ఈ మాస్టారు మంచోడు కాడు..
నర్సాపూర్ రూరల్: ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వెలుగులోకి వచ్చింది. 6, 7 తరగతి చదువుకునే విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ మూడు రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు గ్రామస్తులతో కలసి హెచ్‌ఎంను నిలదీశారు. ఆగ్రహానికి లోనైన కొందరు నిందితుడిపై దాడికి యత్నించగా..గ్రామ పెద్దలు హెచ్‌ఎంను గదిలో ఉంచి తాళం వేశారు.
విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని గ్రామస్తుల సమక్షంలో విచారణ చేసి నిందితుడిని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ విషయమై హెచ్‌ఎం విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హెచ్‌ఎం తీరుని నిరసిస్తూ గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.