సాక్షి, బంజారాహిల్స్: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్లలో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తథ్యమని నగర పోలీస్ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. పబ్‌లు, క్లబ్‌లకు పేరెన్నికగన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌పరిధిలో కూడా శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత అడుగడుగునా వాహనాల తనిఖీలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఒక్క జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తొమ్మిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు వేర్వేరు చోట్ల తనిఖీలు జరగనున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే ఆరు నెలల జైలుతో పాటు రూ. 10 వేల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు.
చదవండి: (New Year Celebrations: ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు)
Comments
Please login to add a commentAdd a comment