Hyderabad: Police Conducts Drunk Drive Checkings - Sakshi
Sakshi News home page

కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్‌లో యువతి హల్‌చల్‌

Jan 1 2022 11:57 AM | Updated on Jan 1 2022 12:54 PM

Police Conducts Drunk Drive Checkings In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరానికి నగరం సంబరంగా స్వాగతం పలికింది. అయితే మరోవైపు పోలీసులు నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు.40 బైక్‌లు, ఏడు కార్లు, ఆటోను సీజ్‌ చేశారు. 92 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

ఇదిలా ఉండగా  జూబ్లీహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ దగ్గర ఓ యువతి హల్‌చల్‌ చేసింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ‍్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో వీరిని అదుపులోకి తీసుకుని​ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

చదవండి: (Omicron: కఠిన ఆంక్షలకు సీఎం ఆదేశం..థియేటర్లలో 50 శాతం మందికే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement