
విరుల వింజామరలు
ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బి, అందులో కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, ఆరిన తర్వాత తలంటుకోవాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే జుత్తు రాలడం ఆగుతుంది.బీట్‌రూట్ రసంలో నిమ్మరసం కలిపి తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తే, దానివల్ల కలిగే దురద మాయమవుతాయి.కోడిగుడ్డు సొనలో ఉసిరిక రసం, బాదం నూనె, నిమ్మరసం, కాఫీ పొడి కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని తలకు పట్టించి గంట తర్వాత తలంటుకోవాలి. తరచుగా ఇలా చేస్తే జుత్తు తెల్లబడటం ఆగుతుంది.
మందారపూలను పేస్టులా చేసి పెరుగులో కలపాలి. దీనికి కాసింత నిమ్మరసం చేర్చి తలకు ప్యాక్ వేసుకుంటే జుత్తు ఒత్తుగా పెరుగుతుంది.కొబ్బరినీళ్లలో నిమ్మరసం కలిపి జుత్తుకు పట్టించి, అరగంట తర్వాత కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే వేసవిలో ఉండే జిడ్డు, మురికి తొలగిపోయి జుత్తు మెరుస్తుంది.పుదీనా ఆకుల్ని రుబ్బి, నీటితో కలిపి కాస్త పలుచగా చేయాలి. ఈ నీటితో జుత్తు కడుక్కుని, ఆ తర్వాత తలంటుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే జుత్తు సజీవంగా మెరుస్తుంది.