Dirty
-
సర్దుకు పోవద్దు.. సర్దుకుందాం ఇలా..!
కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవడంలో మొదటి మెట్టు... వంట పూర్తి కాగానే.. కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌను వెంటనే శుభ్రం చేసేసుకోవడం. స్టవ్ మీద, ప్లాట్‌ఫామ్ మీదా మనం వండిన వంటలోని చిందులు, నూనె మరకలు పడటం సహజం. అలాంటి వాటిని వంట అవగానే వెంటనే తుడిచేయాలి. గోరువెచ్చటి నీళ్లలో వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే.. క్రిములు తొలగిపోతాయి. స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌ని ఉపయోగించచ్చు. అవి కాసింత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది కిచెన్ టవల్స్నే వాడతారు. ఒకోసారి కిచెన్‌లో నూనె ఒలికిపోతుంటుంది. వెంటనే ఆ నూనె మీద గోధుమ పిండి లేదా బియ్యప్పిండిని చల్లి కాసేపటి తరువాత పేపర్‌తో తుడిస్తే జిడ్డులేకుండా శుభ్రపడుతుంది. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై మరకలు ఉంటే.. వంటసోడా వేసిన నీళ్లతో కిచెన్ ప్లాట్‌ఫామ్ తుడిస్తే చాలు. అంతేకానీ బ్లీచింగ్, అమోనియా లాంటివి వాడటం వల్ల క్యాబినెట్కున్న రంగులు, టైల్స్ దెబ్బతింటాయి. కూరగాయలు తరగడం పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. తరిగేటప్పుడే ఓ డబ్బా పెట్టుకొని, తొక్కలు, తొడిమల్లాంటివి దాంట్లో వేసి తర్వాత చెత్తడబ్బాలో పడేస్తే.. శుభ్రంగా ఉంటుంది. కిచెన్ టవల్స్‌ను కూడా... కిచెన్ ప్లాట్‌ఫామ్‌ని, స్టవ్నీ క్లీన్ చేసేందుకు ఉపయోగించే కిచెన్ టవల్ని సరిగా శుభ్రం చేయకపోతే దానికి ఉండే బ్యాక్టీరియా వల్ల అంతవరకు మనం చేసినదంతా నిరర్థకమవుతుంది. కిచెన్ టవల్స్ జిడ్డుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సర్ఫ్, వాషింగ్ లిక్విడ్ వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బట్టలుతికే బ్రష్‌తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి. కిచెన్ క్యాబినెట్ కిచెన్ ప్లాట్‌ఫామ్ కింద లేదా పైన సామాన్లు పెట్టుకోవడం కోసం ఉంచిన ర్యాక్స్, క్యాబినెట్ పుల్స్, హ్యాండిల్స్‌పై కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని క్రిమిసంహారక వైప్‌తో క్లీన్ చేస్తే మంచిది. వెనిగర్‌ని క్లాత్‌పై స్ప్రే చేసి వాడండి. దీనివల్ల వేలిముద్రలు, నీటి గుర్తులు పోయి తెల్లగా మెరుస్తాయి. ఫ్రిజ్ క్లీన్‌గా.. ఫ్రిజ్‌లో మనం చాలా స్టఫ్ పెడుతుంటాం. కానీ, దానిని ఎప్పుడో ఓసారి క్లీన్ చేస్తుంటాం. అలా కాకుండా దీనిని కూడా మరకలు లేకుండా శుభ్రంగా తుడవడం మంచిది. ఫ్రిజ్ కింద, డోర్స్, లోపల గ్లాసెస్.. ఇలా అన్నింటిని తడిగుడ్డతో తుడిస్తే త్వరగా క్లీన్ అవుతుంది. ఇక మిగిలిపోయిన ప్రతిదానిని ఫ్రిజ్‌లో తోసేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా మంచిది. సింక్ క్లీన్.. కిచెన్ క్లీన్ చేయాలంటే ముందుగా సింక్‌ని క్లీన్ చేయాలి. సింక్ బేసిన్ నీట్‌గా ఉందో లేదో చూసుకోండి. కౌంటర్ చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి దూరమవుతాయి. అందుకే, ముందు దీనిని క్లీన్ చేయండి. సింక్ సరిగ్గా లేకపోతే అందులో నుంచే ఎక్కువ బొద్దింకలు, వాటి ద్వారా వ్యాధులు వస్తాయి. కొద్దిగా బ్లీచింగ్ పౌడర్, డిష్‌వాష్, బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సరి. సింక్‌లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్ వాటర్‌తో శుభ్రం చేసేస్తే సింక్ దుర్వాసన రాకుండా ఉంటుంది. కాస్త తీరిక దొరికినప్పుడు ఓ క్లాత్ తీసుకుని వాటర్ స్ప్రే చేస్తూ కిచెన్ గోడలు, కౌంటర్స్‌ని క్లీన్ చేయండి. ఇందుకోసం మార్కెట్లో దొరికే స్ప్రేలను కూడా ఉపయోగించవచ్చు.. ఇప్పుడు డోర్ ఫ్రేమ్స్‌ని క్లీన్ చేయండి. వంటగదిని అన్ని వస్తువులు సులభంగా దొరికేలా సర్దుకుంటే వంట చేయడం ఈజీ అవుతుంది. ఎలాగో చూద్దాం... ట్రాన్స్పరెంట్ డబ్బాలు వంట చేసుకునేప్పుడు ఏ డబ్బాలో ఏముందా? అని వెతుక్కోవడానికే సమయం వృథా అవుతుంది. అలా కాకుండా షెల్ఫుల్లో ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు లేదా స్టీల్ డబ్బాలూ గాజు సీసాలూ అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. పని సులభం అవుతుంది. సరుకులనూ వేరు చేయడం వంట గదిలో షెల్ఫులలో అన్ని సరుకుల్ని అన్ని షెల్ఫుల్లో సర్దేయకుండా ఎక్కువగా వంటకు వాడే వాటిని ఒకచోట, తక్కువగా వాడే పదార్థాల్ని వేరే షెల్ఫులో, బేకింగ్ సామగ్రిని మరో దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
మురికి బెడ్‌షీట్‌తో హఠాత్ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్ ఫైటర్స్!
రోజంతా పనిచేసి అలసిపోయాక సాయంత్రం అయ్యేసరికి మంచం మీద వాలిపోతాం. రాత్రంతా మంచంపైననే విశ్రాంతి తీసుకుంటాం. అయితే మంచం మీద వేసే బెడ్‌షీట్ గురించి అంతగా ఆలోచించం. చాలామంది అపరిశుభ్రంగా ఉన్న బెడ్‌షీట్‌నే వాడేస్తుంటారు. ఇది అనారోగ్యకరం అని తెలిసినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. అయితే తాజాగా ఫైర్ ఫైటర్స్ బెడ్‌షీట్ గురించి తెలిపిన ఒక విషయం ఎంతో ఆశ్చర్యం గొలుపుతోంది. స్లీప్ ఫౌండేషన్ వెలువరించిన ఒక రిపోర్టు ప్రకారం ప్రతీ మనిషి అధిక సమయం బెడ్‌పైనే గడుపుతాడు. అయితే మురికి పట్టిన బెడ్‌షీట్ ఉపయోగిస్తే అది అగ్ని ప్రమాదానికి దారి తీయవచ్చు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఫైర్ బ్రిగేడ్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. మురికిపట్టిన బెడ్షీట్లపై ఎమోలియంట్స్, లేదా స్కిన్ క్రీమ్ అవశేషాలు జమ అవుతాయి. ఇవి మండే గుణాన్ని కలిగివుంటాయి. వేసవి కాలంలో ఇవి మరింత వేడికి గురై అగ్నిప్రమాదాలకు తావిస్తాయి. అందుకు ఎవరైనా చర్మపు క్రీమ్‌లను వినియోగిస్తున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా మెలగాలి. అటువంటి క్రీమ్‌లు బెడ్‌షీట్‌కు అంటుకోకుండా చూసుకోవాలి. లండన్‌లో ఈ విధంగా బెడ్షీట్లు దగ్ధమైన ఘటనలు వెలుగు చూశాయి. మిర్రర్ రిపోర్టును అనుసరించి ఎవరైనా వారానికి ఒకసారి బెడ్‌షీట్‌ను శుభ్రం చేయాలి.వీటిని 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటిలో ఉతకాలి.బెడ్షీట్లు, తలదిండు గలేబులు ఎక్కువగా మురికి పట్టినట్లు అనిపిస్తే వారానికి రెండుసార్లు ఉతకాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా చర్మవ్యాధులు ఉన్న పక్షంలో బెడ్షీట్లను తరచూ ఉతుకుతుండాలి. ఇది కూడా చదవండి: అందం కోసం కొత్త దంతాలు..‘షార్క్’లా మారిన యువకుడు -
‘వరల్డ్ డర్టీ మ్యాన్’ ఇక లేరు.. 67 ఏళ్ల తర్వాత స్నానం చేయడంతో.. !
తెహ్రాన్: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి(డర్టీ మ్యాన్)గా పేరు గాంచిన ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ(94) కన్నుమూశారు. సుమారు 67 ఏళ్లకుపైగా స్నానం చేసి ఎరుగుని హాజీ.. కొద్ది నెలల క్రితం తొలిసారి స్నానం చేశారు. స్నానం చేసిన నెలల వ్యవధిలోనే ఆయన కన్నుమూయటం గమనార్హం. ప్రస్తుతం 94 ఏళ్ల వయసున్న అమౌ హాజీ.. మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. దక్షిణ రాష్ట్రం ఫార్స్‌లోని డెజ్గా గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న హాజీ ఆదివారం తుది శ్వాస విడిచారని ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అనారోగ్యానికి గురవుతాననే భయంతో ఆరు దశాబ్దాలకుపైగా స్నానం చేయలేదని, అయితే, కొద్ది నెలల క్రితం గ్రామస్తులు బలవంతంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లి స్నానం చేయించారని తెలిపింది. ఆయన జీవితంపై ‘ద స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ’ అనే డాక్యూమెంటరీ సైతం నిర్మించారు. ఇదీ ఆయన కథ.. స్వచ్ఛమైన అనే పదానికి అమౌ హాజీ అరవై అడుగుల దూరంలో ఉండేవారు. శుభ్రమైన అనే పదం తనకు ఇష్టం ఉండదని పలు సందర్భాల్లో చెప్పారు. తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఏదో అనారోగ్యం వెంటాడిందని, అందుకు కారణం పరిశుభ్రతే అని గ్రహించానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్ని జ్వాలలతోనే హెయిర్ కట్ చేసుకునే పద్ధతినే ఆరు దశాబ్దాలుగా ఉపయోగించేవారు హాజీ. రోజుకు 5 లీటర్ల నీటిని తాగుతారు. మురికిగా ఉన్న డబ్బాలోనే ఆ నీటిని నిల్వ ఉంచేవారు. అయితే, అపరిశుభ్రంగా జీవిస్తున్నా.. ఎంతో ఆరోగ్యంగా జీవించటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేది. ఆయనకంటూ స్నేహితులు లేరు. వివాహం చేసుకోలేదు. స్మోకింగ్ చేస్తూ రిలాక్స్ అయ్యేవారు హాజీ. అత్యధిక కాలం స్నానం చేయని వారిలో హాజీదే రికార్డు. గతంలో 66 ఏళ్ల కైలాశ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అమౌ హాజీ రెండున్నర దశాబ్దాల కిందటే సవరించాడు. 38 ఏళ్లు స్నానం చేయకుండా ఉన్న కైలాశ్.. హాజీ (67 ఏళ్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇదీ చదవండి: విమానంలో అద్భుతమైన ఘట్టం...30 ఏళ్ల తర్వాత.... -
స్నానం చేయకుండా 65 ఏళ్లకు పైనే..
టెహ్రాన్ : రెండు రోజులు స్నానం చేయకపోతేనే చెమటకంపుతో మనతో పాటు మన చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే అయ్యిందట. దీంతో ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పేరుగాంచిన హాజీ 83 ఏళ్ల వయసులోనూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇరాన్‌లోని దెజ్ అనే ప్రాంతంలో నివసిస్తున్న హాజీ ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో రోజూ స్నానం చేయడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని భావించి..అప్పటినుంచి స్నానం చేయడం మానేశాడు. ఎక్కువగా నాన్‌వెజ్ వంటకాలను ఇష్టపడే హాజీ కుళ్లిపోయిన మాంసాన్ని కూడా ఆరగించేస్తాడు. ఊరి వెలుపల ఓ చిన్న గుడిసెలో నివసించే హాజీకి గ్రామస్తులే భోజనం పెడుతుంటారు. అంతేకాకుండా ఆరు దశాబ్దాలుగా పైగా స్నానం చేయకపోయినా తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాడని గ్రామస్తులు చెప్పారు. (పాతిపెట్టిన పిల్లిని బయటకు తీసి.. ఆపై ) కుళ్లిపోయిన అడవిపంది మాంసాన్ని చాలా ఇష్టంగా తింటానని, రోజుకు అయిదు లీటర్ల నీటిని మాత్రం తాగుతుంటానని హాజీ తెలిపాడు. అంతేకాకుండా తనకు పొగతాడటం అంటే చాలా ఇష్టమని, ఒకవేళ సిగరెట్ అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలనే చుట్టలా కాల్చుకొని తాగుతానని పేర్కొన్నాడు. ఇంత అపరిశుభ్రంగా, మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం, అతని చుట్టు పక్కల వారినే కాకుండా ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేలా ఉంది. ఏది అయితేనేం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా హాజీ రికార్డులకెక్కారు. (వేడి వేడి బటర్ చాయ్.. నిర్వహకుడిపై వ్యంగ్యాస్త్రాలు) -
సోషల్ మీడియాలో ‘చెత్త’ వద్దు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా అనవసర విషయాలను ప్రచారం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. దేశం గురించి గొప్పగా చెప్పే, సమాజ బలోపేతానికి దోహదపడే సానుకూల వార్తలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం వారణాసికి చెందిన బీజేపీ కార్యకర్తలు, వలంటీర్లతో మోదీ బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. గల్లీలో రెండు కుటుంబాల మధ్య జరిగే చిన్నాచితకా గొడవలను సోషల్ మీడియాలో జాతీయస్థాయి వార్తగా చిత్రిస్తుండటంపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. మానసిక పవిత్రతకూ ‘స్వచ్ఛ్ భారత్’.. ‘ప్రజలు కొన్నిసార్లు మర్యాద హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాము విన్న తప్పుడు సమాచారాన్ని ఇతరులకు పంపిస్తున్నారు. దీని వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతోందో వారు గ్రహించడం లేదు. సమాజ ఔన్నత్యానికి తగని పదాలను వాడుతున్నారు. మహిళల గురించి ఏది తోచితే అది రాస్తున్నారు. నేను మాట్లాడుతోంది ఏదో ఒక రాజకీయ పార్టీకో, సిద్ధాంతానికో సంబంధించింది కాదు. మొత్తం 125 కోట్ల మంది భారతీయులతో ముడిపడి ఉంది’ అని మోదీ అన్నారు. నేడు నేపాల్‌కు మోదీ కఠ్మాండులో జరిగే నాలుగో బిమ్స్టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక సహకార సంస్థ) సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ గురువారం నేపాల్ బయల్దేరనున్నారు. రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు. -
పారిశుద్ధ్య లోపం వల్లనే అనారోగ్యం : డీఎంఎచ్ఓ
పెద్దపడిశాల (గుండాల) : పారిశుద్ధ్య లోపం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, విష జ్వరాలు కావని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భానుప్రసాద్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దపడిశాల గ్రామాన్ని సందర్శించి అనారోగ్యానికి గురైన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విష జ్వరాలు సోకినట్లు ప్రజలంతా కామెర్ల వ్యాధి భారిన పడ్డారని సమాచారం అందిన మేరకు ఆయన గ్రామాన్ని సందర్శించారు. నివాస గృహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడం, వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి మురుగు నీరు నిలబడి తాగు నీరు కలుషితమైనందున కీళ్ల నొప్పులు, జలుబుతో బాధపడుతున్నారని కామెర్ల వ్యాధి వచ్చిన వారిని ఆర్ఎంపీ వైద్యుడు భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేట్ ఆసుపత్రుల వైపు అనారోగ్యానికి గురైన వారిని పంపించడం పట్ల ఆర్ఎంపీ వైద్యుడిని తీవ్రంగా మందలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రేణుక, మండల వైద్యాధికారి కిరణ్, సీహెచ్‌వో శ్రీనివాస్‌చక్రవర్తి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఉన్నారు. -
మురికి గుంటలో పడ్డ బాలుడు
-
ఈ మాస్టారు మంచోడు కాడు..
నర్సాపూర్ రూరల్: ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వెలుగులోకి వచ్చింది. 6, 7 తరగతి చదువుకునే విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ మూడు రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు గ్రామస్తులతో కలసి హెచ్ఎంను నిలదీశారు. ఆగ్రహానికి లోనైన కొందరు నిందితుడిపై దాడికి యత్నించగా..గ్రామ పెద్దలు హెచ్ఎంను గదిలో ఉంచి తాళం వేశారు. విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని గ్రామస్తుల సమక్షంలో విచారణ చేసి నిందితుడిని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ విషయమై హెచ్ఎం విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హెచ్ఎం తీరుని నిరసిస్తూ గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. -
బీజేపీ ఆఫీసుల్లో టాయ్‌లెట్స్ చూడండి!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మానస పుత్రికైన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఎంత ఊదరగొడుగుతున్నా ఆయన పార్టీ బీజేపీకి చెందిన నేతలకు మాత్రం అది చెవికెక్కుతున్నట్టు లేదు. సాక్షాత్తు ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్ లోని బీజేపీ కార్యాలయంలోనే సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఎన్నోసార్లు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని ఆ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఉన్న మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల కంపుకొడుతున్నాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలకు సరైన మరుగు దొడ్లు లేవని అంటున్నారు. బీజీపీ ఢిల్లీ శాఖకు చెందిన కార్యాలయంలో కూడా ఇలాంటి అధ్వాన్న పరిస్థితే కొనసాగుతోంది. బీజేపీ అధికారంలోవున్న మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమ మున్సిపల్ పరిధిలో ఏడాదిలో ఏడెనిమిది లక్షల మరుగు దొడ్లను నిర్మిస్తామని పార్టీ నేతలు గొప్పగా ప్రకటించారు. ఏడాది గడిచినా వందకు మించి మరుగుదొడ్లు నిర్మించిన దాఖలాలు కనిపించడం లేదు. బీజేపీ పార్టీ కార్యాలయం తన నియోజక వర్గం పరిధిలో ఉన్నందున తన నియోజకవర్గం నిధులతో తానే స్వయంగా శుభ్రమైన మరుగు దొడ్లు కట్టిస్తానని, అందుకు అనుమతించాలంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ స్వయంగా లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘స్వచ్ఛ భారత్’ పథకాన్ని ఘనంగా ప్రకటించడం తెల్సిందే. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించారు కూడా. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం సెలబ్రటీలను అంబాసిడర్లుగా నియమించిన విషయమూ తెల్సిందే. పథకాన్ని ప్రకటించిన పార్టీనే పట్టించుకోకపోతే ప్రజలెలా ముందుకు కదులుతారు? -
బాడీటాక్స్
స్నానాలే సరిపోవు..శరీరం లోపలికి మురికిని కూడా కడగాలి డీటాక్స్ ఎందుకు..? శరీరంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన మలినాలను, కాలుష్యాలను, విషపదార్థాలను పూర్తిగా ప్రక్షాళన చేసి, పునరుత్తేజం పొందడానికి డీటాక్స్ చక్కని మార్గం. ఇది సామాన్యులకూ సాధ్యమే. శరీరంలో దీర్ఘకాలంగా పేరుకున్న విషపదార్థాలను పూర్తిగా వెలుపలకు పంపి, జీర్ణవ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు క్రమబద్ధమైన ఆహార పానీయాలు తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయడం అవసరం. వాటి ప్రభావంతో విసర్జన ప్రక్రియ మెరుగుపడి, శరీరంలోని విషపదార్థాలు వెలుపలకుపోయి, శరీరం విషరహితమవుతుంది. ఎప్పుడు అవసరం? బరువు తగ్గడం ఇబ్బందికరంగా మారినప్పుడు, తరచు జీర్ణసంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, ముఖంలో జీవకళ తగ్గినప్పుడు డీటాక్స్ చేసుకోవడం మంచిది. డీటాక్స్ ప్రక్రియలో భాగంగా తీసుకునే ప్రత్యేక ఆహార పదార్థాలు, ప్రత్యేకంగా చేసే వ్యాయామాల వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది. అయితే, సమతుల ఆహారం, వ్యాయామాలతో నిమిత్తం లేకుండా డీటాక్స్ ప్రక్రియ సాధ్యం కాదు. డీటాక్స్ ఔషధాల పేరిట మార్కెట్లో దొరుకుతున్న మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. శరీరాన్ని శుభ్రపరచే ఆహారం డీటాక్సిఫికేషన్ కోసం ప్రత్యేక ఆహారాన్ని ఎవరికి వారే ఇంటి వద్ద తీసుకోవచ్చు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు, నీరు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పూర్తిస్థాయిలో డీటాక్స్ కోసం క్రమబద్ధంగా ఉపవాస పద్ధతిని కూడా పాటించవచ్చు. అయితే, ఉపవాస పద్ధతి పాటించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ఉపవాస పద్ధతి పాటించేవారు వారంలో మూడో రోజు, ఆరో రోజు ఉదయం పూట ఘనాహారమేదీ తీసుకోకుండా, గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. సాధారణంగా ఈ పద్ధతిలో రాత్రిపూట భోజనానికి బదులు పండ్లు తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సీతాఫలాలు, మామిడి, సపోటా వంటివి కాకుండా, తక్కువ చక్కెర, ఎక్కువ పీచు పదార్థాలు ఉండే నారింజ, బత్తాయి వంటి పండ్లు తీసుకోవాలి. ఈ పద్ధతిలో పచ్చి కూరగాయలు, హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటి పానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిజ్జాలు, మిర్చిబజ్జీలు వంటి జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. మలినాలను తొలగించే వ్యాయామం డీటాక్స్ విధానంలో జీర్ణవ్యవస్థను శుభ్రపరచే ఆహారంతో పాటు చెమట ద్వారా శరీరంలోని మలినాలను తొలగించే వ్యాయామాలూ అవసరమే. వేగంగా నడక, కార్డియో వ్యాయామాలు, యోగాసనాలు వంటి వ్యాయామాలు స్వేదగ్రంథుల ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలను వెలుపలకు పంపేందుకు దోహదపడతాయి. ఇలాంటి వ్యాయామాలు కండరాలకు సత్తువ ఇవ్వడంతో పాటు శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుతాయి. నీరు కడిగేస్తుంది శరీరంపై పేరుకున్న మలినాలనే కాదు, శరీరం లోపలి మలినాలను కడిగేయడంలోనూ నీరే కీలకం. డీటాక్స్ ప్రక్రియలో ప్రతిరోజూ 60 ఔన్సుల ఊటనీరు (బావి నీరు లేదా నీటిబుగ్గల నుంచి ఊరిన నీరు) తీసుకోవాలి. ఒక్కోసారి పది ఔన్సుల చొప్పున ఆరుసార్లు ఈ నీరు తీసుకోవాలి. ఈ నీటిలో ఒక్కోసారి రెండు ఔన్సుల చొప్పున నిమ్మరసం కలపాలి. రుచికోసం కొద్దిగా మిరియాల పొడి కలుపుకోవచ్చు. డీటాక్స్‌లో భాగంగా కొబ్బరినీరు, తాజా కూరగాయల జ్యూస్‌లు కూడా తీసుకోవచ్చు. ఇలా ఆరు నెలలకు ఒకసారి పూర్తిస్థాయి డీటాక్స్ ప్రక్రియను పాటించవచ్చు. అయితే బరువు తగ్గించుకోవడానికి ‘డీటాక్స్’ అనుసరించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఈ ప్రక్రియలో అన్ని పోషకాలు అందవు కాబట్టి తాత్కాలికంగా కొద్దిగా నీరసం రావచ్చు. కాబట్టి రెండు ‘డీటాక్స్’లకు మధ్య కనీసం పదిహేను రోజుల వ్యవధి ఉండేలా చూడాలి. వీరు దూరంగా ఉండాలి కఠినమైన ఆహార పద్ధతులు, వ్యాయామాలతో కూడిన డీటాక్స్ పద్ధతిని సాధారణ ఆరోగ్యవంతులు మాత్రమే పాటించాలి. గర్భిణులు, చక్కెర వ్యాధితో బాధపడేవారు, గుండెజబ్బులకు, కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న వారు, సత్తువలేని వృద్ధులు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలి. మనలోకి చేరే కాలుష్యాలు గాలి, నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి నానా కాలుష్యాలు, విష పదార్థాలు నిరంతరం చేరుతూనే ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల వాడకం విరివిగా ఉన్నందున, ప్లాస్టిక్‌లోని బిస్ఫెనల్ అనే విష రసాయనం మనలోకి చేరుతూ ఉంటుంది. పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన నీరు తాగునీటిగా సరఫరా అవుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ మన ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. వాడిపారేసిన ఫ్లోరోసెంట్ బల్బులు, డెంటల్ ఫిల్లింగ్స్ కారణంగా పాదరసం మోతాదుకు మించి వాతావరణంలోకి, తర్వాత మన శరీరంలోకి చేరుతోంది. ఇలాంటి కాలుష్యాల కారణంగా కేన్సర్ సహా పలు ప్రమాదకర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడి దూరం డీటాక్స్ ప్రక్రియ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఒళ్లు తేలికబడటమే కాదు, మానసికంగానూ ఒత్తిడి తగ్గుతుంది. క్రమంగా శరీరం పునరుత్తేజం పొందడంతో ఉత్సాహం పెరుగుతుంది. కండరాలకు జవసత్వాలు వచ్చి, వయసు తగ్గిన అనుభూతి కలుగుతుంది. ఆహారంపై శ్రద్ధ డీటాక్స్ ప్రక్రియకు ముందు ఏం తింటున్నామో పట్టించుకోకుండా తినే అలవాటు ఉన్నా, ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆహారంపై శ్రద్ధ పెరుగుతుంది. ఆహార విహారాల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖంలో కళాకాంతులు వచ్చి, చర్మం నునుపుదేరుతుంది. వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. అతి అనర్థదాయకం శరీరంలోని మలినాలను తొలగించుకునేందుకు డీటాక్స్ ఆహార, వ్యాయామ ప్రణాళిక అవసరమే అయినా, త్వర త్వరగా ఈప్రక్రియను పూర్తి చేసుకోవాలనే యావతో అతి జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు తప్పవు. శక్తికి మించిన ఉపవాసాల వల్ల, మోతాదుకు మించి నీరు తాగడం వంటి చర్యలకు పాల్పడితే రక్తపోటు, చక్కెర స్థాయి పడిపోవడం, జీర్ణవ్యవస్థలో సమతుల్యత లోపించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల డీటాక్స్ కోసం ఇంటి వద్ద ఎలాంటి ఆహార పద్ధతులు, వ్యాయామ పద్ధతులు పాటించాలనుకున్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వ్యసనాలను వదులుకోవాలి పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల శరీరంలోకి నిరంతరం విషపదార్థాలు చేరుతూనే ఉంటాయి. డీటాక్స్ పద్ధతులు పాటించాలనుకునేవారు తమకు ఇలాంటి అలవాట్లేమైనా ఉంటే, వాటిని వదులుకోవాలి. డీటాక్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా తిరిగి సిగరెట్లు, మద్యం వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. దీర్ఘకాలిక ఫలితాల కోసం డీటాక్స్ ప్రక్రియ ద్వారా ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే, ఆ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగాలంటే, ఆహార విహారాల్లో నిరంతరం అప్రమత్తత అవసరం. సమతుల పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు కాలుష్యాలకు దూరంగా ఉండటం, వ్యాయామ పద్ధతులను మానేయకుండా కొనసాగించడం ద్వారా డీటాక్స్ ఫలితాలను ఎక్కువకాలం ఆస్వాదించవచ్చు. -
స్కావెంజర్ల నుంచి క్యాబ్ డ్రైవర్లుగా..!
ఇతరుల మలినాలను నెత్తినెత్తుకొని స్కావెంజర్లుగా పనిచేసిన వారి బతుకుల్లో ప్రస్తుతం కాస్త వెలుగులు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా రాజధాని ఢిల్లీలో తాజాగా కనిపిస్తున్న కొత్త మార్పు... మరి కొద్ది రోజుల్లో దేశంలోని ఇతర నగరాలకు వ్యాపించనుంది. కుల ప్రాతిపదికన తరతరాలుగా చేపడుతున్న వృత్తుల్లో అత్యంత నీచ స్థితిలో ఉన్న సఫాయీ కర్మచారీ వృత్తి, వివక్షలో చిక్కుకున్న జీవితాలు మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నంలో భాగంగా హస్తినలో వచ్చిన మార్పు కొన్ని కుటుంబాను తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తోంది. రోడ్లు ఊడుస్తూ, టాయిలెట్లు క్లీన్ చేస్తూ, డ్రైనేజీలు కడుగుతూ గడిపిన వారి తల్లిదండ్రుల జీవన విధానానికి ఇప్పుడా 250 మంది యువతులు స్వస్థి చెప్పారు. వేలల్లో జీతాలు వచ్చే క్యాబ్ డ్రైవర్లుగా మారారు. తమకు దగ్గరలోని పార్కుల్లోనే మార్సల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, కాస్తంత ఆంగ్ల భాషనేర్చుకొని, మురికి వాడ నుంచి ఊబర్, ఓలా వంటి కమర్షియల్ టాక్సీ డ్రైవర్లుగా మారుతున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం, సాధికారత విభాగం ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాలనుంచి 9 వందల మంది మహిళలకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించింది. ఇది ఒక్క ఢిల్లీ నగరానికే కాక దేశంలోని ముంబై, బెంగళూరు, కోల్ కతా, చెన్నై నగరాల్లో కూడ అమలు చేస్తామని మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ చెప్పారు. మా అమ్మ ఆ ఉద్యోగాన్ని పదేళ్ళ పాటు చేసింది. కానీ మేం మా జీవితాలు కాస్త మెరుగు పడతాయని ఆశిస్తున్నాం అంటుంది... రద్దీ ప్రాంతంలో డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఇరవై రెండేళ్ళ ఓ ట్యాక్సీ డ్రైవర్. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారంతా 17 నుంచి 25 ఏళ్ళ మధ్య వయసుండి, ఢిల్లీలోని మాదంగీర్, సంగం విహార్, లాల్ కౌన్, అంబేద్కర్ నగర్ల నుంచి వచ్చిన వారే. వీరిలో కొందరు పదో తరగతి, ఇంటర్ వరకూ చదివిన వారు కూడ ఉన్నారు. ఇటువంటి వారు కొందరు శిక్షణ అనంతరం తాము స్వయంగా ట్రావెల్ ఏజెన్సీలను నిర్వహించుకుంటామని చెప్తున్నారు. కొందరైతే ఇటువంటి మార్పు తమ జీవితాల్లో వస్తుందని ఊహించలేదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోటార్ డ్రైవింగ్ స్కూళ్ళనుంచి మొదటిగా పది కార్లతో ఈ శిక్షణ తరగతులు మొదలు పెట్టారు. అయితే శిక్షణ ప్రారంభమైనప్పుడు మహిళల్లో ఆత్మ విశ్వాసం తక్కువగానే కనిపించినా ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్రైవింగ్ నేర్చుకొంటున్నారని గ్రేటర్ కైలాష్ ఆఫీస్ లోని నాగరాజ్ అంటున్నారు. అయితే మహిళలు ట్యాక్సీ డ్రైవర్లుగా ఉండాలంటే వారికి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు కూడ వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు మూడు వేలమంది క్యాబ్ డ్రైవర్లకు ఢిల్లీలోని సిటీ పార్క్ లో మ్యానరిజమ్ పాఠాలు కూడ నేర్పుతున్నాం అంటున్నారు సీనియర్ ఎస్ జే ఈ అధికారి మునియప్ప నాగరాజ్. ప్రభుత్వం ద్వారా అమల్లోకి తెచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడే అవకాశం ఉందని, అయితే అసలు మొత్తం ఢిల్లీలో సుమారు అరవై వేలమంది పఫాయీ కార్యికులకు కనీసం నెల జీతం వచ్చే అవకాశం కూడ లేదని ఓ ఎన్జీవో సంస్థ సభ్యురాలు దును రాయ్ అంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని ఆమె సూచిస్తున్నారు. -
హై'డర్టీ'బాద్
-
విరుల వింజామరలు
ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బి, అందులో కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, ఆరిన తర్వాత తలంటుకోవాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే జుత్తు రాలడం ఆగుతుంది.బీట్రూట్ రసంలో నిమ్మరసం కలిపి తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తే, దానివల్ల కలిగే దురద మాయమవుతాయి.కోడిగుడ్డు సొనలో ఉసిరిక రసం, బాదం నూనె, నిమ్మరసం, కాఫీ పొడి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని తలకు పట్టించి గంట తర్వాత తలంటుకోవాలి. తరచుగా ఇలా చేస్తే జుత్తు తెల్లబడటం ఆగుతుంది. మందారపూలను పేస్టులా చేసి పెరుగులో కలపాలి. దీనికి కాసింత నిమ్మరసం చేర్చి తలకు ప్యాక్ వేసుకుంటే జుత్తు ఒత్తుగా పెరుగుతుంది.కొబ్బరినీళ్లలో నిమ్మరసం కలిపి జుత్తుకు పట్టించి, అరగంట తర్వాత కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే వేసవిలో ఉండే జిడ్డు, మురికి తొలగిపోయి జుత్తు మెరుస్తుంది.పుదీనా ఆకుల్ని రుబ్బి, నీటితో కలిపి కాస్త పలుచగా చేయాలి. ఈ నీటితో జుత్తు కడుక్కుని, ఆ తర్వాత తలంటుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే జుత్తు సజీవంగా మెరుస్తుంది. -
మనసు నొప్పించే విషయాలు
చనువు ఉందని ‘డర్టీ’ విషయాలు మాట్లాడడం. సమస్యలో ఉన్నపుడు మీకు పని ఉందని కారణం చూపుతూ, ఆమెకు తోడు లేకపోవడం. వారి కొత్త డ్రెస్‌ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం.. అది బాలేకున్నా! ఆమెకు సంబంధించిన దేనిపైన అయినా వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేయడం. ఆమె అందం గురించి ప్రతికూల విషయాలు నేరుగా చెప్పడం. ఇతర అమ్మాయిల అందచందాలను ఆమె ముందు పొగడటం. గమనిక: మీరు ఊహించని కొన్ని విషయాలకు కూడా వారు హర్ట్ అవుతుంటారు. మనసు మెప్పించే విషయాలు వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుంటారు. అమ్మాయిలే తెలుసుకోగలిగిన బహుమతులు వారికి నచ్చేలా ఇవ్వగలగడం (గాజులు, లిప్‌స్టిక్, పర్ఫ్యూమ్). ఆమె తప్పులను కూడా పొరపాట్లు అని చిత్రీకరించి చెప్పగలిగే మీ నైపుణ్యం! ప్రశంసలు... వాటిని కూడా అందంగా వ్యక్తం చేయాలి. ఆమె ప్రైవేట్ టైం, ప్రైవేట్ విషయాలు ఎప్పుడూ అడగకపోవడం (పూర్తిగా చనువు ఏర్పడక ముందు). ఇతరులను ఆమె వద్ద ఎప్పుడూ తిట్టకపోవడం.