
టెహ్రాన్ : రెండు రోజులు స్నానం చేయకపోతేనే చెమటకంపుతో మనతో పాటు మన చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే అయ్యిందట. దీంతో ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పేరుగాంచిన హాజీ 83 ఏళ్ల వయసులోనూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇరాన్‌లోని దెజ్ అనే ప్రాంతంలో నివసిస్తున్న హాజీ ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో రోజూ స్నానం చేయడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని భావించి..అప్పటినుంచి స్నానం చేయడం మానేశాడు. ఎక్కువగా నాన్‌వెజ్ వంటకాలను ఇష్టపడే హాజీ కుళ్లిపోయిన మాంసాన్ని కూడా ఆరగించేస్తాడు. ఊరి వెలుపల ఓ చిన్న గుడిసెలో నివసించే హాజీకి గ్రామస్తులే భోజనం పెడుతుంటారు. అంతేకాకుండా ఆరు దశాబ్దాలుగా పైగా స్నానం చేయకపోయినా తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాడని గ్రామస్తులు చెప్పారు. (పాతిపెట్టిన పిల్లిని బయటకు తీసి.. ఆపై )
కుళ్లిపోయిన అడవిపంది మాంసాన్ని చాలా ఇష్టంగా తింటానని, రోజుకు అయిదు లీటర్ల నీటిని మాత్రం తాగుతుంటానని హాజీ తెలిపాడు. అంతేకాకుండా తనకు పొగతాడటం అంటే చాలా ఇష్టమని, ఒకవేళ సిగరెట్ అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలనే చుట్టలా కాల్చుకొని తాగుతానని పేర్కొన్నాడు. ఇంత అపరిశుభ్రంగా, మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం, అతని చుట్టు పక్కల వారినే కాకుండా ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేలా ఉంది. ఏది అయితేనేం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా హాజీ రికార్డులకెక్కారు. (వేడి వేడి బటర్ చాయ్.. నిర్వహకుడిపై వ్యంగ్యాస్త్రాలు)
Comments
Please login to add a commentAdd a comment