్ కహానీ
-
ప్రయాణికులు కూడా తాగకూడదా?
తిరువనంతపురం: వాహనాల డ్రైవర్లు హాల్కహాల్, డ్రగ్స్ తీసుకొని, సిగరెట్ తాగుతూ వాహనాలు నడపరాదని, ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూన్ 23, 2017వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ గెజిట్ నోటిఫికేషన్‌పై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. తామైతే హాల్కహాల్, డ్రగ్స్ తీసుకోకుండా, సిగరెట్ తాగకుండా కార్లను నడపగలమని, తాగిన ప్రయాణికులను ఎలా ఎక్కించుకోకుండా ఉంటామని వారు ప్రశ్నిస్తున్నారు. బార్లు, క్లబ్‌లు, పబ్‌లకు వచ్చే వారు ఎక్కువగా క్యాబ్‌లు బుక్ చేసుకుంటారని, వారిని కాదంటే తమకు గిరాకీ ఎలా ఉంటుందని కేరళ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదనే నిబంధన అమల్లో ఉన్నప్పుడు, మద్యం సేవించిన ప్రయాణికులను కూడా తీసుకెళ్లొద్దంటే బార్లు, క్లబ్‌లకు వెళ్లే కస్టమర్లు ఇంటికెలా వెళతారని క్యాబ్ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కేరళ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజీవ్ పుతాలత్ దష్టికి మీడియా తీసుకెళ్లగా, ప్రయాణికుల విషయంలో జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదని చెప్పారు. మద్యం సేవించిన ప్రయాణికులను కూడా క్యాబుల్లో తీసుకెళ్లరాదనుకుంటే 1998 నాటి మోటార్ వాహనాల చట్టంలో మార్పులు తీసుకరావాల్సిందేనని, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇంతటి నిర్ణయాన్ని అమల్లోకి తీసుకరాలేమని ఆయన వివరించారు. మోటార్ వాహనాల చట్టంలోని 185వ సెక్షన్, 13వ అధ్యాయం ప్రకారం మొదటి సారి మద్యం తాగి డ్రైవర్ పట్టుపడితే జరిమానాను రెండు వేల రూపాయల వరకు, జైలు శిక్షను ఆరు నెలల వరకు పొడిగించవచ్చని లేదా రెండూ విధించవచ్చని ఆయన తెలిపారు. మొదటిసారి నేరం చేసిన మూడేళ్లలోపు మళ్లీ మద్యం సేవించి పట్టుబడితే మూడు వేల రూపాయల వరకు జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష పొడిగించవచ్చని లేదా రెండూ విధించవచ్చని చెప్పారు. డ్రైవర్ శరీరంలో 100 ఎంఎల్ రక్తంలో 30 ఎంజీకి మించి హాల్కహాల్ ఉండరాదని పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి తెలిసి తాను కూడా ఆందోళన చెందానని, తాగిన ప్రయాణికులను గుర్తించడం, వారిలో ఎవరూ క్యాబ్‌ను బుక్ చేశారో తెలుసుకోవడం కూడా కష్టమేనని, ఇప్పుడు రాజీవ్ వివరణతో గందరగోళం తొలగిపోయిందని ఎర్నాకులంలోని జాయింట్ ప్రాంతీయ రవాణాధికారి కేఎల్ ఫ్రాంక్లిన్ వ్యాఖ్యానించారు. -
ఓలా, ఉబర్ క్యాబ్‌లు ఎక్కేముందు జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వేగవంతం అయిన నగర జీవితంలో క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక నగర జీవికి కాస్త ఊరట కలిగిన విషయం తెల్సిందే. క్యాబుల్లో ఒంటరిగా ప్రయాణించే ఆర్థిక స్థోమత లేనివారి కోసం ఓలా షేర్, ఉబర్ పూల్ పేరిట రైడ్ షేరింగ్‌లు వచ్చి మరింత ఊరటనిచ్చాయి. ఈ రైడ్ షేరింగ్‌లకు ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మినహా దేశంలో మరే రాష్ట్రంలో చట్టపరంగా అనుమతి లేదన్న విషయం ఎందరికి తెలుసో తెలియదుగానీ, ఇక ముందు తెలుసుకొని షేర్ రైడింగ్ క్యాబ్‌లు ఎక్కడం ఎందుకైనా మంచిది. మోటార్ వాహనాల చట్టంలోని 66వ సెక్షన్ కింద ప్రయాణికులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు క్యాబ్‌లకు లైసెన్స్‌లు మంజూరు చేస్తారు. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం కారు సామర్థ్యాన్నిబట్టి ప్రయాణికుడు లేదా ప్రయాణికులను ఓ చోట పికప్ చేసుకొని మరోచోట డ్రాప్ చేయాలి. మధ్య మధ్యలో ఆపడానికి వీల్లేదు. మరొకరిని ఎక్కించుకోవడానికి వీల్లేదు. అలా చేయాలంటే సెట్విన్ బస్సుల్లాగా స్టేజ్ క్యారేజ్ లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. స్టేజ్ క్యారేజ్ పర్మిషన్లు జిల్లా ట్రాన్స్పోర్ట్ యంత్రాంగం పరిధిలోకి వస్తాయి. ఈ కారణంగానే కర్ణాటక రాష్ట్రం ఓలా షేర్, ఉబర్ పూల్ రైడ్స్‌ను ఇటీవల నిషేధించింది. కర్ణాటకతోపాటు తమిళనాడు రాష్ట్రంలోని 1989నాటి మోటార్ వాహనాల చట్టం వీటిని అనుమతించడం లేదు. అందుకనే తమిళనాడులో చాలా ప్రాచుర్యం పొందిన ‘జిప్‌గో’ షేర్ సర్వీసులు 2015లోనే మూతపడ్డాయి. ఒడిశాలో కూడా ఓలా షేర్, ఉబర్ పూల్ సర్వీసులను రద్దుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెల్సిందే. ఇంతవరకు ఓలా షేర్, ఉబర్ పూల్ రైడ్స్‌కు వ్యతిరేకంగా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, లిఖితపూర్వక ఫిర్యాదులు అందినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేరళ రవాణా శాఖా అధికారులు తెలియజేస్తున్నారు. 2012లో రియోలో వాతావరణ కాలుష్యంపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో ‘కార్‌పూలింగ్’ విధానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. అంటే కారు కలిగిన ప్రైవేటు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో కారును తీయకుండా రోజుకొకరి కారులోనే నలుగురు కలిసి వెల్లడం మంచిదని తీర్మానించింది. ఈ తీర్మానానికి ఓటేసిన భారత్ కూడా మోటార్ వాహనాల చట్టంలోని 66వ సెక్షన్ నిబంధనలను మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం గురించి తెలుసో, లేదోగానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓలా షేర్, ఉబర్ పూల్ లాంటి సర్వీసులను అనుమతిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. చట్టాలు వర్తించనప్పుడు ఇలాంటి కార్లలో రోడ్డు ప్రమాదాలకు గురయితే ప్రయాణికులకు ఎలాంటి నష్టపరిహారం వర్తించదు. అనుమతి ఉన్న ఇతర ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణించడం కూడా ఒక విధంగా రిస్కే. ఎందుకంటే, ప్రమాదాలకు తాము ఏమాత్రం బాధ్యత వహించమంటూ కంపెనీల యజమాన్యాలు డ్రైవర్లతో ఒప్పందం చేసుకుంటున్నాయి. -
వెయ్యి మంది నిరుద్యోగులకు క్యాబ్‌లు
గచ్చిబౌలి: వెయ్యి మంది నిరుద్యోగులకు క్యాబ్‌లు ఇప్పిస్తామని, ప్రతి ఒక్కరు వృత్తిని ప్రేమించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. గురువారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ఉబెర్ అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెయ్యి మంది చదువుకున్న నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద క్యాబ్‌లు ఇప్పిస్తామని చెప్పారు. వాహనం కొనుగోలుకు రూ.5 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే 60 శాతం సబ్సిడీ, ఐదు లక్షలకు పైగా లోన్ ఇస్తే 50 శాతం సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. రూ.2 లక్షల లోన్ ఇస్తే 70 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. ఉబెర్ క్యాబ్ సహకారంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ వృత్తిని సామాజిక సేవగా భావించాలని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఉబెర్ క్యాబ్ ప్రయాణికులకు చేరువగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, బీసీ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఉబెర్ క్యాబ్‌లో పనిచేస్తున్న వారు నెలకు రూ.50 వేల నుంచి లక్షకు పైగా సంపాదిస్తున్నారని తెలిపారు. డ్రైవర్ కమ్ ఓనర్ స్కీంతో క్యాబ్ డ్రైవర్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. తెలంగాణ జిల్లాలోని చదువుకున్న నిరుద్యోగులకు వెయ్యి మందికి గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా వాహనాలు అందజేస్తామని తెలిపారు. ఉబెర్ క్యాబ్ జనరల్ మేనేజర్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ 2014 జనవరిలో హైదరాబద్‌లో ఉబెర్ క్యాబ్ ప్రారంభమైందని, రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే ప్రయాణికులకు చెరువయ్యిందని అన్నారు. ఉత్తమ సేవలందించిన 13 మంది డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉబెర్క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. -
ప్రయాణికుడికి దడ పుట్టిస్తున్న ఓలా
ముంబయి: ఈ మధ్య ఓలా క్యాబ్‌లు ప్రయాణికులకు వణుకుపుట్టిస్తున్నాయి. గుండె దడ వచ్చేలా బిల్లులు వడ్డిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తర్వాతగానీ వాటిని సరిచేసి క్షమాపణలు చెప్పి చేతులు దులిపేసుకునే పరిస్థితి కనిపించడంలేదు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి నిజమాబాద్‌కు వెళ్లిన రతీశ్ శేఖర్ అనే వ్యక్తికి ఓలా క్యాబ్ రూ.9.15లక్షలు బిల్లు వేసింది. ఆయన ప్రయాణించిన కారు 450 కిలోమీటర్లు ఉండగా మీటర్ రీడింగ్ మాత్రం ఏకంగా 85,427కి.మీ అని చూపించింది. అచ్చం ఇదే తరహాలోనే మహారాష్ట్రలో కమల్ బాటియా అనే వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ వివాహ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి ముంబయి నుంచి పుణెకు వెళ్లిన ఆయనకు మొత్తం రూ.83,395 బిల్లు చూపించింది. 14 గంటల్లో 7 వేల కిలో మీటర్లు ప్రయాణించినట్లుగా ఇన్వాయిస్లో ఇచ్చింది. ఈ బిల్లు చూసిన తొలుత షాకై.. ఆ వెంటనే తేరుకుని డ్రైవర్‌తో కాసేపు వాదులాడే ప్రయత్నం చేశాడు. అయితే, అది సాఫ్ట్ వేర్ సమస్య అని గుర్తించిన డ్రైవర్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బిల్లు సవరించాడు. క్షమాపణలు చెప్పాడు. చివరకు బాటియా మొత్తం 347 కిలో మీట్లరకు రూ.4,088 చెల్లించి డ్రైవర్‌కు రూ.100 టిప్ ఇచ్చి వెళ్లాడు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఓలా క్యాబ్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి. -
ఆ క్యాబ్‌లు గ్యాస్‌తోనే నడవాలి!
భారత రాజధాని ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబ్‌లు కేవలం గ్యాస్‌తో మాత్రమే తిరగాలంటూ హైకోర్టు డెడ్ లైన్ విధించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు యాప్ ఆధారంగా ఫ్యూయెల్‌తో తిరిగే క్యాబ్‌లు... నాచురల్ గ్యాస్ వినియోగంతో నడపాలని కోర్టు ఆదేశించింది. మార్చి 2016 నాటికి డీజిల్ క్యాబ్‌లు రోడ్లపై నడిచేందుకు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఓలా, ఊబర్ వంటి కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాబ్‌లు ఇచ్చిన గడువు లోపల తమ తమ క్యాబ్ లను దశలవారీగా డీజిల్ నుంచి గ్యాస్‌తో నడిచేట్టుగా మార్చుకోవాలని జస్టిస్ మన్ మోహన్ ఆదేశించారు. ప్రభుత్వం అమలులోకి తేవాలనుకున్న డీజిల్ టాక్సీల నిషేధం ఆచరణాత్మక పరిష్కారం కాదని కోర్టు అభిప్రాయ పడింది. డీజిల్ క్యాబ్ లు నడుపుతున్న కంపెనీలపై జూలై 29 న ప్రభుత్వం విధించిన నిషేధం నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. -
స్కావెంజర్ల నుంచి క్యాబ్ డ్రైవర్లుగా..!
ఇతరుల మలినాలను నెత్తినెత్తుకొని స్కావెంజర్లుగా పనిచేసిన వారి బతుకుల్లో ప్రస్తుతం కాస్త వెలుగులు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా రాజధాని ఢిల్లీలో తాజాగా కనిపిస్తున్న కొత్త మార్పు... మరి కొద్ది రోజుల్లో దేశంలోని ఇతర నగరాలకు వ్యాపించనుంది. కుల ప్రాతిపదికన తరతరాలుగా చేపడుతున్న వృత్తుల్లో అత్యంత నీచ స్థితిలో ఉన్న సఫాయీ కర్మచారీ వృత్తి, వివక్షలో చిక్కుకున్న జీవితాలు మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నంలో భాగంగా హస్తినలో వచ్చిన మార్పు కొన్ని కుటుంబాను తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తోంది. రోడ్లు ఊడుస్తూ, టాయిలెట్లు క్లీన్ చేస్తూ, డ్రైనేజీలు కడుగుతూ గడిపిన వారి తల్లిదండ్రుల జీవన విధానానికి ఇప్పుడా 250 మంది యువతులు స్వస్థి చెప్పారు. వేలల్లో జీతాలు వచ్చే క్యాబ్ డ్రైవర్లుగా మారారు. తమకు దగ్గరలోని పార్కుల్లోనే మార్సల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, కాస్తంత ఆంగ్ల భాషనేర్చుకొని, మురికి వాడ నుంచి ఊబర్, ఓలా వంటి కమర్షియల్ టాక్సీ డ్రైవర్లుగా మారుతున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం, సాధికారత విభాగం ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాలనుంచి 9 వందల మంది మహిళలకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించింది. ఇది ఒక్క ఢిల్లీ నగరానికే కాక దేశంలోని ముంబై, బెంగళూరు, కోల్ కతా, చెన్నై నగరాల్లో కూడ అమలు చేస్తామని మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ చెప్పారు. మా అమ్మ ఆ ఉద్యోగాన్ని పదేళ్ళ పాటు చేసింది. కానీ మేం మా జీవితాలు కాస్త మెరుగు పడతాయని ఆశిస్తున్నాం అంటుంది... రద్దీ ప్రాంతంలో డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఇరవై రెండేళ్ళ ఓ ట్యాక్సీ డ్రైవర్. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారంతా 17 నుంచి 25 ఏళ్ళ మధ్య వయసుండి, ఢిల్లీలోని మాదంగీర్, సంగం విహార్, లాల్ కౌన్, అంబేద్కర్ నగర్ల నుంచి వచ్చిన వారే. వీరిలో కొందరు పదో తరగతి, ఇంటర్ వరకూ చదివిన వారు కూడ ఉన్నారు. ఇటువంటి వారు కొందరు శిక్షణ అనంతరం తాము స్వయంగా ట్రావెల్ ఏజెన్సీలను నిర్వహించుకుంటామని చెప్తున్నారు. కొందరైతే ఇటువంటి మార్పు తమ జీవితాల్లో వస్తుందని ఊహించలేదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోటార్ డ్రైవింగ్ స్కూళ్ళనుంచి మొదటిగా పది కార్లతో ఈ శిక్షణ తరగతులు మొదలు పెట్టారు. అయితే శిక్షణ ప్రారంభమైనప్పుడు మహిళల్లో ఆత్మ విశ్వాసం తక్కువగానే కనిపించినా ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్రైవింగ్ నేర్చుకొంటున్నారని గ్రేటర్ కైలాష్ ఆఫీస్ లోని నాగరాజ్ అంటున్నారు. అయితే మహిళలు ట్యాక్సీ డ్రైవర్లుగా ఉండాలంటే వారికి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు కూడ వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు మూడు వేలమంది క్యాబ్ డ్రైవర్లకు ఢిల్లీలోని సిటీ పార్క్ లో మ్యానరిజమ్ పాఠాలు కూడ నేర్పుతున్నాం అంటున్నారు సీనియర్ ఎస్ జే ఈ అధికారి మునియప్ప నాగరాజ్. ప్రభుత్వం ద్వారా అమల్లోకి తెచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడే అవకాశం ఉందని, అయితే అసలు మొత్తం ఢిల్లీలో సుమారు అరవై వేలమంది పఫాయీ కార్యికులకు కనీసం నెల జీతం వచ్చే అవకాశం కూడ లేదని ఓ ఎన్జీవో సంస్థ సభ్యురాలు దును రాయ్ అంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని ఆమె సూచిస్తున్నారు. -
క్యాబ్ సర్వీసులకు విశ్రాంతినిస్తున్నాం!
కోల్ కతా: మండే ఎండలతో ట్యాక్సీ సర్వీసులకు విశ్రాంతి ఇస్తున్నట్లు బెంగాల్ ట్యాక్సీ అసోసియేషన్ శనివారం ప్రకటించింది. ఉదయం 11గం.ల నుంచి సాయంత్రం 4.గం.ల వరకూ ట్యాక్సీ సర్వీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ నడపలేమని స్పష్టం చేసింది. భానుడి ఉగ్రరూపంతో ఇప్పటికే ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు మృత్యువాత పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీకి ట్యాక్సీ అసోసియేషన్ ఓ లేఖ రాసింది. ' ఎండ వేడిమి ఎక్కువగా ఉండే సమయంలో మేము ఏ క్యాబ్ ను కూడా రోడ్డుపై తిప్పలేం. ఒకవేళ ఎవరైనా తిప్పడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఈ విషయాన్ని పోలీసులు, ప్రయాణికులు అర్ధం చేసుకోవాలి. సర్వీసులను నిలుపదల చేసే క్రమంలో పోలీసులు మాపై ఎటువంటి జరిమానా విధించొద్దు' అని ట్యాక్సీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీమల్ గుహ విజ్ఞప్తి చేశాడు. శుక్రవారం ఎండ తాపానికి తాళలేక నగరంలోని ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, ఈ రోజు జాదవ్ పూర్ ప్రాంతంలో శత్రుఘాన్ పొడ్డార్ అనే ట్యాక్సీ డ్రైవర్ సృహ తప్పిపడిపోయిన అనంతరం ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
'అంతా జీపీఎస్మయం'
న్యూఢిల్లీ: ఢిల్లీ అద్దె వాహనాలన్నీ జీపీఎస్మయం కానున్నాయి. మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకునే దిశగా కొత్తగా కొలువు దీరిన సర్కారు ట్యాక్సీల్లో ఖచ్చితంగా జీపీఎస్ ఉండాలని, అలా జీపీఎస్ లేని వాహనాలకు ఫిట్నెస్ సర్కిఫికెట్లు కూడా ఇవ్వొద్దని రహదారుల పన్నుశాఖ (ఆర్టీవో) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వశాఖకు చెందిన సీనియర్ అధికారుల వివరాల ప్రకారం రేడియో ట్యాక్సీలు, బ్లాక్, ఎల్లో ట్యాక్సీలతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించే అద్దె వాహనాల్లో ఖచ్చితంగా జీపీఆర్‌ను కలిగిఉండాలని, వాటి వివరాలు పోలీసుశాఖ వద్ద ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ట్యాక్సీలో ఓ 25 ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరగడంతోపాటు.. ఇటీవల కాలంలో ఈ తరహా దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ఈ విధానం తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. -
అమ్మాయిలా తాగి క్యాబ్ ఎక్కితే..!!
-
మహిళా ఉద్యోగులకు కార్పొరేట్ అలర్ట్స్
ఉబర్ క్యాబ్ ఘటన నేపథ్యంలో ఈ-మెయిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. అటు స్వీయ జాగ్రత్తలూ పాటించాలంటూ ఉద్యోగులకు సూచనలిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఉబర్ క్యాబ్ సంఘటన నేపథ్యంలో కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల రూపంలో సందేశాలను చేరవేశాయి. కంపెనీ సమకూర్చే క్యాబ్స్‌ను మాత్రమే ప్రయాణానికి వినియోగించాలని ఆ సందేశాల్లో సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తే వాహనం నంబరును రాసుకుని, సంబంధీకులకు ఆ నంబరును చేరవేయాలని గుర్తు చేశాయి. అయితే భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడమేగాక, ఉద్యోగులకు తరచూ సూచనలిస్తున్నట్టు కొన్ని కంపెనీలు వెల్లడించాయి. ఈ-మెయిల్ సందేశాలు.. మహిళా ఉద్యోగులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్యానాసోనిక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోటెక్, ఆర్పీజీ గ్రూప్, ఏజిస్, జెన్సర్ టెక్నాలజీస్ తదితర సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపించాయి. కొన్ని కంపెనీలైతే సమావేశ మందిరాల్లో ఉద్యోగులకు సూచనలు చేస్తున్నాయి. రాత్రి వేళ త్వరగా పని ముగించుకుని, అవసరమైతే మర్నాడు ముందుగా రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నట్టు హైసియా ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ ఇండియా ఎండీ రమేశ్ లోగనాథన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భద్రత చర్యలు, స్వీయ రక్షణ గురించి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తరఫున అన్ని వేదికలపైనా చెబుతున్నామని అన్నారు. ‘కొన్ని క్యాబ్ కంపెనీలను నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. వేలాది అనధికార క్యాబ్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే’ అని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. అలర్ట్స్ కొత్తేమీ కాదు.. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ఉద్యోగులకు గుర్తు చేస్తున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ప్రతి శుక్రవారం అందరు ఉద్యోగులకు భద్రతపరమైన సందేశాలు పంపిస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘రాత్రి 8 లోపే పనులను ముగిం చుకోవాలని మహిళా ఉద్యోగులకు చెబుతున్నాం. రాత్రి 8 తర్వాత వెళ్లేవారికి కంపెనీ కారులో గార్డు రక్షణతో పంపిస్తున్నాం. 10 ఏళ్ల నుంచి ఒకే క్యాబ్ ఆపరేటర్ సేవలందిస్తున్నారు. వాహనాలు, భద్రత ఏర్పాట్లను క్యాబ్ ఆపరేటర్‌తో కలసి తరచూ సమీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత చర్యలు నిరంతర ప్రక్రియ అని టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణా రెడ్డి తెలిపారు. స్వీయ రక్షణ విషయంలో ఉద్యోగులకు కంపెనీ నుంచి అలర్ట్స్ కొత్తేమీ కాదన్నారు. -
హైదరాబాద్ లో బుక్ మై క్యాబ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసుల రంగంలో ఉన్న బుక్ మై క్యాబ్.కామ్ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. భాగ్యనగరికి చెందిన క్యాబ్ ఆన్ క్లిక్.కామ్‌ను కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 100 కార్లతో సేవలను ప్రారంభిస్తున్నట్టు బుక్ మై క్యాబ్ సీఈవో అవినాశ్ గుప్త తెలిపారు. సీవోవో వినయ్ పాండేతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ముంబై, కోల్‌కత, ఢిల్లీలో 5 వేల వాహనాలతో సర్వీసులు ఇస్తున్నట్టు చెప్పారు. ‘కస్టమర్లు గతంలో ప్రణాళిక ప్రకారం ముందుగా కారు బుక్ చేసేవారు. ఇప్పుడంతా ఇన్స్టాంట్. ప్రయాణానికి 15-45 నిముషాల ముందు కారు కావాలంటున్నారు. హైదరాబాద్, కోల్‌కతలో 50 శాతంపైగా కస్టమర్లు ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తున్నారు. ముంబై, ఢిల్లీలో 65 శాతంపైగా కస్టమర్లు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి క్యాబ్ కోరతారు’ అని వివరించారు. క్యాబ్ డ్రైవర్లు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని వారి పిల్లల చదువుల కోసం దాచుకునేలా సేవింగ్ పథకాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లేకున్నా ఎస్ఎంఎస్ ద్వారా బుకింగ్ సేవలను త్వరలో పరిచయం చేయనుంది. -
పంచ ప్రణాళిక
సాక్షి, సిటీబ్యూరో: అభయ ఘటన అనంతరం ఉన్నతాధికారులు ఐటీ కారిడార్ భద్రతపై పూర్తిగా దృష్టి సారించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీసీపీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు.. ఆర్టీసీ అధికారులు, ఏపీఐఐసీ, ఎస్సీఎస్సీ (సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కౌన్సిల్)ల సహకారంతో మహిళా ఉద్యోగుల రవాణా సౌకర్యంపై అధ్యయనం చేశారు. రెండు నెలల పాటు సాగిన ఈ అధ్యయనంలో నిత్యం 40 వేల మంది ఐటీ ఉద్యోగులు ఆటో, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం ఐటీ కారిడార్‌లో 10 వేల ఆటోలు, క్యాబ్‌లు ఉన్నాయని నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో ఐటీ మహిళల కోసం ఐదంచెల భద్రతా ప్రణాళికను రూపొందించారు. ఆ వివరాలను సీవీ ఆనంద్ బుధవారం మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల సమావేశంలో వివరించారు. సైబరాబాద్ సెంట్రల్ కాంప్లెంట్ సెల్‌ను డీజీపీ బి.ప్రసాదరావు ప్రారంభించారు. పంచ ప్రణాళిక 1. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ =4 రూట్లలో 24 గంటలు ఆర్టీసీ షటిల్ సర్వీసులు =40 కొత్త బస్సులతో 326 ట్రిప్పులు =ప్రతి పది నిముషాలకు బస్సు సౌకర్యం =బస్సులు నిలిపేందుకు 5 ప్రాంతాలను కేటాయించిన ఏపీఐఐసీ =మహిళా ఉద్యోగులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని అధికారుల సూచన 2. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణిస్తే.. =క్యాబ్‌లు, ఆటోలో ప్రయాణం తప్పనిసరైతే పోలీసులు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాన్నే ఎంచుకోవాలి =వాహనంలో డ్రైవర్ పేరు, సెల్‌నెంబర్, పోలీసు రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పరిశీలించుకోండి =క్యూ.ఆర్ కోడ్ స్టిక్కర్ ఉన్న ఆటోలో సురక్షితం =మహిళల బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే ఉంచుకోవాలి 3. పెరిగిన పోలీసు పర్యవేక్షణ =9 ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు. =ఒక్కో చెక్‌పోస్టులో హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు =ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ పర్యవేక్షణలో 80 మంది సిబ్బందితో ఐటీ కారిడార్ పోలిసింగ్. =రంగంలోకి ఐదు ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు =ఒక్కో వాహనంలో హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు =ఇందుకోసం నెలకు ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు పెడుతుంది =అదనపు డీ సీపీ జానకి షర్మిళ చైర్మన్‌గా మహిళా ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు 4. అదనపు రక్షణ చర్యలు =47 సీసీ టీవీలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు =ఇందుకోసం ఎస్సీఎస్సీ రూ.4 కోట్లు వెచ్చించింది =నైట్ విజన్ సీసీ కెమెరాల ఏర్పాటు =సీసీటీవీ నెట్వర్క్ నిర్వహణ కోసం ఏపీఐఐసీ రూ.5 కోట్లు అందజేసింది =త్వరలో మరో 150 కెమెరాలనూ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు =మాల్స్, వ్యాపార కేంద్రాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు =150 ఐటీ కంపెనీల్లో కేవలం 82 కంపెనీలే ఎస్‌సీఎస్‌సీలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. =మిగిలిన కంపెనీలు కూడా సభ్యత్వం తీసుకోవాలి =ఉద్యోగుల కోసం ఎస్సీఎస్సీ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు 5. క్యాంపెయిన్ =మహిళల భద్రతపై అవగాహన కలిగించేందుకు లఘు చిత్రాల తయారీ =ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా నటించిన లఘు చిత్రంతో ప్రచారం =కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో మహిళలకు చైతన్యం కలిగించడం =సైబరాబాద్ మహిళా హెల్ప్‌లైన్ నెంబర్ 94947 31100 =సోషల్ మీడియానూ ఉపయోగించుకుంటారు =అన్నీ ఐటీ కంపెనీల్లో భద్రతపై సమావేశాలు ఏర్పాటు -
క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు
= ఐటీ ఉద్యోగుల భద్ర తా చర్యల్లో భాగంగా పోలీసుల ఏర్పాటు =కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ =మూడు డిజిట్లతో త్వరలో సహాయ ఫోన్ నంబర్ సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఉద్యోగుల భద్రతా చర్యల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు క్యాబ్‌లు, ఆటోలకు ప్రత్యేక నంబర్ (నాలుడు డిజిట్ల)ను కేటాయిస్తున్నారు. ఇందుకుగాను డ్రైవర్లకు ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తులను కూడా ఇప్పటికే అందజేశారు. వీరంతా డిసెంబర్ 31వ తేదీలోగా నంబర్‌ను పొందాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. దరఖాస్తులో వాహనం యజమాని పేరు, చిరునామాతో పాటు సెల్‌నెంబర్, డ్రైవర్ పేరు, చిరునామాతో పాటు సెల్‌నెంబర్ తదితర వివరాలు పూరించాలి. వచ్చిన దరఖాస్తులన్నింటికీ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్‌ను కేటాయిసా ్తరు. ఈ నంబర్‌ను క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు త మ వాహనంపై లోపల, బయట రాసుకోవాలి. ఏదైనా సంఘటన చోటుచేసుకున్నప్పుడు బాధితులు చెప్పిన నంబర్ ఆధారంగా డ్రైవర్, వాహన యజమాని వివరాలు క్షణాల్లో పోలీసులకు ప్రత్యక్ష మవుతాయి. దీంతో పాటు అం దరి వివరాలు, ప్రత్యేక నంబర్ల వివరాలన్నింటి నీ సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్‌తో పాటు సెక్యురిటీ కౌన్సిల్ వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ అభయ ఘటన తరువాత రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు మరో కొత్త ప్రతిపాదన చేశారు. ఆయా ఐటీ కంపెనీలు కాల్సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కాల్‌సెంటర్ల వల్ల తరచూ ఫిర్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నందున గచ్చిబౌలిలోని కమిషనర్ కార్యాలయంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పోలీసులు, సెక్యురిటీ కౌన్సిల్ ఒక నిర్ణయానికి వచ్చారు. సులువుగా నంబర్ గుర్తుండేవిధంగా మూడు డిజిట్ల నంబర్‌ను త్వరలో కేటాయిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న కెమెరాలతో పాటు మరో వంద కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించడంతో ఇందుకు సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు. ఆర్టీసీకి మూడు ప్రాంతాల అప్పగింత బస్సులను నిలిపేందుకు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలో మూడు ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాలను ఏపీఐఐసీ ఆర్టీసీకి కేటాయించింది. ఉద్యోగులు డ్యూటీకి వెళ్లేటప్పుడు, ముగించుకునే సమయాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. మిగతా సమయంలో డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను వారికి కేటాయించిన ప్రాంతాలలో పార్కింగ్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. -
మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ
= స్త్రీలపై అఘాయిత్యాలను అరికట్టేందుకే.. = జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని నిరుద్యోగ మహిళ లకు డ్రైవింగ్‌లో, సెక్యూరిటీగార్డులుగా శిక్షణనిస్తామని, శిక్షణ పొందిన వారిలో 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇందుకుగాను ఎన్జీఓలతో కలిసి డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభివృది ్ధపనులపై గురువారం మేయర్, కమిషనర్ ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్యాబ్స్‌లో వెళ్తున్న మహిళలపై అభయ తరహా ఘటనలు జరగుతున్నందున, మహిళాడ్రైవర్లే ఉంటే ఇలాంటివి కొంతమేర నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. బ్యాంకు లింకేజీలు, దీపం, బంగారు తల్లి, వడ్డీలేని రుణం, అభయహస్తం తదితర కార్యక్రమాలపై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ/ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన పనులను త్వరిత గతిన పూర్తిచేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్ బల్బుల్ని బయట అమ్ముకోకుండా ఉండేందుకు వాటిపై జీహెచ్ఎంసీ లోగోను ముద్రించాల్సిందిగా సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో టైమర్ల ఏర్పాటు కోసం టెండ ర్లు ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వెటర్నరీ ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ సూచించారు. హెచ్ఎంఆర్కు అప్పగించిన మొఘల్సరాయిని జీహెచ్ఎంసీకి తిరిగి అప్పగించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లు కమిషనర్‌ను కోరారు. ఇంకా, తమ గౌరవ వేతనాల్ని పెంచాల్సిందిగా కోరారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో... అంతకు ముందు జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయా పనులకు బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే అదనపు నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ పనులకు 400 శాతం, రెవెన్యూ పనులకు 300 శాతం అదనంగా కేటాయించేందుకు అంగీకరించారు. శ్మశానవాటికల అభివృద్ధికి కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నవయుగ సెజ్ నుంచి చందానగర్ రైల్వేస్టేషన్ వరకు రోడ్డు అభివృద్ధికి రూ. 8.25 కోట్లు మంజూరుకు ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు వల్ల ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని అడ్డుకున్నారు. పాతబస్తీలో ఎక్కువమందికి అవసరమైన పనులెన్నో ఉన్నాయన్నారు. దీంతో, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. -
ఏదీ నిర్భయం?
=ఐటీ కారిడార్‌ను వణికిస్తున్న క్యాబ్‌లు =చాలా వాహనాల వివరాలు ‘బోగస్’ =పక్కా చిరునామాలు ఆర్టీఏలోనూ నిల్ = పటిష్ట చర్యలకు వెనకాడుతున్న పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: రాజధాని ఐటీ కారిడార్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినులకు భద్రత లేకుండా పోయింది. వారికి రక్షణ కరువవుతోంది. శుక్రవారం నాటి ఘటన నేపథ్యంలో... సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సాఫ్ట్వేర్ ఉద్యోగినులు క్యాబ్, ఆటోలు అంటేనే వణికిపోతున్నారు. అయినప్పటికీ క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లపై నిఘా కరువైంది. కారణమేమిటంటే.. ఆటోలు, క్యాబ్‌లకు సంబంధించిన పక్కా వివరాలు లేకపోవడమే అన్న సమాధానం అధికారుల నుంచి వినవస్తోంది. అందువల్లే ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజధానిలో దాదాపు 70 వేలకు పైగా ఆటోలు, 40 వేల వరకు క్యాబ్స్ ఉండగా... ఆర్టీఏ రికార్డుల్లో కనీసం 50 శాతం కూడా అసలైన చిరునామాలపై లేవు. ఫలితంగా ఏదైనా ఉదంతం జరిగినప్పుడు దర్యాప్తులో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. జంట కమిషనరేట్ల వ్యాప్తంగా రిజిస్టర్ అయిన ఆటోలు, క్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి..? వాస్తవానికి ఎన్ని సంచరిస్తున్నాయి? అంటూ ఆర్టీఏ అధికారుల్ని అడిగితే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. నగరంలో డబుల్ రిజిస్ట్రేషన్ నెంబర్, బోగస్ నంబర్ ప్లేట్లతో తిరుగున్న వాహనాలు అనేకం ఉంటాయని పోలీసులే అంగీకరిస్తున్నారు. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న ఆటో/క్యాబ్ డ్రైవర్లు, యజమానులు అందిస్తున్న పత్రాల విశ్వసనీయత, చిరునామా పక్కానా? కాదా? అనేవి క్రాస్ చెక్ చేసేందుకు ఆర్టీఏ వద్ద వనరులు లేవు. పోనీ నగరవ్యాప్తంగా విస్తృత దాడులు చేసి ఇలాంటి వాటికి చెక్ చెప్పాలన్నా... ఉన్న సిబ్బందితో రోటీన్ పనులే కష్టంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేరాలకు కారణమవుతున్న ఆటోలకు అన్ని వేళలా చెక్ చెప్పడం సాధ్యం కాదన్నది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలే అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. పత్తాలేని ప్రత్యేక నంబరింగ్ ఆర్టీఏలో పరిస్థితులు ఈ రకంగా ఉంటే... పోలీసుల దుస్థితి మరోలా ఉంది. నగరంలో సంచరిస్తున్న ఆటో/క్యాబ్‌లకు సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించాలన్న ఆలోచన వారికి రాదు. గతంలో ఈ విధానాన్ని ప్రారంభించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. విజయవాడతో పాటు ఇతర పట్టణాలకు చెందిన పోలీసులు ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. తమ పరిధుల్లో తిరిగే ఆటోలు, ట్యాక్సీల యజమానులు, డ్రైవర్లకు చెందిన పూర్తి రికార్డులు తమ వద్ద నిర్వహిస్తున్న పోలీసులు వాటికి ప్రత్యేక నంబర్లు ఇచ్చారు. ఇవి ఆటోలో ఎక్కే వారి భద్రతతో పాటు ఉల్లంఘనలకు చెక్ చెప్పేందుకూ ఉపకరిస్తున్నాయి. నగరంలోని ఆటోల్లో ఉన్న ‘లొసుగులు’ తెలిసినప్పటికీ జంట కమిషనరేట్ల అధికారులు ఆ కోణంలో ఆలోచించకుండా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆరంభ శూరత్వమే... నగర కమిషనరేట్ పరిధిలో సంచరించే ఆటోల్లో డ్రైవర్లు తమ వివరాలతో పాటు పోలీసు హెల్ప్‌లైన్‌తో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు రెండేళ్ల క్రితం ఆదేశించారు. దీన్ని ఆటోలో కూర్చున్న వారికి కనిపించేలా డ్రైవర్ సీటు వెనుక ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిపై ఆటోఓనర్ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ట్రాఫిక్ హెల్ప్‌లైన్, కంట్రోల్‌రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచాలన్నారు. దీంతో పాటు ఆటో వెనుక భాగంలో లోపలి ప్రదేశం పాదర్శకంగా కనిపించేలా ఓపెన్‌గా ఉండాలని స్పష్టం చేశారు. వీటిపై తొలినాళ్లలో హడావుడి చేసిన అధికారులు ఆపై మర్చిపోయారు. ఇప్పుడు బోర్డులు మాయం కాగా... వెనుక భాగంలో ఆటోయాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఆటోల విషయంలో కనీసం ఈ తరహా చర్యలు తీసుకున్న అధికారులు క్యాబ్‌లపై మాత్రం ఎలాంటి దృష్టి పెట్టలేదు. కనీసం ప్రాథమికమైన అంశాలనూ పట్టించుకోలేదు. పటిష్ట చర్యలతోనే భద్రతకు వీలు ప్రయాణికుల భద్రత కోసం ఉద్దేశించిన ఈ బోర్డుల స్థానంలో నేమ్షీట్లు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు ప్రయాణికులు తాము దారుణాలకు గురైన, మోసపోయిన ఆటోడ్రైవర్‌పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. క్యాబ్‌ల విషయంలో అసలు ఎలాంటి నిబంధనలూ లేకుండా పోయాయి. ఇకనైనా పోలీసులు మేల్కొని ఓనర్ ఫోటో, వ్యక్తిగత ఫోన్ నెంబరు, చిరునామా, హెల్ప్‌లైన్, పోలీసులకు సంబంధించిన నెంబర్లు తదితరాలు ఆంగ్ల, తెలుగు, ఉర్దూలో ఉండేలా వాహనాల్లో బోర్డులు ఏర్పాటయ్యేలా చూడాలి. ఆటోలు, క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు కేటాయించడంతో పాటు అవి వాహనం ముందు, వెనుక, లోపలే కాకుండా టాప్‌పైన కూడా రాసేలా చర్యలు తీసుకోవాలి. ఫలితంగా ఆ వివరాలు రహదారులు, జంక్షన్లలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అవుతాయి. స్వీయ జాగ్రత్తలే మేలు మారిన జీవన విధానం నేపథ్యంలో మహిళలు సైతం పురుషులతో సమానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో దూసుకుపోతున్నారు. దీంతో అనివార్యంగా వేళలతో సంబంధం లేకుండా రహదారుల్లో సంచరించాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో ముష్కరుల బారిన పడకుండా కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. =విద్యార్థినులు, ఉద్యోగినులు పోకిరీలు, ముష్కరులకు చెక్ చెప్పడానికి వీలుగా హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రేను వెంట ఉంచుకోవాలి. =పెప్పర్ స్ప్రే అందుబాటులో లేకుంటే కనీసం ఘాటైన వాసన గల సెంట్లు, స్ప్రేలు దగ్గర ఉంచుకోవాలి. =ఎవరైనా దాడి చేసినా, వేధించినా, ఘోరాలకు యత్నించినా వీటిని వారి ముఖంపై స్ప్రే చేసి తప్పించుకోవచ్చు. =రాత్రి వేళల్లో, నిర్జన ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకు మహిళలు ఒంటరిగా సంచరించకపోవడమే మంచిది. =తప్పనిసరి పరిస్థితుల్లో సంచరించే మహిళలు తమతో పాటు ఓ విజిల్‌ను ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఊదుతూ చుట్టపక్కల వారిని అలర్ట్ చేయవచ్చు. =స్థానిక పోలీసుస్టేషన్, కంట్రోల్ రూమ్‌తో పాటు సన్నిహితుల నెంబర్లు సెల్‌ఫోన్‌లోని స్పీడ్ డయల్స్ ఆప్షన్లో సేవ్ చేసుకోవాలి. అవసరమైతే వాటిని సేవ్ చేసిన బటన్ నొక్కిన వెంటనే అవతలి వారికి కాల్ వెళ్తుంది. =మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మహిళా ప్రయాణికులు ఉన్న షేర్ ఆటోలు, క్యాబ్లే ఎక్కడం ఉత్తమం. =తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా అద్దె వాటిలో వెళ్లాల్సి వస్తే అది ఎక్కే ముందు దాని నెంబర్, డ్రైవర్ పేరు అడిగి తెలుసుకుని వాటిని సన్నిహితులు, స్నేహితులకు సంక్షిప్త సందేశం, ఫోన్‌కాల్ ద్వారా తెలపాలి. =సన్నిహితులు, స్నేహితులు, కుటుంబీకులు సమీపంలో లేని వారు కనీసం పోలీసు కంట్రోల్ రూమ్ (100)కు ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఈ విషయం ఆ డ్రైవర్‌కు తెలిసేలా చేస్తే అతను దుస్సాహసాలకు ఒడిగట్టే ధైర్యం చేయడు. =మహిళలు, యువతులు వ్యక్తిగత పనులపై ఒంటరిగా బయటకు వస్తే ఎక్కడెక్కడకు వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే సంబంధీకులకు తెలపాలి.