![Kerala: Transparent Partitions Installed in Cabs - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/11/kerala.jpg.webp?itok=NpA0-mLt)
కొచ్చి: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడికి చేసేందుకు కేరళ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ట్యాక్సీలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల్లో తిరిగి వస్తున్న వారిని తరలించేందుకు ఈ ట్యాక్సీలను వినియోగించనున్నారు. కారు లోపల ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య ప్లాస్టిక్ షీట్లతో పారదర్శక విభజన ఏర్పాటు చేశారు. పారదర్శక విభజనలతో కారు లోపల భౌతిక దూరం పెరగడంతో పాటు తుమ్మినా, దగ్గినా మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఎర్నాకుళలం జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు పారదర్శక విభజనలు ఏర్పాటు చేసినట్టు ఎంజీఎస్ లాజిస్టిక్స్ సంస్థ వెల్లడించింది. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..)
కాగా, పటిష్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తిని కేరళ సమర్థవంతంగా కట్టడి చేస్తోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణింకాల ప్రకారం కేరళలో ఇప్పటివరకు 512 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా, నలుగురు చనిపోయారు. కోవిడ్-19 నుంచి 489 మంది కోలుకున్నారు. (కరోనాను అడ్డుపెట్టుకుని అణచివేస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment