రోజంతా పనిచేసి అలసిపోయాక సాయంత్రం అయ్యేసరికి మంచం మీద వాలిపోతాం. రాత్రంతా మంచంపైననే విశ్రాంతి తీసుకుంటాం. అయితే మంచం మీద వేసే బెడ్‌షీట్ గురించి అంతగా ఆలోచించం. చాలామంది అపరిశుభ్రంగా ఉన్న బెడ్‌షీట్‌నే వాడేస్తుంటారు. ఇది అనారోగ్యకరం అని తెలిసినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. అయితే తాజాగా ఫైర్ ఫైటర్స్ బెడ్‌షీట్ గురించి తెలిపిన ఒక విషయం ఎంతో ఆశ్చర్యం గొలుపుతోంది.
స్లీప్ ఫౌండేషన్ వెలువరించిన ఒక రిపోర్టు ప్రకారం ప్రతీ మనిషి అధిక సమయం బెడ్‌పైనే గడుపుతాడు. అయితే మురికి పట్టిన బెడ్‌షీట్ ఉపయోగిస్తే అది అగ్ని ప్రమాదానికి దారి తీయవచ్చు. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఫైర్ బ్రిగేడ్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. మురికిపట్టిన బెడ్‌షీట్లపై ఎమోలియంట్స్, లేదా స్కిన్ క్రీమ్ అవశేషాలు జమ అవుతాయి. ఇవి మండే గుణాన్ని కలిగివుంటాయి.
వేసవి కాలంలో ఇవి మరింత వేడికి గురై అగ్నిప్రమాదాలకు తావిస్తాయి. అందుకు ఎవరైనా చర్మపు క్రీమ్‌లను వినియోగిస్తున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా మెలగాలి. అటువంటి క్రీమ్‌లు బెడ్‌షీట్‌కు అంటుకోకుండా చూసుకోవాలి. లండన్‌లో ఈ విధంగా బెడ్‌షీట్‌లు దగ్ధమైన ఘటనలు వెలుగు చూశాయి.
మిర్రర్ రిపోర్టును అనుసరించి ఎవరైనా వారానికి ఒకసారి బెడ్‌షీట్‌ను శుభ్రం చేయాలి.వీటిని 60 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటిలో ఉతకాలి.బెడ్‌షీట్లు, తలదిండు గలేబులు ఎక్కువగా మురికి పట్టినట్లు అనిపిస్తే వారానికి రెండుసార్లు ఉతకాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా చర్మవ్యాధులు ఉన్న పక్షంలో బెడ్‌షీట్లను తరచూ ఉతుకుతుండాలి.
ఇది కూడా చదవండి: అందం కోసం కొత్త దంతాలు..‘షార్క్’లా మారిన యువకుడు
Comments
Please login to add a commentAdd a comment