పారిశుద్ధ్య లోపం వల్లనే అనారోగ్యం : డీఎంఎచ్‌ఓ
పెద్దపడిశాల (గుండాల) : పారిశుద్ధ్య లోపం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, విష జ్వరాలు కావని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భానుప్రసాద్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దపడిశాల గ్రామాన్ని సందర్శించి అనారోగ్యానికి గురైన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విష జ్వరాలు సోకినట్లు ప్రజలంతా కామెర్ల వ్యాధి భారిన పడ్డారని సమాచారం అందిన మేరకు ఆయన గ్రామాన్ని సందర్శించారు. నివాస గృహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడం, వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి మురుగు నీరు నిలబడి తాగు నీరు కలుషితమైనందున కీళ్ల నొప్పులు, జలుబుతో బాధపడుతున్నారని కామెర్ల వ్యాధి వచ్చిన వారిని ఆర్‌ఎంపీ వైద్యుడు భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేట్ ఆసుపత్రుల వైపు అనారోగ్యానికి గురైన వారిని పంపించడం పట్ల ఆర్‌ఎంపీ వైద్యుడిని తీవ్రంగా మందలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రేణుక, మండల వైద్యాధికారి కిరణ్, సీహెచ్‌వో శ్రీనివాస్‌చక్రవర్తి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ఉన్నారు.