స్కావెంజర్ల నుంచి క్యాబ్ డ్రైవర్లుగా..! | From dirty drains to smart cabs | Sakshi
Sakshi News home page

స్కావెంజర్ల నుంచి క్యాబ్ డ్రైవర్లుగా..!

Published Mon, Oct 5 2015 6:54 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

స్కావెంజర్ల నుంచి  క్యాబ్ డ్రైవర్లుగా..! - Sakshi

స్కావెంజర్ల నుంచి క్యాబ్ డ్రైవర్లుగా..!

ఇతరుల మలినాలను నెత్తినెత్తుకొని స్కావెంజర్లుగా పనిచేసిన వారి బతుకుల్లో ప్రస్తుతం కాస్త వెలుగులు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా రాజధాని ఢిల్లీలో తాజాగా కనిపిస్తున్న కొత్త మార్పు... మరి కొద్ది రోజుల్లో దేశంలోని ఇతర నగరాలకు వ్యాపించనుంది. కుల ప్రాతిపదికన తరతరాలుగా చేపడుతున్న వృత్తుల్లో అత్యంత నీచ స్థితిలో ఉన్న సఫాయీ కర్మచారీ వృత్తి, వివక్షలో చిక్కుకున్న జీవితాలు మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నంలో భాగంగా హస్తినలో వచ్చిన మార్పు కొన్ని కుటుంబాను తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తోంది.

రోడ్లు ఊడుస్తూ, టాయిలెట్లు క్లీన్ చేస్తూ, డ్రైనేజీలు కడుగుతూ గడిపిన  వారి తల్లిదండ్రుల జీవన విధానానికి ఇప్పుడా 250 మంది యువతులు స్వస్థి చెప్పారు. వేలల్లో జీతాలు వచ్చే  క్యాబ్ డ్రైవర్లుగా మారారు. తమకు దగ్గరలోని పార్కుల్లోనే మార్సల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, కాస్తంత ఆంగ్ల భాషనేర్చుకొని, మురికి వాడ నుంచి ఊబర్, ఓలా వంటి  కమర్షియల్ టాక్సీ డ్రైవర్లుగా మారుతున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం, సాధికారత విభాగం ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాలనుంచి 9 వందల మంది మహిళలకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించింది. ఇది ఒక్క ఢిల్లీ నగరానికే కాక దేశంలోని ముంబై, బెంగళూరు, కోల్ కతా, చెన్నై నగరాల్లో కూడ అమలు చేస్తామని మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ చెప్పారు.

మా అమ్మ ఆ ఉద్యోగాన్ని పదేళ్ళ పాటు చేసింది. కానీ మేం మా జీవితాలు కాస్త మెరుగు పడతాయని ఆశిస్తున్నాం అంటుంది... రద్దీ ప్రాంతంలో డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఇరవై రెండేళ్ళ ఓ ట్యాక్సీ డ్రైవర్. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారంతా  17 నుంచి 25 ఏళ్ళ మధ్య వయసుండి, ఢిల్లీలోని మాదంగీర్, సంగం విహార్, లాల్ కౌన్, అంబేద్కర్ నగర్ల నుంచి వచ్చిన వారే. వీరిలో కొందరు పదో తరగతి, ఇంటర్ వరకూ చదివిన వారు కూడ ఉన్నారు. ఇటువంటి వారు కొందరు శిక్షణ అనంతరం తాము స్వయంగా ట్రావెల్ ఏజెన్సీలను నిర్వహించుకుంటామని చెప్తున్నారు. కొందరైతే ఇటువంటి మార్పు తమ జీవితాల్లో వస్తుందని ఊహించలేదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోటార్ డ్రైవింగ్ స్కూళ్ళనుంచి మొదటిగా పది కార్లతో ఈ శిక్షణ తరగతులు మొదలు పెట్టారు. అయితే శిక్షణ ప్రారంభమైనప్పుడు మహిళల్లో ఆత్మ విశ్వాసం తక్కువగానే కనిపించినా ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్రైవింగ్ నేర్చుకొంటున్నారని గ్రేటర్ కైలాష్ ఆఫీస్ లోని నాగరాజ్ అంటున్నారు.

అయితే మహిళలు ట్యాక్సీ డ్రైవర్లుగా ఉండాలంటే వారికి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు కూడ వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు మూడు వేలమంది క్యాబ్ డ్రైవర్లకు ఢిల్లీలోని సిటీ పార్క్ లో మ్యానరిజమ్ పాఠాలు కూడ నేర్పుతున్నాం అంటున్నారు సీనియర్ ఎస్ జే ఈ అధికారి మునియప్ప నాగరాజ్.

ప్రభుత్వం ద్వారా అమల్లోకి  తెచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడే అవకాశం ఉందని, అయితే అసలు మొత్తం ఢిల్లీలో సుమారు అరవై వేలమంది పఫాయీ కార్యికులకు కనీసం నెల జీతం వచ్చే అవకాశం కూడ లేదని ఓ ఎన్జీవో సంస్థ సభ్యురాలు దును రాయ్ అంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని ఆమె సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement