సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పరిమితులు, మార్గదర్శకాలను విడుదల చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి. వాహన డ్రైవర్లు ప్రయాణికుల బుకింగ్‌లను రద్దు చేస్తే . ఈ– చలాన్ రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఎవరైనా క్యాబ్, ఆటో బుకింగ్స్‌ను రద్దు చేస్తే సైబరాబాద్ పరిధిలో అయితే 94906 17346, రాచకొండ పరిధిలో అయితే 94906 17111కు వాహనం, సమయం, ప్రాంతం వంటి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌పై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు (విమాన టికెట్‌ను చూపించాలి) మినహా ప్యాసింజర్, తేలికపాటి వాహనాలకు అనుమతి లేదు. మీడియం, గూడ్స్ వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు మినహా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ మీదకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు.
చదవండి: (Hyderabad: రాత్రి పది తర్వాత అడుగడుగునా తనిఖీలు)
క్లబ్, పబ్ నిర్వాహకులూ బాధ్యులే..
బార్, క్లబ్, పబ్‌లలో మద్యం తాగి వాహనం నడిపి ఏదైనా ప్రమాదాలకు కారణమైతే వాహనదారులతో పాటూ సంబంధిత బార్, క్లబ్, పబ్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తాగి వాహనం నడిపే బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, హారన్, ట్రిపుల్, మల్టీఫుల్ రైడింగ్ వంటి వాటిపై కేసులు నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment