పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు | Fitnes tests transparent | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు

Published Mon, Dec 12 2016 12:57 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

Fitnes tests transparent

అనంతపురం సెంట్రల్‌ :   ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ (పీఎంటీ), పీఈటీ(ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌) పరీక్షలకు హాజరయ్యే పోలీస్‌ కానిస్టేబుల్, జైల్‌వార్డ¯న్ అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోనే  రావాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎంటీ, పీఈటీ పరీక్షలు ఈనెల 13 నుంచి 19 వరకూ స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. 13న 800 మందికి, 14న 1000 మందికి, 15న 1200 మందికి, 16న 1297 మందికి, 17న 1200 మందికి, 19న 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.  హాల్‌టికెట్లలో సూచించిన ప్రకారమే నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలన్నారు. పదోతరగతి, ఇంటర్, స్టడీ, కమ్యూనిటీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఒరిజనల్స్‌ తీసుకురావాలన్నారు.  సదరు సర్టిఫికెట్లను గెజిటెడ్‌ అధికారి తో అటెస్టేçÙ¯ŒSతో కూడిన జిరాక్స్‌ కాపీలు కూడా ఒక సెట్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. బీసీ అభ్యర్థులు క్రిమలేయర్‌ సర్టిఫికెట్‌ కచ్చితంగా తీసుకురావాలన్నారు. ఇప్పటికే డౌన్లోడ్‌ చేసుకున్న స్టేజ్‌–1 ఆ¯ŒSలై¯ŒS దరఖాస్తుతో పాటు స్టేజ్‌–2 దరఖాస్తును ఆ¯ŒSలై¯ŒSలో డౌ¯ŒSలోడ్‌ చేసుకొని ఈ రెండు దరఖాస్తులను పూరించి వెంట తీసుకురావాలని చెప్పారు. పీఎంటీ, పీఈటీ పరీక్షలు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కాగా జరుగుతాయన్నారు. ఇందులో ఎలాంటి లొసుగులు, అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షలన్నీ పారదర్శకంగానే జరుగుతాయని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement