cause
-
కుండపోత.. జల దిగ్బంధంలో విజయవాడ (ఫొటోలు)
-
టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
అధిక సంఖ్యలో ప్రజలు టైప్ 2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లుకు ఓ నిర్ధిష్ట ఏజ్ వచ్చేటప్పటికీ మధుమేహం అనే దీర్ఘకాలిక వ్యాధి వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది వైద్యులకు కూడా తెలియలేదు. ఎందువల్ల ఇన్సులిన్ వ్యవస్థ పనిచేయడం అగిపోతుంది. తగిన స్థాయిలో ఎందుకు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోతుందనేది వైద్యులకు ఇప్పటికీ అర్థం కానీ ఓ మిస్టరీ. పైగా ఇది దీర్థకాలిక వ్యాధి, దీనికి నివారణ ఉండదు, కేవలం నియంత్రణ మాత్రమే. అలాంటి ఈ టైప్ 2 డయాబెటిస్ ఎందువల్ల వస్తుందో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. అంతేగాదు ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్కెపెట్టేందుకు మార్గం సుగమం చేసిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఇది ఎందువల్ల వస్తుందంటే..? సాధారణంగా టైప్ 2 మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్‌కు ప్రతిస్పందించడం ఆపివేయడంతో ప్రారంభమై, చివరికి ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది శాస్త్రవేత్తలకు అర్థం కానీ చిక్కు ప్రశ్న. అందుకోసం మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషులపై అధ్యయనాలు కూడా నిర్వహించారు కేస్ వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇలా ఇన్నులిన్ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక ఎంజైమ్‌ని గుర్తించారు. దీన్ని స్కాన్(SCAN) అని పిలుస్తారు. ఈ ఎంజైమ్ ఇన్సులిన్ చర్యలకు గ్రాహకంగా పనిచేసే నైట్రిక్ ఆక్సైడ్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ కీలకమైన రసాయనం. ఇది ఇన్సులిన్‌తో సహా హార్మోన్లను నియంత్రిస్తుంది. కాగా, శాస్త్రవేత్తలు మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషుల్లో ఈ స్కాన్(SCAN) కార్యచరణను గుర్తించారు. అలాగే ఈ ఎంజైమ్లేని ఎలుకల్లో మధుమేహం రాకుండా ఎలా సేఫ్‌గా ఉన్నాయో కనుగొన్నారు. ఈ ఎంజైమ్ ఒక్కటిని నిరోధిస్తే మధుమేహం నుంచి రోగులను రక్షించొచ్చని తెలిపారు. ఇక ఈ ఎంజైమ్‌ని నిరోధించడంపై పలు పరిశోధనలు చేయాల్సి ఉంది. అంతేగాదు ఈ నైట్రిక్ ఆక్సైడ్‌ని జోడించి ఉండే ఎంజైమ్‌లు వివిధ రకాల వ్యాధులకు దారితీస్తాయని శాస్త్రవేత్త జోనాథన్ తెలిపారు. అధిక స్థాయి నైటిక్ ఆక్సైడ్ కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. అయితే ఇది రియాక్టివ్ మాలిక్యూల్ కావడం వల్ల నేరుగా దీన్నే లక్ష్యం చేసుకుని తొలగించడం కష్టమని చెప్పారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!
వర్షాలు కొన్ని ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొస్తాయి. మరికొన్ని వ్యాధుల్ని మరింతగా పెచ్చరిల్లేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో! వాళ్లతో పాటు పెద్దల్లో కూడా. ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యే. సామాన్యజనం పరిభాషలో ‘నెత్తుటిబంక విరేచనాలు’ అంటారు. విరేచనాలవుతూ ఉండగా అందులో కొద్దిగా రక్తం, మరికొద్దిగా చీములా పడుతుండటంతో ఈ పేరు. షిజెల్లా అనే ప్రజాతికి చెందిన ఓ బ్యాక్టీరియాతో వచ్చే సమస్య ఇది. కలుషితమైన నీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నీరు కలుషితం అవ్వడానికి అనువుగా ఉండే ఈ సీజన్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. షిజెల్లోసిస్ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. మానవ విసర్జకాలతో కలుషితమైన నీరు తాగడం వల్ల, ఆ నీటితో చేసిన వంటల వల్ల షిజెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిం, మానవ జీర్ణవ్యవస్థలోకి చేరి, విరేచనాలు మొదలవుతాయి. ఈ విరేచనాలు కాస్త జిగటగా, నెత్తురుతో ఉండటంతో మామూలు వాటికంటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. పిల్లల్లో అందునా ఐదేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూస్తుంటారు. లక్షణాలు: విరేచనాల్లో బంక (మ్యూకస్), నెత్తురు కనిపించడం. కడుపు పట్టేసినట్లుగా అనిపించడం (స్టమక్ క్రాంప్స్), కడుపు నొప్పి జ్వరం (జ్వరతీవ్రత 101 ఫారెన్‌హీట్ వరకు ఉండవచ్చు) వికారం, కొన్నిసార్లు వాంతులు. వ్యాప్తి ఇలా... ∙కలుషితాహారంతో : షిజెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన నీటితో తయారు చేసిన ఆహారంతో లేదా ఆ నీళ్లు తాగడం వల్ల; లేదా ఆ నీటిలో ఈదినప్పుడు నోట్లోకి వెళ్లినప్పుడు మింగడం వల్ల. వ్యక్తి నుంచి వ్యక్తికి: ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న వ్యక్తి తన పెదవుల్ని చేతులతో తాకాక అవే చేతుల్ని ఇతరులు ముట్టుకున్నప్పుడు. ఇది పిల్లల డే కేర్ సెంటర్లలో, పిల్లలను ఆడిపించే క్రష్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ ద్వారా... అలాగే హైజీన్ తక్కువగా ఉండే విద్యార్థుల హాస్టల్స్, మెస్‌లు, క్యాంపస్‌లలో వ్యాపించే అవకావం ఎక్కువ. ఇక ప్రయాణాల్లో అంతగా పరిశుభ్రత పాటించని హోటళ్ల వల్ల కూడా ఒకరినుంచి మరొకరికి పాకవచ్చు. కొన్నిసార్లు కాంప్లికేషన్లు... డీ–హైడ్రేషన్‌తో : విరేచనాల కారణంగా దేహంలోని ద్రవాలను కోల్పోవడంతో డీ–హైడ్రేషన్‌కు గురికావచ్చు. ఫలితంగా తల తిరగడం (డిజ్జీనెస్); తేలిగ్గా అనిపించడం (లైట్ హెడెడ్నెస్); పిల్లల్లో కన్నీళ్లు కూడా కనిపించకపోవడం, కళ్లు లోతుకుపోయినట్లుగా కనిపించడం... మరీ చిన్నపిల్లల్లో ఈ పరిస్థితులు తీవ్రమైతే ఒక్కోసారి షాక్కూ... అటు తర్వాత ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. మూర్ఛ (సీజర్స్) : కొంతమంది పిల్లల్లో మూర్ఛ (సీజర్స్) కనిపించవచ్చు. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకావాలు ఎక్కువ. ∙మలద్వారం చివరి భాగం బయటికి జారడం (రెక్టల్ ప్రొలాప్స్) : జిగురుతో కూడిన మ్యూకస్ బంకలా పడటం వల్ల మలద్వారం చివరి భాగం బయటకు జారే అవకాశం ఉంటుంది. దీన్నే రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. హీమోలైటిక్ అనీమియా : ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు అయినప్పటికీ కొట్టి పారేయలేని సమస్య. నెత్తుటి విరేచనాలు అవుతుండటంవల్ల ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం (హీమోలైటిక్ అనీమియా), ప్లేట్లెట్స్ తగ్గడం (థ్రాంబోసైటోపీనియా)... చాలా అరుదుగా ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కనిపించవచ్చు. టాక్సిక్ మెగాకోలన్: ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు. ఇందులో పేగుల కదలిక (బవెల్ మూవ్మెంట్) మందగించి మలం ముందుకు కదలడం ఆగిపోవచ్చు. దాంతో గ్యాస్‌గానీ, మలవిసర్జన గానీ జరగకపోవచ్చు. ఇలాంటి వైఫల్యం కనిపింనప్పుడు దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిం వెంటనే చికిత్స తీసుకోకపోతే పెద్దపేగు గాయపడటంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీసే ప్రవదం ఉంటుంది. బ్యాక్టీరిమియా : షిజెల్లా ఇన్ఫెక్షన్తో పేగుల లోపలి లైనింగ్ దెబ్బతినవచ్చు. దాంతో ఇలా దెబ్బతిన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఇది కాస్త అరుదు. నివారణ కేర్‌ఫుల్ డిస్పోజల్ ఆఫ్ డయపర్స్ : చిన్న పిల్లల డయపర్స్ను జాగ్రత్తగా పారేయాలి. వీటిని నీటివనరు (వాటర్ సోర్స్)తో కలవనివ్వకుండా జాగ్రత్తపడాలి. అప్పటికే విరేచనాల, నీళ్ల విరేచనాల, నెత్తుటిబంక విరేచనాలతో బాధపడుతున్నవారు... వంట చేయడం సరికాదు. వాళ్లు కిచెన్ నుంచి దూరంగా ఉండాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్ టాయెలెట్ హ్యాబిట్స్: పిల్లలకూ చేతులు కడుక్కునే అలవాటు నేర్పాలి. స్ల్స్కూ, పిల్లల కేర్ సెంటర్స్, ఆటస్థలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, వాళ్ల టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్‌లో లేదా పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈదుతున్నప్పుడు ఆ నీటిని మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులు, వాగుల వంటి నీటి వనరు నుంచి తెచ్చిన నీటిని కాచి వడబోయకుండా తాగవద్దు. అలాగే పట్టణాల్లోన కొళాయి/నల్లా నీటిని శుభ్రం చేయడం, వడబోయడం వంటివి చేయకుండా వాడకూడదు. --డాక్టర్ శివనారాయణ రెడ్డి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!) -
Pneumonia: అశ్రద్ధ చేస్తే ‘ఊపిరి’ తీస్తుంది
గుంటూరు మెడికల్: ఊపిరితిత్తులకు వచ్చి, ప్రాణాలు తీసే వ్యాధుల్లో న్యుమోనియా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు న్యుమోనియా వ్యాధితో చనిపోతున్నారు. ప్రతి ఏడాది ఐదేళ్లలోపు పిల్లలు రెండు మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. భారత దేశంలో ప్రతి ఏడాది రెండులక్షల మంది పిల్లలు ఈ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధి నివారణకు ఉన్న టీకాను వినియోగించటం ద్వారా ఒక మిలియన్ పిల్లల మరణాలు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. చలికాలంలో న్యుమోనియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారినపడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాధి లక్షణాలు... ఈ వ్యాధి అన్ని వయస్సుల వారికి వస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లుదాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దగ్గు, కళ్లె పడటం, కళ్లె పసుపు లేదా పచ్చగా ఉండటం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఆయాసం, అలసట, ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం, చలి, వణుకు ఉండటం, తలనొప్పి, కండరాల నొప్పులు, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవటం లేదా తక్కువగా కొట్టుకోవటం, వికారం, వాంతులు, విరేచనాలు, పిల్లలు పాలు తాగలేకపోవటం తదితర లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. చలికాలంలో న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. ఆడవారితో పోల్చితే మగవారిలోనే వ్యాధి బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. కారణాలు... వ్యాధి ఉన్న వ్యక్తి ముఖానికి కర్చీఫ్ పెట్టుకోకుండా దగ్గినా, తుమ్మినా వారి నోటి తుంపర్ల ద్వారా పక్కన ఉండే వారికి వ్యాధి సోకుతుంది. వైరస్, బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిలో, పొగతాగేవారిలో, మద్యపానం చేసేవారిలో, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం అధికం. నిర్ధారణ... ఛాతీ ఎక్సరే, సీటీ స్కాన్ పరీక్ష, రక్తపరీక్షలు, కళ్లె పరీక్ష, బ్క్రాంకోస్కోపీ, పల్స్ ఆక్సీమెట్రీ, ఫ్లూయిడ్ కల్చర్ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. వ్యాధి బాధితులు... ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మంది, పిల్లల వైద్య నిపుణులు, 300 మంది పల్మనాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ ఇద్దరు బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నివారణ చర్యలే ఉత్తమం.. వ్యాధి రాకుండా ముందస్తుగా పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్లు చేయించాలి. వ్యాధి సోకకుండా నివారించే వ్యాక్సిన్లు పిల్లలకు, పెద్దవారికి అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలకు వ్యాక్సిన్లు వేయిస్తుంది. విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్ వినియోగించకూడదు. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవటం చాలా మంచిది. – డాక్టర్ పి.పద్మలత, జీజీహెచ్ పిల్లల వైద్య విభాగాధిపతి జాగ్రత్తలు తీసుకోవాలి... వ్యాధి బాధితులు త్వరగా కోలుకోవటానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండటంతోపాటుగా మద్యపానం, ధూమపానం చేయకూడదు. దగ్గినా, తుమ్మినా ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. తరచుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారంలో కనీసం ఐదురోజులపాటు వ్యాయామం చేయాలి. – డాక్టర్ గోపతి నాగేశ్వరరావు, పల్మనాలజిస్ట్, గుంటూరు -
షాకింగ్: సిగరెట్ వల్లే ఆ ఘోర విమాన ప్రమాదం!
EgyptAir Flight 804 Mishap Details: ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. అనేక అనుమానాల నడుమ దాదాపుగా చిక్కుముడి వీడింది. మొత్తం 66 మంది ప్రయాణికులతో 37వేల అడుగులో వెళ్తూ.. సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈజిప్ట్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి ఒక సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ విమాన ప్రమాదాన్ని ఉగ్రవాద దాడిగా ఈజిప్ట్ ప్రకటించింది. కానీ, ఏ ఉగ్రసంస్థ కూడా దానిని తామే చేసినట్లు నిర్ధారించలేదు. ఈ తరుణంలో విమానంలోని లోపమే కారణమని ఇంతకాలం అనుకున్నారు. అయితే.. ఆ విమానం 2003 నుంచే సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. అంటే కేవలం 13 ఏళ్ల సర్వీసు మాత్రమే పూర్తి చేసుకుంది. సాధారణంగా ఆ విమానం లైఫ్ 30 నుంచి 40 ఏళ్ల ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుమానాలు.. విస్తృతస్థాయి దర్యాప్తు వైపు అడుగులు వేయించాయి. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. ఇక పైలెట్ సిగరెట్ పొగ పీల్చినట్లు రికార్డయిన శబ్దాల గురించి ఇటాలియన్ పత్రిక కార్రియర్ డెల్లా సెరా కూడా ఓ కథనం ప్రచురించింది. ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్-ఎ320, 2016 మే 19న తేదీన పారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ఈజిఫ్ట్ పౌరులు, 15 మంది ఫ్రెంచ్ పౌరులు సిబ్బంది సహా మొత్తం 66 మంది ఉండగా, అంతా ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పాక్-అఫ్గన్.. డామిట్ కథ అడ్డం తిరిగింది! -
జిమ్ మరణం.. ఆమెది గుండెపోటు కాదు!
బెంగళూరు: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన మహిళ వీడియో ఒకటి సుమారు పదిరోజుల కిందట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతోనే మృతి చెంది ఉంటారని పోలీసులు, అంతా ప్రాథమికంగా భావించారు. అయితే ఆమెది గుండెపోటు మరణం కాదని వైద్యులు ఇప్పుడు ధృవీకరించారు. ఈమధ్యకాలంలో ఉన్నపళంగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాటిలో చాలావరకు ఫిట్‌నెస్‌కు ముడిపడి ఉండడంతో.. జిమ్లంటేనే వణికిపోతున్నారు చాలామంది. ఈ తరుణంలో కర్ణాటక మహిళ హఠాన్మరణం సైతం ఆ ప్రచారానికి ఆజ్యం పోసింది. అయితే.. 44 ఏళ్ల వినయకుమారి విట్టల్ మరణం వెనుక గుండె పోటు కారణం కాదని వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణానికి కారణం బ్రెయిన్ ఎటాక్ అని శవపరీక్షలో వైద్యులు గుర్తించారు. మెదడులోని రక్తనాళం పగిలి ఆమె మరణించారట. ఇందుకు సంబంధించిన ఆటాప్సీ రిపోర్ట్ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మెదడులో ఉబ్బిన రక్తనాళము పగిలి పోవడం వల్ల రక్తస్రావం జరిగి.. కోమా వెనువెంటనే మరణం సంభవించింది అని ఉంది ఆ నివేదికలో. కాబట్టి, జిమ్‌లకు వెళ్తున్న వాళ్లు.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం లాంటివి చేయడం వల్ల.. రక్తపోటు స్థాయిలు పెరగడంతో పాటు మరణానికి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఘటన వివరాలు.. మంగళూరు మల్లేశ్వపాళ్యంలో నివాసం ఉండే వినయకుమారి (44).. సీవీ రామ్‌నగర్ జీఎం పాల్యాలోని ఓ జిమ్ సెంటర్లో మార్చి 26న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జిమ్ చేస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే పక్కనున్నవారు ఆమెను రక్షించాలని ప్రయత్నించినా.. క్షణాల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయకుమారి ఓ ప్రైవేట్సంస్థలో పని చేస్తోంది. ఆమె అవివాహితురాలు. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే..
చెమట పట్టడం చాలా సాధారణమైన జీవక్రియ. మనం బాగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా బాగా ఆటలాడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది సాధారణ పరిస్థితులలో. అయితే వేసవిలో మాత్రం ఇలాంటి వాటì తో పనిలేదు. కేవలం వాతావరణంలోని వేడి కారణంగా చెమట పడుతుంది. ఇది చాలా చికాకుగా అనిపిస్తుంది. నిజానికి చెమట పోయడం అనేది మంచి లక్షణమే అయినప్పటికీ వేసవిలో తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలు... ఒంటికి చెమటలు పట్టగానే చాలామంది చిరాకు పడతారు. నిజానికి అలా చెమట పట్టడం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఓ అద్భుత ప్రక్రియ. వాతావరణంలోని వేడి వల్ల లేదా, వేసవి ఎండల వల్ల దేహంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని వ్యవస్థలన్నీ విఫలమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో చర్మం మీద చెమట పట్టేలా చేసి, ఆ వేడిమి నుంచి కాపాడి దేహం చల్లగా అయ్యేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. అంటే చెమట మన ప్రాణాలు కాపాడటమే కాదు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చూసి దేహక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూసే అపూర్వమైన ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో అధికంగా చెమట పట్టడం వల్ల కొన్ని ఇబ్బందులూ తలెత్తవచ్చు. వాటికి ఉపశమనం కోసం జాగ్రత్తలను తెలుసుకుందాం. చెమట వల్ల సమస్యలు ►నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, శరీర దుర్వాసన. ►పిల్లల్లో చెమట పట్టడం వల్ల పరీక్షలు రాసే సమయంలో ఒక్కోసారి జవాబు పత్రం చిరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ►టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు మాటిమాటికీ తుడుచుకోవలసి వస్తుంది. ►ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం ►నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం, షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం చదవండి: Summer Tips: చెరకురసంలో అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి తాగితే.. ► కొందరిలో నడుస్తుండగానే చెమటల కారణంగా చెప్పులు/పాదరక్షలు జారిపోతుంటాయి. అలాంటివారు బూట్లు వేసుకోవడం కొంత మెరుగు. అయితే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన సాక్సులు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటకు తోడు మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి ► రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ►మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది. ►చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు «ధరించడం మంచిది. ►ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన బట్టలు ధరించాలి. శరీర దుర్వాసన ►శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ►అందుకోసం పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. జింక్ తగినంత ఉంటే నోటి, శరీర దుర్వాసన తొలగిపోవడంతోపాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. ►నిమ్మరసం సహజసిద్ధమైన డియోడరెంట్ గా పనిచేస్తుంది. ఇది అధిక చెమటనూ తగ్గిస్తుంది. ►గోధుమగడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు. ► ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ► ప్రతిరోజూ ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల చెమట సమస్య చాలా వరకు తగ్గుతుంది. ►బిగుతుగా ఉండే సింథటిక్ వస్త్రాలు వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయాలి. ► లో దుస్తులను వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టువాలి. ►రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ►డియోడరెంట్ వాడవచ్చు. లేదంటే టాల్కమ్ పౌడర్ రాసుకోవడం. ►ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తగ్గించాలి. తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోవాలి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే చెమట సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ‘చెమట’లు పట్టిస్తుంటే ఓసారి స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి వారి సలహాను బట్టి మందులు వాడటం ఉత్తమం. అంతేకానీ, అతిగా పట్టించుకున్నా, అసలు పట్టించుకోపోయినా ఇబ్బందే! చెమటలు ఎక్కువగా ఎందుకు పడతాయి? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. శరీరం లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా అధిక చెమటకు కారణమవుతాయి. ఎలా బయటపడాలి? ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవడం. (అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.) ►రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►నిమ్మకాయ రసాన్ని బాహుమూలల్లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయాలి. ►కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. ►అలోవెరా జెల్లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్‌ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►బేకింగ్ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిసి బాహుమూలల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీ లో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో బాహుమూలల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. -
లాంగ్ కోవిడ్‌తో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారినపడి కోలుకున్నాక కూడా కొందరిలో అనారోగ్య సమస్యలు చాలాకాలం బాధిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కరోనాతో తీవ్రంగా జబ్బుపడి, ఐసీయూ, వెంటిలేటర్ వరకు వెళ్లిన బాధితులపైనే లాంగ్ కోవిడ్ ఎక్కువ ప్రభావం ఉన్నట్టు తొలుత భావించినా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కోవిడ్ సీరియస్‌గా మారని వారు, చికిత్స కోసం ఆస్పత్రులదాకా వెళ్లాల్సిన అవసరం పడనివారిలోనూ లాంగ్ కోవిడ్ సమస్యలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. వయసుతోగానీ, వ్యాధి తీవ్రతతోగానీ సంబంధం లేకుండా ‘బ్రెయిన్ ఫాగింగ్ (మెదడు మొద్దుబారిపోవడం)’, ఇతర మానసిక సమస్యల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ అంశంపై యూకేకు చెందిన ఫ్లోరే ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్, మెంటల్ హెల్త్ న్యూరాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ ట్రేవర్ కిల్పాట్రిక్, ప్రొఫెసర్ స్టీవెన్ పెట్రో పరిశోధన చేశారు. ఇన్‌ఫ్లూయెంజా సహా ఊపిరితిత్తులతో ముడిపడిన వైరస్‌లకు.. మెదడు సరిగా పని చేయకపోవడానికి మధ్య లంకె ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. 1918 నాటి స్పానిష్ ఫ్లూకు సంబంధించి డిమెన్షియా, కాగ్నిటివ్ డిక్లైన్, నిద్రలేమి సమస్యలు, 2002 నాటి సార్స్, 2012 లో వచ్చిన మెర్స్ కేసుల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, చురుకుగా వ్యవహరించడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సార్స్, మెర్స్ నుంచి కోలుకున్నవారిలో 20 శాతం మంది జ్ఞాపకశక్తితో ఇబ్బందులు, అలసట, నీరసం, కుంగుబాటు, ఆం దోళన సమస్యలు ఎదుర్కొన్నారని వివరించారు. (corona leak: అప్పుడే అనుమానం వచ్చింది! మాట మార్చిన డబ్ల్యుహెచ్ఓ సైంటిస్ట్) ముక్కు నుంచి మెదడుకు.. కోవిడ్ పేషెంట్లలో ముక్కును మెదడుతో కలిపే నరాల ద్వారా వైరస్ మెదడుకు చేరుకుంటోందని అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. మెదడులోని ‘లింబిక్ సిస్టమ్’ను ముక్కులోని సెన్సరీ సెల్స్ కలుపుతాయని.. భావోద్వేగాలు, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి వంటి వాటిని లింబిక్ సిస్టమ్ నిర్వర్తిస్తుందని వివరించారు. కరోనా బారిన పడక ముందు, తర్వాత మెదడుకు సంబంధించిన స్కానింగ్‌లను పరిశీలిస్తే.. లింబిక్ సిస్టమ్‌లోని కొన్నిభాగాలు కుంచించుకుపోయినట్టు బయటపడిందని తెలిపారు. మొత్తంగా కొవిడ్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతోందని స్పష్టమైందని వెల్లడించారు. కాగా.. ఈ పరిశోధన, మెదడుపై కరోనా ప్రభావానికి సంబంధించి రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతున్నాయి లాంగ్ కోవిడ్ బారినపడ్డవారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేకపోవడం, మర్చిపోవడం, ఆందోళన, కుంగుబాటు వంటివి కనిపిస్తున్నాయి. ఇది ‘బ్రెయిన్ ఫాగింగ్’కు దారితీసి.. మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. నిద్ర సరిగా పట్టకపోవడం, గొంతు కండరాల సమస్య, గురక (ఓఏఎస్) వంటివి కూడా వస్తున్నాయి. కరోనా వచి్చనపుడు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం, బరువు పెరగడం, మానసిక ఆందోళనలకు లోనవడం కారణంగా లాంగ్ కోవిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. నాడీ వ్యవస్థపై కరోనా ప్రభావం తక్కువే అయినా.. కొవిడ్ వ్యాక్సిన్‌తో కొందరిలో నరాల పైపొర దెబ్బతిని జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తోంది. 90 శాతం మంది లాంగ్ కోవిడ్ సమస్యల నుంచి 6 నెలలలోగా కోలుకుంటున్నారు. మిగతావారు 9 నెలల నుంచి ఏడాదిలో కోలుకుంటున్నారు. – డాక్టర్ బి చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరాలజిస్ట్, చైర్మన్ ఏపీ కొవిడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ లాంగ్ కొవిడ్ సమస్య పెరిగింది కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారితోపాటు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రానివారు, స్వల్ప లక్షణాలతో కోలుకున్నవారు కూడా లాంగ్ కోవిడ్ సమస్యతో వైద్యుల వద్దకు వస్తున్నారు. నీరసం, నిస్సత్తువ, అయోమయంగా కనిపించడం, చురుకుదనం లేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురైన వారికి కూడా మేం చికిత్స ఇస్తున్నాం. చాలా మంది త్వరగానే కోలుకుంటున్నారు. వంద మందికి కోవిడ్ వస్తే.. అందులో 30 శాతం మంది వివిధ రకాల లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని ఇది వరకే వెల్లడైంది. జూన్‌లో లాంగ్ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికీ బాధితులు వస్తూనే ఉన్నారు. – డాక్టర్ నిశాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ ఆస్పత్రి -
భార్య చనిపోయిందని డంపింగ్ యార్డుకు నిప్పు
-
సాంకేతిక లోపమే కారణం
► హిరాఖండ్ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రాథమిక అంచనా ► రైలు లైన్ మారే సమయంలో విరిగిన టంగ్‌రైల్ పట్టా ► విద్రోహచర్య కాకపోవచ్చు... సాక్షి, హైదరాబాద్: నలభై మంది ప్రాణాలు బలిగొన్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రైల్వే సెక్యూరిటీ కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జరగిన ఈ ప్రమాదం వెనక విద్రోహచర్య ఉందన్న అభిప్రాయాల నేపథ్యంలో రైల్వే సేఫ్టీ కమిషన్ అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై లోతైన దర్యాప్తు జరపాల్సి ఉన్నప్పటికీ ప్రాథమిక అంచనాలో మాత్రం సాంకేతిక లోపమే కారణమై ఉంటుందన్న అభిప్రాయాన్ని రైల్వే బోర్డు ముందుంచినట్టు తెలిసింది. రైలు ట్రాక్ మారే తరుణంలో టంగ్‌రైల్ (ట్రాక్ మారేందుకు ఉపయోగపడే సన్నటి పట్టా) విరిగిపోవటంతోనే చక్రాలు పట్టాలు తప్పాయని దాదాపు నిర్ధారణకు వచ్చింది. ఆ సమయంలో టంగ్‌రైల్ పట్టాపై విపరీతమైన ఒత్తిడి, రాపిడి జరిగినట్టు భావిస్తున్నారు. వీల్ యాక్సిల్ లోపం వల్లనా, టంగ్‌రైల్ మార్పు సరిగా జరగకపోవటం వల్లనా అన్నది తేలాల్సి ఉంది. అయితే అసలు టంగ్ రైల్ పట్టా పటుత్వంలో లోపం ఉంటే సులభంగా విరుగుతుందనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేశారు. దీంతో ఆ పట్టా నమూనాలను పరీక్షించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సాధారణంగా చలి తీవ్రత ఉన్న సమయంలో పట్టాలు విరిగే అవకాశం ఉంటుంది. చిన్నపాటి పగళ్లున్నా చలికి సంకోచించినప్పుడు ఒత్తిడికిలోనై విరుగుతాయి. ఈ క్రమంలో విరిగిన పట్టా నాణ్యతను కూడా అంచనా వేయనున్నారు. గత సంవత్సరం కాన్పూరు వద్ద రైలు పట్టాలుతప్పి 125 మంది మృతికి కారణమైన ఘోర ప్రమాదానికి కూడా పట్టా విరిగిపోవటమే కారణమని తాజాగా తేలిన నేపథ్యంలో... అధికారులు పేర్కొంటున్న అభిప్రాయాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నిర్వహణ లోపం ఉన్నట్టే... సాధారణ పట్టాల కంటే... రైలును మరో మార్గంలో మళ్లించే అతి కీలక టంగ్‌రైల్ పట్టాలపై మరింత శ్రద్ధ అవసరం. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ వ్యవస్థతో అనుసంధానమై పనిచేస్తున్నందున దాన్ని అత్యంత శ్రద్ధగా నిర్వహించాల్సి ఉంటుంది. అది పటుత్వం కోల్పోయిందా, రెండు మార్గాలకు అనుసంధానించేలా అటూఇటూ కదలిక సరిగ్గా జరుగుతోందా లేదా అన్న విషయంలో నిరంతరం పరిశీలన అవసరం. అలాంటి తరుణంలో ఇంతటి భారీ ప్రమాదం జరిగిందంటే సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టేనని ఓ రైల్వే ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రంగంలోకి ఎన్ఐఏ... ఈ ఘోర రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర ఉందా? ఇదే కోణంలో అనుమానిస్తున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక బృందం సోమవారం ఘటనాస్థలికి చేరుకుంది. కాగా, ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ గత ఏడాది నవంబర్ 21న పుఖర్యాన్లోని కాన్పూర్‌లో పట్టాలు తప్పి 148 మంది మరణించారు. అంతా ప్రమాదమని భావిస్తున్న తరుణంలో... దీని వెనుక విద్రోహ కోణం ఇటీవల బయటపడింది. పాక్ నిఘా సంస్థ కనుసన్నల్లో పని చేస్తూ దుబాయ్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌ల కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్న గ్యాంగ్ పనని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్ఐఏ అధికారులు కూనేరు ప్రమాదం వెనుకా ఇలాంటి కోణాలు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నారు. నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఆధారాల కోసం కూనేరులో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదస్థలికి వెళ్లినట్లు ఎన్ఐఏ పీఆర్ఓగా వ్యవహరిస్తున్న ఐజీ అలోక్ మితలానీ ధృవీకరించారు. ఈ కేసు దర్యాప్తును స్వీకరించాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించలేదని, ప్రస్తుతం ప్రాథమిక పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు. -
కాంట్రాక్టు అధ్యాపకులకు ‘షో’కాజ్
ఎన్నికల హామీలకు గ్రహణం చంద్రబాబు తీరుపై కాంట్రాక్టు అధ్యాపకుల ఆగ్రహం షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు రెగ్యులరైజ్ చేయాలని ఆందోళనలు కాంట్రాక్టు అధ్యాపకులపై ప్రభుత్వం రెండు నాల్కల «ధోరణి అవలంబిస్తోంది. తమను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా దానిని అమలుచేయకపోగా తిరిగి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో కాంట్రాక్టు అధ్యాపకుల్లో ఆగ్రహాం పెల్లుబికుతుంది. మొక్కుబడిగా నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ నియమించి..రెగ్యులరైజ్‌పై తాత్సారం చేస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు, ఆమరణ దీక్షలు మిన్నంటాయి. - కంబాలచెరువు (రాజమండ్రి) జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అత్యధికశాతం పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఉన్నారు. 40 జూనియర్ కళాశాలల్లో 352 మంది, 15 డిగ్రీ కళాశాలల్లో 90 మంది, మూడు పాలిటెక్నిక్ కళాశాలల్లో 22 మందితో కలిపి మొత్తం 464 మంది పని చేస్తున్నారు. వీరంతా 27 రోజులుగా విధులు బహిష్కరించి కలెక్టరేట్, ఇంటర్‌బోర్డు, ఆర్జేడీ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వీరిని క్రమబద్దీకరిస్తామని నాలుగో తేదీ ఫిబ్రవరి 2012న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో చంద్రబాబు ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు. నష్టపోతున్న విద్యార్థులు కాంట్రాక్టు అధ్యాపకుల దీక్షలు, ఆందోళనలతో విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలపై పడే ప్రభావముంది. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ సమ్మెతో చంద్రబాబు ఆగ్రహాంతో ఉన్నారని మంత్రులు పలు ధపాలుగా చెప్పడంతో కాంట్రాక్టు అ«ధ్యాపకులు మండిపడుతున్నారు. యనమల ‘యు’ టర్న్ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన హామీని తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కాంట్రాక్టు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉద్యమ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కాకినాడలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసిన కాంట్రాక్టు అధ్యాపకులతో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని 60 ఏళ్ల వరకు ఎవరూ విధుల నుంచి తొలగించరని, ఉద్యోగభద్రత కల్పిస్తామని, వేతనాలు సవరిస్తామని చెప్పారు. దీనిపై ఈ నెల 26న తుదినిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షోకాజ్ నోటీసులు జారీ తీరా ఆశగా ఎదురుచూసిన కాంట్రాక్టు అధ్యాపకులు తుది నిర్ణయం ఏమిటో తెలిసేసరికి హతాశులయ్యారు. ఉద్యమాలతో తమను బ్లాక్ మెయిల్ చేయలేరని, దీనికి తాము భయపడేదిలేదంటూ దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందరికీ మంగళవారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నాలుగు యూనియన్లు ఉండగా వారిలో విబేధాలు కల్పిస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అంతేకాక ఆర్జేడీలు, ఇంటర్‌బోర్డు అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో బెదిరింపు చర్యలకు పూనుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని వారు అంటున్నారు. దీనికితోడు కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని వారు కనిపించిన నాయకులందరినీ కాళ్లువేళ్లూ పట్టుకుంటున్నారు. -
చక్కెర తింటే షుగర్ వ్యాధి వస్తుందా?
లండన్: షుగర్ వ్యాధి సోకితే.. చక్కెర తీసుకోవడం మానేయాలి అని తెలుసు. మరి చక్కెర తింటే షుగర్ వస్తుందా. ఈ విషయంపై సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు మితిమీరిన చక్కెర వినియోగం వలన షుగర్ వ్యాధి వస్తుందంటూ వాదిస్తోండగా.. మరికొందరు మాత్రం చక్కెరకు షుగర్ వ్యాధి రావడానికి సంబంధం లేదు అని చెబుతున్నారు. అయితే ఇటీవల డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో.. ముఖ్యంగా సోడా లాంటి వాటిల్లో ఉపయోగించే ఫ్రక్టోజ్ చక్కెరల మూలంగా డయాబెటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తేలింది. అధిక పరిమాణంలో ఫ్రక్టోజ్ చక్కెరను తీసుకోవడం మూలంగా లివర్‌లో కొవ్వు పరిమాణం పెరగటంతో పాటు.. శరీరంలో గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్‌కు కణజాలం సాధారణంగా స్పందించడం నిలిపివేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది మధుమేహాం ప్రారంభంలో గుర్తించదగిన మార్పుల్లో ఒకటి అని పరిశోధనకు నేతృత్వం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క్ హెర్మన్ తెలిపారు. -
పారిశుద్ధ్య లోపం వల్లనే అనారోగ్యం : డీఎంఎచ్ఓ
పెద్దపడిశాల (గుండాల) : పారిశుద్ధ్య లోపం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, విష జ్వరాలు కావని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భానుప్రసాద్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దపడిశాల గ్రామాన్ని సందర్శించి అనారోగ్యానికి గురైన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విష జ్వరాలు సోకినట్లు ప్రజలంతా కామెర్ల వ్యాధి భారిన పడ్డారని సమాచారం అందిన మేరకు ఆయన గ్రామాన్ని సందర్శించారు. నివాస గృహాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడం, వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి మురుగు నీరు నిలబడి తాగు నీరు కలుషితమైనందున కీళ్ల నొప్పులు, జలుబుతో బాధపడుతున్నారని కామెర్ల వ్యాధి వచ్చిన వారిని ఆర్ఎంపీ వైద్యుడు భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేట్ ఆసుపత్రుల వైపు అనారోగ్యానికి గురైన వారిని పంపించడం పట్ల ఆర్ఎంపీ వైద్యుడిని తీవ్రంగా మందలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రేణుక, మండల వైద్యాధికారి కిరణ్, సీహెచ్‌వో శ్రీనివాస్‌చక్రవర్తి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఉన్నారు. -
ప్రాణాలు కోల్పోతున్న కంగారూలు!
కాన్బెర్రా: ఆస్ట్రేలియా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కంగారూ. అటువంటిది ఇప్పుడా జంతువులకు అక్కడ రక్షణ లేకుండా పోతోంది. మిగిలిన జంతువులతో పోలిస్తే కంగారూలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు స్థానిక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించిన తాజా వివరాలను బట్టి తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ జంతువు కంగారూలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన గణాంకాలను బట్టి, మిగిలిన జంతువులతో పోలిస్తే పదిలో తొమ్మిది కంగారూలు రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నట్లు స్థానిక జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రమాదాల్లో 2015 లో జరిగిన దాదాపు 20,000 రోడ్డు ప్రమాదాలను విశ్లేషించగా కంగారూలు 88 శాతం, వల్లబీస్ 6 శాతం, వోమ్బాట్స్ 3 శాతం, శునకాలు 2 శాతం చనిపోతున్నట్లు ఏఏఎమ్ ఐ నివేదికల్లో తెలిపింది. దేశంలో మొత్తం కంగారూల సంఖ్య 30 నుంచి 60 మిలియన్ల మధ్య ఉంటుంది. ఆస్ట్రేలియాలో మాత్రమే అత్యధికంగా కనిపించే జంతువైన కంగారూ... ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, అడవుల్లోనూ నివసిస్తూ... తన పిల్లలను పొట్టకింది భాగంలో ఉండే సంచిలో పెట్టుకొని ఒక చోటునుంచీ మరోచోటుకు గెంతుకుంటూ వెడుతుంటుంది. అయితే జూన్, ఆగస్టు మధ్య, శీతాకాలంలో ఈ కంగారూలు 68 శాతం రోడ్లను దాటుతుంటాయని, అదే సమయంలో గరిష్టస్థాయిలో ప్రమాదాలకు గురౌతున్నాయని ఏఏఎమ్ఐ ప్రతినిధి మైఖేల్ మిల్స్ తెలిపారు. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండి, రోడ్లు చీకటిగా, సరిగా కనిపించకుండా ఉండటం కూడ ఈ సమయంలో రోడ్లపై వెళ్ళే జంతువులు ఎక్కువ ప్రమాదాలకు గురౌతున్నట్లు మైఖేల్ చెప్పారు. రోడ్లకు అడ్డుగా వచ్చే జంతువుల వల్ల ప్రమాదాలు జరగడంతో ఆయా జంతువులు చనిపోవడం, లేదా తీవ్రంగా గాయపడటంతోపాటు, డ్రైవర్లకు కూడా ప్రమాదంగానే మారిందని, ఒక్కోసారి డ్రైవర్లూ, జంతువులు సైతం చనిపోయిన సందర్భాలుంటాయని మైఖేల్ చెప్తున్నారు. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ క్వీన్ బెయాన్.. ఆస్ల్రేలియాలోనే రోడ్డు ప్రమాదాలకు రాజధానిగా, ప్రత్యేక గుర్తుగా మారుతోందని ఏఏఎమ్ ఐ విశ్లేషించింది. దీంతోపాటు విక్టోరియన్ నగరం బెండిగో, క్వీన్స్ ల్యాండ్ పట్టణం డింగో, న్యూ సౌత్ వేల్స్ పట్టణం సింగిల్టన్, గౌల్ బర్న్ నగరాలైన మొత్తం ఐదు ప్రముఖ ప్రాంతాలు దేశంలోనే జంతు ప్రమాదాలకు నెలవులుగా పరిణమించినట్లు ఏఏఎమ్ఐ నివేదికల్లో తెలిపింది. -
వయాగ్రాతో జర జాగ్రత్త!
వాషింగ్టన్; పురుషుల్లో లైంగిక పటుత్వం మెరుగవటానికి వాడే వయాగ్రాతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలు తీసుకునే వారిలో స్కిన్ క్యాన్సర్ సంభవించే అవకాశాలు ఉన్నాయి అని తాజా పరిశోధనల్లో తేలింది. జంతు, మానవ కణాలపై దీనిలోని మెడిసిన్ సిడెన్ఫిల్ చూపించే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ట్యుబింజెన్ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. చర్మంలోని మాలిగ్నెంట్ మెలనోమా కణాలను వయాగ్రా ప్రేరేపిస్తుందని, దీంతో చర్మ క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన రాబర్ట్ ఫీల్ తెలిపారు. ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి వయాగ్రా అన్నది జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమాల్ లాంటి మందు కాదని, దీనితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గుండెజబ్బు లాంటి వ్యాధులకు మందులు వేసుకునే వారిలో ఇది ప్రమాదకరం అంటున్నారు. వయాగ్రాను సరైన స్పెషలిస్ట్‌ల ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. -
రూపాయి పతనానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
మోపాల్(నిజామాబాద్‌రూరల్),న్యూస్‌లైన్ :మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, రోజురోజుకు రూపాయి విలువ పతనమైతున్నా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ మండలంలోని మోపాల్ గ్రామంలో బీజేపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మోపాల్ చౌరస్తాలో ఆయన కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు రూపాయికి ఒక డాలర్ ఉండేదన్నారు. 67 ఏళ్ల తరువాత దాని విలువ 67 రూపాయలకు ఒక డాలర్ చేరుకుందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమన్నా రు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల ను మభ్యపెట్టి ఆనేక లోపభూయిష్ట పథకాలను అమలుచేస్తోందని విమర్శించారు. ఆ రోజుల్లో సబ్సిడీలు లేవని, నేడు అనేక సబ్సిడీలు అందిస్తూ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను దివాలా తీయించిందన్నారు. దేశభవిష్యత్తు కోసం బీజేపీ ప్రచార సారథి నరేంద్రమోడి కృషిచేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అనంతరం పలువురు యువకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.