
లండన్: లండన్‌లో ప్రముఖ క్యాబ్ సంస్థ ‘బ్లాక్ క్యాబ్స్’ తన వాహనాలను డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రిక్ కార్లు మంగళవారం లండన్ రోడ్డెక్కాయి. నగరంలో కాలుష్యం పెరుగుతున్నందున ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తన వాహన శ్రేణిలోని దాదాపు సగం డీజిల్ వాహనాలను (9వేలకు పైగా) 2021 నాటికి విద్యుత్‌తో నడిచే కార్లుగా మారుస్తున్నట్లు వెల్లడించింది. ‘ఈ వాహనాల్లోని అన్ని ఫీచర్లూ కొత్తగా ఉన్నాయి. ప్రయాణికులకు, క్యాబ్ డ్రైవర్‌కూ సౌకర్యవంతంగా ఉండనున్నాయి’ అని లండన్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ సీఈవో క్రిస్ గబ్బే తెలిపారు. ఆరుగురు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా, వైఫై, యూఎస్‌బీ చార్జర్లు, ప్లగ్ సాకెట్ వంటి వివిధ వసతులు ఈ కార్లో ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment