ఈ బదిలీలు అక్రమం
- ఇరిగేషన్ శాఖ అధికారులపై సిబ్బంది ఆగ్రహం
- కౌన్సిలింగ్‌ను బహిష్కరించి నిరసన
చిత్తూరు (టౌన్): ఇరిగేషన్ శాఖలో చేపట్టిన బదిలీల కౌన్సిలింగ్ వివాదాస్పదమైంది. అధికారుల తీరును నిరసిస్తూ సిబ్బంది శుక్రవారం కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ‘ఏ శాఖలో లేనివిధంగా ఇక్కడే ఎందుకు బదిలీలు చేస్తున్నారు.. జన్మభూమి తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టమని ప్రభుత్వం ఆదేశిం చినా మీరెందుకు తొందరపడుతున్నా రు’ అని అధికారులపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా తిష్టవేసిన వారిని కాదని మూడేళ్లుగా పనిచేస్తు న్న వారిని బదిలీ చేయడం దారుణమన్నారు. నవంబర్ 2వ తేదీపైన బదిలీ లు చేపట్టాలి, లేదంటే పారదర్శకంగా వ్యవహరించి అందరికీ బదిలీలు వర్తిం చేలా చూడాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
ఇరిగేషన్ శాఖలో చేపట్టనున్న బదిలీల్లో భాగంగా గురువారం కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అర్హులైన వారంతా ఎస్‌ఈ కార్యాలయానికి రావాలని ఈనెల 22న 255 మందికి ఎస్‌ఈ నుంచి సమాచా రం అందింది. ఆమేరకు అందరూ గురువారం చిత్తూరులోని ఎస్‌ఈ కార్యాల యానికి చేరుకున్నా కౌన్సిలింగ్‌ను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. దాంతో అందరూ శుక్రవారం మళ్లీ కార్యాలయం వద్దకు చేరుకున్నా రు. అయితే మరికొద్దిసేపటికి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందనుకుంటుం డ గా వీడియో కాన్ఫరెన్సుకు వెళుతున్నాన ని చెప్పి ఎస్‌ఈ వెళ్లిపోయారు.
దాంతో కార్యాలయం వెలుపలే వేచి ఉన్న సిబ్బంది లోపలికి వెళ్లి కౌన్సిలింగ్ గురిం చి వాకబు చేశారు. ‘ఎస్‌ఈ గారు వీడి యో కాన్ఫరెన్స్‌కు వెళుతున్నారు, ఆయ న మధాహ్నం రెండు గంటలకు వస్తా రు, ఈలోగా మీనుంచి అనుమతి పత్రాలను తీసుకోమని చెప్పారు’ అని చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. మీరిచ్చి న బదిలీల జాబితా పారదర్శకంగా లేద ని ఆరోపించారు. దీనికి తామేమీ చేయలేం. ఎస్‌ఈ గారొచ్చాక మాట్లాడండని కౌన్సిలింగ్ నిర్వహించే అధికారులు చె ప్పారు.
దీంతో సిబ్బంది కౌన్సిలింగ్‌ను బాయ్‌కాట్ చేసి వెలుపలకు వచ్చేశారు. ఆ తర్వాత 3 గంటల వరకు వేచిచూసినా ఎస్‌ఈ రాకపోవడంతో యూనియ న్ నేతలతో కలిసి కొంతమంది సిబ్బంది కలెక్టరేట్‌కు వెళ్లి ఆయనను కార్యాలయానికి పిలుచుకువచ్చారు. యూనియన్ నాయకులతో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అనంతరం కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఆందోళన విరమించారు.