transparent
-
లోపలికి తొంగిచూడొచ్చు
1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... ఇలా సాధించారు... టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. రక్తనాళాలన్నీ కన్పించాయి ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లాభాలెన్నో... మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. → రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. → ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. → లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.కొన్నిపద్ధతులున్నాకణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘గ్యారంటీలు’ అమలు చేస్తున్నాం
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగంతోపాటు రైతన్నలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హామీల గురించి కేవలం మాటలు చెప్పడం లేదని, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు. శనివారం ఢిల్లీలో 17వ భారత సహకార సదస్సులో మోదీ మాట్లాడారు. సహకార సంఘాలు రాజకీయాలను పక్కనపెట్టి సామాజిక, జాతీయ విధానాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పారదర్శక, అవినీతి రహిత పాలనకు నమూనాగా మారాలని సూచించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చెప్పారు. వంట నూనెలు, తృణధాన్యాలు, శుద్ధి చేసిన ఆహారం, చేపల దాణాను దిగుమతి చేసుకోవడానికి మనం ఏటా రూ.2.5 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని, ఈ భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వంట నూనెల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో నూనె గింజలు, తృణ ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సహకార సంఘాలు కృషి చేయాలని కోరారు. చేసిందే చెబుతున్నాం.. గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని ప్రధాని మోదీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చౌక ధరలకే రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో భారీ మొత్తంలో పంటలను సేకరిస్తున్నామని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత నాలుగేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు. ప్రజలకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలపై మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ప్రతి రైతుకు ఏటా వివిధ రూపాల్లో రూ.50,000 లబ్ధి చేకూరుతోందని, ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. చేసిందే చెబుతున్నామని పేర్కొన్నారు. ఎంఎస్పీ ద్వారా గత తొమ్మిదేళ్లలో రైతులకు రూ.15 లక్షల కోట్లకుపైగా సొమ్ము అందజేశామని తెలియజేశారు. ఎరువుల రాయితీ కోసం ఏకంగా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంతకంటే పెద్ద గ్యారంటీ ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో రైతులకు ఒక్కో ఎరువు బస్తా కేవలం రూ.270కే లభిస్తోందని, అమెరికాలో దీని ధర రూ.3,000 పైగానే ఉందన్నారు. రైతుల జీవితాలను మార్చాలంటే చిన్న ప్రయత్నాలు సరిపోవు, భారీ ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. విపక్షాల ఐక్యత నిలిచేది కాదు షాదోల్: ప్రతిపక్షాలు ఐక్యంగా ఒక్క తాటిపైకి వస్తాయనడానికి ఎలాంటి గ్యారంటీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత గొడవలతో పార్టీలన్నీ మునిగిపోయినప్పుడు వారందరూ ఐక్యంగా ఉంటారని భావించలేమన్నారు. కాంగ్రెస్ ఇతర కుటుంబ పార్టీలన్నీ ప్రజలకి తప్పుడు హామీలిస్తున్నాయని ఇవన్నీ వారంతా ఐక్యంగా ఉండలేరనడానికి సంకేతాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడానికి అంగీకారానికొచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2047 నాటికి దేశం ఎనీమియా (రక్తహీనత)ను పారద్రోలే లక్ష్యంతో మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఒక మిషన్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలతో ఈ పార్టీలన్నీ తమ కుటుంబాల సంక్షేమమే చూస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం కాదని అన్నారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని బెయిల్‌పై బయటకు వచ్చిన వారు, కుంభకోణాల్లో దోషులుగా తేలి జైల్లో ఉండి వచ్చినవారే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారని నిందించారు. రాజకీయ పార్టీలిచ్చే హామీల్లో ఏమి అమలు చేయగలిగేవో ప్రజలే గుర్తించాలన్నారు. ఇలాంటి తప్పుడు హామీలిచ్చే వారంతా ఇప్పుడు ఒకే గూటికి వస్తామనడం విడ్డూరమేనని ఆయన ఎద్దేవా చేశారు. -
వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?
సాక్షి, ముంబై: టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా గాడ్జెట్స్‌కు సంబంధించి అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ల్యాండ్ ఫోన్లనుంచి ఫీచర్ ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఒక ఎత్తు అయితే. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల దాకా మరో ఎత్తు అని చెప్పవచ్చు. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీలు, రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా, 5జీ దాకా ఈ ప్రస్థానం చాలా గొప్పది. ఈ క్రమంలో భవిష్యత్తు ఫోన్లు ఎలా ఉంటాయో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. ఇవీ చదవండి: ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు ఐపీఎల్ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్ స్లిమ్ అండ్ స్లీక్ మాత్రమే కాదు. అత్యంత ట్రాన్సపరెంట్గా స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటోంది. The Future of Smartphones!#Smartphone #mobile #gadgets pic.twitter.com/IDIgxyRwnx — The Pakistan Affairs (@ThePKAffairs) May 28, 2023 డోంట్ మిస్ టు క్లిక్ హియర్ సాక్షి బిజినెస్ -
ప్రపంచీకరణలో మరింత పారదర్శకత అవసరం
వాషింగ్టన్: గ్లోబలైజేషన్ ప్రయోజనాలను తక్కువ చేసి చూపాలని భారత్ కోరుకోవడం లేదని కేంద్ర లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే దానిని మరింత పారదర్శకంగా మార్చాలని కోరుతోందని పేర్కొన్నారు. ప్రముఖ అమెరికన్ పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ మేరకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మరింత ప్రగతిశీలంగా ఉండాలని, ఇతర దేశాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని భారత్ కోరుతోందన్నారు. ‘‘వినడానికి మాత్రమే కాకుండా చెప్పడానికి భిన్నమైన దేశాలకు డబ్ల్యూటీఓ మరింత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని’’ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా.. భారత్ చాలా కాలంలో తన తయారీ రంగం వృద్ధి చెందేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. తను ఉత్పత్తి చేయగల వినియోగ వస్తువులను కూడా దిగుమతి చేసుకోవడం లేదని తెలిపారు. అయితే ధర వ్యత్యాసాలు, పోటీతత్వం వంటి అంశాలు అంతర్జాతీయంగా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యల విషయంలో ఆయా దేశాల మధ్య పరస్పర ప్రయోజనకర అవగాహనలు అవసరమని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానం ఇక అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ తగిన ప్రాంతమని ఆమె ఉద్ఘాటించారు. నైపుణ్యం, డిజిటలైజేషన్‌పై భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సీతారామన్ స్పష్టం చేశారు. క్రిప్టో ‘జీ 20’ ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్! క్రిప్టో రిస్క్‌లను ఎదుర్కోవడానికి ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడమే ఇండియా జీ20 ప్రెసిడెన్సీ లక్ష్యమని కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలతో సంబంధం ఉన్న నష్టాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలకు ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్ అవసరమన్నారు. భారత్ పారదర్శక ఎకానమీ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆమె అమెరికన్ వ్యాపారవేత్తలను అభ్యర్థించారు. తద్వారా పారదర్శక ఎకానమీ నుంచి లభించే ప్రయోజనాలు పొందాలని అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో సూచించారు. ప్రస్తుత భారత్ ప్రభుత్వం దేశ వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ పరిశ్రమ భాగస్వామ్యం కోసం తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వివరించారు. మహమ్మరి వంటి సవాళ్ల సమయంలోనూ దేశాభివృద్ధే లక్ష్యంగా సంస్కరణల బాటన నడిచిందన్నారు. -
Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దోపిడీకి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఇసుక పాలసీపై మరోసారి 'ఈనాడు' పత్రిక అసత్యాలు, అభూత కల్పనలతో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 'దోచుకో... పంచుకో... తినుకో...’ అనే శీర్షికతో ‘ఈనాడు’ పత్రిక పూర్తి అవాస్తవాలతో కూడిన కథనం రాశారని, వాస్తవాలను వక్రీకరిస్తూ... అబద్దాలతో కూడిన ఆరోపణలను తమ పత్రికలో ప్రచురించారన్నారు. గతంలో జేపీ, టర్న్‌కీ సంస్థలపై పదేపదే తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు పత్రిక ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నేతలు, సిండికేట్లు అంటూ మరోసారి ఊహాత్మక ఆరోపణలతో, కట్టుకథలతో వార్తను ప్రచురించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగింది ఇదే.. గత ప్రభుత్వంలో ప్రారంభంలో మహిళా సంఘాలకు ఇసుక ఆపరేషన్స్‌ను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించింది. తరువాత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వ్యక్తుల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. అటు ప్రభుత్వానికి ఐదేళ్లలో రావాల్సిన దాదాపు రూ.3825 కోట్ల ఆదాయానికి గండి పడింది. ఈ సొమ్ము ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే మరోవైపు ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దం పట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కా పత్రం లేకుండా విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ మొత్తం విధానాన్ని మార్చేందుకు సీఎం జగన్ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారు. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఇసుక టెండర్లను నిర్వహింపచేయడం, పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా.. టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ను దక్కించుకున్న జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు సంస్థ ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు రెవెన్యూగా చెల్లిస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్‌లలో రూ.475 కి విక్రయిస్తున్నారు. అలాగే రీచ్‌లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, ఇసుక కొనుగోళ్లు రవాణాలో ఎటువంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించాము. వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా సులభతర విధానాన్ని తీసుకువచ్చాం. ఎప్పటికప్పుడు తనిఖీలు ప్రతినెలా జేపీ సంస్థ తమకు అప్పగించిన రీచ్‌లకు గానూ ఎంత పరిమాణంలో పర్యావరణ అనుమతులు పొందింది, ఎంత మేర ఇసుక తవ్వకాలు చేసింది, ఎంత మేర విక్రయాలు చేసిందో గనులశాఖకు నివేదిస్తుంది. గనులశాఖ అధికారులు దీనిని పరిశీలించిన తరువాతే తరువాత తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం దాటి ఇసుకను పొరుకు రాష్ట్రాలకు రవాణా చేసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం జిఓ నెం.71 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. గనులశాఖ రీజనల్ స్వ్కాడ్స్, ఎస్ఇబి కూడా దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పనికట్టుకుని తప్పుడు కథనాలు.. ఇంత పకడ్భందీగా ఇసుక విధానాన్ని అమలు చేస్తుంటే... ఈనాడు పత్రిక పనికట్టుకుని వరుసగా తప్పుడు కథనాలను ప్రచురించడం బాధాకరం. ఈ ప్రభుత్వంపై ఏదో ఒక రీతిలో బుదరచల్లే ఉద్దేశంతోనే ఇటువంటి అసత్య కథనాలను ఈనాడు పత్రిక వండి వారుస్తోంది. నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలే సిండికేట్లుగా మారి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఏ సమాచారంతో ఈనాడు పత్రిక ఆరోపిస్తోంది? రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం ఉంది. దానికి అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇసుక కొరత అనేది లేదు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు.. వర్షాకాలం కోసం కూడా ముందుగానే డిపోల్లో ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నాం. 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు గానూ రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా. ఈనాడు పత్రిక మాత్రం ఏకంగా ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయం వస్తోందని ఏ లెక్కల ప్రకారం చెబుతోంది? పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జిఓ 71 ని జారీ చేసి, దానిని అమలు చేస్తోంది. అటువంటప్పుడు పొరుకు రాష్ట్రాలకు భారీగా అక్రమ రవాణా జరుగుతోందని ఏ ఆధారాలతో ఈనాడు పత్రిక ఆరోపణలు చేస్తోంది ఈనాడు పత్రిక చేసిన ఆరోపణల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతే, రాష్ట్రంలో అవసరాలకు ఇసుక కొరత ఏర్పడి ఉండేది కాదా? ఏ రీచ్‌లో అయినా కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. అంటే ఈనాడు పత్రిక తన కథనంలో రాసినదంతా అసత్యాలు అని అర్థమవుతోంది. ‘ఈనాడు’ రాతలకు అర్థం ఉందా? ప్రతి రీచ్ లోనూ పర్యావరణ అనుమతులు పొందిన తరువాత ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. ఇసుక పరిమాణం, రేటు కూడా ఖరారు అయిన తరువాత దానిపై వచ్చే ఆదాయం కూడా ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఇవ్వన్నీ తెలిసి కూడా జిల్లాల్లో రీచ్ ల వారీగా అత్యధిక రేట్లకు ఇసుక తవ్వకాలు చేస్తామని ఎవరైనా ముందుకు వస్తారా? జిల్లాల వారీగా కోట్ల రూపాయల రేట్లను ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారు. వారి నుంచి ముఖ్య నేతలు లక్ష్యాలు విధించి మరీ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారనే రాతలకు అర్థం ఉందా? జేపీ సంస్థ నిబంధనల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తాలను నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తోంది. అన్ని రీచ్ లు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తులు ఇసుక ఆపరేషన్స్ ఎలా చేస్తారు? నెలకు జిల్లాకు రూ.150 కోట్లు ఎలా వసూలు చేస్తారు? దానిని హైదరాబాద్ లోని ముఖ్య నేతలకు ఏ విధంగా చెల్లిస్తారు? ఊహలను వార్తలుగా రాస్తూ... ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ.... రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఇసుక పేరుతో పదేపదే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా కనీసం వివరణ కూడా కోరలేదు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తే ఈనాడు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
Karnataka: ఖాకీలూ మారాలి.. హోంమంత్రి జ్ఞానేంద్ర హెచ్చరిక
సాక్షి, బనశంకరి (కర్ణాటక): పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చే సిబ్బందిని సహించేదిలేదని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. బుధవారం మైసూరురోడ్డులోని సీఏఆర్ కేంద్ర కార్యాలయంలో నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.56 కోట్ల విలువైన సొత్తు ప్రదర్శన, వారసుదారులకు అప్పగింతలో హోంమంత్రి పాల్గొని మాట్లాడారు. రౌడీలతో, నేరకార్యకలాపాలకు పాల్పడేవారితో ఎవరైనా పోలీసులు చేతులు కలిపితే ఊరుకోబోమని, అలాంటి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచుతామన్నారు. కొందరి వల్ల పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోందన్నారు. పోలీసులు నేరగాళ్లను మట్టికరిపించాలి తప్ప నేరస్తులతో కుమ్మక్కు కారాదని సూచించారు. కొందరు పోలీసులు హత్యకేసుల్లో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వినబడుతున్నాయని, ఇలాంటివి సహించేది లేదని తెలిపారు. బాగా పనిచేసేవారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో రికవరీ చేసిన రూ.56 కోట్లు విలువచేసే వాహనాలు, బంగారం, ఇతర విలువైన సామగ్రిని, రూ.32 కోట్ల డ్రగ్స్‌ను ప్రదర్శించారు. సొత్తును సొంతదారులకు అప్పగింతను ప్రారంభించారు. సవాల్‌గా మారిన భద్రత: కమిషనర్ పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ మాట్లాడుతూ వేర్వేరు రాష్ట్రాల నుంచి ప్రజలు బెంగళూరుకు వచ్చి స్థిరపడటంతో వారికి భద్రత కల్పించడం సవాల్‌తో కూడుకున్న విషయమన్నారు. డ్రగ్స్‌ను, గూండాగిరీని అడ్డుకట్టకు కఠినచర్యలు తీసుకుంటున్నామని, నగరంలోని అఫ్గానిస్తాన్లకు పూర్తి భద్రతను కల్పిస్తామని చెప్పారు. సీనియర్ ఐపీఎస్‌లు సౌమేందు ముఖర్జీ, మురుగన్, సందీప్ పాటిల్, రవికాంతేగౌడ పాల్గొన్నారు. -
ఏపీలోని అంగన్వాడీలు.. పారదర్శక కేంద్రాలు
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలంటే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అనే గత పరిస్థితిని చక్కదిద్ది తల్లీబిడ్డలకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ కేంద్రాలను మరింత పారదర్శకంగా నిర్వహించేలా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. పైన పేర్కొన్న రెండు యాప్‌లు ఈ కేంద్రాల సేవల్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే యాప్‌ల నిర్వహణపై అంగన్వాడీ టీచర్లకు, అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మంగళవారం టీసీఎస్ సాంకేతిక నిపుణులతో వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ యాప్‌లో అప్డేట్ రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 32,59,042 మందికి అందించే పౌష్టికాహారంతోపాటు ఇతర సేవలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్ (మొబైల్ అప్లికేషన్)లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమశాఖ పర్యవేక్షణలో ఈ ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్లో సాంకేతిక లోపాలను చక్కదిద్దడంతో కొద్దిరోజులుగా మంచి ఫలితాలు ఇస్తోంది. దీన్ని యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించడంతో పనితీరు బాగుంది. రాష్ట్రంలోని మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు 3,24,378 మంది, బాలింతలు 2,23,085 మంది, మూడేళ్లలోపు చిన్నారులు 15,64,445 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 11,47,134 మంది ఉన్నారు. వారి వివరాలను వైఎస్సార్ యాప్‌లో అప్డేట్ చేసి వారిలో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం, వైద్యం వంటి సేవలు అందుతున్నది లేనిది అప్డేట్ చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్ నంబరుతో సహా అనుసంధానం చేశారు. పౌష్టికాహారం అందించి లబ్ధిదారుల బయోమెట్రిక్ సేకరిస్తారు. దీనివల్ల ఏ అంగన్వాడీ కేంద్రంలో ఎంతమందికి, ఎప్పుడు పౌష్టికాహార పంపిణీ జరిగిందనేది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లోపాలను చక్కదిద్దే వీలు కలుగుతుంది. మిల్క్ వ్యాన్ ట్రాకింగ్ అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో లోపాలు లేకుండా చేసేందుకు ఏపీ డెయిరీ ‘మిల్క్ యాప్’ను కొద్దిరోజుల కిందట అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని 181 స్టాక్ పాయింట్లకు పాల వ్యాన్ చేరుకునే వరకు జియో ట్రాకింగ్ సిస్టంతో ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతోంది. ప్రతినెల సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా తల్లీబిడ్డలకు పంపిణీచేసే పాలప్యాకెట్ల వివరాలను యాప్‌లో అప్డేట్ చేయాలి. యాప్‌లో లబ్ధిదారుల బయోమెట్రిక్ సేకరించడం ద్వారా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది తల్లీబిడ్డలకు పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఏయే ప్రాంతాల్లో పంపిణీ పూర్తయింది. ఇంకా ఎవరికైనా పౌష్టికాహారం అందకపోతే కారణాలేమిటి? ఇలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్’ దోహదం చేస్తుంది. ఏ పాల వ్యాన్ ఎక్కడ బయలుదేరింది. నిర్దేశించిన ప్రాంతానికి ఎప్పటికి చేరింది.. ఇలా పాల వ్యాన్ బయలుదేరిన దగ్గర్నుంచి పాలు అందించేవరకు దాన్ని కనిపెట్టేలా జియో ట్రాకింగ్ దోహదం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏపీ డెయిరీ రూపొందించిన ‘మిల్క్ యాప్’లో అప్డేట్ అవుతుంటాయి. యాప్‌ల ద్వారా పారదర్శక పనితీరు అంగన్వాడీ కేంద్రాలను పారదర్శకంగా పనిచేసేలా, పాలు, పౌష్టికాహార పంపిణీ పర్యవేక్షణకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, మిల్క్ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 37 వేలు, పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 10 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యాప్‌ల నిర్వహణ బాగుంది. గిరిజన ప్రాంతాల్లోని 8 వేల కేంద్రాల్లో మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ సమస్య కారణంగా సాంకేతిక సమస్యలు ఉన్నట్టు గుర్తించాం. దీన్ని అధిగమించేలా గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ నిర్వాహకులకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాం. వివరాలను నెట్వర్క్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నచోటకు వచ్చి అప్డేట్ చేసే వెసులుబాటు కల్పించాం. వారికి కొద్దిరోజులు గడువు ఇచ్చి యాప్‌ల ద్వారా డేటాను అప్డేట్ చేయాలని ఆదేశాలిచ్చాం. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాల్సిన పాలను నేలపాలు చేశారనే ఆరోపణల్లో నిజం లేదు. ఆ పాలు చెడిపోవడం వల్ల వాటిని అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయడం సరికాదని, పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. – కృతికాశుక్లా, మహిళా, శిశుసంక్షేమశాఖ సంచాలకులు -
పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలనే అంశంపై.. అధికారులతో సమావేశం నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో నిబంధన ప్రకారమే అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు.(చదవండి: ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ) ఆన్లైన్లోనే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని.. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్లపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్ అడ్మిషన్లు. ఈ నెల 18 నుంచి ఇంటర్ తరగతులు. కాలేజీల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలి. యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని’’ మంత్రి సురేష్ పేర్కొన్నారు.(చదవండి: చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు) -
ఏపీ: ఇసుక విక్రయాలు మరింత పారదర్శకం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈనెల 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటించిన తరువాత ఎపిఎండిసి ద్వారా పారదర్శకతతో ఇసుక విక్రయాలను నిర్వహిస్తున్నామని అన్నారు. (ఎడ్ల బండ్లకు ఇసుక ఉచితం) ఇసుక డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే ఆన్ లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు వుందన్నారు. కొత్త విధానం ద్వారా వినియోగదారులకు ఇసుకను అందిస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను కూడా గుర్తించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అదే క్రమంలో ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు రీచ్ లు, స్టాక్ పాయింట్లు, చెక్ పోస్ట్ లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం, గనుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ద్వారా తనిఖీలు చేయడం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండేళ్ళ జైలుశిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాన్ని చేసిందని పేర్కొన్నారు. (రీచ్‌లలో అక్రమాలు లేకుండా చూడాలి: సీఎం జగన్) ఇకపై సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ ఇప్పటి వరకు ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వారని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం వున్న వారికే ముందుగా ఇసుక లభిస్తుండటంతో, పోర్టల్ ప్రారంభించిన కొద్దిసేపటికే బుక్ అవుతోందన్నారు. దీంతో మిగిలిన వినియోగదారులకు ఇసుక బుకింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు నిర్వహించేందుకు ఈ నెల 5న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం వుంటుందని వెల్లడించారు. వినియోగదారులు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్నట్లయితే స్థానికంగా వున్న సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన అవసరానికే సదరు బుకింగ్ జరుగుతోందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, నిర్ధారించుకునేందుకు అవకాశం వుంటుందని పేర్కొన్నారు. దీనివల్ల అవసరం లేని వారు కూడా ఇసుకను బుక్ చేసి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం వుండదని స్పష్టం చేశారు. స్థానికులకు ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుకకు అనుమతి రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా స్థానికులు వాడుకునేందుకు వీలుగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గతంలో వాగులు, వంకలకు చెందిన 1 నుంచి 3వ ఆర్డర్ స్ట్రీమ్ ల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుక తీసుకునే వీలుండేదన్నారు. తాజాగా ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నదులు, జలవనరులకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా తీసుకునే ఉచిత ఇసుక పరిధిని 4, 5 ఆ పై ఆర్డర్ స్ట్రీమ్ ల వరకు కూడా పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు. గుర్తించిన వాటర్ స్ట్రీమ్ ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఉచితంగా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల జలవనరుల సమీపంలోని ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని, ఇసుక బుకింగ్ లపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు మరింత వేగవంతం.. లాక్ డౌన్ తరువాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలను మరింత వేగవంతం చేశామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిని అతి త్వరలోనే రోజుకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,53,197 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వితీశామని, దానిలో డోర్ డెలివరీ ద్వారా 33,28,553 ఎంటిలు, ఇతర వినియోగదారులకు 53,57,003 ఎంటిలు అందించామని తెలిపారు. ఇక ఉపాధి హామీ పనుల కోసం 7,51,189 ఎంటిలు, నాడు-నేడు పనులకు 3,29,814 ఎంటిలు, బల్క్ బుకింగ్ లకు 21,47,386 మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వినియోగదారులు 48,99,916 టన్నులను బుక్ చేసుకోగా, వారికి 46,20,217 టన్నులను రవాణా చేశామని తెలిపారు. కేవలం 5.7శాతం మాత్రమే వారికి పెండింగ్ వుందని తెలిపారు. అలాగే 16,70,678 టన్నుల బుల్క్ బుకింగ్ కి గానూ 14,25,797 టన్నులు రవాణా చేశామని, ఇంకా పెండింగ్ లో కేవలం 2,44,540 టన్నులు మాత్రమే వుందని వివరించారు. ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు పర్యావరణ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఇసుక అందించే నదుల్లోని ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. ఇక్కడ యంత్రాలను, ఇసుకను బయటకు పంపేందుకు లారీలు, టిప్పర్లను ఉపయోగించేందుకు నిబంధనలు అంగీకరించని నేపథ్యంలో కూలీలతో తవ్వకాలు చేసి, ట్రాక్టర్ ల ద్వారానే తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్ లకు పంపుతున్నామని తెలిపారు. అయితే కోవిడ్-19 కి ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇసుక తవ్వకాల్లో ఎక్కువశాతం పనిచేశారని, లాక్ డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధికశాతం తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. దీనితో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. దీనివల్ల కూడా ఓపెన్ రీచ్ ల నుంచి వచ్చే ఇసుక నిల్వలు కొంత మందగించాయని అన్నారు. జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా తిరిగి ఇసుక తవ్వకాల్లో నైపూణ్యం వున్న వలస కూలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓపెన్ రీచ్ లలో కూడా ఇసుక తవ్వకాలను పెంచాలని అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, మైనింగ్, ఎపిఎండిసి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఎక్కువ ఇసుకను తవ్వేందుకు, రీచ్ లలో ఆపరేషన్లు సక్రమంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో ఇసుక పై పూర్తి పర్యవేక్షణ ఇసుక ఆపరేషన్లపై జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జిల్లాలో టెక్నికల్ టీంల ఆధ్వర్యంలో రీచ్ లు, పట్టాభూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఇకపై బల్క్ బుకింగ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ల పర్యవేక్షణలోనే అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. -
కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!
కొచ్చి: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడికి చేసేందుకు కేరళ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రైవేటు ట్యాక్సీలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల్లో తిరిగి వస్తున్న వారిని తరలించేందుకు ఈ ట్యాక్సీలను వినియోగించనున్నారు. కారు లోపల ప్రయాణికులకు, డ్రైవర్‌కు మధ్య ప్లాస్టిక్ షీట్లతో పారదర్శక విభజన ఏర్పాటు చేశారు. పారదర్శక విభజనలతో కారు లోపల భౌతిక దూరం పెరగడంతో పాటు తుమ్మినా, దగ్గినా మరొకరికి వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఎర్నాకుళలం జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు పారదర్శక విభజనలు ఏర్పాటు చేసినట్టు ఎంజీఎస్ లాజిస్టిక్స్ సంస్థ వెల్లడించింది. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..) కాగా, పటిష్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తిని కేరళ సమర్థవంతంగా కట్టడి చేస్తోంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణింకాల ప్రకారం కేరళలో ఇప్పటివరకు 512 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా, నలుగురు చనిపోయారు. కోవిడ్-19 నుంచి 489 మంది కోలుకున్నారు. (కరోనాను అడ్డుపెట్టుకుని అణచివేస్తారా?) -
ఆ దందా సాగదిక...
మద్యం వ్యాపారంలో ప్రైవేటు వ్యాపారుల దందాకు ఇక చరమ గీతం పాడనున్నారు. నిరుపేదలను నిలువునా మోసగించే చర్యలు ఇక సాగనివ్వరు. లూజు విక్రయాల పేరుతో దగా చేసే విధానానికి ఇక చెల్లు చెప్పనున్నారు. కల్తీ మద్యంతో అనారోగ్యం కొనితెచ్చుకోనక్కర లేదు. ప్రభుత్వమే ఇక మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున విక్రయాలన్నీ ఇక పారదర్శకమే. సాక్షి, విజయనగరం రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్యనిషేధం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మరో కీలకమైన అడుగు పడబో తోంది. తొలుత బెల్టుషాపులు నిరోధించి...కొంతవరకు పల్లెల్లో ప్రశాంతవాతావరణం నెలకొల్పారు. ఇప్పుడు మద్యం దుకాణాలు పూర్తిగా ప్రభుత్వపరంగానే నిర్వహించడంతో లూజు విక్రయాలు... కల్తీ మ ద్యానికి చెల్లు చెప్పనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 210 మద్యం దుకా ణాలు ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. వ్యాపారులు మద్యం దుకాణాలకు టెండర్లు వేసిలాటరీ పద్ధతిలో దుకాణాలను దక్కించుకుని నిర్వహించారు. ప్రభుత్వం ఏడాది కాలానికి నిర్దేశించిన ఫీజును చెల్లించి వ్యాపారం కొనసాగించారు. దీనివల్ల మద్యం దుకాణాల్లో లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగేది. నిబంధనలు ఖాతరు చేయకుండా మద్యం దుకాణాల్లోనే లూజ్ విక్రయాలు చేసేవారు. దీంతో మద్యం విక్రయాల్లో కల్తీ జరిగి మందుబాబుల జేబులకు చిల్లు పడటమే కాకుండా మద్యం ప్రియుల ఆరోగ్యంపైనా ప్రభావం పడేది. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతులు ఉండటంతో ఆ సమయం వరకు అధికారికంగా మద్యం విక్రయాలు సాగించిన వ్యాపారులు రాత్రి 10 గంటల అనంతరం మద్యం దుకాణాల వెనుకనుంచి వారి సిబ్బందితో అనధికార విక్రయాలు సాగించేవారు. ఇక విడి విక్రయాలు బంద్.. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఇక విడి విక్రయాలకు ఆస్కారం ఉం డదు. దీనివల్ల కల్తీ జరిగే అవకాశమే ఉండదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అలాగే మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అనధికార విక్రయాలకు ఆస్కారం ఉండదు. దీంతో మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉండటం, దశలవారీ మద్య నిషేధానికి బాటలు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కల్తీకి ఆస్కారం ఉండదు.. నూతన మద్యం విధానంలో విడి విక్రయాలకు ఆస్కారం లేనందు న మద్యంకల్తీ జరిగే అవకాశం ఉండదు. అలాగే జిల్లాలో ఉన్న 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించి 168కే పరిమితం చేశాం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిబ్బందిని నియమించడంతో వారు నిర్ణీత వేళల్లోనే పని చేస్తారు కాబట్టి అనధికార విక్రయాలు జరపడానికి వీలుపడదు. – వై.బి.భాస్కరరావు, అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్, విజయనగరం -
ముందుగా ‘పారదర్శకత’ కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సంస్కరణలపై సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం ప్రధానంగా పోలింగ్‌లో ఈవీఎంల విధానానికి స్వస్తి చెప్పి మళ్లీ బ్యాలెట్ విధానానికి రావాలని ప్రతిపాదించాయి. పాలకపక్షంలోని శివసేన సహా 70 శాతం పార్టీలు బ్యాలెట్ విధానానికే స్వాగతం పలికాయి. మళ్లీ బ్యాలెట్ విధానం ఎందుకని వాదించిన పార్టీలు కూడా ఈవీఎంలను మరింత పటిష్టం చేయాలని, లోపరహితంగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చాయి. గత వరుస ఎన్నికల్లో ఓటమి మింగుపడని బీజేపేతర ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ విధానాన్ని డిమాండ్ చేస్తున్నాయనే విషయం ప్రజలకు తెల్సిందే. ఏ సాంకేతిక పరిజ్ఞానానికి సరైన భద్రతలేని భారత్‌లాంటి వర్ధమాన దేశంలో ప్రతిపక్షాల విమర్శలను, సూచనలను ఎన్నికల కమిషన్ తీవ్రంగానే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన కొన్ని ఎన్నికల్లో పలు ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో ఇది మరింత అవసరం. అఖిలపక్ష సమావేశం అనగానే ముందుగా ప్రధాని మోదీ జమిలి ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతారని అందరు ఆశించారు. ఎందుకోగానీ ఆయన ఆ ప్రస్థావననే తీసుకరాలేదు. ఎన్నికల సందర్భంగా పార్టీలు పెడుతున్న ఖర్చులపై కూడా పరిమితి ఉండాలన్న విషయం కూడా చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో అభ్యర్థులు పెడుతున్న ఖర్చుపైనే పరిమితులు ఉన్నాయి. పార్టీకి కూడా పరిమితులు విధిస్తే అభ్యర్థులు తమ ఖర్చులను పార్టీ కోటాలో వేస్తారన్న ఉద్దేశంతో నాడు పార్టీల ఖర్చుపై పరిమితులు విధించలేదు. ఎక్కువ మంది అభ్యర్థులు, పాలకపక్ష అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చుచేస్తున్నారని, అయితే వాటి వివరాలను వెల్లడించడం లేదన్నది ప్రజలందరికి తెల్సిందే. ఇప్పుడు పార్టీకి పరిమితులు విధించినా రేపు అదే జరుగుతుందని, పార్టీలు పరిమితికి మించి ఖర్చు పెట్టి, లెక్కలను పరిమితి లోపల చూపిస్తాయని తెలిసిందే. అందుకని ఆ పరిమితి విధానం వల్ల పెద్దగా లాభం లేదు. పార్టీలకు విరాళాల విధానం మరింత పారదర్శకంగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందులో న్యాయం ఉంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానం సవ్యంగా లేదు. అది పాలకపక్షానికి అనుకూలంగా ఉంది. పారదర్శకతా లేదు. అందులో తక్షణం సంస్కరణలు అవసరం. అలాగే ఆరు జాతీయ పార్టీలు ప్రజా స్క్రూటినీకి వీలుగా ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకరావాలని 2013లో కేంద్ర సమాచార కమిషనర్ సూచించారు. నాడు దాన్ని నిర్లక్ష్యం చేసిందీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అయినందున ఆ అంశాన్ని తీసుకరావాలంటే కాంగ్రెస్‌కు ఇబ్బందే ఉంటుందిగానీ పారదర్శకత కావాలంటే ఆ సూచనను అమలు చేయాల్సిందే. అందుకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందే. -
సుప్రీంలో త్వరలో పారదర్శక రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంలో దాఖలయ్యే సున్నితమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను(పిల్) ధర్మాసనాలకు కేటాయించే విషయంలో మరింత పారదర్శతక కోసం అందిన సలహాలను సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా పరిశీలించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేసులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించాయి. మరోవైపు సుప్రీం సంక్షోభం నివారణకు సీజేఐతో నలుగురు సీనియర్ జడ్జీలు సోమవారం భేటీ అయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. -
ఆ ముసుగు ధరిస్తే మాయం అవడం ఖాయం!
బీజింగ్: మాయా ముసుగును ధరిస్తే మనుషులు కూడా కనిపించకుండా మాయం అయ్యే దృశ్యాలను నాటి పౌరాణిక చిత్రాల నుంచి నేటి సైన్స్ ఫిక్షన్ చిత్రాల వరకు చూస్తూనే ఉన్నాం. ఏ వస్తువునైనా కనిపించకుండా మాయం చేసే గడియారాన్ని (క్లాక్) కనిపెట్టవచ్చంటూ కొంతమంది శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. ఎవరూ కూడా ఈ విషయంలో పూర్తి విజయాన్ని సాధించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అయితే చైనా ప్రజా భద్రత మంత్రిత్వ శాఖలో నేర దర్యాప్తు విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న చెన్ షికు అలాంటి ఓ మాయా ముసుగును ప్రదర్శించారు. అత్యంత పారదర్శకంగా ఉన్న ఓ టేబుల్ క్లాత్ లాంటి గుడ్డను ఆయన తన విభాగంలోని పార్క్‌లో ప్రదర్శించారు. ఆ క్లాత్‌ను తనముందు ఏ మేరకు పట్టుకుంటే ఆ మేరకు ఆయన నిజంగా కనిపించకుండా పోతున్నారు. వెనుతిరిగి, ముందుకు తిరిగి ఆయన ఈ మాయను అద్భుతంగా ప్రదర్శించి చూపారు. క్వాంటమ్ థియరీని ఉపయోగించి ఈ పారదర్శక క్లాత్‌ను తయారు చేశామని, అందుకనే దీన్ని ‘క్వాంటమ్ ఆఫ్ ఇన్విజుబిలిటీ క్లాక్’ అని పిలుస్తున్నామని చెప్పారు. మనిషి మీద పడి పరావర్తనం చెందే కాంతి మనిషి చుట్టూ తిరిగి బయటకు పోవడం వల్ల మనిషి కనిపించకుండా పోతారని ఆయన వివరించారు. దొంగలను పట్టుకునే పోలీసులకు, టెర్రరిస్టులను పట్టుకునే భద్రతా దళాలకు ఈ క్లాత్‌లను డ్రెస్‌లుగా కుట్టిస్తే ఎంతో ఉపయోగమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే దొంగలకు, టెర్రరిస్టులకు కూడా ఈ క్లాత్ దొరికితే ఎలా ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఆయన ఆలోచించలేకపోయారు. ఈ క్లాత్ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఆయన డిసెంబర్ 4వ తేదీన చైనా సోషల్ మీడియా ‘వైబో’ సైట్లో విడుదల చేయడంతో ఇప్పటి వరకు 2.11 కోట్ల మంది వీక్షించారు. చూసిన వారంతా అబ్బురపడ్డారు. అయితే ఇలాంటి ‘ఇన్విజబుల్ క్లాక్’ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదని ‘క్వాంటమ్ వీడియో ప్రొడక్షన్ కంపెనీ’కి చెందిన ప్రొడ్యూసర్ జూ జెన్సాంగ్ తెలిపారు. నీలి లేదా ఆకుపచ్చ ప్లాస్టిక్ క్లాత్‌ను ఉపయోగించి వీడియో తీసి దాన్ని అతి జాగ్రత్తగా ఎడిట్ చేశారని చెప్పారు. అడోబ్స్కు చెందిన ‘ఆఫ్టర్ ఎఫెక్ట్స్’, ‘బ్లాక్‌మేజిక్ ఫ్యూజన్’ లాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి దృశ్యాల బ్యాక్‌గ్రౌండ్‌ను సులభంగానే ఎడిట్ చేయవచ్చని ఆయన వివరించారు. -
‘పులి పవరు’ కావాలా!
మన దేశంలో పారదర్శకంగా ఉండమంటే ఆమడ దూరం పారిపోతారుగానీ... అపరిమిత అధికారాలు కావాలని అడిగేవారికి లోటుండదు. ఆ జాబితాలో ఇప్పుడు ఎన్నికల సంఘం (ఈసీ) వచ్చి చేరింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో తమ సంస్థ పరువుతీసేలా ఆరోపణలు చేసేవారిని ధిక్కారనేరం కింద శిక్షించే అధికారం ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో ‘కొన్ని’ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిర్వహణను ప్రశ్నిస్తున్నారని, చిన్నపాటి ఆధారమైనా లేకుం డానే ఆ ప్రక్రియపై జనంలో అనవసర అపోహలు రేకెత్తిస్తున్నారని ఆ లేఖలో తెలిపింది. ఒకపక్క ఎన్నికల పనుల్లో తలమునకలై ఉండే ఈసీకి ఇవన్నీ అదనపు భారంగా మారి, వాటికి సంజాయిషీ ఇచ్చుకోవడానికే సమయం వెచ్చించాల్సి వస్తు న్నదని ఆ సంస్థ ఆవేదన చెందింది. ఈసీ రాసిన ఈ లేఖ పూర్తి అవాస్తవాలతో కూడుకున్నదని ఎవరూ అనలేరు. ఎన్నికల కోలాహలంలో వివిధ పక్షాల నాయకులు ఈసీకి వినతులు సమర్పించు కోవడం... ఫలానా అధికారి పాలక పక్షంతో కుమ్మక్కయ్యారని ఫిర్యాదు చేయడం రివాజు. అందులో నిజానిజాలపై ఆరా తీసి చర్య తీసుకోవడం లేదా ఫిర్యాదులో నిజంలేదని చెప్పడం కూడా తరచు జరిగేదే. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇలా స్థానికంగా ఎన్నికలు నిర్వహించేవారిపైన కాక నేరుగా ఎన్నికల సంఘంపైనే ఆరోపణలు చేసింది. అది బీజేపీతో కుమ్మక్కై వోటింగ్ యంత్రాలనే తారుమారు చేసిందన్నది ఆ ఆరోపణల సారాంశం. తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఓ డమ్మీ ఓటింగ్ యంత్రంతో ఓట్లు ఎలా దారిమళ్లుతాయన్న అంశాన్ని ‘ప్రదర్శించి’ చూపింది. కాంగ్రెస్కీ, ఆప్కీ, మరో పార్టీకీ పడిన ఓట్లు బీజేపీ ఖాతాలోకి పోయి నట్టు అందులో ‘నిరూపించింది’. ఆ విషయంలో ఎన్నికల సంఘానికీ, ఆప్కూ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆప్ ఒక్కటి మాత్రమే కాదు... కాంగ్రెస్, బీఎస్పీలు కూడా ఈ మాదిరి ఆరోపణలే చేశాయి. దీనికితోడు ఢిల్లీ సర్కారు పార్ల మెంటరీ కార్యదర్శులుగా పదవులిచ్చిన 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉంటున్నట్టు పరి గణించాలని కోరే ఫిర్యాదుపై రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘం అధికారులిద్దరు విచారణ జరుపుతుండగా ఆ అధికారుల నిష్పాక్షికతపై తనకు నమ్మకం లేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పర్యవసానంగా వారిలో ఒకరు విచారణ నుంచి తప్పుకున్నారు. ఇక ఈవీఎంలపై ఆరోపణ కొత్తదేం కాదు. 2009లో దారుణంగా ఓటమిపాలైనప్పుడు చంద్రబాబు సైతం ఆ ఆరోపణే చేశారు. నవ్వులపాలయ్యారు. ఆరోపణలొచ్చినప్పుడు వ్యక్తుల వ్యవహారశైలికీ, సంస్థలు స్పందించే తీరుకూ తేడా ఉంటుంది. వ్యక్తులు వారి వారి భావోద్వేగాలతో ఒక్కోసారి సహనం కోల్పో వడం, ఇష్టానుసారం అవతలివారిని దూషించడం, దౌర్జన్యం చేయడం తరచు కనబడుతుంటుంది. నియంతృత్వ దేశాల సంగతేమోగానీ... ప్రజాస్వామ్య వ్యవస్థ లున్నచోట సంస్థల స్పందన తీరు వేరుగా ఉండాలి. వాటికి ఓపిక అవసరం. వేలా దిమంది పనిచేస్తున్నందువల్లా, వారి పని విధానంలో ఉండే విస్తృతివల్లా ఆరోప ణలు రావడం అత్యంత సహజం. తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని నిరూ పించగలిగినప్పుడు ఆరోపణలు చేసినవారే పలచన అవుతారు. మన ఎన్నికల సంఘానికి దేశంలోనేకాదు... ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు రావడమన్నది ఇంత వరకూ దానిపై ఒక్క ఆరోపణా లేకపోవడం వల్ల కాదు. ఆ వచ్చిన ఆరోపణల్లో చాలామటుకు అవాస్త వమని అది ఎప్పటికప్పుడు నిరూపించుకోవడంతోపాటు... ఆరోపణ నిజమైన పక్షంలో బాధ్యులపై సత్వరం చర్య తీసుకోవడం వల్ల... భవి ష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టం చేయడం వల్ల! నిజమే కొన్ని అంశాల విష యంలో ఇప్పుడున్న అధికారాలు ఆ సంస్థకు చాలడం లేదు. ఉదాహరణకు భారీ యెత్తున నోట్లకట్టలు పట్టుబడినప్పుడు లేదా ఓటర్లను ప్రలోభ పెట్టేలా విలువైన సరుకులు పంచుతున్నప్పుడు అందుకు బాధ్యులైన అభ్యర్థులను గుర్తించి చర్య తీసుకోవడం దాని పరిధిలో లేదు. అలాగే ఎన్నికల్లో నెగ్గడమే ధ్యేయంగా బాధ్య తారహితంగా వాగ్దానాలు చేస్తూ, అధికారంలోకొచ్చాక వాటిని ఉల్లంఘించే పార్టీలను కూడా అది ఏమీ చేయలేకపోతోంది. ఇలా అనేక అంశాల్లో దానికున్న అధికారాల పరిధి తక్కువ. అవన్నీ కావాలని కోరితే ఎవరూ ఆక్షేపించరు. ఎందుకంటే ఆ అధికారాలు మొత్తంగా ఎన్నికల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల విశ్వసనీయతను పెంచుతాయి. కానీ ఈసీ అడుగుతున్నదేమిటి? తప్పుడు ఆరోపణలు చేసినవారిని ధిక్కార నేరంకింద శిక్షించే అధికారం ఇమ్మంటున్నది. విఖ్యాత కథా రచయిత రావిశాస్త్రి పరి భాషలో చెప్పాలంటే ‘పులి పవరు’ (ఫుల్ పవర్) కావాలంటున్నది. అందుకు అది ఫిలిప్పీన్స్, ఘనా, పాకిస్తాన్, లైబీరియాల ఎన్నికల సంఘాలకున్న అధికారాలను చూపుతోంది. నిజానికి ఈ జాబితాలోని దేశాలకు ప్రజాస్వామిక దేశాలుగా పేరు ప్రఖ్యాతులేమీ లేవు. సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలన అక్కడ రివాజు. అలాంటిచోట ఎన్నికల సంఘాలకున్న అధికారాల సంగతి అటుంచి, వాటికుండే విశ్వసనీయత ఏపాటో ఎవరికీ తెలియదు. అసలు న్యాయ వ్యవస్థకు ‘కోర్టు ధిక్కార నేరం’కింద శిక్షించడానికుండే అధికారాలనే తొలగించాలని అనేకులు కోరుతు న్నారు. బ్రిటన్, అమెరికా వంటి దేశాలు సైతం ఈ మాదిరి అధికారాలను చాలా పరిమితం చేశాయి. ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థకూ, ఇలాంటి అధికారాలకూ పొసగదని ప్రజాస్వామికవాదులు భావిస్తారు. ఇలాంటి తరుణంలో ఆ అధికా రాలూ తమకూ ఇవ్వాలని ఈసీ కోరడం విపరీతమనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో కీలకమని భావించే ఎన్నికలు నిర్వహించాల్సిన సంస్థ దృక్పథం ప్రజాస్వామికం గానే ఉండాలి తప్ప దానికి విరుద్ధంగా కనబడకూడదు. ఈ మాదిరి అధికారాలు కావాలనడానికి బదులు ఓటర్ల జాబితాలో ఉన్నట్టుండి కొందరి పేర్లు ఎందుకు మాయమవుతాయో, బోగస్ ఓటర్లు ఎలా వచ్చి చేరతారో... ఈ జాడ్యాన్ని అరి కట్టడానికి, బాధ్యులను శిక్షించ డానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో ఈసీ చర్చిస్తే, పరిష్కారాలను కనుగొంటే బాగుంటుంది. -
పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు
అనంతపురం సెంట్రల్ : ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఫిజికల్ మెజర్మెంట్ (పీఎంటీ), పీఈటీ(ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్) పరీక్షలకు హాజరయ్యే పోలీస్ కానిస్టేబుల్, జైల్వార్డ¯న్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోనే రావాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎంటీ, పీఈటీ పరీక్షలు ఈనెల 13 నుంచి 19 వరకూ స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. 13న 800 మందికి, 14న 1000 మందికి, 15న 1200 మందికి, 16న 1297 మందికి, 17న 1200 మందికి, 19న 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. హాల్టికెట్లలో సూచించిన ప్రకారమే నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలన్నారు. పదోతరగతి, ఇంటర్, స్టడీ, కమ్యూనిటీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఒరిజనల్స్ తీసుకురావాలన్నారు. సదరు సర్టిఫికెట్లను గెజిటెడ్ అధికారి తో అటెస్టేçÙ¯ŒSతో కూడిన జిరాక్స్ కాపీలు కూడా ఒక సెట్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. బీసీ అభ్యర్థులు క్రిమలేయర్ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకురావాలన్నారు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న స్టేజ్–1 ఆ¯ŒSలై¯ŒS దరఖాస్తుతో పాటు స్టేజ్–2 దరఖాస్తును ఆ¯ŒSలై¯ŒSలో డౌ¯ŒSలోడ్ చేసుకొని ఈ రెండు దరఖాస్తులను పూరించి వెంట తీసుకురావాలని చెప్పారు. పీఎంటీ, పీఈటీ పరీక్షలు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కాగా జరుగుతాయన్నారు. ఇందులో ఎలాంటి లొసుగులు, అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షలన్నీ పారదర్శకంగానే జరుగుతాయని తెలిపారు. -
పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు
విద్యావికాసానికి ‘పడిశాల’ సేవలు ఎనలేనివి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి రామన్నపేట : తెలంగాణ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాల నియామకం పారదర్శకంగా జరుగుతోదని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. నగరంలోని బట్టలబజార్‌లో గల పడిశాల వీరభద్రయ్య విద్యాసంస్థలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న శతజయంతి ఉత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. తొలుత వీరభద్రయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. విద్య వ్యాపారమైన నేటి సమాజంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొంటూ సేవా దృక్పథంతో బాలికల కోసం విద్యాసంస్థలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎయిడెడ్ పాఠశాలకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులకే ఉద్యోగాలు లభించేలా వ్యవహరిస్తున్నామన్నారు. వీరభద్రయ్య సంతానం కూడ ఆయన మార్గంలోనే వారి ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని అభినందించారు. విద్యాసంస్థ చైర్మన్ రాజగురు లింగప్రసాద్ మాట్లాడుతూ విద్యలో కొనసాగుతున్న వివక్షను నిర్మూలించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపక బృందం రచించిన వివిధ ప్రక్రియల సావనీర్‌ను ఆవిష్కరించారు. వీరభద్రయ్య సతీమణి వరలక్ష్మమ్మను ఘంటా చక్రపాణి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవరాజు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాణి ప్రియదర్శిని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజు శ్రీ పాల్గొన్నారు. -
ఇంటికి వెలుగునిచ్చే గాజులాంటి చెక్క!
లండన్: ఇంటిని అందంగా తీర్చి దిద్దడంలోనూ, అలంకరణ కోసమేకాక ఇంట్లో వెలుతురు నింపేందుకు గాజు పదార్థాన్నివినియోగించడం ఇప్పటి దాకా చూస్తున్నాం. అలా అమర్చిన గ్లాస్ పగిలి పోకుండా ఎంతో సున్నితంగా చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడిక ఆ భయం లేదంటున్నారు పరిశోధకులు. గృహ నిర్మాణాల్లో గోడలకు, కిటికీలకు వాడే అద్దానికి బదులుగా గాజును పోలి ఉండే పారదర్శకమైన చెక్కను అందుబాటులోకి తెస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టేవారు ఇక ఇంట్లో వెలుతురుతోపాటు, అందాన్ని తెచ్చుకునేందుకు గాజుకంటే బలమైన చెక్కను వాడి డబ్బును ఆదా చేసుకోవచ్చంటున్నారు. ఇంటి గోడల గుండా కాంతి ప్రసరించి ఇల్లు ప్రకాశవంతంగా ఉండేందుకు గృహ నిర్మాణంలో అద్దాలను వాడటం జరుగుతోంది. అయితే ఇప్పుడు అదే స్థానంలో ఎంతో ధృఢంగా ఉండి.. గాజులాంటి పారదర్శకంగా ఉండే చెక్కను వాడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఈ పదార్థాన్ని సోలార్ సెల్ విండోగా కూడ వినియోగించవచ్చని బయోమాక్రోమోలెక్యూల్స్ జర్నల్ లో వివరించారు. నిజానికి ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుకునేందుకు, విద్యుత్తును ఆదా చేసేందుకు లేత రంగు అద్దాలను పైకప్పులకు అమర్చుకోవడం, దీపాలను ఆశ్రయించడం చేస్తుంటారు. అయితే ఈ పారదర్శకంగా ఉండే చెక్క తో అటువంటి సమస్యను తీర్చవచ్చని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా గోడలు పారదర్శకంగా ఉంటే కృత్రిమ వెలుగుల అవసరాన్ని తగ్గిస్తాయి. ఇప్పటికే చెక్కనుంచి పారదర్శకమైన కాగితాన్ని తయారు చేస్తుండగా, ప్రస్తుత పరిశోధనల్లో అదే కాగితాన్ని ధృఢంగా, బలమైన పదార్థంగా తయారు చేయడం సాధ్యమని కనుగొన్నారు. స్వీడన్ లోని స్టాకోట్ కెటిహెచ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బెర్గ్ లండ్, అతడి సహచరులు జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం ముందుగా వాణిజ్య బాల్సా చెక్క నమూనాలనుంచి పరిశోధకులు లైనిన్ తొలగించారు. సాధారణంగా మొక్కల్లో ఉండే లైనిన్ చెక్కనుంచి కాంతిని ప్రసరించకుండా చేస్తుంది. అయితే దీన్ని తొలగించడం వల్ల పూర్తి శాతం పారదర్శకత చేకూరదు. అందుకే చెక్కనుంచీ నేరుగా కాంతి లోపలకు ప్రసరించేందుకు వీలుగా యాక్రిలిక్ ను ఉపయోగిస్తున్నారు. దీంతో రెండు రెట్లు బలమైన గాజులాంటి చెక్క తయారవుతుందని చెప్తున్నారు. -
జల్సాల ట్రాన్స్ట్రాయ్
14 బ్యాంకుల్లో రూ.4,300 కోట్ల రుణం అప్పు చెల్లించకుండా విలాసాలు హైదరాబాద్: అధికారపార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీ అది. పేరు ట్రాన్స్ట్రాయ్. పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న ఈ కంపెనీ తాజాగా బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేస్తున్న కంపెనీల జాబితాలో చేరింది. 14 బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్ల రుణం తీసుకున్న ఈ కంపెనీ.. తిరిగి చెల్లిం చకుండా చేతులెత్తేసింది.ఈ పరిస్థితుల్లోనూ ఆ సంస్థ రూ.5 కోట్ల వ్యయంతో 4 లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. బ్యాంకుల్ని ముంచి విలాసాలకు ఖర్చుపెట్టడం కార్పొరేట్ ప్రపంచంలోనూ చర్చనీయాంశమైంది. లగ్జరీ కారుకోసం దేనా బ్యాంకులో రుణం తీసుకుని సరిగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు ట్రాన్స్ట్రాయ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతో మిగతా బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. మొత్తం 14 బ్యాంకులనుంచి రూ.4,300 కోట్ల రుణం తీసుకున్నట్లు తేల్చాయి. అన్ని బ్యాంకుల్లో ట్రాన్స్ట్రాయ్ ఖాతాలను ఎన్పీఏ (మొండిబకాయిలు-నాన్ పెర్ఫామింగ్ అసెట్స్)గా ప్రకటించాయి. ఇకమీదట ట్రాన్స్ట్రాయ్కు రుణాలివ్వరాదని నిర్ణయించాయి. లగ్జరీ కార్ల కొనుగోలుతో కదిలిన డొంక లంబొర్గిని హరకన్ కూప్, మెర్సిడెస్ బెంజ్ ఎస్350, బీఎండబ్ల్యూ జెడ్4 ఎస్డ్రైవ్.. కార్ల కొనుగోలుకు బీఎండబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సేవల విభాగం ‘అల్ఫెరా ఫైనాన్షియల్ సర్వీసెస్’తో ఈ ఏడాది జనవరి చివరివారంలో ట్రాన్స్ట్రాయ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మూడు కార్లకు దేనా బ్యాంకు నుంచి రుణం పొందారు. కార్లు కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత ఈఎంఐ చెల్లించడం మానేశారు. దీంతో దేనా బ్యాంకు ట్రాన్స్ట్రాయ్ ఖాతాను ఎన్పీఏగా ప్రకటించింది. దీంతో మిగతా బ్యాంకు లు మేల్కొన్నాయి. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకు నుంచి.. ఇలా మొత్తం 14 బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందిన విషయాన్ని గుర్తించాయి. సాధారణంగా ఇలా బ్యాంకుల్ని మోసగించకుండా నిరోధించడానికి వీలుగా అన్ని బ్యాంకులు కలసి ‘కన్సార్షియం’గా ఏర్పడి భారీ కంపెనీలకు రుణాలిస్తుంటాయి. కానీ ట్రాన్స్ట్రాయ్ విషయంలో ఇందుకు భిన్నంగా రుణాలివ్వడం గమనార్హం. ఈసురోమంటున్న పోలవరం పనులు రూ.4 వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్నా వేగంగా పనులు చేసిన చరిత్ర ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. నిబంధనలకు విరుద్ధంగా రూ.250 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంది. ప్రభుత్వమిచ్చిన అడ్వాన్స్కుగాను కంపెనీకి చెందిన యంత్రాలు, వాహనాల పత్రాలను అప్పగించాలని(మార్ట్గేజ్) సర్కారు సూచించింది. అయితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న యంత్రాలు, వాహనాల పత్రాలన్నింటినీ బ్యాంకులకే మార్ట్గేజ్ చేశారు. పోనీ.. తీసుకున్న అడ్వాన్స్ మేరకైనా పనులు చేసిందా? అంటే అదీ లేదు. ఏడాదిగా కనీసం రూ.100 కోట్ల విలువైన పనులూ చేయలేక చతికిలపడింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కిన నేపథ్యంలో.. మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. ఈ సదవకాశాన్నీ వినియోగించుకోకుండా సొంత పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ను కాపాడటానికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. తీరాచూస్తే.. సదరు కాంట్రాక్టర్ బ్యాంకులనుంచి భారీగా రుణం తీసుకొని ఎగనామం పెట్టారు. ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఒకవైపు ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతూనే, మరోవైపు బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన కాంట్రాక్టర్‌ను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాగా పోల వరం పనులు జరుగుతున్న ప్రాంతంలో పనిచేస్తున్న వాహనాలు నిర్వహణ లేక మూలన పడుతున్నాయి. సిబ్బందికి కొన్ని నెలలుగా జీతాలివ్వడం లేదు. మరోవైపు బ్యాంకు రుణాలను యాజమాన్యం లగ్జరీ కార్లకు, విలాసాలకు ఖర్చు పెట్టడంపై సంస్థ సిబ్బందిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
‘పారదర్శకంగా ఉండాల్సిందే’
న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండేందుకు కేంద్ర క్రీడా శాఖ నడుం బిగించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల కార్యకలాపాలను, ఆర్థిక వ్యవహారాలను తప్పనిసరిగా ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించింది. ఈ సూచనలు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్-2011లో భాగమేనని ఐఓఏ, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు రాసిన లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీలోగా అన్ని సమాఖ్యల వెబ్సైట్లలో వారి పూర్తి వివరాలు ఉంచాల్సిందేనని చెప్పింది. -
గిరిజన సంక్షేమంలో ప్రక్షాళన
మంత్రి చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఆ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నిరంతర పర్యవేక్షణ కోసం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్), మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) పరిజ్ఞానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు నిజాయితీ అధికారుల సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. పథకాల అమలుపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ‘గిరిజన ఆర్థిక పరిశోధన కేంద్రం’ నెలకొల్పుతామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధతో కలసి శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. గిరిజన వసతి గృహాల విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదు కోసం రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. సౌర విద్యుత్ దీపాలతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. చలి తీవ్రత పెరిగినందున వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల వసతి గృహాలకు 5 వేల దుప్పట్లు పంపించామన్నారు. గిరిజన మహిళల వివాహాలకు ఆర్థిక సాయం అందించే కల్యాణ లక్ష్మీ పథకం కింద 408 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకంపై విస్తృత ప్రచారం కోసం 27న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు.. జయంతి ఉత్సవాల కోసం ఇప్పటికే ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల నిధులను విడుదల చేశామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద నిర్వాసితులవుతున్న 760 గిరిజన కుటుంబాలకు పునరావాసం, ఉద్యోగాల కల్పన కోసం ఈ నెల 22న నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతాని చెప్పారు. -
ఈ బదిలీలు అక్రమం
ఇరిగేషన్ శాఖ అధికారులపై సిబ్బంది ఆగ్రహం కౌన్సిలింగ్‌ను బహిష్కరించి నిరసన చిత్తూరు (టౌన్): ఇరిగేషన్ శాఖలో చేపట్టిన బదిలీల కౌన్సిలింగ్ వివాదాస్పదమైంది. అధికారుల తీరును నిరసిస్తూ సిబ్బంది శుక్రవారం కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ‘ఏ శాఖలో లేనివిధంగా ఇక్కడే ఎందుకు బదిలీలు చేస్తున్నారు.. జన్మభూమి తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టమని ప్రభుత్వం ఆదేశిం చినా మీరెందుకు తొందరపడుతున్నా రు’ అని అధికారులపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా తిష్టవేసిన వారిని కాదని మూడేళ్లుగా పనిచేస్తు న్న వారిని బదిలీ చేయడం దారుణమన్నారు. నవంబర్ 2వ తేదీపైన బదిలీ లు చేపట్టాలి, లేదంటే పారదర్శకంగా వ్యవహరించి అందరికీ బదిలీలు వర్తిం చేలా చూడాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. ఇరిగేషన్ శాఖలో చేపట్టనున్న బదిలీల్లో భాగంగా గురువారం కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అర్హులైన వారంతా ఎస్ఈ కార్యాలయానికి రావాలని ఈనెల 22న 255 మందికి ఎస్ఈ నుంచి సమాచా రం అందింది. ఆమేరకు అందరూ గురువారం చిత్తూరులోని ఎస్ఈ కార్యాల యానికి చేరుకున్నా కౌన్సిలింగ్‌ను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. దాంతో అందరూ శుక్రవారం మళ్లీ కార్యాలయం వద్దకు చేరుకున్నా రు. అయితే మరికొద్దిసేపటికి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందనుకుంటుం డ గా వీడియో కాన్ఫరెన్సుకు వెళుతున్నాన ని చెప్పి ఎస్ఈ వెళ్లిపోయారు. దాంతో కార్యాలయం వెలుపలే వేచి ఉన్న సిబ్బంది లోపలికి వెళ్లి కౌన్సిలింగ్ గురిం చి వాకబు చేశారు. ‘ఎస్ఈ గారు వీడి యో కాన్ఫరెన్స్‌కు వెళుతున్నారు, ఆయ న మధాహ్నం రెండు గంటలకు వస్తా రు, ఈలోగా మీనుంచి అనుమతి పత్రాలను తీసుకోమని చెప్పారు’ అని చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. మీరిచ్చి న బదిలీల జాబితా పారదర్శకంగా లేద ని ఆరోపించారు. దీనికి తామేమీ చేయలేం. ఎస్ఈ గారొచ్చాక మాట్లాడండని కౌన్సిలింగ్ నిర్వహించే అధికారులు చె ప్పారు. దీంతో సిబ్బంది కౌన్సిలింగ్‌ను బాయ్‌కాట్ చేసి వెలుపలకు వచ్చేశారు. ఆ తర్వాత 3 గంటల వరకు వేచిచూసినా ఎస్ఈ రాకపోవడంతో యూనియ న్ నేతలతో కలిసి కొంతమంది సిబ్బంది కలెక్టరేట్‌కు వెళ్లి ఆయనను కార్యాలయానికి పిలుచుకువచ్చారు. యూనియన్ నాయకులతో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అనంతరం కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఆందోళన విరమించారు. -
అర్హులందరికీ పరిహారం
పారదర్శకంగా నష్టం అంచనాలు వేయండి సర్వే గడువు మరో మూడురోజులు పొడిగిస్తాం జాబితాలను గ్రామసభల్లో పెట్టండి అధికారులతో మంత్రులు గంటా, పత్తిపాటి సాక్షి, విశాఖపట్నం: ‘గతంలో విపత్తులు సంభవించినప్పుడు..ఎన్నడూ ఇవ్వలేని స్థాయిలో రెట్టింపు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనర్హులకు అందినా ఫర్వాలేదు కానీ, అర్హుల్లో ఏ ఒక్కరూ మిస్ కావడానికి వీల్లేదు’ అని రాష్ర్టమంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రూరల్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నష్టం అంచనాలపై సమీక్షించారు. తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి నుంచి గ్రామ నౌకరు వరకు ప్రతీ ఒక్కరూ రేయింబవళ్లు శ్రమించాం. కేవలం ఆరు రోజుల్లోనే సాధారణ పరిస్థితుల్లోకి రాగలిగాం. ఇప్పుడు నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకోవడమే మనముందున్న ప్రధాన కర్తవ్య’మని మంత్రులు అన్నారు. గ్రామాల్లో నష్టం అంచనాలను పారదర్శకంగా చేపట్టండి. తుది జాబితాలను గ్రామసభల్లోనే కాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించండి.. అభ్యంతరాలుంటే స్వీకరించి అర్హుల్లో ఏ ఒక్కరూ జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండని సూచించారు. ప్రతీ ఒక్కర్ని ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నష్టం అంచనాల కోసం క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే గడువు మరో మూడురోజులు పెంచే విషయమై కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లి అనుమతి తీసుకుంటామన్నారు. పలువురు మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ విశాఖ నగరంలో అందుతున్న వేగంగా గ్రామస్థాయిలో నిత్యావసరాలు,కూరగాయల పంపిణీ జరగడం లేదన్నారు. విశాఖలో మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కోరారు. విశాఖలో తొమ్మిది సరుకులిస్తుంటే గ్రామాల్లో ఐదు సరుకులే ఇస్తున్నారని దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. వరిపొలం పచ్చగా ఉన్నా తుఫాన్ ప్రభావానికి గురైనట్టుగానే పరిగణనలోకి తీసుకోవాలని,కొబ్బరి, జీడిమామిడి, మామిడి, సపోటా వంటి హార్టికల్చర్ పంటలకు కోళ్లఫారాలకు, జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ఉదారంగా స్పందించాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవానీ, ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, జిల్లాసహకార శాఖాధికారి ప్రవీణ, ఆర్డీవో వెంకట మురళి, భీమిలి మున్సిపల్ మాజీ చైర్‌పర్శన్ గాడు చిన్న కుమారి లక్ష్మి పాల్గొన్నారు. -
పారదర్శకంగా సర్వే
భయాందోళనలు అవసరం లేదు అర్హులకే సంక్షేమ ఫలాలు బోగస్ లబ్ధిదారుల ఏరివేత ‘ఇంటింటి సర్వే’ అవగాహన సదస్సులో మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అక్రమార్కుల ఏరివేతే లక్ష్యంగా ‘ఇంటింటి సర్వే’ జరుగుతుందని రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ సర్వేకు పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. సర్వే నిర్వహణలో అపోహలకు తావులేదన్నారు. ఈ నెల 19న చేపట్టే ‘ఇంటింటి సర్వే’పై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సందేహాల నివృత్తికి శనివారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే పేరుతో రేషన్‌కార్డులు ఏరివేస్తారని, స్థానికత నిర్ధారిస్తారనే ప్రచారం సరికాదన్నారు. సమాశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, జేసీ-2 ఎంవీ రెడ్డి పాల్గొన్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం ‘సర్వేను నిష్పాక్షికంగా నిర్వహిస్తాం. ఎన్యూమరేటర్ల కొరత ఉన్నా.. ప్రైవేటు ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్సేవలను వినియోగించుకుని సమస్యను అధిగమిస్తాం. జీహెచ్ఎంసీ మినహా జిల్లాలో 7.41లక్షల ఇళ్లు ఉన్నాయి. ఈ వివరాల సేకరణకు 28,549 మందిని నియోగిస్తున్నాం. ప్రతి ఎన్యూమరేటర్‌కు సర్వే తీరు, ప్రశ్నావళిని పూరించే విధానంపై 11, 12,13వ తేదీల్లో శిక్షణ ఇస్తున్నాం. పోలింగ్ విధుల మాదిరిగానే ఈ ప్రక్రియనూ నిర్వహిస్తాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే ఉంటుంది. ఎన్యూమరేటర్లు సేకరించిన డేటాను మూడు వారాల్లో కంప్యూటరీకరిస్తాం. 19న ప్రభుత్వ హాలీడే ప్రకటిస్తున్నాం. స్థిరనివాసం ఎక్కడ ఉంటే అక్కడే పేర్లు నమోదు చేసుకోవడం ఉత్తమం. ఏ మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా.. సదరు కుటుంబ యజమానిదే బాధ్యత. - కలెక్టర్ శ్రీధర్ ఆచరణ సాధ్యం కాదు సామాజిక సర్వేను ఒకే రోజు పూర్తి చేయడం ఆచరణ సాధ్యం కాదు. సమాచార సేకరణలో తప్పు జరిగితే లబ్ధిదారులు నష్టపోతారు. గతంలో అధికారుల పొరపాట్లతో రేషన్‌కార్డులు కోల్పోయిన కుటుంబాలెన్నో ఉన్నాయి. ఇప్పుడూ అలాంటి తప్పిదాలే పునరావృతమైతే తిరుగుబాటు తప్పదు. - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సర్వే ఏమైనా భగవద్గీతా? సర్వే సమంజసమే అయినా, దాన్ని భగవద్గీతగా భావించాల్సిన అవసరంలేదు. ప్రశ్నావళికి కుటుంబ సభ్యులిచ్చే సమాధానంలో వాస్తవం ఉందా? లేదా అనే విషయాన్ని తేల్చుకునేందుకు ఎన్యూమరేటర్ల దగ్గర డేటాబేస్‌ను అందుబాటులో ఉంచాలి. - నాగేశ్వర్, ఎమ్మెల్సీ గుడిసెవాసుల పరిస్థితేంటి? హడావుడిగా సర్వే చేస్తే తప్పులుదొర్లుతాయి. మా నియోజకవర్గంలో షంషీగూడలో వందలాది గుడిసెవాసులున్నారు. వీరికి ఇంటి నంబర్లు లేవు. వీరిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?. - మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే సర్వేపై ఫీడ్‌బ్యాక్ తీసుకోండి హడావుడిగా సర్వే నిర్వహించకుండా మూడు రోజుల ముందే ప్రక్రియను చేపట్టే అంశాన్ని పరిశీలించాలి. క్షేత్రస్థాయిలో ఫీడ్‌బ్యాక్ తీసుకోకుండా... ఏకపక్షంగా సర్వే నిర్ణయం తీసుకోవడంతో సహజంగానే ప్రజల్లో అపోహలకు దారితీస్తోంది. - వివేక్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సీమాంధ్రుల ఏరివేతకే.. ప్రభుత్వ పథకాల జాబితా నుంచి సీమాంధ్రులను తొలగించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమర్జెన్సీని తలపించేలా ఇప్పుడు చేస్తున్న సర్వే గ్రామీణులను ఆందోళనకు గురిచేస్తోంది. - యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే చాలా ఆందోళనలున్నాయి గ్యాస్ కనెక్షన్లు తొలగించడానికే సర్వే నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సర్వేలో శాస్త్రీయత పాటిం చకపోతే అనర్థాలకు దారి తీస్తుంది. - గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పేదలను పట్టించుకోండి ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన నం దనవనం, రాజీవ్ గృహకల్ప కా లనీల్లో లబ్ధిదారుల స్థానే కొత్తవారు నివసిస్తున్నారు. సర్వే పేరి ట వారి పేర్లను తొలగించే ఆలోచనచేయకూడదు. పేదల పక్షం గా సర్వే ఉండాలే తప్ప... కార్డుల ఏరివేత లక్ష్యంగా సాగకూడదు. - తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే మన మంచికే ప్రభుత్వ పథకాలు పేదలకే అందాలనే సంకల్పంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా సర్వేకు సహకరించాలి. - సుధీర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే కంపెనీలకు హాలీడే ప్రకటించాలి సర్వే రోజున పరిశ్రమలకు సెలవు ప్రకటించాలి. సర్వే సిబ్బంది కార్మికులు పనిచేసే కంపెనీల వద్దకు కూడా వెళ్లాలి. - ప్రకాశ్‌గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే -
వీఆర్వో పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం
వీఆర్వో, వీఏవో పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి వెల్లడించారు. ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో జరగుతున్న వీఆర్వో పరీక్షా కేంద్రంలో మంత్రి రఘువీరా పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చేప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన అభ్యర్థులకు హితవు పలికారు. ఈ నెల నాలుగో తేదీన వీఆర్వో, వీఏవో పరీక్షల 'కీ' లను విడుదల చేస్తామన్నారు.