చక్కెర తింటే షుగర్ వ్యాధి వస్తుందా?
చక్కెర తింటే షుగర్ వ్యాధి వస్తుందా?
Published Sun, Oct 2 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
లండన్: షుగర్ వ్యాధి సోకితే.. చక్కెర తీసుకోవడం మానేయాలి అని తెలుసు. మరి చక్కెర తింటే షుగర్ వస్తుందా. ఈ విషయంపై సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు మితిమీరిన చక్కెర వినియోగం వలన షుగర్ వ్యాధి వస్తుందంటూ వాదిస్తోండగా.. మరికొందరు మాత్రం చక్కెరకు షుగర్ వ్యాధి రావడానికి సంబంధం లేదు అని చెబుతున్నారు. అయితే ఇటీవల డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో.. ముఖ్యంగా సోడా లాంటి వాటిల్లో ఉపయోగించే ఫ్రక్టోజ్ చక్కెరల మూలంగా డయాబెటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తేలింది.
అధిక పరిమాణంలో ఫ్రక్టోజ్ చక్కెరను తీసుకోవడం మూలంగా లివర్‌లో కొవ్వు పరిమాణం పెరగటంతో పాటు.. శరీరంలో గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్కు కణజాలం సాధారణంగా స్పందించడం నిలిపివేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది మధుమేహాం ప్రారంభంలో గుర్తించదగిన మార్పుల్లో ఒకటి అని పరిశోధనకు నేతృత్వం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క్ హెర్మన్ తెలిపారు.
Advertisement